కురాన్ భావామృతం/అత్-తకాసుర్
కురాన్ భావామృతం అధ్యాయములు |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 |
102. తకాసుర్ (ప్రాపంచిక వ్యామోహం)
(అవతరణ: మక్కా; సూక్తులు: 8)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
ప్రాపంచిక వ్యామోహంలో పరస్పరం పోటీపడి వీలైనంత ఎక్కువ సంపాదించా లన్న తపనే మిమ్మల్ని ఏమరుపాటులో పడవేసింది. చివరికి (అదే రందిలో) మీరు సమాధికి చేరుకుంటారు.
(మీరసలు ప్రాపంచిక సంపదే ప్రగతికి చిహ్నమని అనుకుంటు న్నారు కాబోలు.) ఎంతమాత్రం కాదు. త్వరలోనే మీకు తెలుస్తుంది (వాస్తవం ఏమిటో). ఎంతమాత్రం కాదు. త్వరలోనే మీకు తెలుస్తుంది. ఎంతమాత్రం కాదు. విశ్వసనీయ జ్ఞానంతో మీరు విషయాన్ని గ్రహిస్తే (మీ వైఖరి ఇలా ఉండదు). మీరు తప్పక నరకాన్ని చూస్తారు. ఔను, మీరు నమ్మకంగా దాన్ని మీకళ్ళారా చూస్తారు. ఆరోజు ఈ సౌఖ్యాలు, సిరిసంపదలను గురించి మిమ్మల్ని తప్పక నిలదీయడం జరుగుతుంది. (1-8)