కురాన్ భావామృతం/అజ్-జుహా
కురాన్ భావామృతం అధ్యాయములు |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 |
93. జుహా (పగటివెల్తురు)
(అవతరణ: మక్కా; సూక్తులు: 11)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
ఎండకాసే పగటి సాక్షి! చీకటి ఆవరించే రాత్రి సాక్షి! (ప్రవక్తా!) నీ ప్రభువు నిన్ను వదలి పెట్టలేదు. నీపై కినుక కూడా వహించలేదు.
నీకోసం ప్రారంభకాలం కంటే ఆ తరువాత కాలం నిస్సందేహంగా ఎంతో మేలయినదిగా ఉంటుంది. త్వరలోనే నీ ప్రభువు నీకు (గొప్ప వరాలు) అనుగ్రహిస్తాడు. వాటిపట్ల నీవు సంతోషిస్తావు. (1-5)
నీవు అనాథగా ఉన్నప్పుడు ఆయన నీకు ఆశ్రయం కల్పించలేదా? నీవు మార్గవిహీ నుడవై ఉండగా ఆయన నీకు మార్గం చూపలేదా? నీవు నిరుపేదగా ఉండటం చూసి ఆయన నిన్ను ధనవంతుడ్ని చేయలేదా? కనుక అనాథల పట్ల కఠినంగా ప్రవర్తించకు. యాచకుడ్ని కసరికొట్టకు. నీప్రభువు అనుగ్రహాల్ని (గురించి) చాటుతూవుండు. (6-11)