కురాన్ భావామృతం/అజ్-జల్ జలా
కురాన్ భావామృతం అధ్యాయములు |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 |
99. జిల్జాల్ (భూకంపం)
(అవతరణ: మదీనా; సూక్తులు: 8)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
భూమి తీవ్ర ప్రకంపనలతో కుదిపేయబడుతుంది. అది తనలోని భారమంతా తీసి బయట పడవేస్తుంది. అప్పుడు మానవుడు (బిత్తరపోయిచూస్తూ) “ఏమైంది దీనికి (ఇలా చేస్తోంది)?”అంటాడు. ఆరోజు భూమి (తనమీద జరిగిన) పరిస్థితులు వివరిస్తుంది. కారణం, నీ ప్రభువు (అలా చేయమని) దాన్ని ఆదేశించి ఉంటాడు. (1-5)
ఆరోజు మానవులు విభిన్నవర్గాలుగా విడిపోయి (న్యాయస్థానం నుండి) తిరిగొ స్తారు. అప్పుడు వారికి వారికర్మలు చూపించబడతాయి. ఆ తర్వాత ఎవరైనా అణు మాత్రం సత్కార్యం చేసివున్నా అతను దాన్ని (కళ్ళారా) చూసుకుంటాడు. అలాగే ఎవరైనా అణుమాత్రం దుష్కార్యం చేసివున్నా అతనూ దాన్ని (కళ్ళారా)చూసుకుంటాడు. (6-8)