కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

73. ముజమ్మిల్‌ (దుప్పటి కప్పుకొని నిద్రించేవాడు)
(అవతరణ: మక్కా; సూక్తులు: 20)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
దుప్పటి కప్పుకొని నిద్రించేవాడా! రాత్రివేళ (నమాజుకోసం) లేచి నిలబడు. అయితే రేయంతా కాదు, అర్థరాత్రిదాకా. లేదా అంతకంటే కొంచెం తక్కువ చేసుకో. లేదా అంత కంటే కొంచెంఎక్కువ చేసుకో. ఖుర్‌ఆన్‌ని ఆగిఆగి నిదానంగా పఠించు. మేము నీమీద (ఎంతో బాధ్యతతో కూడిన) ఓ బరువైన వాణి అవతరింపజేయబోతున్నాం#
మనస్సును అదుపులో ఉంచడానికి రాత్రిజాగరణ ఎంతో ప్రయోజనకరమైనది. పైగా ప్రశాంతంగా ఖుర్‌ఆన్‌ పఠించడానికి కూడా అది చాలా సమంజసమైన వేళ. (అదీగాక) నీకు పగటి పూట (ఇతరత్రా) అనేక పనులుంటాయి. (1-7)
(సదా) నీప్రభువు నామం స్మరిస్తూఉండు. అన్నిటినీ వదలి ఆయనకే అంకితమైపో. ఆయన తూర్పుపడమరలకు ప్రభువు. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. కనుక నీవు ఆయన్నే నీ రక్షకుడిగా చేసుకో. ఆయన మీదే భారం వెయ్యి. జనం కల్పించి చెప్పుకునే మాటలు నీవు పట్టించుకోకు. సహనంతో వ్యవహరించు. సత్పురుషుడిలా వారికి దూరంగాఉండు. సత్యాన్ని ధిక్కరిస్తున్న ధనికుల సంగతి నాకు వదిలెయ్యి. నేను వారి భరతం పడ్తాను. వారిని కొంతకాలం అదే స్థితిలో ఉండని. (8-11)
(వారికోసం) మా దగ్గర బరువైన సంకెళ్ళున్నాయి. భగభగమండే అగ్ని, గొంతులో ఇరుక్కుపోయే ఆహారం, దుర్భర యాతనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ భూమి, పర్వతాలు తీవ్రంగా కంపించే రోజు ఎదురవుతాయి. ఆరోజు పెద్దపెద్ద పర్వతాలు సైతం ఇసుక తిన్నెల్లా మారి చెల్లాచెదరయి పోతాయి. (12-14)
పూర్వం మేము ఫిరౌన్‌వద్దకు (మూసా)ప్రవక్తను ఎలా పంపామో అలాగే ఈనాడు మీవ్యవహారం గురించి సాక్ష్యమివ్వడానికి మీ వద్దకు (ముహమ్మద్‌) ప్రవక్తను పంపాము. ఫిరౌన్‌ ఆ ప్రవక్త చేసిన హితబోధ అంగీకరించలేదు. కనుక మేము అతడ్ని కఠినంగా పట్టుకున్నాం. (ఇప్పుడీ ప్రవక్త మాట వినకపోతే మీకూ అదే గతి పడ్తుంది.) (15-16)
మీరు (మా సందేశం) ధిక్కరిస్తే రేపు పిల్లల్ని సైతం వృద్ధులుగా మార్చే (ప్రళయ) దినాన ఎలా తప్పించుకుంటారు? ఆరోజు ఆకాశం బ్రద్దలవుతుంది. దేవుని వాగ్దానం నెరవేరే తీరుతుంది. ఇదొక హితోపదేశం. ఇష్టమైనవారు తమ ప్రభువు వైపు వెళ్ళేమార్గం అవలంబించవచ్చు. (లేదా పెడదారిపట్టి నరకంలోనైనా పడొచ్చు). (17-19)
ప్రవక్తా! నీవు ఒకసారి మూడింట రెండువంతుల రాత్రిదాకా, మరొకసారి అర్థరాత్రి దాకా, వేరొకసారి మూడింట ఒక వంతు రాత్రిదాకా మేల్కొని ఆరాధనలో గడుపుతావని నీ ప్రభువుకు తెలుసు. నీ అనుచరుల్లో కూడా కొందరు ఇలా చేస్తున్నారు. రాత్రివేళను, పగటివేళను దేవుడే లెక్క కడ్తాడు. వేళలను మీరు సరిగా అంచనా కట్టలేరని ఆయనకు తెలుసు. అందువల్ల ఆయన మిమ్మల్ని కనికరించాడు. ఇక నుండి మీరు ఖుర్‌ఆన్‌ని సులభంగా ఎంతమేరకు పఠించగలిగితే అంతమేరకే పఠించండి. మీలో కొందరు వ్యాధిగ్రస్తులు, కొందరు దైవానుగ్రహం(ఉపాధి) అన్వేషణలో ప్రయాణం చేసేవారు, మరికొందరు దైవమార్గంలో పోరాడేవారు ఉంటారని ఆయనకు తెలుసు.
కనుక ఖుర్‌ఆన్‌ని సులభంగా పఠించగలిగినంత పఠించండి. ప్రార్థనా వ్యవస్థ నెల కొల్పండి. జకాత్‌ చెల్లించండి. దేవునికి శ్రేష్ఠమైన రుణం అందజేయండి. మీరు మీకోసం ఏ పుణ్యకార్యం చేసి పంపుకుంటారో అది దేవుని వద్ద సురక్షితంగా ఉంటుంది. అదే అత్యంత శ్రేష్ఠమైనది, దాని సుకృతఫలం కూడా ఘనమైనది. దేవుడ్ని మన్నింపు వేడు కోండి. ఆయన గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడు. (20)