కురాన్ భావామృతం/అత్-తారిఖ్
కురాన్ భావామృతం అధ్యాయములు |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 |
86. తారిఖ్ (ప్రభాత నక్షత్రం)
(అవతరణ: మక్కా; సూక్తులు: 17)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
ఆకాశం సాక్షి! ప్రభాత నక్షత్రం సాక్షి! ప్రభాత నక్షత్రం అంటే నీకేమయినా తెలుసా? దేదీప్యమానంగా వెలిగిపోయే నక్షత్రం... ప్రతి ప్రాణినీ కనిపెట్టి ఉండేందుకు ఆ ప్రాణిపై ఒక పర్యవేక్షకుడు ఉన్నాడు. పర్యవేక్షకుడు లేని ప్రాణి అంటూ ఏదీ లేదు. (1-4)
మానవుడు తానుఎలాంటి పదార్థంతో పుట్టించబడ్డాడో కాస్త ఆలోచించాలి. వెనెన్‌మ్ను కకు, ప్రక్కటెముకలకు మధ్య నుండి దూకుడుగా వెలువడే ద్రవపదార్థంతో పుట్టించ బడ్డాడు. (అలాగే) అతడ్ని మళ్ళీ బ్రతికించే శక్తి కూడా ఆ సృష్టికర్తకు ఉంది. (5-8)
రహస్య విషయాలు(సైతం) బయటపెట్టి విచారణజరిపే రోజున మానవుని దగ్గర తనదంటూ ఎలాంటి శక్తి ఉండదు. అతడ్ని ఆదుకునేవారు కూడా ఉండరు. (9-10)
వర్షం కురిపించే ఆకాశం సాక్షి! (చెట్లు మొలకెత్తే సమయంలో) చీలిపోయే నేల సాక్షి! ఇది నిర్ణయాత్మకమైన విషయం. ఏదో ఆషామాషీ విషయం కాదు. (విచారణ రోజు మీరు తప్పకుండా బ్రతికించబడతారు.) వీరు కొన్ని పన్నాగాలు పన్నుతున్నారు. నేను కూడా ఒక పన్నాగం పన్నుతున్నాను. కనుక ప్రవక్తా! వారిని చూసీచూడనట్లు వదిలెయ్యి. కొంతకాలం పాటు వారి మానాన వారిని వదలిపెట్టు. (11-17)