కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

14. ఇబ్రాహీం
(అవతరణ: మక్కా; సూక్తులు: 52)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
అలిఫ్‌-లామ్‌-రా. ముహమ్మద్‌ (స)! ఇది మేము నీపై దించిన దివ్యగ్రంథం. ప్రజల్ని నీవు చీకటి నుండి వెలుగులోకి తీసుకురావడానికే దీన్ని దించాము. అంటే వారి ప్రభువు ఆజ్ఞతో సర్వశక్తిమంతుడు, సకల ప్రశంసలకు అర్హుడైన దేవుని మార్గంలోకి అన్నమాట. భూమ్యాకాశాలలోని అణువణువూ ఆయనకు చెందినదే.
పరలోక జీవితానికి బదులు ప్రాపంచికజీవితానికి ప్రాధాన్యమిచ్చే అవిశ్వాసుల్ని సర్వనాశనంచేసే కఠినశిక్ష కాచుకొని ఉంది. వారు ప్రజలను దైవమార్గంలోకి రాకుండా నిరోధిస్తున్నారు; దైవమార్గాన్ని (తమ మనోవాంఛలకు అనువుగా) వక్రీకరింప జేయగోరు తున్నారు. వారసలు మార్గభ్రష్టత్వంలో చాలా దూరం కొట్టుకుపోయారు. (1-3)
మేము పంపిన ప్రతి ప్రవక్తా విషయం విడమరచి చెప్పడానికి వీలుగా తన జాతి ప్రజలు మాట్లాడే భాషలోనే మా సందేశం (ప్రజలకు) అందజేశాడు. ఆ తర్వాత దేవుడు తాను తలచిన విధంగా కొందరికి దారి చూపాడు: మరికొందరిని దారి తప్పించాడు. ఆయన సర్వాధికారి, ఎంతో వివేచనాపరుడు. (4)
మేము ఇంతకుపూర్వం మా నిదర్శనాలిచ్చి మూసాను కూడా పంపాం. ప్రజలను చీకటినుండి వెలుగులోకి తీసుకురావాలని, వారికి దైవచరిత్రకు సంబంధించిన సంఘట నలు విన్పిస్తూ హితోపదేశం చేయాలని మేము అతడ్ని కూడా ఆదేశించాం. ఈ సంఘట నల్లో సహనం వహించి కృతజ్ఞత చూపేవారికి గొప్ప నిదర్శనాలున్నాయి. (5)
మూసా వృత్తాంతం కాస్త గుర్తుకు తెచ్చుకో. అప్పుడతను తన జాతిప్రజలతో ఇలా అన్నాడు: “మీకు దేవుడు చేసిన ఉపకారాలు జ్ఞాపకం తెచ్చుకోండి. మీకు తీవ్రయాత నలు పెడ్తుండిన ఫిరౌనీయుల బారినుండి ఆయన మిమ్మల్ని కాపాడాడు. వారు మీ కొడుకుల్ని చంపుతూ మీ కూతుళ్ళను మాత్రమే సజీవంగా ఉండనిచ్చేవారు. అది మీకు మీ ప్రభువు వైపున కఠిన పరీక్షాకాలం. మరొక విషయం కూడా జ్ఞాపకం తెచ్చుకోండి. కృతజ్ఞులైవుంటే మీకు మరిన్ని వరాలు అనుగ్రహిస్తానని, కృతఘ్నులైపోతే తన శిక్ష చాలా కఠినంగా ఉంటుందని మీ ప్రభువు మిమ్మల్ని హెచ్చరించాడు. (6-7)
“మీరు సత్యాన్ని తిరస్కరిస్తే, (మీరే కాదు) ప్రపంచంలోని యావత్తు మానవులు సత్యతిరస్కారులైపోయినా సరే (దానివల్ల దేవుని దైవత్వానికి వాటిల్లే నష్టమేమీ లేదు). ఆయన నిరపేక్షాపరుడు, స్వతహాగానే ఎంతో ప్రశంసనీయుడు.” (8)
గత జాతుల వృత్తాంతం మీకు చేరలేదా? నూహ్‌జాతి, ఆద్‌జాతి, సమూద్‌ జాతి, ఆతర్వాత కూడా అనేకజాతులు వచ్చాయి. వాటిసంఖ్య దేవునికి మాత్రమే తెలుసు. వారి ప్రవక్తలు స్పష్టమైన నిదర్శనాలు తెచ్చినప్పుడు వారు చేతివ్రేళ్ళు చెవుల్లో దూర్చుకుంటూ “నీవు తెచ్చిన సందేశం మేము ససేమిరా అంగీకరించం. నీవు ప్రచారం చేస్తున్న ధర్మం గురించి మేము తీవ్రమైన సందిగ్ధం, సంశయాలలో పడిపోయాం” అని అన్నారు. (9)
“ఏమిటీ, మీరు భూమ్యాకాశాల్ని సృష్టించిన దేవుడ్ని గురించి సందేహిస్తున్నారా? ఆయన మీ పొరపాట్లు క్షమించి, ఒక నిర్ణీతకాలం వరకు మీకు అవకాశం ఇవ్వడానికే మిమ్మల్ని తన (ధర్మం) వైపు పిలుస్తున్నాడు” అన్నారు దైవప్రవక్తలు.
“మీరు మాలాంటి మనుషులే. అంతకుమించి మరేమీ కాదు. మా తాతముత్తాతల కాలం నుంచీ వస్తున్న ఈ దైవాలను ఆరాధించవద్దని మమ్మల్ని వారిస్తున్నారా? సరే (మీరు సత్యమంతులైతే) ఏదైనా నిదర్శనం తీసుకురండి” అన్నారు ఆ ప్రజలు. (10)
“నిజమే, మేము మీలాంటి మనుషులమే గాని, మరేమీ కాము. అయితే దేవుడు తన దాసులలో తాను కోరుకున్న వారిని అనుగ్రహిస్తాడు. నిదర్శనాలు (మహిమలు) తెచ్చే శక్తి మాకు లేదు. దేవుని అనుమతి అయితేనే అవి వస్తాయి. విశ్వసించినవారు దేవుడ్నే నమ్ముకోవాలి. ఆ దేవుడే కదా మాకు జీవిత పరమార్థం తెలిపి, మేము నడ వాల్సిన (రుజు)మార్గం ఏమిటో చూపింది! అలాంటప్పుడు ఆయన్ని మేము ఎందుకు నమ్ముకొని ఉండం? మీ వేధింపుల పట్ల మేము సహనం వహిస్తాం. నమ్ముకోవాల్సిన వారు దేవుడ్ని మాత్రమే నమ్ముకోవాలి” అన్నారు దైవప్రవక్తలు. (11-12)
చివరికి అవిశ్వాసులు తమ ప్రవక్తల్ని బెదిరిస్తూ “(మర్యాదగా) మీరు మా మతం లోకి తిరిగి వచ్చేయండి. లేదంటారా, మిమ్మల్ని దేశం నుండే వెళ్ళగొడ్తాం” అన్నారు. అప్పుడు వారి ప్రభువు దివ్యావిష్కృతి ద్వారా వారి దగ్గరకు ఈ విధంగా సందేశం పంపాడు: “ఆ దుర్మార్గుల్ని మేము నాశనం చేయబోతున్నాం. వారి (పతనం) తరువాత ధరణిలో మిమ్మల్ని, (మీ అనుచరుల్ని) వశింపజేస్తాము. నా సన్నిధిలో సమాధానం చెప్పు కోవలసి ఉందన్న బాధ్యతా భావంతో భయపడుతూ, నా హెచ్చరిక పట్ల అప్రమత్తులయి మసలుకునేవారికి ఈ బహుమానం లభిస్తుంది.” (13-14)
ఆ ప్రవక్తలు విజయం అర్థించారు. (అదిలా లభించింది.) తలబిరుసుతో హూంక రించిన ప్రతి సత్యతిరస్కారీ సర్వనాశనమయ్యాడు. ఆతర్వాత అతని కోసం నరకం కూడా కాచుకొనిఉంది. అతనికక్కడ త్రాగడానికి చీము, నెత్తురు కలసిన (పరమ జుగు ప్సాకరమైన) నీరివ్వబడుతుంది. దాన్ని అతడు బలవంతంగా గొంతులోకి దించడానికి ప్రయత్నిస్తాడు. (అది ఓపట్టాన అతని గొంతులోకి దిగదు.) చివరికి ఎలాగో అతి కష్టం మీద దించుతాడు. నలువైపుల నుండి మృత్యువు అతడ్ని చుట్టుముడ్తుంది. కాని అతను చావడు. దానికిముందు అతడ్ని చంపుకుతినే మరో ఘోరయాతన పొంచివుంటుంది#
దేవుని పట్ల తిరస్కార వైఖరి అవలంబించినవారి ఆచరణ, పెనుతుఫానుకు త్రుటిలో ఎగిరిపోయే బూడిదకుప్ప లాంటిది. వారు తమ కర్మలకు ఎలాంటి ప్రతిఫలం పొందలేరు. అదే అన్నిటికంటే ఘోరమైన వైఫల్యం. (15-18)
దేవుడు భూమ్యాకాశాలను ఎలా నియమబద్ధంగా నెలకొల్పాడో మీరు గమనించ లేదా? ఆయన తలచుకుంటే మిమ్మల్ని తుడిచిపెట్టి మీస్థానంలో మరో కొత్త సృష్టి తీసుకురాగలడు. అలా చేయడం ఆయనకు ఏమాత్రం కష్టం కాదు. (19-20)
వారంతా దేవుని ముందు (దోషులుగా) నిలబడతారు. అప్పుడు వారిలో (శక్తిసామ ర్థ్యాలు అంతగాలేని) బలహీనులు తమపై పెత్తందారులయి కూర్చున్న నాయకులతో “ప్రపంచంలో మేము మీకు విధేయులై మీ వెనుక నడిచాం కదా; ఇప్పుడు మమ్మల్ని దైవశిక్ష నుండి కాపాడేందుకు ఏమైనా చేయగలరా?” అని అడుగుతారు.
దానికి వారు సమాధానమిస్తూ “దేవుడు గనక మా విముక్తి కోసం ఏదయినా దారి చూపిస్తే మీక్కూడా (ఆ దారి) తప్పకుండా చూపిస్తాము. కాని ఇప్పుడు మనం ఎంత ఏడ్చి మొత్తుకున్నా, ఓర్పు వహించినా ప్రయోజనం లేదు. మనమిక (ఈ నరక కూపం నుంచి) బయటపడే ప్రసక్తే లేదు” అని అంటారు. (21)
తీర్పు ముగిసిన తరువాత షైతాన్‌ వారితో ఇలా అంటాడు: “మీకు దేవుడు చేసిన వాగ్దానాలన్నీ నిజమయ్యాయి. కాని నేను చేసిన వాగ్దానాలలో ఒక్కటీ నిజం కాలేదు. అసలు మీచేత బలవంతంగా ఏదైనా చేయించడానికి మీమీద నాకేదైనా శక్తి ఉంటేకదా! నేను మిమ్మల్ని నామార్గం వైపు పిలిచాను. అంతే, మరేమీ చేయలేదు. మీరే నా పిలుపు నకు స్పందించి వచ్చారు. కనుక మీరిప్పుడు అనవసరంగా నన్ను నిందించకండి. మిమ్మల్ని మీరే నిందించుకోండి. ఇక్కడ మీగోడు నేను ఆలకించలేను; నాగోడు మీరు ఆలకించలేరు. ఇంతకుముందు మీరు నన్ను దేవునికి సాటికల్పించారు. (నాక్కూడా దైవత్వం ఆపాదించారు. అది మీపనే గాని, నాపని కాదు.) నేను దీన్ని ఖండిస్తున్నాను. అలాంటి దుర్మార్గులకు తప్పకుండా ఘోరమైన శిక్ష పడుతుంది.” (22)
పోతే సత్యాన్ని విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు సెలయేరులు ప్రవహించే స్వర్గవనాలకు పంపబడతారు. దేవుని అనుమతితో వారక్కడ శాశ్వతంగా ఉంటారు. వారికక్కడ శాంతీశుభాల దీవెనలతో ఘనమైన స్వాగతం లభిస్తుంది. (23)
దేవుడు శిష్టవచనాన్ని దేనితో పోల్చాడో మీరు గమనించారా? ఓ మేలుజాతి వృక్షం ఉంది. దాని వేళ్ళు నేలలో లోతుకు దృఢంగా పాతుకుపోయాయి. దానిశాఖలు ఆకాశం దాకా విస్తరించాయి. అనుక్షణం అది తన ప్రభువాజ్ఞతో సుమధుర ఫలాలు ఇస్తోంది. ప్రజలు గుణపాఠం నేర్చుకోవడానికే దేవుడు ఇలాంటి ఉదాహరణలు ఇస్తున్నాడు#
దీనికి భిన్నంగా దుష్టవచనాన్ని నేల ఉపరితలం నుండి పెరికివేసే నాసిరకం చెట్టుతో పోల్చవచ్చు. దానికి ఎలాంటి స్థిరత్వమూ, దృఢత్వమూ ఉండవు. (24-26)
దేవుడు విశ్వాసులకు ఒక దృఢవచనం ప్రాతిపదికపై ఇటు ఇహలోకంలోనూ, అటు పరలోకంలోనూ స్థిరత్వం ప్రసాదిస్తాడు. దుర్మార్గుల్ని ఆయన మార్గభ్రష్టత్వంలో పడవేస్తాడు. దేవునికి తానుతలచిన ప్రతిపనీ చేయగల శక్తిసామర్థ్యాలున్నాయి. (27)
దేవుని అనుగ్రహాలు పొంది కూడా కృతఘ్నులై పోయినవారిని మీరు చూడలేదా? వారు తమతోపాటు తమ జాతిప్రజలను కూడా వినాశాగాధంలోకి నెట్టివేశారు. అంటే నరకంలోకి. వారు నరకంలో ప్రవేశిస్తారు. అది పరమనీచమైన నివాసస్థలం. ప్రజలను దైవమార్గం నుండి తప్పించడానికి వారు కొన్ని మిధ్యాదైవాలను దేవునికి సాటి కల్పిం చారు. వారికిలా చెప్పెయ్యి: “సరే, కొన్నాళ్ళపాటు భోగభాగ్యాలు అనుభవించండి. చివరికి మీరు నరకానికే పోవలసి ఉంటుంది.” (28-30)
ప్రవక్తా! విశ్వసించిన నా దాసులకు ఎలాంటి క్రయవిక్రయాలు, స్నేహసహకారాలు జరగని దినం రాకముందే నమాజు వ్యవస్థ నెలకొల్పమని, మేము ప్రసాదించిన సంపద నుండి రహస్యంగానూ, బహిరంగంగానూ దానధర్మాలు చేయమని చెప్పు. (31)
దేవుడే భూమ్యాకాశాల్ని సృష్టించాడు. ఆయనే ఆకాశం నుండి వర్షం కురిపించి మీ ఉపాధి కోసం వివిధరకాల పండ్లు (పంటలు) పండిస్తున్నాడు. ఆయనే సముద్ర యానం కోసం మీకు ఓడలు అధీనం చేసినవాడు. ఆయన ఆజ్ఞతోనే అవి సముద్రంలో సవ్యంగా సాగిపోతున్నాయి. నదుల్ని కూడా ఆయనే మీ అదుపులో ఉంచాడు. ఆయనే సూర్యచంద్రుల్ని మీకోసం ఒక నియమావళికి కట్టుబడి నిరంతరాయంగా సాగిపోయేలా చేశాడు. మీకోసం రాత్రిని, పగటిని సృష్టించినవాడు కూడా ఆయనే. ఇలా మీరు కోరినదంతా ఆయన మీకు ప్రసాదించాడు. అనంతమైన దైవానుగ్రహాలను మీరు లెక్కించాలనుకున్నా లెక్కించలేరు. అయితే (ఇన్ని అనుగ్రహాలు పొందినప్పటికీ) మానవుడు చాలా కృతఘ్నుడుగా, అన్యాయపరుడుగా తయారయ్యాడు. (32-34)
ఇబ్రాహీం ఇలా వేడుకున్నాడు: “ప్రభూ! ఈ (మక్కా) నగరాన్ని శాంతి నగరంగా చెయ్యి. నన్ను, నా సంతానాన్ని విగ్రహారాధనా బారినుండి కాపాడు. ప్రభూ! ఈవిగ్రహాలు అనేకమందిని దారి తప్పించాయి. (నా సంతానాన్ని కూడా దారితప్పించే ప్రమాదముంది. కనుక వారిలో) నా విధానాన్ని అనుసరించేవారు నా వారవుతారు. నా విధానానికి వ్యతి రేకంగా నడిచేవారికి (నీవే దిక్కు.) నీవు క్షమించేవాడవు, కరుణించేవాడవు. (35-36)
ప్రభూ! నేను నాసంతానాన్ని ఎలాంటి చెట్టూ-పుట్టా లేని ఎడారిప్రాంతంలో నీ ప్రతిష్ఠాలయం దగ్గరకు తీసుకొచ్చి వశింపజేశాను, (భవిష్యత్తులో) వీరిక్కడ ప్రార్థనా వ్యవస్థ నెలకొల్పుతారన్న ఆశతో. కనుక వీరిపట్ల నీవు ప్రజల హృదయాల్లో ఆసక్తి అభి మానాలు కలిగించు. వీరికి తినడానికి పండ్లు ఫలాలు ప్రసాదించు, బహుశా అందుకు కృతజ్ఞులై ఉంటారు. ప్రభూ! మేము దాస్తున్నదీ, బహిర్గతం చేస్తున్నదీ అంతా నీకు తెలుసు.” నిస్సందేహంగా దేవునికి భూమ్యాకాశాల్లో ఏదీ కనుమరుగుగా లేదు. (37-38)
“ఈ వృద్ధాప్యంలో నాకు ఇస్మాయీల్‌, ఇస్‌హాఖ్‌ల వంటి సంతానాన్ని ప్రసాదించిన దేవునికి కృతజ్ఞతలు. నాప్రభువు తప్పకుండా (నా)మొరాలకిస్తాడు. ప్రభూ! నన్ను ప్రార్థనా వ్యవస్థ నెలకొల్పేవానిగా చెయ్యి. నా సంతానాన్ని కూడా. ప్రభూ! నా విజ్ఞప్తి స్వీకరించు. నా తల్లిదండ్రుల్ని, యావత్తు విశ్వాసుల్ని కర్మవిచారణ రోజు క్షమించు.” (39-41)
ఈ దుర్మార్గులు చేస్తున్న పనుల పట్ల దేవుడు అజాగ్రత్తగా ఉన్నాడని భావించకు. కాకపోతే వారిని ఆయన ఒక నిర్ణీత దినం వరకు ఉపేక్షిస్తున్నాడు. ఆ రోజు (ప్రళయ బీభత్సంతో) ప్రజలు కళ్ళు తేలవేసి, తల పైకెత్తి పరుగిడుతుంటారు. పై చూపులు పైనే ఉండిపోతాయి. గుండెలు దడదడలాడి పోతుంటాయి. (42-43)
ప్రవక్తా! ఆ దినం గురించి జనాన్ని భయపెట్టు. అప్పుడు దుర్మార్గులు (ప్రాపంచిక మత్తు వదలి) “ప్రభూ! మాకు మరో అవకాశం ఇవ్వు. మేము నీ పిలుపునకు (వెంటనే) స్పందించి, నీ ప్రవక్తల అడుగుజాడల్లో నడుస్తాము” అని మొరపెట్టుకుంటారు.
(దానికిలా సమాధానం లభిస్తుంది:) “దీనికి పూర్వం మీరు ప్రమాణాలు చేసిమరీ మీకసలు వినాశకాలమే రాదని చెబుతుండేవారు కదూ? నిజానికి మీరు (ఆనాడు) ఆత్మ వినాశానికి పాల్పడినవారి నివాసప్రాంతాల్లోనే జీవితం గడిపారు. మేము వారి పట్ల ఎలా వ్యవహరించామో మీరు చూశారు. వారిగాధలు ఉదాహరిస్తూ మీకు హితోపదేశం కూడా చేశాము. (అయినా మీకు బుద్ధి రాలేదు.) ఇప్పుడు సమయం మించిపోయింది.” వారు తమ పన్నాగాలన్నీ పన్ని చూసుకున్నారు. పర్వతాలు సైతం కంపించే అంతటి భయం కరమైన పన్నాగాలు పన్నినా వాటన్నిటికీ విరుగుడు దేవుని దగ్గర ఉంది. (44-46)
కనుక ప్రవక్తా! దేవుడు తన ప్రవక్తలకు చేసిన వాగ్దానాలకు వ్యతిరేకంగా చేస్తాడని నీవు ఎన్నటికీ భావించకు. దేవుడు సర్వశక్తిమంతుడు; ప్రతీకారం చేసేవాడు కూడా. భూమ్యాకాశాల స్వరూపస్వభావాలు మారిపోయే (ప్రళయ) దినం గురించి వారిని భయపెట్టు. ఆరోజు యావన్మందినీ (ప్రళయ) రౌద్రుడయిన ఏకేశ్వరుని ముందు ప్రవేశపెడ్తారు. ఆరోజు నేరస్థుల పరిస్థితి ఎలా ఉంటుందో నీవు చూస్తావు. వారి కాళ్ళు, చేతులు సంకెళ్ళతో బిగించి కట్టి వేయబడిఉంటాయి. గంధకపు వస్త్రాలు ధరించి ఉంటారు. వారి ముఖాలపై అగ్నిజ్వాలలు ఆవరిస్తుంటాయి. ప్రతి మనిషికీ అతను చేసిన కర్మలకు ప్రతిఫలం ఇవ్వడానికే ఇలా సంభవిస్తుంది. కర్మవిచారణ జరపడానికి దేవునికి ఎంతోసేపు పట్టదు. (47-51)
ఇది మానవులందరి కోసం అవతరించిన విశ్వజనీన సందేశం. (పరలోక) పరిణా మాలను గురించి ప్రజలను హెచ్చరించడానికి, వారు దేవుడు ఒక్కడేనని తెలుసుకోవ డానికి, బుద్ధీజ్ఞానం కలవారు సృహలోకి రావడానికీ సందేశం పంపబడింది. (52)