కురాన్ భావామృతం/అల్-హిజ్ర్

కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

15. హిజ్ర్‌ (హిజ్ర్‌వాసులు)
(అవతరణ: మక్కా; సూక్తులు: 99)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
అలిఫ్‌-లామ్‌-రా. ఇవి దైవగ్రంథమైన విస్పష్ట ఖుర్‌ఆన్‌కు సంబంధించిన సూక్తులు. (1)
ఈరోజు (సత్యాన్ని) నిరాకరించినవారే రేపు తీవ్రమైన పశ్చాత్తాపంతో “అయ్యయ్యో! మనం (దేవునికి, ఆయన ప్రవక్తకు) విధేయులయిపోతే ఎంత బాగుండేది!!” అని వాపోతారు. వారిని వదిలెయ్యి. మస్తుగా తింటూ త్రాగుతూ భోగభాగ్యాలు అనుభ వించనీ. లేనిపోని ఆశలు వారిని ఏమరుపాటులో పడవేశాయి. త్వరలోనే వారికి తెలుస్తుంది (ఏమరుపాటు పర్యవసానం ఏమిటో)- (2-3)
ఇంతకు పూర్వం మేము ఏ పట్టణాన్ని నాశనం చేసినా ఆ పట్నం ప్రజల కోసం ఓ ప్రత్యేక ఆచరణ వ్యవధి రాసిఉంచాం. అందువల్ల ఏజాతి కూడా తనకు నిర్ణయించ బడిన గడువుకు ముందుగాని, వెనకగాని నాశనం కాజాలదు. (4-5)
వారు (ప్రవక్తతో) “ఖుర్‌ఆన్‌ అవతరించబడినవాడా! నీవు నిజంగా పిచ్చివాడవు. నీవు సత్యవంతుడవైతే మాదగ్గరికి దైవదూతల్ని ఎందుకు తీసుకురావు?” అని అంటారు. కాని మేము దైవదూతల్ని ఇట్టే దించము. వారు దిగితే దైవాజ్ఞ తీసుకొని దిగుతారు. ఆ తర్వాత ప్రజలకు ఏమాత్రం వ్యవధి నివ్వడం జరగదు. ఖుర్‌ఆన్‌ విషయానికొస్తే, దాన్ని మేమే అవతరింపజేశాం. దాన్ని పరిరక్షించేవాళ్ళం కూడా మేమే. (6-9)
ప్రవక్తా (స)! నీకు పూర్వం కూడా మేము అనేక జాతులలో ప్రవక్తలను ప్రభవింప జేశాం. అయితే ఏజాతి దగ్గరకు ఏప్రవక్త వచ్చినా ఆజాతి ఆప్రవక్తను హేళన చేయ కుండా ఉండటం ఎన్నడూ జరగలేదు. అలాగే మేమీ హితబోధను నేరస్థుల గుండెల్లోకి (గునపంలా) దించుతాం. దాంతో వారు (రెచ్చిపోయి) దాన్నిక విశ్వసించరు. పూర్వం నుండీ ఇలాంటి ప్రవృత్తి కలవారి వైఖరి ఇలాగే సాగుతూవస్తోంది. (10-13)
వారికోసం ఆకాశంలో ఏదైనా ద్వారం తెరచిపెట్టి, వారక్కడికి పట్టపగలు ఎక్కి చూసినా “మాకళ్ళకు ఏదో అయింది, మాకెవరో చేతబడిచేశార”నే అంటారు. (14-15)
ఆకాశంలో పటిష్ఠమైన కోటలు నిర్మించినది కూడా మేమే. చూపరుల కోసం మేము వాటిని అందంగా రూపొందించాం. శాపగ్రస్తుడైన ప్రతిషైతాన్‌ బారినుండి వాటిని సురక్షితంగా ఉంచాం. ఇక ఏ షైతాన్‌ వాటి దరిదాపులకు పోలేడు. కాకపోతే చాటు మాటుగా ఒకటి రెండు విషయాలు వినడానికి ప్రయత్నిస్తాడు. అయితే అలా వినడానికి ప్రయత్నించినప్పుడల్లా ఓ అగ్నిజ్వాల వాడ్ని వెంటాడి తరిమేస్తుంది. (16-18)
మేము భూమిని పరచి దానిమీద పర్వతాలు పాతాము. ప్రతి వృక్షజాతిని ఒక నిర్ణీత పరిమాణంలో సృజించాము. మీకోసం, మీరు పోషించని జీవరాసుల కోసం అందులో ఉపాధిఒనరుల్ని కూడా సమకూర్చాం. మా దగ్గర లేని వస్తువేదీ లేదు. సమస్తం ఉన్నాయి. మేము ఏవస్తువుని దించినా ఒక నిర్ణీతపరిమాణంలో దించుతాం. (19-21)
మేము ప్రయోజనకరమైన గాలులు పంపుతున్నాము. ఆపై మీరు త్రాగడానికి, (ఇతరత్రా ఉపయోగాల కోసం) ఆకాశం నుండి వర్షం కురిపిస్తున్నాం. ఈ జలసంపదకు యజమానులు (మేమే కాని,) మీరు కాదు. (22)
జీవన్మరణాలకు మేమే మూలకారకులం. మీరు కొన్నాళ్ళు మాత్రమే ఉండి వట్టి చేతులతో ఈలోకం నుంచి వెళ్ళిపోయేవారు. (మేమే శాశ్వతంగా ఉండేవాళ్ళము గనక) మేమే అందరికీ వారసులం. పూర్వం గతించినవారిని కూడా మేము చూశాం. ఇక ముందు వచ్చేవారు కూడా మా దృష్టిపథంలో ఉన్నారు. నీ ప్రభువు వారందర్నీ (ప్రళయ దినాన కర్మవిచారణ కోసం) తప్పకుండా సమావేశపరుస్తాడు. ఆయన ఎంతో వివేక వంతుడు, అపార జ్ఞానసంపన్నుడు. (23-25)
మేము మానవుడ్ని కుళ్ళి ఎండిపోయిన మట్టితో సృజించాము. అంతకుముందు మేము జిన్నులను ఉష్ణవాయువుతో కూడిన అగ్నిజ్వాలతో సృజించాము. (26-27)
ఆ సందర్భంలో నీ ప్రభువు దైవదూతలతో అన్న మాటలు గుర్తుచేసుకో: “నేను కుళ్ళి ఎండిపోయిన మట్టితో ఒక మానవుడ్ని సృజిస్తున్నాను. మానవుడ్ని సృష్టించడం పూర్తయిన తర్వాత అతని (దేహం)లో నాఆత్మ (నొకదాని)ని ఊదుతాను. అప్పుడు మీరంతా అతనికి గౌరవసూచకంగా అభివాదం చేయాలి” అన్నాడు నీప్రభువు. (28-29)
దాని ప్రకారం దైవదూతలంతా (మానవునికి) అభివాదం చేశారు, ఇబ్లీస్‌ తప్ప. ఇబ్లీస్‌ వారందరితోపాటు అభివాదం చేయడానికి నిరాకరించాడు. (30-31)
“ఇబ్లీస్‌! ఏమయింది నీకు అందరితోపాటు అభివాదం చేయలేదు?” అడిగాడు దేవుడు. “కుళ్ళి ఎండిపోయిన మట్టితో సృజించిన మానవుడికి అభివాదం చేయడం నావల్ల కాని పని” అన్నాడు ఇబ్లీస్‌. (32-33)
“అయితే నువ్విక్కడ్నుంచి వెళ్ళిపో. నువ్వు శాపగ్రస్తుడివి. తీర్పుదినం వరకు నీపై (ఈ) శాపం ఉంటుంది” అన్నాడు దేవుడు. (34-35)
“ప్రభూ! అలాగైతే మానవులంతా తిరిగి బ్రతికించి లేపబడేరోజు వరకు నాకు గడువు నివ్వు” అన్నాడు ఇబ్లీస్‌. (36)
“సరే, నిర్ణీతకాలం వరకు నీకు గడువిస్తున్నాము” అన్నాడు దేవుడు. (37-38)
“ప్రభూ! నీవు నన్ను ఏవిధంగా దారి తప్పించావో అదేవిధంగా నేను భూలోకంలో మానవులకు ఎన్నో మనోహరమైన వస్తువుల్ని చూపి వారిని దారి తప్పిస్తాను. అయితే నీవు ప్రత్యేకించుకున్న నీ దాసుల్ని మాత్రం అలా చేయను” అన్నాడు ఇబ్లీస్‌. (39-40)
“నా దగ్గరకు చేరుకోవడానికి ఇదే (ఏకైక)రుజుమార్గం. (ఈ మార్గంలో నడిచే) నా (ప్రియ)దాసులపై నీఅధికారం చెల్లదు. నీ అధికారం నిన్ను అనుసరించే భ్రష్టుల మీదనే చెల్లుతుంది. వారందరికీ నరకమే (గతి, ఇది) మావాగ్దానం” అన్నాడు దేవుడు. ఆ నరకానికి ఏడు ద్వారాలు ఉన్నాయి. వారిలో ప్రతి వర్గానికి ఒక్కొక్క ద్వారం కేటా యించబడింది. (41-44)
దైవభీతిపరాయణులు స్వర్గవనాలలో (చల్లటి) సెలయేరుల మధ్య ఉంటారు. నిర్భయంగా, ప్రశాంతంగా, సురక్షితంగా (స్వర్గంలో) ప్రవేశించండని వారికి చెబుతాము. వారి హృదయాల్లో రాగద్వేషాలు ఏవైనా మిగిలివుంటే వాటిని మేము తీసేస్తాం. వారు పరస్పరం అన్నదమ్ముల్లా మారి ఆసనాల మీద ఎదురెదురుగా కూర్చుంటారు. వారికక్కడ ఎలాంటి శ్రమా ఉండదు. అక్కడ్నుంచి వారిని తీసివేయడం కూడా జరగదు. (45-48)
ప్రవక్తా! నేను గొప్ప క్షమాశీలినని, అమిత దయామయుణ్ణని నా దాసులకు చెప్పు. దాంతోపాటు నాశిక్ష చాలా కఠినంగా, దుర్భరంగా ఉంటుందని కూడా చెప్పు. (49-50)
వారికి ఇబ్రాహీం అతిథుల గాధ విన్పించు. వారతని దగ్గరకు వచ్చి “నీకు శాంతి కలుగుగాక” అన్నారు. అప్పుడతను “మిమ్మల్ని చూస్తుంటే నాకేదో భయంగా ఉంది” అన్నాడు. “భయపడకు. నీకు (త్వరలోనే) బుద్ధికుశలత గల కొడుకు పుడ్తాడని మేము శుభవార్త అందజేస్తున్నాము” అన్నారు వారు. (51-53)
“ఏమిటీ! ఈ ముసలితనంలో నాకు పిల్లలు పుడ్తారని శుభవార్త విన్పిస్తున్నారా!! కాస్త ఆలోచించండి, ఎలాంటి వార్త విన్పిస్తున్నారో నాకు మీరు” అన్నాడు ఇబ్రాహీం.#
“మేము నీకు సత్యంతో కూడిన శుభవార్తే విన్పిస్తున్నాం. నీవు (అనవసరంగా) నిరాశ చెందకు” అన్నారు దైవదూతలు. (54-55)
“మార్గభ్రష్టులే తమ ప్రభువు కారుణ్యం పట్ల నిరాశ చెందుతారు” అన్నాడు ఇబ్రాహీం. ఆ తరువాత అతను “దైవసందేశహరులారా! ఇంతకూ మీరు వచ్చిన పనేమిటీ?” అని అడిగాడు. (56-57)
“మేమొక నేరజాతి దగ్గరకు పంపబడ్డాము. ఒక్క లూత్‌ కుటుంబానికి మాత్రమే (దైవశిక్ష నుండి) మినాహాయింపు ఉంది. వారిని మేము కాపాడుతాం. అయితే అతని భార్యను మాత్రం కాపాడము. ఆమె వెనుక ఉండిపోయేవారిలో చేరిపోతుందని మేము ముందుగానే నిర్ణయించాం” (అన్నారు దైవదూతలు). (58-60)
ఆ తర్వాత ఈ దూతలు లూత్‌ దగ్గరకు వెళ్ళారు. వారిని చూసి అతను “మీరెవరో కొత్తవాళ్ళుగా ఉన్నారే!” అన్నాడు. (61-62)
“కాదు, మేము వీరు అనుమానిస్తున్న విషయాన్ని తీసుకొచ్చాము. మేము నీతో నిజమే చెబుతున్నాము. మేము నీ దగ్గరకు సత్యం తీసుకొచ్చాము. కనుక నీవిప్పుడు కొంతరాత్రి గడిచిన తరువాత నీ కుటుంబసభ్యుల్ని తీసుకొని ఇక్కడ్నుంచి బయలుదేరి (వేరే చోటికి) వెళ్ళు. నీవు వారి వెనకాల నడు. (జాగ్రత్త!) మీలో ఏ ఒక్కరూ వెనక్కి తిరిగి చూడకూడదు. మిమ్మల్ని ఎటు వెళ్ళమని ఆజ్ఞాపిస్తే అటువైపే (ముఖం తిప్పి) నేరుగా నడవాలి” అన్నారు దైవదూతలు. (63-65)
(ఈ విధంగా) తెల్లవారేటప్పటికి (ఆ పట్టణంలో ఉండే) వారిని సమూలంగా తుడిచి పెడ్తామన్న మా నిర్ణయాన్ని అతనికి ముందే తెలియజేశాము. (66)
అంతలో పట్టణవాసులు సంతోషంతో గంతులేస్తూ వచ్చారు. లూత్‌ (కంగారు పడుతూ) “సోదరులారా! వీరు నాఅతిథులు. నన్ను నవ్వులపాలు చేయకండి. దేవునికి భయపడండి. నా పరువు మంటగలపకండి” అని బ్రతిమాలాడు. (67-69)
“ఏమిటీ, లోకంలోని జనమందరి వైపున వకాల్తా పుచ్చుకో వద్దని మేము నిన్ను వారించలేదా?” అన్నారు వారు. (70)
“(కాస్త నామాట కూడా వినండి.) మీరు (అలా) చేయాలని పట్టుపడ్తుంటే, ఇదిగో నా కుమార్తెలున్నారు. (వీళ్ళను చేసుకోండి)” అన్నాడు లూత్‌. (71)
ముహమ్మద్‌ (సల్లం)! నీ ఆత్మసాక్షి! ఆ సమయంలో వారు కళ్ళుకానని కైపుతో బలిసి కొట్టుకోసాగారు. చివరికి (మరునాడు) సూర్యుడు ఉదయించీ ఉదయించగానే భయంకరమైన విస్ఫోటం వారిమీద విరుచుకుపడింది. మేమా పట్టణాన్ని అమాంతం ఎత్తి కుదిపేశాము. వారి మీద కాలిన మట్టిరాళ్ళ వర్షం కురిపించాము. (72-74)
ఈ సంఘటనలో యోచించేవారికి గొప్ప సూచనలున్నాయి. ఆప్రాంతం (వారు నడిచే) రహదారి సమీపంలోనే ఉంది. విశ్వాసులకు ఇందులో గుణపాఠం ఉంది#
అయికాప్రజలు కూడా దుర్మార్గులే. మేము వారిమీదా ప్రతీకారం తీర్చుకున్నాం. ఆ రెండుజాతుల శిథిలప్రాంతాలు సాధారణ రహదారుల్లోనే ఉన్నాయి. (75-79)
హిజ్ర్‌వాసులు కూడా ప్రవక్తలను తిరస్కరించారు. మేము వారి దగ్గరికి మా సూక్తులు పంపి మా నిదర్శనాలు చూపాము. కాని వారు వాటిని విస్మరిస్తూనే పోయారు. వారు కొండల్ని తొలిచి ఇండ్లు నిర్మిస్తుండేవారు. (దైవభయం లేకుండా ఉండేవారు.) చివరికి ఒకరోజు సూర్యోదయం కాగానే భయంకర విస్ఫోటం వారిని మట్టుబెట్టింది. వారు సంపాదించుకున్నది వారికి ఏమాత్రం పనికిరాకుండా పోయింది. (80-84)
మేము భూమ్యాకాశాల్ని, వాటిలోఉన్న సమస్తాన్ని సత్యం తప్ప మరే ప్రాతిపదికపై సృజించలేదు. ప్రళయఘడియ తప్పక వస్తుంది. నీవు (వారి కుచేష్టల్ని) సహృదయంతో క్షమించు. నిస్సందేహంగా నీ ప్రభువు సర్వజ్ఞుడు, సర్వసృష్టికర్త. (85-86)
మేము నీకు మాటిమాటికి ఉచ్చరించదగిన ఏడు సూక్తులు ప్రసాదించాము. నీకు మహోన్నతమైన ఖుర్‌ఆన్‌ (పాఠ్యగ్రంథం) అనుగ్రహించాము. కనుక నీవు (క్షణికమైన) ప్రాపంచిక సంపద వైపు కన్నెత్తి కూడా చూడకు. వాటిని మేము వారిలో వివిధ వర్గాల ప్రజలకు (పరీక్ష నిమిత్తం) ఇచ్చాము. వారి పరిస్థితి పట్ల నీవు విచారపడకు. వారిని వారిమానాన వదిలేసి విశ్వసించినవారిపై దృష్టి కేంద్రీకరించు. (87-89)
వారికి నీవు స్పష్టంగా హెచ్చరించేవాడివి మాత్రమేనని చెప్పు. ఈహెచ్చరిక వర్గ భేదాలు సృష్టించుకున్నవారి దగ్గరకు పంపిన హెచ్చరిక లాంటిదే. వారు తమ ఖుర్‌ఆన్‌ని ముక్కలు ముక్కలుగా చేసుకున్నారు. ప్రవక్తా! నీప్రభువు సాక్షి! (వారి కర్మల్ని గురించి గతంలో) మీరేమి చేస్తుండేవారని మేము వారిని తప్పకుండా ప్రశ్నిస్తాం. (90-93)
కనుక నీకు ఆదేశిస్తున్న విషయాల్ని ఎలాంటి దాపరికంలేకుండా ప్రజలకు చేర వేయి. బహుదైవారాధన చేసేవారిని ఏమాత్రం ఖాతరు చేయకు. హేళనచేసేవారికి సమా ధానం ఇచ్చేందుకు నీతరఫున మేము చాలు. వారు దేవునితోపాటు ఇతరుల్ని దైవాలుగా చేసుకున్నారు. త్వరలోనే వారికి (దాని పర్యవసానం ఏమిటో) తెలుస్తుంది. (94-96)
నీ గురించి వారు కల్పించి చెబుతున్న మాటలేమిటో, దానివల్ల నీ మనసు ఎంత నొచ్చుకుంటున్నదో మాకు తెలుసు. (దీనికి పరిష్కారం ఒక్కటే.) నీవు నీ ప్రభువును స్తుతిస్తూ ఆయన ఔన్నత్యం ప్రశంసించు. ఆయన సన్నిధిలో సాష్టాంగపడుతూ ఉండు. (ఇలా) అంతిమశ్వాస వరకూ నీ ప్రభువుని ఆరాదిస్తూ ఉండు. (97-99)