కురాన్ భావామృతం/అల్-ముర్సలాత్

కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

77. ముర్సలాత్‌ (రుతుపవనాలు)
(అవతరణ: మక్కా; సూక్తులు: 50)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
ఒకదాని తర్వాత ఒకటి తెరలు తెరలుగా పంపబడే పవన వీచికల సాక్షి! తర్వాత (అవి) ఉధృతంగా వీస్తూ (మేఘాలను) పైకి మోసుకెళ్తాయి. ఆ తర్వాత (వాటిని) చీల్చి వేరుచేస్తాయి. ఆపై (దేవుడ్ని గురించి) క్షమాపణగాని, హెచ్చరికగాని జ్ఞాపకం చేస్తాయి. మీకు వాగ్దానం చేయబడుతున్న విషయం (ప్రళయం) తప్పక సంభవిస్తుంది. (1-7)
ఆరోజు నక్షత్రాలు నిస్తేజమైపోతాయి. ఆకాశం చీలిపోతుంది. పర్వతాలు దూది పింజల్లా ఎగురుతాయి. దైవప్రవక్తలను ప్రవేశపెట్టే సమయం ఆసన్నమవుతుంది. ఏ రోజుకోసం ఈ పనులు ఆపి ఉంచబడ్డాయి? విచారణ రోజు కోసం. విచారణ రోజంటే ఏమిటో నీకు తెలుసా? (పరలోక) ధిక్కారులకు ఆరోజు వినాశం తప్పదు. (8-15)
(సత్యాన్ని తిరస్కరించిన) పూర్వీకులను మేము హతమార్చలేదా? ఆ తర్వాత వచ్చే వారిని కూడా మేము వారి వెనుకే పంపుతాం. నేరస్థుల పట్ల మేము ఇలాగే వ్యవ హరిస్తాం. ధిక్కారులకు ఆరోజు వినాశం తప్పదు. (16-19)
మేము మిమ్మల్ని క్షుద్ర బిందువుతో పుట్టించలేదా? దాన్ని నిర్ణీతకాలం వరకు ఓచోట (స్త్రీగర్భంలో) భద్రపరచలేదా? చూశారా, ఈపని చేసే శక్తి మాకే ఉంది. మేము అద్భుత శక్తిసామర్థ్యాలు కలవారం. ధిక్కారులకు ఆరోజు వినాశంతప్పదు. (20-24)
మేము భూమిని జీవుల్ని, నిర్జీవుల్ని తనలో ఇముడ్చుకునేలా రూపొందించలేదా? అందులో ఎత్తయిన పర్వతాలు పాతాము. త్రాగడానికి మంచినీటిని కూడా ఏర్పాటు చేశాం. (ఇదంతా ఎవరు చేశారు?) ధిక్కారులకు ఆరోజు వినాశం తప్పదు. (25-28)
ఇప్పుడిక నడవండి మీరు ధిక్కరిస్తున్న దాని వైపు. మూడు తెరలుగా మారే నీడ వైపు నడవండి. ఆ నీడలో ఎలాంటి చల్లదనం ఉండదు. అగ్నిజ్వాలల నుండి కాపాడదు. అది మేడలువంటి పెద్దపెద్ద నిప్పురవ్వలు వెదజల్లుతుంది, బంగరువన్నె ఒంటెలు ఎగురుతున్నట్లు (అన్పిస్తుంది). ధిక్కారులకు ఆరోజు వినాశం తప్పదు. (29-34)
వారు నోరు కూడా మెదపలేని దుస్థితి దాపురించే రోజది. సాకులు చెప్పడానికి అవకాశమే ఇవ్వబడదు. ధిక్కారులకు ఆరోజు వినాశం తప్పదు.
అదే విచారణ జరిగే రోజు. మేము మిమ్మల్ని, మీ పూర్వీకుల్ని ఒకచోట చేర్చాం. ఇప్పుడు మాకు వ్యతిరేకంగా మీరేదైనా పన్నాగం పన్నగలిగితే పన్ని చూడండి. ధిక్కారులకు ఆరోజు వినాశం తప్పదు#
దైవభీతిపరులు ఆరోజు చల్లటి నీడపట్టున సెలయేరుల మధ్య ఉంటారు. వారు కోరుకున్న పండ్లు, ఫలాలు (క్షణాల్లో వారి ముందుంచబడతాయి). “మీరు చేసుకున్న సత్కార్యాలకు ప్రతిఫలంగా నేడు హాయిగా తినండి, త్రాగండి.” మంచివారికి మేము ఇలాంటి ప్రతిఫలమే ప్రసాదిస్తాం. ధిక్కారులకు ఆరోజు వినాశం తప్పదు. (35-45)
(ధిక్కారులారా!) కొన్నాళ్ళపాటు తినండి, భోగభాగ్యాలు అనుభవించండి. మీరసలు పరమదుర్మార్గులు. ధిక్కారులకు ఆరోజు వినాశం తప్పదు. (దేవుని ముందు) తలవంచండని చెబితే వీరు (తలబిరుసుతో) తలవంచడానికి నిరాకరిస్తున్నారు. దీని తరువాత (అంటే ఖుర్‌ఆన్‌ని తిరస్కరించిన తరువాత) వారు మరే వాణిని విశ్వసిస్తారు? ధిక్కారులకు ఆరోజు వినాశం తప్పదు. (46-50)