కురాన్ భావామృతం/అల్-మాఊన్
కురాన్ భావామృతం అధ్యాయములు |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 |
107. మావూన్ (సాధారణ వినియోగవస్తువులు)
(అవతరణ: మదీనా; సూక్తులు: 7)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
పరలోక తీర్పును ధిక్కరించే వాడ్ని నీవు గమనించావా? అతనే అనాథలను కసరి కొట్టేవాడు. పేదల అన్నదానం కోసం (ఇతరుల్ని) ప్రోత్సహించనివాడు. ప్రార్థన పట్ల అశ్రద్ధ, ఏమరుపాటులు వహించేవారికి వినాశం (రాసిపెట్టి) ఉంది. వారు ప్రతిపనీ లోకుల మెప్పు కోసం ప్రదర్శనాబుద్ధితో చేస్తుంటారు. (మితిమీరిన పిసినారితనంతో) వాడుకునే సాధారణ వస్తువుల్ని సైతం ఇతరులకు ఇవ్వడానికి నిరాకరిస్తారు. (1-7)