కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

35. ఫాతిర్‌ (సృష్టికర్త)
(అవతరణ: మక్కా; సూక్తులు: 45)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
భూమ్యాకాశాలు సృష్టించిన దేవునికే సకల విధాల ప్రశంసలు శోభిస్తాయి. ఆయన దైవదూతలను సందేశహరులుగా నియమించాడు. ఆ దైవదూతలలో కొందరికి రెండేసి రెక్కలు, మరికొందరికి మూడేసి రెక్కలు, ఇంకొందరికి నాల్గేసి రెక్కలున్నాయి. ఆయన తానుకోరిన విధంగా తన సృష్టితాల రూపకల్పనలో (కొన్ని అవయవాలు) అదనంగా చేర్చుతాడు. దేవుడు ప్రతిపనీ చేయగల సమర్థుడు, సర్వ శక్తిమంతుడు. (1)
దేవుడు మానవుల కోసం తన అనుగ్రహద్వారం తెరచిపెడితే దాన్నెవరూ మూసి వేయలేరు. అలాగే ఆయన తన అనుగ్రహద్వారం మూసేస్తే, ఇక దాన్నెవరూ తెరవలేరు. ఆయన మహా శక్తిమంతుడు, అత్యంత వివేకవంతుడు. (2)
మానవులారా! మీకు దేవుడు చేసిన మహోపకారాలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు తప్ప మీకు భూమ్యాకాశాల నుండి ఉపాధినిచ్చే మరోసృష్టికర్త ఉన్నాడా? ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. అలాంటప్పుడు మీరు ఎలా మోసపోతున్నారు? (3)
ప్రవక్తా! వీరు నిన్ను తిరస్కరిస్తుంటే (ఇది ఈనాడు కొత్తేమీ కాదు.) నీకు పూర్వం కూడా చాలామంది ప్రజలు దైవప్రవక్తలను తిరస్కరించారు. చివరికి యావత్తు వ్యవ హారాలు దేవుని వైపుకే మరలిపోవలసి ఉంది. (4)
మానవులారా! దేవుని వాగ్దానం సత్యమయినది. కనుక ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసగించకూడదు. ఆ మహామోసగాడు కూడా మిమ్మల్ని మోసగించకూడదు సుమా! షైతాన్‌ మీకు బహిరంగ శత్రువు. కనుక మీరు కూడా వాడ్ని శత్రువుగానే పరిగ ణించండి. వాడు తన అనుచరుల్ని నరకవాసుల్లో కలిపేయడానికి తన మార్గం వైపు పిలుస్తున్నాడు. అవిశ్వాసులకు కఠినశిక్ష పడుతుంది. సత్యాన్ని విశ్వసించి, సదాచార వైఖరి అవలంబించేవారికి మన్నింపుతోపాటు గొప్ప ప్రతిఫలం లభిస్తుంది. (5-7)
ఒక వ్యక్తికి అతని దుష్కార్యాల్ని మనోహరమైనవిగా చేసి చూపడం జరుగుతుంది. అతను కూడా తన దుష్కార్యాల్ని సత్కార్యాలుగా భావిస్తాడు. అలాంటివాడికి పట్ట పగ్గాలు ఉంటాయా? దేవుడు తాను తలచినట్లు కొందరిని దారి తప్పిస్తాడు, మరికొంద రిని దారికి తెస్తాడు. కనుక (ప్రవక్తా!) నీవు అనవసరంగా వారికోసం బాధపడిపోతూ ప్రాణం పోగొట్టుకోకు. వారు చేస్తున్నదంతా దేవునికి బాగా తెలుసు. (8)
గాలులు పంపేవాడు దేవుడే. ఆ గాలులు మేఘాలను పైకి లేపుతాయి. తరువాత మేము వాటిని బంజరుభూమి వైపు తీసికెళ్తాం. (అక్కడ వర్షం కురిపించి) మృతప్రాయ మైన ఆ భూమికి జీవంపోసి (వృక్షజాతిని) లేపుతున్నాం. అదేవిధంగా చనిపోయిన మానవుల్ని కూడా (ప్రళయ దినాన) మళ్ళీ బ్రతికించి లేపుతాము. (9)
గౌరవప్రతిష్ఠలు కోరుకునే ప్రతివ్యక్తీ గౌరవప్రతిష్ఠలన్నీ దేవునికే చెందుతాయని తెలుసుకోవాలి. ఆయన దగ్గరకు సద్వచనం మాత్రమే అధిరోహిస్తుంది. ఈ సద్వచనాన్ని సదాచరణ మాత్రమే పైకి అధిరోహింపజేస్తుంది. దుష్టపన్నాగాలకు పాల్పడేవారికోసం కఠినాతికఠిన శిక్ష కాచుకొని ఉంది. త్వరలోనే వారి కుట్రలు వారికే బెడిసికొడ్తాయి. (10)
దేవుడు మిమ్మల్ని (ప్రారంభంలో) మట్టితో సృజించాడు. తరువాత వీర్యబిందువు ద్వారా పుట్టించాడు. ఆయన మిమ్మల్ని (స్త్రీపురుష) జంటలుగా చేశాడు. ఏ స్త్రీ కూడా దేవునికి తెలియకుండా గర్భం దాల్చడంగాని, బిడ్డను కనడంగాని ఎన్నటికీ జరగదు. అలాగే ఎవరికైనా ఆయుష్షు పెరగడంగాని, తరగడంగాని అంతా ఒక గ్రంథంలో ముందే రాసిపెట్టి ఉంది. ఇలా చేయడం దేవునికి చాలా తేలిక. (11)
రెండు (రకాల) జలనిధులు ఒకే విధంగా లేవు. ఒకటి దప్పిక తీర్చగలిగే మంచి నీరు. త్రాగడానికి తియ్యగా ఉంటుంది. రెండోది గొంతును పాడుచేసే ఉప్పునీరు. అయితే ఆ రెండు జలనిధుల నుండి మీరు తాజా (చేపల)మాంసం తీసి తింటున్నారు. ధరించడానికి ఆభరణాలు (ముత్యాలు) కూడా సేకరిస్తున్నారు. అంతేకాదు, దేవుని అనుగ్రహం (ఉపాధి) అన్వేషించి ఆయన పట్ల కృతజ్ఞులై ఉండేందుకు మీరు ఆ జలాలలో నౌకలు వాటి గుండెలు చీల్చుతూ నడవడాన్ని కూడా చూస్తున్నారు. (12)
ఆయన రాత్రిని పగటిలోకి, పగటిని రాత్రిలోకి జొప్పిస్తున్నాడు. ఆయనే సూర్యచం ద్రుల్ని అదుపులో ఉంచాడు. ఇవన్నీ ఒక నిర్ణీతకాలం దాకా (తమ కక్ష్యల్లో) సంచరిస్తూ ఉంటాయి. ఆయనే మీ ప్రభువు. (విశ్వ)రాజ్యాధికారం ఆయనదే. ఆయన్ని వదలి మీరు పూజిస్తున్న మిధ్యాదైవాలు ఓ గడ్డిపోచకు కూడా యజమానులు కారు. మీరు వాటిని మొరపెట్టుకుంటే అవి మీ మొరల్ని ఆలకించలేవు. ఒకవేళ ఆలకించినా మీకెలాంటి సమాధానం ఇవ్వలేవు. ప్రళయదినాన అవి మీ బహు దైవారాధనను ఖండిస్తాయి. ఇలాంటి యదార్థాలు మీకు సర్వజ్ఞుడు తప్ప మరెవరూ తెలియజేయ లేరు. (13-14)
మానవులారా! మీరే దేవుని మీద ఆధారపడే నిర్ధనులు. దేవుడు మాత్రం సర్వం కలిగి ఉన్న స్థితిపరుడు, సకలవిధాల ప్రశంసనీయుడు. ఆయన తలచుకుంటే మిమ్మల్ని తొలగించి మీ స్థానంలో మరో సృష్టిరాసిని సృజించగలడు. ఇది దేవునికి ఏమాత్రం కష్టసాధ్యం కాదు. (పాప)భారం మోసేవారెవరూ ఇతరుల (పాప)భారం మోయలేరు. (పాప)భారం క్రింద అణగిపోయినవాడు తన భారం తొలగించుకోవడానికి ఎవరినైనా పిలిస్తే, అతని భారంలోని అణుమాత్రం బరువుకూడా మోయడానికి ఎవరూ ముందుకు రారు. చివరికి అతి సన్నిహితులైన అతని బంధువులు సైతం ముందుకు రారు.
ప్రవక్తా! తమ ప్రభువును (ప్రత్యక్షంగా) చూడకుండానే ఆయనకు భయపడుతూ ప్రార్థనా వ్యవస్థ నెలకొల్పేవారిని మాత్రమే నీవు హెచ్చరించగలవు. ఒక వ్యక్తి పవిత్రతా వైఖరి అవలంబిస్తున్నాడంటే అది తనశ్రేయస్సు కోసమే అవలంబిస్తున్నాడు. చివరికి అందరూ దేవుని సన్నిధికే మరలిపోవలసి ఉంది. (15-18)
గుడ్డివాడు, కళ్ళున్నవాడు ఒకటి కాదు. చీకటి వెలుగులు సమానం కాలేవు. చల్లని నీడ మండుటెండ లాంటిది కాదు. జీవులు, మృతులు ఒకటి కాదు. దేవుడు తాను కోరిన వారికి (తన సూక్తులు) విన్పిస్తాడు. (కనుక ప్రవక్తా!) సమాధుల్లో ఉన్నవారికి నీవు (ఏమాటా) విన్పించలేవు. (జరగనున్న పరిణామాలను గురించి) నీవు హెచ్చరించేవాడివి మాత్రమే. మేము నిన్ను శుభవార్త అందజేసేవానిగా, భయపెట్టేవానిగా చేసి సత్యాన్నిచ్చి పంపాము. ప్రతిజాతిలోనూ హెచ్చరించేవాడు ఆవిర్భవించాడు. వీరు నిన్ను నిరాకరి స్తుంటే (నిరాకరించనీ), వారి పూర్వీకులు కూడా (ఇలాగే ప్రవక్తలను) నిరాకరించారు. వారి దగ్గరకు వారి ప్రవక్తలు స్పష్టమైన నిదర్శనాలు, చిరు పుస్తకాలు, ఉజ్వలమైన గ్రంథాలు తీసుకొచ్చారు. ఆ తర్వాత సత్యాన్ని తిరస్కరించినవారిని నేను పట్టుకున్నాను. చూడండి నా శిక్ష ఎంత తీవ్రంగా ఉండిందో! (19-26)
దేవుడు ఆకాశం నుండి ఎలా వర్షం కురిపిస్తున్నాడో మీరు పరికించి చూడలేదా? తద్వారా మేము అనేక రకాల పండ్లు ఉత్పత్తి చేస్తున్నాము. వాటి రంగు రకరకాలుగా ఉంటుంది. పర్వతాలలో తెల్లచారలు, ఎర్రచారలు, నల్లచారలతో రంగురంగుల పర్వతా లున్నాయి. అలాగే మానవుల్లో, జంతువుల్లో, పశువుల్లో, (పక్షుల్లో) కూడా వివిధ రంగు లున్నాయి. దేవుని దాసులలో జ్ఞానులు మాత్రమే (ఈప్రకృతి యదార్థాలు గమనించి) దేవునికి భయపడతారు. (ఆ) దేవుడు మహా శక్తిమంతుడు, గొప్ప క్షమాశీలి. (27-28)
దైవగ్రంథాన్ని పఠించే, ప్రార్థానా వ్యవస్థ నెలగొల్పే, మేము ప్రసాదించిన ఉపాధి నుండి రహస్యంగా, బహిరంగంగా దానంచేసేవారు ఎలాంటి నష్టంలేని వ్యాపారం ఆశి స్తున్నారు. దేవుడు తమకు పూర్తిప్రతిఫలం ఇవ్వడంతోపాటు, తన ప్రత్యేక అనుగ్రహంతో మరింత ప్రతిఫలం ప్రసాదిస్తాడన్న ఆశతోనే (వారీ పరలోక వ్యాపారంలో తమ సర్వస్వం ధారపోస్తారు). నిజంగా దేవుడు ఎంతో క్షమించేవాడు, ఆదరించేవాడు. (29-30)
ప్రవక్తా! మేము దివ్యావిష్కృతి ద్వారా నీ వద్దకు పంపిన గ్రంథమే సత్యం. ఇది పూర్వం వచ్చిన గ్రంథాలను దృవీకరిస్తూ వచ్చింది. దేవునికి తన దాసుల స్థితిగతులను గురించి బాగా తెలుసు. ఆయన ప్రతి విషయాన్నీ గమనిస్తున్నాడు. (31)
మా దాసులలో మేము ఎన్నుకున్నవారిని ఈ గ్రంథానికి వారసులుగా చేశాం. వారిలో కొందరు ఆత్మవంచన చేసుకున్నవారున్నారు. కొందరు మధ్యేమార్గం అవలంబిం చిన వారున్నారు. మరికొందరు దేవుని ఆజ్ఞతో సత్కార్యాలు చేయడంలో ఒకర్నొకరు మించిపోయే వారున్నారు. ఇదే అన్నిటికంటే గొప్ప (దైవా)అనుగ్రహం. (32)
వారు శాశ్వత స్వర్గవనాల్లో ప్రవేశిస్తారు. వారక్కడ స్వర్ణకంకణాలు, ఎంతో విలువైన రత్నాలు, పట్టువస్త్రాలు ధరిస్తారు. వారు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ “మా దుఃఖం దూరంచేసిన దేవుడు ఎంతో ప్రశంసనీయుడు. నిస్సందేహంగా మా ప్రభువు క్షమించే వాడు, ఆదరించేవాడు. ఆయన తన అనుగ్రహంతో మనకు శాశ్వతనివాసం కల్పించాడు. ఇప్పుడిక్కడ మనకు ఎలాంటి బాధ, అలుపు ఉండవు” అని అంటారు. (33-35)
ఇక సత్యాన్ని నిరాకరించినవారి కోసం నరకాగ్ని కాచుకొని ఉంది. (అక్కడ) వారు చావాలనుకున్నా చావు రాదు. వారికి నరకయాతనలు తగ్గించడం కూడా జరగదు. ఈ విధంగా మేము సత్యతిరస్కారులకు ప్రతిఫలమిస్తాము. వారక్కడ పెడబొబ్బలు పెడ్తూ “ప్రభూ! మమ్మల్నిక్కడ్నుంచి తీసెయ్యి. (మాకు బుద్ధొచ్చింది.) మేము ఇదివరకు చేసిన వాటికి భిన్నంగా సత్కార్యాలు చేస్తాం” అని మొరపెట్టుకుంటారు.
(అప్పుడు వారికి) “మీకు మేము దీర్ఘాయుష్షు ఇవ్వలేదా? అంత దీర్ఘాయుష్షులో మీరు తలచుకుంటే గుణపాఠం నేర్చుకుని ఉండేవారు. మీ దగ్గరికి హెచ్చరించేవాడు కూడా వచ్చాడు కదా! ఇప్పుడిక (నరక యాతనలు) చవిచూడండి. దుర్మార్గులకు ఇక్కడ ఎవరూ సహాయం చేయరు” అని సమాధానం ఇవ్వబడుతుంది. (36-37)
దేవునికి భూమ్యాకాశాల్లోని సమస్త నిగూఢ విషయాలు తెలుసు. (మీ)హృదయాల్లో దాగిన రహస్యాలు సయితం ఆయనకు తెలుసు. ఆయనే మిమ్మల్ని ధరణిలో (తన) ప్రతినిధిగా నియమించాడు. ఇప్పుడెవరైనా సత్యాన్ని తిరస్కరిస్తున్నాడంటే ఆ తిరస్కార పర్యవసానం అతని మీదనే పడుతుంది. తిరస్కారుల తిరస్కార వైఖరి వల్ల వారిపై మరింత దైవాగ్రహమే విరుచుకు పడుతుంది. అది అవిశ్వాసులకు నష్టంలో తప్ప మరే విషయంలోనూ వృద్ధినివ్వదు. (38-39)
వారిని అడుగు: “దేవుడ్ని వదలి మీరు పూజిస్తున్న మీ భాగస్వాముల్ని మీరెప్పుడైనా పరికించి చూశారా? వారు భూలోకంలో ఏ వస్తువును సృష్టించారో నాకు చూపండి కాస్త. పోనీ ఆకాశనిర్మాణంలో వారి పాత్ర ఏమిటో చెప్పండి.” వారికి మేమేదైనా రాసిచ్చామా, దాని ఆధారంగా వారు గట్టి ప్రమాణం కలిగి ఉండేందుకు? లేదు. అసలీ దుర్మార్గులు పరస్పరం మోసగించుకోవడానికి బూటకపు వాగ్దానాలు చేస్తున్నారు. (40)
భూమ్యాకాశాలు దొర్లకుండా స్థిరంగా పట్టి ఉంచినవాడు దేవుడే. ఒకవేళ అవి దొర్లి పడితే, దేవుడు తప్ప మరెవరూ వాటిని పొదివి పట్టుకోలేరు. దేవుడు ఎంతో ఉదార స్వభావుడు, గొప్ప క్షమాశీలి. (41)
గతంలో వారు దేవుని పేరుతో గట్టి ప్రమాణాలు చేస్తూ, తమ వద్దకు హెచ్చరించే వారెవరైనా (దైవప్రవక్త) వస్తే తాము ప్రపంచంలోని ఇతర జాతులకన్నా ఎక్కువ సన్మార్గ గాములవుతామని చెప్పేవారు. తీరా వారి దగ్గరకు హెచ్చరించేవాడు రాగానే, అతని రాక వారిని సత్యానికి మరింత దూరం నెట్టివేసింది. వారు దేశంలో గర్వపోతులై దుష్ట పన్నాగాలు పన్నడం ప్రారంభించారు. నిజానికి దుష్టపన్నాగాలు వాటిని పన్నేవారికే బెడిసి కొడ్తాయి. వీరిప్పుడు గత జాతులకు పట్టిన దుర్గతి కోసం వేచిఉన్నారా? అలాగైతే (దుష్ట శిక్షణకై) దేవుడు అనుసరిస్తున్న విధానంలో నీవు ఎలాంటి మార్పు చూడలేవు. దేవుని విధానాన్ని ఆయన నిర్ణయించిన మార్గం నుండి ఏ శక్తీ మళ్ళించలేదు. (42-43)
వారు పూర్వం గతించినవారికి ఎలాంటి దుర్గతి పట్టిందో ప్రపంచంలో తిరిగి చూడలేదా? ఆ ప్రజలు వీరికంటే ఎంతో శక్తిమంతులు. భూమ్యాకాశాల్లోని ఏ వస్తువూ దేవుని పట్టునుండి తప్పించుకోలేదు. ఆయన సర్వం ఎరిగినవాడు. ప్రతి విషయంపైనా ఆయనకు అధికారం ఉంది. మానవుల్ని వారి దుశ్చర్యల కారణంగా పట్టుకోదలిస్తే ఆయన భూమిపై ఒక్క ప్రాణిని కూడా సజీవంగా వదలిపెట్టేవాడు కాదు. కాని ఆయన వారిని ఒక నిర్ణీతసమయం వరకు అవకాశమిచ్చి వదలిపెడ్తున్నాడు. ఆ నిర్ణీత సమయం రాగానే దేవుడే తన దాసుల సంగతి చూసుకుంటాడు. (44-45)