కురాన్ భావామృతం/అద్-దుఖాన్

కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

44. దుఖాన్‌ (పొగ)
(అవతరణ: మక్కా; సూక్తులు: 59)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
హా-మీమ్‌. విషయస్పష్టత కలిగిన ఈగ్రంథం సాక్షి! మేము మానవుల్ని హెచ్చరించే ఉద్దేశ్యంతో దీన్ని ఒక శుభరాత్రిన అవతరింపజేశాము. మా నిర్ణయం ప్రకారం ప్రతి విషయంలోనూ వివేకవంతమైన ఉత్తర్వు జారీఅయ్యే రాత్రి ఇది. మేమే సందేశహరుడ్ని ప్రభవింపజేశాం. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. (1-5)
(ఇది) నీ ప్రభువు అనుగ్రహం. ఆయన సమస్తం వింటున్నాడు. ఆయనే సర్వం ఎరిగినవాడు. భూమ్యాకాశాలకు, వాటి మధ్యౌన్న సర్వానికీ ఆయనే ప్రభువు. మీరు నిజంగా (ఈ విషయాన్ని) నమ్ముతుంటే (ఈ ఖుర్‌ఆన్‌ ఆయన పంపిన గ్రంథమేనని విశ్వసించాలి). ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయనే మీ జీవన్మరణాలకు మూలకారకుడు. మీకు, మీ పూర్వీకులక్కూడా ఆయనే ప్రభువు. (6-8)
వీరసలు అనుమానంలో పడి (మా సూక్తుల్ని గురించి ప్రశాంతంగా ఆలోచించ కుండా) ఆటపాటల్లో మునిగి తేలుతున్నారు. సరే, ఆకాశంనిండా పొగ కమ్ముకునే రోజు కోసం ఎదురుచూడండి. అది ప్రజల మీద ఆవరిస్తుంది. అదొక దుర్భరయాతన.#
(వీరు కరువుకష్టాలతో తల్లడిల్లిపోతూ) “ప్రభూ! మాపై నుండి ఈ ఆపద తొలగించు, మేము విశ్వసిస్తాం” (అంటున్నారు.) కాని వారి ఏమరుపాటు (అంత త్వరగా) ఎలా వదలుతుంది? వారి దగ్గరకు సత్యాన్ని స్పష్టంగా చెప్పే ప్రవక్త వచ్చినా వారతని వైపు కన్నెత్తి చూడలేదు. పైగా “ఇతను చెప్పుడు మాటలు నేర్చుకున్న పిచ్చోడు.” అని అంటారు. మేము కాస్త మీ (కరువు)కష్టాన్ని తొలగిస్తాం. కాని మీరు లోగడ చేసిన (చెడ్డ)పనులే మళ్ళీ చేస్తారు. ఆ తరువాత మీపై మేము పెద్దదెబ్బ వేసే రోజు వస్తుంది. ఆరోజు మేము తప్పకుండా మీకు ప్రతికారం చేస్తాం. (9-16)
వీరికి పూర్వం మేము ఫిరౌన్‌జాతిని ఇలాంటి పరీక్షకే గురిచేశాము. వారి దగ్గరకు సౌశీల్యుడైన దైవప్రవక్త వచ్చి ఇలా అన్నాడు: “దేవుని దాసులను నాకు అప్పగించండి. నేను మీకోసం వచ్చిన నిజాయితీపరుడైన దైవప్రవక్తను. దేవుని పట్ల తిరుగుబాటు వైఖరి అవలంబించకండి. నేను మీముందు గట్టి నిదర్శనాలు చూపుతాను. మీరు నా మీద చేసే దాడి నుండి నేను నాకూ, మీకూ ప్రభువైన దేవుని శరణు పొందాను. మీరు నామాట ఒప్పుకోకపోతే (కనీసం) నామీద చేయిచేసుకోకండి.” (17-21)
చివరికతను వీరు నేరస్థులని (తనను, తన అనుచరుల్ని కాపాడమని) తన ప్రభువుని ప్రార్థించాడు. (దానికి) “సరే, (ఒకరోజు) రాత్రికిరాత్రే నా దాసుల్ని తీసుకొని బయలుదేరు. (ఫిరౌన్‌) మిమ్మల్ని వెంబడిస్తాడు. సముద్రాన్ని దాని మానాన వదిలెయ్యి. ఈ సైన్యమంతా అందులో మునిగిపోతుంది” (అని చెప్పాడు దేవుడు). (22-24)
వారు ఎన్నో పొలాలు, తోటలు, సెలయేళ్ళు, మేడలు వదలివెళ్ళారు. వారు రంగ రంగ వైభవంతో అనుభవించిన ఎన్నో విలాసవస్తువులు వారి వెనుకే ఉండిపోయాయి. ఇదీ వారి (అహంకారానికి) పర్యవసానం. మేమా వస్తువులన్నిటికీ ఇతరుల్ని వారసులుగా చేశాం. వారి దుస్థితి చూసి ఇటు భూమీ ఏడ్వలేదు; అటు ఆకాశమూ ఏడ్వలేదు. వారికి కాస్త కూడా (బ్రతికి బయటపడే) అవకాశం ఇవ్వలేదు. (25-29)
ఈవిధంగా మేము ఇస్రాయీల్‌ సంతతివారిని ఎంతో అవమానకరమైన శిక్ష నుండి కాపాడి, ఫిరౌన్‌ బారి నుండి విముక్తి కలిగించాము. హద్దులు మీరే వారిలో ఫిరౌన్‌ నిజంగా చాలా ఘనత వహించిన పెద్దమనిషి! (ఇస్రాయీల్‌ సంతతి)వారి పరిస్థితి తెలిసే మేము వారికి ప్రపంచంలోని ఇతర జాతులకన్నా ఎక్కువ ప్రాధాన్యమిచ్చాము. వారికి మేము చూపిన నిదర్శనాలలో స్పష్టమైన పరీక్ష ఉండింది. (30-33)
వీరు (పరలోకాన్ని తిరస్కరిస్తూ) “మాకొచ్చే తొలి మరణం తర్వాత మరేమీ లేదు. మమ్మల్ని మళ్ళీ బ్రతికించి లేపడమంటూ జరగదు. ఒకవేళ నీవు చెప్పేది నిజమయితే (చనిపోయిన) మా తాతముత్తాతల్ని లేపుకురా” అనంటారు. వీరు మేటిగాళ్ళా లేక తుబ్బాజాతి ప్రజలా? లేక వారికి పూర్వం గతించినవారా? నేరస్థులయిన కారణంగానే వారిని మేము సర్వనాశనం చేశాము. (34-37)
మేము భూమ్యాకాశాల్ని, వాటి మధ్యౌన్న సమస్తాన్ని ఏదో తమాషా కోసం సృష్టిం చలేదు. వాటిని మేము (ఓ మహోన్నత లక్ష్యం కోసం) సత్యం ప్రాతిపదికపై సృజించాం. కాని చాలామందికి (ఈసత్యం) తెలియదు. వీరందర్నీ (బ్రతికించి) లేపడానికి ఒక నిర్ణీత దినం ఉంది. అదే తీర్పుదినం. ఆరోజు ఏ ఆప్తమిత్రుడూ తన ప్రాణస్నేహితుడికి ఏ మాత్రం ఉపయోగపడలేడు. దేవుడు ఎవరినైనా కటాక్షిస్తే తప్ప వారికి ఎలాంటిసహాయం లభించదు. దేవుడు మహా శక్తిమంతుడు, అపార దయామయుడు. (38-42)
పాపాత్ములు జఖ్కూమ్‌ (అనే ఒక రకమైన నాగజెముడు) చెట్టు తప్పకుండా తిన వలసిఉంటుంది. చమురు తెట్టులాంటి ఆ పదార్థం వారి పొట్టలోకి పోయి మరగకాచిన నీటిలా కుతకుత ఉడికిపోతుంది. “పట్టుకోండి వాడ్ని. బరబర ఈడుస్తూ తీసికెళ్ళి నరకం మధ్య విసరిపడేయండి. సలసల కాగే నీటిని వాడి నెత్తిమీద కుమ్మరించండి”... “ఇక చూడు దీని రుచి. నువ్వు మహా గౌరవనీయుడవైన పెద్ద మనిషివి కదూ!”...“మీరు ఇంతకాలంగా సంభవిస్తుందో లేదో అని సందేహిస్తూఉండిన విషయమిదే.” (43-50)
(ఆరోజు) దైవభీతిపరులు ప్రశాంత నిలయంలో సెలయేరులుండే ఉద్యాన వనాలలో ఉంటారు. పల్చటి జరీ పట్టువస్త్రాలు ధరించి ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చుంటారు. ఇదీ వారి వైభవం! వారికి మేము ఎర్రటి దేహచ్ఛాయతో విశాల నేత్రాలు గల సుందరాంగుల్ని ఇచ్చి పెళ్ళి చేస్తాం. వారక్కడ ఏ చీకూచింతా లేకుండా హాయిగా కూర్చొని రకరకాల పలహారాలు తెప్పించుకుంటారు. మరణం వారి దరిదాపులకే రాదు; ప్రపంచంలో ఒకసారి వచ్చిన మరణమే మరణం. దేవుడు తన కటాక్షంతో వారిని నరక యాతనల నుండి రక్షిస్తాడు. ఇదే అన్నిటికంటే ఘనవిజయం (పరమమోక్షం). (51-57)
ముహమ్మద్‌ (సల్లం)! ప్రజల హితోపదేశం కొరకు మేమీ గ్రంథాన్ని మీకు తెలిసిన భాషలో సులభతరం చేశాము. ఇక నీవూ ఎదురు చూస్తూవుండు, వారూ ఎదురు చూస్తూవుంటారు. (58-59)