పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/74

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

మన్నారుదాసవిలాసము


వింతాయెను వింటిరె యని
చింతింపుచు నందు నొక్కచెలి నెన రమరన్.

20


సీ.

ఇంతిరో! చూచితే యీకల్కి చూపులు
        మగువ! వింటివె చెలిమనసుతగులు
యెలనాగ! వింటివే యీకన్నెకోరిక
        నెలఁతరో! సుదతికి నిద్ర లేదు
మెలఁతరో! సకియకు మేను చిక్కెను జాల
        వనిత! లేమకు నెందు వాంఛ సడలె
నలివేణిరో! యతివఁ బాయఁగఁద్రోచె
        మదవతి! తగుణి మైమఱచి పలికెఁ


తే.

[1]గొదవ లింకను రాకుండఁ గొమ్మలార!
కాంతిమతికి సంతసమును గలుఁగజేయు
పడఁతు లెవ్వరొ యిం దని పలుకువేళఁ
బలికెను విలాసవతి తోడిభామలకును.

21


క.

చెలులార! యింతసేపును
దెలియఁగరాదయ్యె నింతితెఱఁ గిప్పుడు దాఁ
బలికిన పలుకుల హృదయము
తెలిసెగదా! మనకుఁ దేటతెల్లమిఁ గాఁగన్.

22


వ.

అని మఱియును.

23


సీ.

తనకు నేవస్తువుల్ తలిదండ్రు లంపిన
        మనకు దాఁచఁగ నిచ్చు మగువలార!
మనము బంతికి రాక మఱి యెంతప్రొద్దైన
        నారగించఁగ నొల్ల దతివలార!
అలరఁ గుంకుమగంద మలఁదెడు వేళల
        ముందుగా మన కిచ్చు ముదితలార!
ముడిఁబూలు కొప్పున ముడుచుచు మనకును
        సగముఁ బంచి యొసంగు సకియలార!


తే.

వింతవగలైన సొమ్ములు వెలల హెచ్చు
చీరలును నిండ్ల కంపించుఁ జెలియలార!

  1. కొదవ లింకును రాకుండ