కురాన్ భావామృతం/అల్-ఫుర్ ఖాన్

కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

25. ఫుర్ఖాన్‌ (గీటురాయి)
(అవతరణ: మక్కా; సూక్తులు: 77)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
యావత్తు ప్రపంచవాసులను హెచ్చరించే నిమిత్తం ఈ ఫుర్ఖాన్‌ (గీటురాయి)ని తన దాసునిపై అవతరింపజేసినవాడు ఎంతో శుభదాయకుడు. ఆయన భూమ్యాకాశాల విశాల సామ్రాజ్యానికి అధినేత. ఆయన తనకంటూ ఎవరినీ కొడుకుగా చేసుకోలేదు. ఆయన సామ్రాజ్యం, సార్వభౌమత్వాలలో ఆయనకు ఎవరూ సాటిలేరు. ఆయన ప్రతి వస్తువునూ, (ప్రతిప్రాణిని) సృష్టించి, దానికొక జాతకం నిర్ణయించాడు. (1-2)
(అలాంటి మహోన్నతుడు, మహత్తర శక్తిసంపన్నుడైన) దేవుడ్ని వదలి మానవులు ఎలాంటి వస్తువునీ సృజించలేని, స్వయంగా దేవునిచే సృజించబడిన మిధ్యాదైవాలను ఆరాధిస్తున్నారు. అవి తమకు ఎలాంటి లాభంగాని, నష్టంగాని కలిగించుకోలేవు. చంపే, బ్రతికించే శక్తి వాటికసలే లేదు. మృతుల్ని పునర్జీవింపజేసే శక్తి అంతకన్నా లేదు. (3)
సత్యతిరస్కారులు (ఖుర్‌ఆన్‌ని విమర్శిస్తూ) “ఇవన్నీ అతను కల్పించుకున్న అభూతకల్పనలు. ఈ పనిలో అతనికి ఇతరులు సహాయపడుతున్నారు” అంటారు. వీరు ఘోరమైన అన్యాయానికి, పచ్చి అబద్ధానికి పాల్పడ్డారు. అదీగాక “ఇవన్నీ పూర్వ కాలం మనుషుల నుండి వస్తున్న కట్టుకథలు. వాటిని ఈయనగారు వ్రాయించి ఉదయం, సాయంత్రం (జనానికి) విన్పిస్తున్నాడు” అని కూడా చెప్పసాగారు. (4-5)
ముహమ్మద్‌ (స)! వారికి చెప్పు: “దీన్ని భూమ్యాకాశాల రహస్యాలను ఎరిగినవాడు మాత్రమే అవతరింపజేశాడు. ఆయన గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడు.” (6)
వారిలా అంటారు: “ఇతనేం ప్రవక్తండి బాబు, కూడు తింటూ వీధుల్లో తిరిగే మనిషి దైవప్రవక్త అవుతాడా? ప్రవక్త అయితే దేవుడు అతని దగ్గరకు ఒక దైవదూతను పంపవచ్చుకదా? ఆ దూత అతని వెంటౌండి (విశ్వసించనివారిని) మందలిస్తూ ఉండాలి. అలా ఎందుకు జరగలేదు? అదీకాకపోతే అతని కోసం నిధినిక్షేపాలు దింప వచ్చుకదా? పోనీ, ప్రశాంతజీవితం గడపడానికి అతని దగ్గర ఒక తోటయినా లేదే!!
ఈ దుర్మార్గులు (విశ్వాసులతో) “మీరు చేతబడికి గురైనవాడి వెంటపడ్డారు” అంటారు. నీ గురించి ఎలాంటి కారుకూతలు కూస్తున్నారో చూడు. వీరికసలు మతి భ్రమించింది. ఒక్క మాటా సరిగ్గా ఆలోచించి మాట్లాడరు. దేవుడు తలచుకుంటే వారు చెబుతున్నదాని కంటే ఎంతో(భాగ్యం) నీకు ప్రసాదించ గలుగుతాడు. ఆయన గొప్ప శుభకరుడు. (ఒక్క తోటేమిటి,) సెలయేళ్ళు, (అందమైన) మేడలు ఉండే అనేక తోటలు అనుగ్రహించ గలుగుతాడు. (7-10)
వారసలు (నిన్ను కాదు,) ప్రళయాన్ని తిరస్కరిస్తున్నారు. ప్రళయాన్ని తిరస్కరించే వారికోసం మేము తీవ్రంగా ప్రజ్వరిల్లే నరకాగ్ని సిద్ధపరచి ఉంచాము. నరకం వారిని దూరం నుంచి చూడగానే, వారు దాని ఆగ్రహోద్రేకపూరితమైన భీకరగర్జనలు వింటారు. వారిని కాళ్ళు-చేతులు కట్టివేసి ఓ ఇరుకైన (నరక)స్థలంలో కుక్కినప్పుడు వారు (విల విల్లాడుతూ) మృత్యువుని పిలుస్తారు. (దానికి) “ఈరోజు మీరు ఒక్క చావుకాదు, అనేక చావులను పిలుచుకోండి” (అని సమాధానం ఇవ్వబడుతుంది). (11-14)
“ఈ దుర్గతి మంచిదా లేక భయభక్తులు కలవారికి వాగ్దానం చేయబడిన శాశ్వత స్వర్గధామం మంచిదా?” అని వారిని అడుగు. అది వారి సుకృతఫలం. వారి (మహా) ప్రస్థానంలో అంతిమ గమ్యం. అక్కడ వారు కోరే ప్రతి కోరికా నెరవేరుతుంది. వారక్కడ శాశ్వతంగా ఉంటారు. దాన్ని (భక్తిపరాయణులకు) ప్రసాదించే బాధ్యత నీ ప్రభువుపై ఉంది. ఇది ఆయన తప్పనిసరిగా నెరవేర్చవలసిన వాగ్దానం. (15-16)
ఆరోజు దేవుడు వారిని, దేవుడ్ని వదలి వారు పూజించిన మిధ్యాదైవాల్ని ఒక చోట చేర్చుతాడు. అప్పుడాయన మిధ్యాదైవాలను ఉద్దేశించి “నాయీ దాసులను మీరు అప మార్గం పట్టించారా లేక వారంతటవారే దారితప్పారా?” అని అడుగుతాడు. (17)
దానికి వారు ఇలా అంటారు: “(దేవ దేవ! ఎంతమాట!!) మీరు ఎంతో పరిశు ద్ధులు. మిమ్మల్ని గాకుండా మరొకర్ని రక్షకుడిగా, పోషకుడిగా చేసుకునేటంతటి ధైర్యం మాకే లేదు. (ఇక వారికి మేమెలా చెప్పగలం?) అసలు మీరే వారికి, వారి తాతముత్తాత లకు పుష్కలంగా జీవన సామగ్రి ప్రసాదిస్తూ పోయారు. చివరికి వారు (మేలు చేసిన) మిమ్మల్నే మరచిపోయి సర్వనాశనమయ్యారు.” (18)
(కనుక అవిశ్వాసులారా!) ఈవిధంగా (మీ దైవాలు) నేడు మీరంటున్న మాటల్ని (రేపు ప్రళయదినాన) తిరస్కరిస్తారు. ఆ తర్వాత మీకు విధించబడే శిక్షనుండి మీరు ఏమాత్రం తప్పించుకోలేరు. ఎలాంటి సహాయం లభించదు. మీలో దౌర్జన్యానికి (సత్య తిరస్కారానికి) పాల్పడిన ప్రతివాడికీ మేము కఠినాతికఠిన యాతన చవిచూపిస్తాం. (19)
ముహమ్మద్‌ (స)! మేము నీకు పూర్వం పంపిన ప్రవక్తలు కూడా కూడు తింటూ, వీధుల్లో తిరిగేవారే. మేమసలు మిమ్మల్ని ఒకరికొకరు పరీక్షా సాధనాలుగా చేశాం. మరి మీరు సహనం వహిస్తారా? నీ ప్రభువు సమస్త విషయాలు గమనిస్తున్నాడు. (20)
మా దర్శనభాగ్యం ఆశించనివారు “దైవదూతలు మా దగ్గరికి ఎందుకు రారు? లేక దేవుడు మాకెందుకు కన్పించడు?”అనంటారు. వారు తమనుతాము ఏదో గొప్ప వాళ్ళమని భావిస్తూ అహంకారం, తలబిరుసుతనాలతో హద్దుమీరి పోతున్నారు. నేరస్థులు ఏరోజు దైవదూతల్ని (కళ్ళారా) చూస్తారో ఆరోజు వారికి ఎలాంటి శుభవార్త ఉండదు. (అన్నీ దుర్వార్తలే.) దాంతో వారు వాపోతూ దేవుడ్ని శరణుకోరుతారు. మేము వారి కర్మల న్నిటినీ ధూళిరేణువుల్లా ఎగరగొడ్తాము. (21-23)
స్వర్గానికి అర్హులైనవారు మాత్రమే ఆరోజు మంచి స్థితిలో ఉంటారు. మధ్యాహ్నం వేళ (ఎండ తీక్షణ)ను వెళ్ళబుచ్చడానికి వారికి హాయిగా ఉండే విశ్రాంతి స్థలం లభి స్తుంది. ఆరోజు ఆకాశాన్ని చీల్చుకుంటూ ఒక మేఘం ప్రత్యక్షమవుతుంది. దాంతోపాటు (ఆకాశం నుండి) పెద్ద ఎత్తున దైవదూతలు దిగివస్తారు. (24-25)
ఆ రోజు నిజమైన సామ్రాజ్యాధికారం కరుణామయునిదే అవుతుంది. అది సత్య తిరస్కారులకు అతి కఠినమైన దుర్దినంగా దాపురిస్తుంది. ప్రతి దుర్మార్గుడు (ఆరోజు పశ్చాత్తాపంతో) చేతిని కొరుక్కుంటూ ఇలా అంటాడు: “అయ్యో! నేను దైవప్రవక్తతో సహకరించి సన్మార్గగామి అయివుంటే ఎంత బాగుండేది!! అయ్యయ్యో! నేను ఫలానా వాడ్ని స్నేహితుడిగా చేసుకోకుండా ఉంటే బాగుండేది!! వాడి మాయదారి మాటలు విని నాదగ్గరకు వచ్చిన హితోపదేశాన్ని దూరం చేసుకున్నానే! నేనెంత దౌర్భాగ్యుడ్ని!!”
షైతాన్‌ మానవుడ్ని అత్యవసర సమయంలోనే నట్టేట ముంచుతాడు. దైవప్రవక్త “ప్రభూ! నాజాతి ప్రజలు ఈ ఖుర్‌ఆన్‌ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు”అంటాడు. (26-30)
ముహమ్మద్‌ (స)! ఈవిధంగా మేము నేరస్థులను ప్రతి ప్రవక్తకు విరోధులుగా చేశాం. నీకు మార్గదర్శనం చేయడానికి, సహాయపడటానికి నీ ప్రభువే చాలు. (31)
“ఇతనిపై మొత్తం ఖుర్‌ఆన్‌ ఒకేసారి ఎందుకు అవతరించదు?” అనంటారు అవిశ్వాసులు. ఎందుకంటే మేము దీన్ని కొద్దికొద్దిగా (దించి) నీకు క్షుణ్ణంగా బోధపరుస్తు న్నాం. ఓ ప్రత్యేక క్రమంలో దీన్ని విడివిడిగా అంశాలవారిగా రూపొందించాము. నీ ముందు వారేదయినా కొత్త విషయం (లేదా విచిత్రమైన మాట) తెచ్చినప్పుడు దానికి సందర్భోచితంగా తగిన సమాధానమిచ్చి ఎంతో శ్రేష్ఠమైన రీతిలో నీకు విషయాన్ని విడమరచి చెబుతున్నాము... బోర్లా పడవేసి నరకానికి ఈడ్చబడవలసినవారి వైఖరి చాలా ఘోరంగా ఉంది. వారు పూర్తిగా దారితప్పారు. (32-35)
మేము మూసాకు (తౌరాత్‌) గ్రంథం ఇచ్చి, అతని సోదరుడ్ని అతనికి సహాయకు నిగా నియమించాం. అప్పుడు వారితో “మా సూక్తులు తిరస్కరించిన జాతి దగ్గరకు వెళ్ళండి” అని చెప్పాము. చివరికి మేము ఆజాతి ప్రజలను సర్వనాశనం చేశాం. (36)
దైవప్రవక్తలను తిరస్కరించిన నూహ్‌జాతికి కూడా అదేగతి పట్టింది. మేము వారిని (నీటిలో) ముంచి, ఆ సంఘటనను ప్రజల కోసం గుణపాఠంగా చేశాం. దుర్మార్గుల కోసం మేము (పరలోకంలో వేరే) వ్యధాభరితమైన యాతన సిద్ధపరచి ఉంచాం. (37)
అలాగే ఆద్‌, సమూద్‌ జాతులు, పాడుబడ్డ బావివాళ్ళు, వాటి మధ్యకాలాలకు చెందిన అనేకజాతుల ప్రజలు కూడా నాశనమయ్యారు. వారిలో చాలా మందికి (చారిత్రక) ఉదాహరణల ద్వారా విషయం నచ్చజెప్పాం. చివరికి మేము అందర్నీ అంత మొందించాం.
అతి దారుణంగా (శిలా)వర్షం కురిపించి (నాశనం చేయబడి)న పట్టణం మీదుగా వీరు ఎన్నోసార్లు ప్రయాణం చేశారు. మరి వారు ఆ పట్టణానికి పట్టిన దుర్గతి గమనించలేదా? వారికసలు మరణానంతర జీవితంపై నమ్మకమే లేదు. (38-40)
వారు నిన్ను చూసినప్పుడల్లా “ఓహో, ఇతణ్ణేనా దేవుడు ప్రవక్తగా చేసి పంపింది!” అంటూ హేళన చేస్తారు. పైగా “మనం గనక మన దేవతల విషయంలో ఒక మాటపై స్థిరంగా ఉండకపోతే ఇతను తప్పకుండా మనల్ని పెడత్రోవ పట్టించి, మన దేవతల నుండి దూరం చేస్తాడు” అనంటారు. సరే, (పరలోక) శిక్ష చూసినప్పుడు పెడత్రోవ పట్టి పోయింది ఎవరో వారికే తెలుస్తుంది. (41-42)
మనోవాంఛనే దైవంగా చేసుకున్న వాడ్ని చూశావా నీవు? అలాంటివాడ్ని దారిలోకి తీసుకురాగలవా? వారిలో చాలామంది (నీమాటలు) వింటారని, అర్థం చేసుకుంటారని భావిస్తున్నావా? వారసలు పశువుల్లాంటివారు. కాదు, అంతకన్నా దిగజారిపోయారు#
నీ ప్రభువు, నీడను ఎలా విస్తరింపజేస్తున్నాడో గమనించావా? ఆయన తలచు కుంటే దాన్ని శాశ్వతమైన నీడలా చేయగలడు. మేము సూర్యుడ్ని నీడకు మార్గదర్శిగా చేశాం. ఆపై మేమా నీడను క్రమేణా మావైపు వెనక్కి తీసుకుంటున్నాం. దేవుడే మీకోసం రాత్రిని (చీకటి) తెరగా, నిద్రను విశ్రాంతి స్థితిగా, పగటిని లేచి పనులు చేసుకునే సమయంగా చేశాడు. (43-47)
ఆయనే తన కారుణ్యానికి (వర్షానికి) ముందు (చల్లటి) గాలిని శుభవార్తగా పంపు తున్నాడు. తరువాత ఆకాశం నుండి స్వచ్ఛమైన నీటిని వర్షింపజేస్తున్నాడు. దాని ద్వారా మేము (బీటలు వారిన) మృతభూమికి జీవం పోస్తున్నాం. మరోవైపు మేము సృష్టించిన జీవరాసుల్లో అనేకమంది మానవులకు, జంతువులకు ఆ నీటిని త్రాగిస్తున్నాం. (48-49)
ప్రజలు గుణపాఠం నేర్చుకోడానికి ఈ మహిమను మాటిమాటికి వారి ముందుకు తెస్తున్నాం. కాని చాలామంది తిరస్కారం, కృతఘ్నతలు తప్ప మరోవైఖరి అవలంబించ డానికి సిద్ధంగా లేరు. మేము తలచుకుంటే ప్రతి ఊరికీ ఒక హెచ్చరించేవాడ్ని (దైవ ప్రవక్తను) నియమించేవాళ్ళం. కనుక ప్రవక్తా! అవిశ్వాసుల మాట ఎన్నటికీ వినకు. ఈ ఖుర్‌ఆన్‌ తీసుకొని వారితో అవిశ్రాంత పోరాటం జరుపుతూ ఉండు. (50-52)
ఆయనే రెండు సముద్రాలను కలిపి ఉంచాడు. ఒకటి మధురమైన మంచినీటి సముద్రం, రెండోది అతి క్షారవంతమైన ఉప్పునీటి సముద్రం. అవి రెండు ఒకదానితో ఒకటి కలసిపోకుండా వాటి మధ్య ఒక అడ్డుతెర ఉంటుంది. ఆయనే నీటితో మానవుడ్ని సృజించి, అతని నుండి పుట్టిల్లు, మెట్టిల్లు అనే రెండు వంశవృక్షాలను వృద్ధిచేస్తున్నాడు. నీ ప్రభువు ఎంతో శక్తిమంతుడు. (53-54)
అలాంటి దేవుడ్ని వదలి ప్రజలు తమకు ఎలాంటి లాభంగాని, నష్టంగాని కలిగించ లేని మిధ్యాదైవాలను ఆరాధిస్తున్నారు. పైగా (ఈ) అవిశ్వాసి తన నిజ ప్రభువుకు వ్యతిరేకంగా ప్రతి దుష్టశక్తికీ తోడ్పడుతున్నాడు. (55)
ప్రవక్తా! మేము నిన్ను శుభవార్తాహరునిగా, హెచ్చరించేవానిగా నియమించి పంపాం. వారికిలా చెప్పు: “నేనీ పని కోసం మీనుండి ఎలాంటి ప్రతిఫలం ఆశించడం లేదు. ఇష్టమున్నవారు తమ ప్రభువు మార్గం అవలంబిస్తే చాలు. అదే నా ప్రతిఫలం.”#
ముహమ్మద్‌ (స)! నిత్యజీవుడు, అమరుడైన దేవుడ్ని మాత్రమే నమ్ముకో. ఆయన్ని స్తుతిస్తూ, ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు. తన దాసుల పాపకార్యాలు తెలుసుకోవడానికి ఆయన ఒక్కడే చాలు. ఆయన భూమ్యాకాశాల్ని, వాటి మధ్య ఉన్న సమస్తాన్ని ఆరు రోజుల్లో సృష్టించి, ఆ తరువాత (విశ్వసామ్రాజ్యాధినేతగా అధికార) సింహాసనం అధిరోహించాడు. ఆయన ఎంతో కరుణామయుడు. (కావాలంటే) ఆయన్ని గురించి తెలిసినవారిని అడిగి తెలుసుకో. (56-59)
ఆ కరుణామయునికి సాష్టాంగపడమని చెప్పినప్పుడు వారు (తిరస్కారభావంతో) “ఎవరా కరుణామయుడు? నీవు ఎవరికి సాష్టాంగపడమంటే వారికి సాష్టాంగపడటమేనా మాపని?” అనంటారు. ఈ వైఖరితో వారి తిరస్కారం మరింత ముదిరిపోయింది. (60)
ఆకాశంలో నక్షత్రసముదాయాలను, (దేదీప్యమానమైన) సూర్యుడ్ని, ప్రకాశవంత మైన చంద్రుడ్ని సృజించిన శక్తిస్వరూపుడు గొప్ప శుభకరుడు. ఆయనే రాత్రింబవళ్ళను ఒకదాని వెనుక మరొకటి వచ్చేలా చేశాడు. (సృష్టినిర్మాణం గురించి) యోచించగోరే వారికి, లేదా కృతజ్ఞత చూపదలిచేవారికి ఇందులో గొప్ప సూచన ఉంది. (61-62)
కరుణామయుని (నిజ)భక్తులు భూమిపై (విర్రవీగకుండా) నమ్రతగా నడుస్తారు. మూర్ఖులు వారితో వాదనకు దిగితే ‘మీకు సలాం’ అంటారు. వారు తమప్రభువు సన్నిధి లో నిలబడి ప్రార్థనచేస్తూ, సాష్టాంగపడుతూ రాత్రిళ్ళు గడుపుతారు. అదీగాక దైవాన్ని వేడుకుంటూ “ప్రభూ! మమ్మల్ని నరకయాతనల నుండి కాపాడు. అవెంతో బాధాకరంగా, దారుణంగా ఉంటాయి. నరకం పరమచెడ్డ నివాసస్థలం” అని అంటారు. (63-66)
వారు తమ సంపద వినియోగిస్తున్నప్పుడు దుబారా ఖర్చుచేయరు; ఇటు పిసినారి తనం కూడా వహించరు. వారి ఖర్చు ఆ రెండు అతిచర్యలకు మధ్యస్తంగా ఉంటుంది. వారు ఒక్క దేవుడ్ని తప్ప మరెవరినీ ప్రార్థించరు. దేవుడు నిషేధించిన ఏ ప్రాణినీ అన్యాయంగా హతమార్చరు. వ్యభిచారానికి ఏమాత్రం పాల్పడరు.
ఈ పాడుపనులు చేసేవాడు మటుకు తన పాపఫలం అనుభవిస్తాడు. ప్రళయం రోజు అతనికి రెట్టింపు శిక్ష పడుతుంది. అందులోనే అతను ఎల్లకాలం అవమానభారం తో క్రుంగిపోతూ పరమనీచంగా పడివుంటాడు. అయితే పశ్చాత్తాపహృదయంతో క్షమాపణ కోరుకొని, దాంతోపాటు సత్యాన్ని విశ్వసించి సత్కార్యాలు చేయడం మొదలెడితే అలాంటి మనిషికి శిక్ష ఉండదు. పైగా దేవుడు అలాంటివారి (గత) దుష్కర్మలను సత్కర్మలుగా మారుస్తాడు. ఆయన గొప్పఅనుగ్రహశీలి, పరమదయాళువు. (67-70)
పశ్చాత్తాపంతో క్షమాపణ కోరుకొని సదాచార వైఖరి అవలంబించినవాడు నిజానికి మనస్పూర్తిగా పశ్చాత్తాపం చెంది దేవుని వైపు మరలి వచ్చినవాడవుతాడు. (71)
(కరుణామయుని భక్తులు) అసత్యానికి ఎన్నడూ సాక్షులుగా ఉండరు. ఎప్పుడైనా వారు పనికిమాలిన వ్యవహారం మీదుగా పోవలసివస్తే దాన్ని ఏమాత్రం పట్టించుకో కుండా హుందాగా, గౌరవప్రదంగా దాటివెళ్తారు. వారికి వారిప్రభువు సూక్తులు విన్పించి హితోపదేశం చేయడం జరిగితే వారు అంధులుగా, బధిరులుగా మారి వాటిని నిర్లక్ష్యం చేయరు. వారు “ప్రభూ! మా భార్యాపిల్లల ద్వారా మా కంటికి చలువ ప్రసాదించు. మేము దైవభీతిపరులకు నాయకులయ్యేలా చెయ్యి” అని ప్రార్థిస్తారు.(72-74)
(ఇలాంటి) వారే తమ సహనానికి ప్రతిఫలంగా (పరలోకంలో) అత్యున్నత స్థానాలు పొందేవారు. వారిని (దైవదూతలు) ఎంతో గౌరవిస్తూ శాంతివచనాలతో స్వాగతిస్తారు. వారక్కడ (స్వర్గంలో) కలకాలం (సుఖసంతోషాలతో) ఉంటారు. ఎంత మంచి నివాసస్థలం అది! (75-76)
ముహమ్మద్‌ (సల్లం)! అవిశ్వాసులకు ఇలా చెప్పెయ్యి: “మీరు నా ప్రభువుని ఆరాధించడానికి ముందుకు రాకపోతే ఆయన మాత్రం మిమ్మల్ని ఎందుకు లక్ష్య పెడతాడు? అదీగాక మీరాయన్ని తిరస్కరించారు కూడా. కనుక మీరు త్వరలోనే ఈ తిరస్కారానికి తగిన శిక్ష అనుభవిస్తారు.” (77)