కురాన్ భావామృతం/అల్-ఆదియాత్
కురాన్ భావామృతం అధ్యాయములు |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 |
100. ఆదియాత్ (తురంగం)
(అవతరణ: మక్కా; సూక్తులు: 11)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
నురుగులు కక్కుతూ, నిప్పురవ్వలు రాల్చుతూ పరుగెత్తే గుర్రాల సాక్షి! అవి తెల్ల వారేటప్పటికి వచ్చిపడతాయి. దుమ్ము లేపుతూ చివరికి (శత్రు)సమూహంలోకి చొచ్చుకు పోతాయి. మానవుడు తన ప్రభువుకు చాలా కృతఘ్నుడైపోయాడు. దానికి అతనే సాక్ష్యం. (అతనిచేష్టలే సాక్ష్యం.)
అతను ధనవ్యామోహంలో పూర్తిగా కూరుకుపోయాడు. సమాధుల్లో వున్నవాటిని తీసిబ్రతికించి, అంతరంగాల్లో ఉన్నవాటిని రట్టుచేయడం జరుగుతుందని అతనికి తెలియదా? ఆరోజు అతడ్ని గురించి అతని ప్రభువుకే బాగా తెలుసు. (1-11)