కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

54. ఖమర్‌ (చంద్రుడు)
(అవతరణ: మక్కా; సూక్తులు: 55)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
ప్రళయఘడియ సమీపించింది. చంద్రుడు చీలిపోయాడు. కాని వీరు ఎలాంటి మహిమ చూసినా (సత్యాన్ని నమ్మకుండా) విముఖులైపోతున్నారు. పైగా ఇది రోజూ ప్రదర్శిస్తున్న మంత్రజాలమేనని అంటున్నారు. వారు (చంద్రఖండన మహిమను కూడా) తిరస్కరించి మనోవాంఛలకు బానిసలైపోయారు. ప్రతి వ్యవహారం చివరికి ఒక పర్యవ సానానికి చేరుకోక తప్పదు. వారి ముందుకు (గతజాతుల) స్థితిగతులు వచ్చాయి. అందులో గుణపాఠం, నీతి, వివేకం ఉన్నాయి. కాని (ఈ)హెచ్చరికలేవీ వారికి ఏమాత్రం ఉపయోగపడటం లేదు. కనుక ప్రవక్తా! నీవు కూడా వారిని అట్టే పట్టించుకోకు.
ఏరోజు వారిని పిలిచేవాడు అనూహ్యమైన ఓ జుగుప్సాకర విషయం వైపు పిలు స్తాడో, ఆరోజు మానవులంతా బిత్తరచూపులు చూస్తూ, చెల్లాచెదరైన మిడతల దండులా తమతమ సమాధుల నుండి బిలబిల బయటికి వస్తారు. అలా బయటికొచ్చి పిలిచేవాడి వైపు పరుగెత్తుతారు. (ఈరోజు ఈ సత్యాన్ని నిరాకరిస్తున్న) తిరస్కారులు అప్పుడు (యదార్థం తెలుసుకొని) “ఇది చాలా కఠినమైన రోజు” అనంటారు. (1-8)
వీరికి పూర్వం నూహ్‌జాతి (కూడా దైవప్రవక్తను) తిరస్కరించింది. ఆ ప్రజలు మా దాసుడ్ని అసత్యవాదిగా జమకట్టి ఇతనో పిచ్చివాడన్నారు. వారతడ్ని తీవ్రంగా బెదిరిం చారు. చివరికి అతను తన ప్రభువును మొరపెట్టుకుంటూ “(దేవా!) నన్ను అణచివేశారు. ఇక నీవే వీరికేదైనా ప్రతీకారం చెయ్యి” అన్నాడు. (9-10)
అప్పుడు మేము ఆకాశం నుండి కుండపోత వర్షం కురిపించాం. నేలను చీల్చి ఎక్కడికక్కడ ఊటలు పొంగిపొరలేలా చేశాం. ఈ నీరంతా విధినిర్ణయం ప్రకారం పని నెరవేరడానికి పూర్తిగా ఉపయోగపడింది. నూహ్‌ని, (అతని శిష్యుల్ని) మేము పలకలు, మేకులతో నిర్మించబడిన ఒక నౌకలో ఎక్కించాం. అది మా పర్యవేక్షణలో (సవ్యంగా) సాగిపోతుండేది. ఇదీ తిరస్కృతుడైన వ్యక్తికోసం చేయబడిన ప్రతీకారం. (11-14)
ఆ నౌకను మేము ఒక (గుణపాఠంగా) సూచనగా చేసి వదలిపెట్టాం. మరి (దాన్ని చూసైనా) హితబోధ స్వీకరించేవారెవరైనా ఉన్నారా? నాశిక్ష ఎలాంటిదో, నాహెచ్చరికలు ఎలా ఉండేవో చూడండి. మేమీ ఖుర్‌ఆన్‌ని ప్రజలు అర్థం చేసుకోవడానికి సులభతరం చేశాం; మరి (దీన్నుండి) హితబోధ గ్రహించే వారెవరైనా ఉన్నారా? (15-17)
ఆద్‌జాతి కూడా తిరస్కరించింది. నాశిక్ష, నా హెచ్చరికలు ఎలా ఉండేవో చూడండి. మేమొక దుర్దినాన వారిపైకి భయంకరమైన తుఫాన్‌ పంపాము. అది ఖర్జూరపు మొదళ్ళను సమూలంగా ఎత్తి పడేసినట్లు జనాన్ని ఎత్తి విసిరి పడేస్తుండేది. కనుక నాశిక్ష, నాహెచ్చరికలు ఎలా ఉండేవో చూడండి. మేమీ ఖుర్‌ఆన్‌ని ప్రజలు గ్రహించడానికి సులభతరం చేశాం; మరి హితబోధ గ్రహించేవారున్నారా? (18-22)
సమూద్‌జాతి మా హెచ్చరికల్ని త్రోసిపుచ్చింది. వారిలా అన్నారు: “మనలోని వాడే అయిన ఒకడ్ని మనం అనుసరిస్తామా? అతనికి విధేయులై పోవడమంటే మనం అప మార్గం పట్టినట్టే; మన బుద్ధి గడ్డితిన్నట్టే. మనందరిలో ఇతనొక్కడి పైనే దైవసందేశం అవతరించిందా? లేదు. ఇతను పచ్చిఅబద్ధాలకోరు; బడాయి చెప్పుకునే తప్పుడుమనిషి”#
(మేమిలా అన్నాం:) “అబద్ధాలకోరు ఎవరో, బడాయి చెప్పుకునే తప్పుడు మనిషి ఎవరో రేపే వారికి తెలుస్తుంది. మేము వారికోసం ఒంటెను పరీక్షగాచేసి పంపుతున్నాం. వారికి ఎలాంటి గతి పడ్తుందో కాస్త ఓపికపట్టి చూడు. వారికి, ఒంటెకు మధ్య నీళ్ళు విభజించబడతాయని, ప్రతిఒక్కరూ తమవంతు వచ్చేరోజు మాత్రమే నీటిని వాడుకోవా లని వారికి చెప్పు.” చివరికి వారు తమ మనిషి ఒకడ్ని పురిగొల్పారు. అతను ఒంటెను పట్టుకొని చంపేశాడు. ఇక నాశిక్ష, నా హెచ్చరికలు ఎలా ఉండేవో చూడండి. మేము వారిపైకి భయంకర విస్ఫోటం పంపాము. దాంతో వారు తొక్కివేయబడిన పశువుల కొట్టంలా నుగ్గునుగ్గయి పోయారు. మేమీ ఖుర్‌ఆన్‌ని ప్రజలు అర్థం చేసుకోవడానికి సులభతరం చేశాం; మరి హితబోధ గ్రహించేవారెవరైనా ఉన్నారా? (23-32)
లూత్‌జాతి ప్రజలు కూడా మా హెచ్చరికలు త్రోసిపుచ్చారు. అంచేత మేము వారి మీదికి రాళ్ళతుఫాన్‌ పంపాము. దాని బారినుండి లూత్‌గృహస్థులు మాత్రమే సురక్షితం గా ఉన్నారు. వారిని మేము మా అనుగ్రహంతో (ఆ)రాత్రి తెల్లవారుజామునే అక్కడ్నుంచి వేరే చోటికి తరలించాం. ఇలా మేము కృతజ్ఞులైనవారికి ప్రతిఫలమిస్తున్నాం. (33-35)
లూత్‌ (ప్రవక్త) ముందుగానే తన జాతిప్రజల్ని మా పట్టు గురించి హెచ్చరించాడు. కాని వారు మా హెచ్చరికల్ని ఉత్తుత్తి హెచ్చరికలుగా భావించి త్రోసిపుచ్చారు. వారతడ్ని తన అతిథుల్ని కాపాడుకోనివ్వకుండా అడ్డుతగలడానికి ప్రయత్నించారు. చివరికి మేము “ఇక నాశిక్ష, నా హెచ్చరికల పర్యవసానం చవిచూడండి” అంటూ వారి కళ్ళు పో గొట్టాము. అదీగాక (ఆ మరునాడు) తెలతెలవారుతుండగానే తిరుగులేని శిక్ష (వారిని మట్టుబెట్టింది. “నా శిక్ష, నా హెచ్చరికల పర్యవసానం చవిచూడండిప్పుడు.” మేమీ ఖుర్‌ఆన్‌ని ప్రజలు అర్థం చేసుకోవడానికి సులభతరం చేశాం; మరి (దీన్నుండి) హిత బోధ గ్రహించేవారు ఎవరైనా ఉన్నారా? (36-40)
ఫిరౌనీయుల దగ్గరకు (కూడా మా) హెచ్చరికలు వచ్చాయి. కాని వారూ మా సూచనలన్నిటినీ త్రోసిపుచ్చారు. చివరికి మేము అత్యంత శక్తిసామర్థ్యాలు గలవాడు పట్టినట్లు వారిని (కఠినంగా) పట్టుకున్నాము. (41-42)
(అరబ్బులారా!) మీ అవిశ్వాసులు వారికంటే శ్రేష్ఠులా? లేక గతగ్రంథాలలో మీ కోసం క్షమాపణ రాసిఉందా? లేక వీరు తామొక పటిష్ఠమైన వర్గమని, తమనితాము కాపాడుకోగలమని భావిస్తున్నారా?(కాని) త్వరలోనే ఈవర్గం చిత్తుగా ఓడి పారిపోతుంది. వారి భరతం పట్టడానికి నిర్ణీతదినం ప్రళయం ఉండనేఉంది. అది అతి ప్రాణసంకట మైన కఠిన సమయం. అసలీ పాపాత్ములు అపోహకు గురైఉన్నారు. వారి బుద్ధి మంద గించింది. వారిని ఒకరోజు బోర్లాపడేసి ఈడుస్తూ నరకాగ్నిలో పడేయడం జరుగుతుంది. అప్పుడు (దైవదూతలు) వారితో “ఇక నరకాగ్నిని చవిచూడండి” అంటారు. (43-48)
మేము ప్రతి వస్తువుని ఒక నిర్ణీతపద్ధతి ప్రకారం ఒక నిర్దిష్టక్రమంలో సృష్టించాం. మేము (ఏదైనా చేయదలచుకుంటే జరిగిపో అని) ఒకేఒక ఆజ్ఞ జారీచేస్తాం. దాంతో ఆ పని తృటిలో జరిగిపోతుంది. మీలాంటి వారిని మేము ఎంతో మందిని హతమార్చాం. మరి (మా)హితబోధ గ్రహించే వారెవరైనా ఉన్నారా? వీరు చేసినదంతా (మా దగ్గర) కర్మలచిట్టాలో నమోదైఉంది. చిన్నా పెద్దా ప్రతి విషయం రాయబడిఉంది. (49-53)
భయభక్తులు కలవారు తప్పకుండా స్వర్గోద్యానవనాలలో, చల్లటి సెలయేరుల మధ్య (హాయిగా) ఉంటారు. అది సర్వ శక్తిమంతుడైన విశ్వసామ్రాట్టు సమీపంలో ఉండే ఎంతో గౌరవప్రదమయిన స్థానం. (54-55)