కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

50. ఖాఫ్‌
(అవతరణ: మక్కా; సూక్తులు: 45)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
ఖాఫ్‌, ఖుర్‌ఆన్‌ సాక్షి! (నిస్సందేహంగా ముహమ్మద్‌ దేవుని ప్రవక్తే.) కాని ఒక హెచ్చరించేవాడు (దైవప్రవక్త) తమలోనే ఉద్భవించి తమ వద్దకు రావడమేమిటని వారు ఆశ్చర్యపోతున్నారు. (పైగా ఈ) అవిశ్వాసులు “చాలా విచిత్రంగా ఉందే! మనం ఒకసారి చనిపోయి మట్టిలో కలసిపోయాక (మళ్ళీ బ్రతికించబడతామా)? ఇది బుద్ధికందని విషయం” అని చెప్పసాగారు. (కాని) వారి దేహంలో భూమి తినేసే భాగాలేమిటో మాకు తెలుసు. మా దగ్గరున్న గ్రంథంలో అంతా నమోదయి భద్రంగా ఉంది. (1-4)
వారు సత్యం ముందుకొచ్చినప్పుడు దాన్ని (గురించి ప్రశాంతంగా ఆలోచించ కుండా) తిరస్కరించారు. అందుకే వారిప్పుడు దైవప్రవక్తను గురించి నిరాధారమైన అభి ప్రాయాలు వెలిబుచ్చుతూ కచ్చితమైన నిర్ణయానికి రాలేక సందిగ్ధంలో పడిపోయారు#
వారెప్పుడైనా తమ పైనున్న ఆకాశాన్ని పరికించి చూడలేదా, మేము ఎలా దాన్ని నిర్మించి తీర్చిదిద్దామో? అందులో ఎక్కడా ఎలాంటి రంధ్రంగాని, నెర్రగానిలేదు. మేము భూమిని పరచి దానిపై పర్వతాలను పాతాము. అందులో రకరకాల మనోహరమైన వృక్షజాతుల్ని మొలపించాం. ఇవి సత్యాన్వేషకులకు కళ్ళుతెరిపించే సూచనలు. (5-8)
మేము ఆకాశం నుండి శుభదాయకమైన నీటిని (వర్షాన్ని) దించి, తద్వారా (పండ్ల) తోటలు, పంటధాన్యాలు, ఒకదాని మీద ఒకటి విరగగాచే పండ్లగుత్తులు గల ఎత్తయిన ఖర్జూరచెట్లు పుట్టించాము. ఇది (మా) దాసులకు ఆహారం అందజేసే (అద్భుతమైన) ఏర్పాటు. ఈ నీటితో మేము (బీటలు వారిన) మృతభూమికి తిరిగి జీవం పోస్తున్నాము. అలాగే (మరణించిన మానవులు కూడా పునరుజ్జీవులయి) లేస్తారు. (9-11)
వీరికి పూర్వం నూహ్‌జాతి, పాడుబడ్డబావివాళ్ళు, ఆద్‌, సమూద్‌, ఫిరౌన్‌వాళ్ళు, లూత్‌ సోదరులు, అయికా వాసులు, తుబ్బాజాతి ప్రజలు కూడా తిరస్కరించారు. వారంతా ప్రవక్తలను తిరస్కరించినవారే. అందువల్ల మా హెచ్చరిక కార్యరూపం దాల్చి (వారిని తుడిచిపెట్టి)ంది. మేము తొలి సృష్టి నిర్మాణంతోనే అలసిపోయామా? (అదేమీ కాదు.) వీరసలు నూతన సృష్టి గురించి సందేహంలో పడిపోయారు. (12-15)
మేము మానవుడ్ని సృజించాం. అతని అంతరంగంలో మెదిలే ఆలోచనలు సైతం మాకు తెలుసు. మేమతనికి అతని కంఠనాళంకన్నా అతిసమీపంగా ఉన్నాం. అతని కుడి, ఎడమల వైపు ఇద్దరు (అదృశ్య) లేఖకులు కూడా కూర్చొని (అతని) ప్రతి పనినీ, ప్రతి పలుకునూ నమోదు చేస్తున్నారు. అతనినోట ఏదైనా మాట వెలువడగానే దాన్ని నమోదు చేయడానికి ఒక పర్యవేక్షకుడు తక్షణమే అక్కడ ప్రత్యక్షమవుతాడు. (16-18)
చూడండి, చివరికి ప్రాణసంకటం సత్యాన్ని తీసుకొచ్చింది. “(మానవా!) నీవు ఏ సత్యాన్ని నిరాకరిస్తూ పారిపోతుండేవాడివో ఆ సత్యం ఇదే. ఆ తర్వాత (ప్రళయ)శంఖం పూరించబడుతుంది. ఈ దినాన్ని గురించే నిన్ను భయపెట్టడం జరుగుతుండేది. ఆరోజు ప్రతి మనిషి వెంట అతడ్ని తోలుకొచ్చేవాడు ఒకడుంటాడు. ఈ విషయాన్ని గురించి నీవు ఏమరుపాటులో పడివున్నావు. మేము నీముందున్న (ఐహిక) తెరను తొలగించాం. నీ చూపులిప్పుడు వాడిగా ఉన్నాయికదూ! (ఇకచూడు ఇది యదార్థమో కాదో.)” (19-22)
అతని (వెంటనున్న) సహచరుడు “(ప్రభూ!) ఇతను నా అధీనంలో ఉండేవాడు, (ఇప్పుడు తమరి ముందు) ప్రవేశపెడ్తున్నాను” అంటాడు. “సత్యాన్ని ధిక్కరించిన ప్రతి కృతఘ్నుడ్నీ నరకంలో పడేయండి. వాడు సత్కార్యాలు చేయకపోవడమేగాక ఇతరుల్ని కూడా నిరోధించేవాడు. హద్దు మీరిపోయేవాడు. తాను అనుమానంలో పడిపోవడమేగాక ఇతరుల్లో కూడా అనుమానాలు రేకెత్తించేవాడు. దేవునితో పాటు దైవేతరశక్తుల్ని ఆరా ధించేవాడు. పడేయండి వాడ్ని భీకర (నరక)యాతనలో” అని ఆజ్ఞవుతుంది. (23-26)
(ఆవ్యక్తి షైతాన్‌ని ఆడిపోసుకుంటూ, ఈదుర్మార్గుడు తన వెంటబడి తనను సర్వ నాశనం చేశాడని ఆరోపించినప్పుడు) అతని సహచరుడు (దాన్ని ఖండిస్తూ) “మహాప్రభో! నేనితడ్ని తిరుగుబాటుకు ప్రేరేపించలేదు. ఇతను తనంతటతానే మార్గభ్రష్టత్వంలో పడి చాలాదూరం కొట్టుకుపోయాడు” అనంటాడు. “నాముందు వాదించకండి. నేను ముందే మిమ్మల్ని హెచ్చరించాను. నాదగ్గర మాటమారదు. నేను నా దాసులకు అన్యాయంచేసే వాడ్నికాను”అని జవాబు లభిస్తుంది. ఆరోజు మేము నరకాన్ని ‘నీవు నిండిపోయావా?’ అని అడుగుతాం. దానికి నరకం “ఇంకా ఏమైనా ఉందా?” అంటుంది. (27-30)
(ఆరోజు) స్వర్గం దైవభీతిపరులకు అతి చేరువగా తీసుకు రాబడుతుంది; దూరంగా ఉండదు. అప్పుడిలా ఆజ్ఞవుతుంది: “మీకు వాగ్దానం చేయబడిన వస్తువు ఇదే. పశ్చాత్తా పంతో దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకునేవాడు, (బాధ్యతల్ని) పరిరక్షించేవాడు, కరుణామయుడైన దేవుడ్ని చూడకుండానే ఆయనకు (ప్రతి విషయంలోనూ) భయపడే వాడు, ఏకాగ్ర హృదయంతో వచ్చినవాడు అయిన ప్రతివ్యక్తికీ (ఈ మహాభాగ్యం లభిస్తుంది). శాంతీసంక్షేమాలతో స్వర్గప్రవేశం చేయండి.” అదే శాశ్వత(జీవితం సాగించే) దినం. అక్కడ స్వర్గవాసులకు వారు కోరిన ప్రతివస్తువూ లభిస్తుంది. వారి కోసం మా దగ్గర అంతకంటే అధికంగానే ఉంది. (31-35)
పూర్వం మేము వీరికంటే ఎంతో శక్తిసామర్థ్యాలున్న అనేక జాతుల్ని హతమార్చాం. వారు ప్రపంచదేశాలు గాలించారు. మరి రక్షణ కోసం ఎక్కడైనా ఆశ్రయం లభించిందా? బుద్ధీజ్ఞానాలుండి, శ్రద్ధగా ఆలకించే ప్రతి వ్యక్తికీ ఇందులో గుణపాఠం ఉంది. (36-37)
మేము భూమ్యాకాశాల్ని, వాటిమధ్య ఉన్న సమస్తాన్ని ఆరు రోజుల్లో సృష్టించాం. అయినా మేము అలసిపోలేదు. ప్రవక్తా! వీరు కల్పించి చెబుతున్న మాటలకు నీవు (బాధపడకు,) సహనం వహించు. (ప్రతిరోజూ) సూర్యోదయానికి, సూర్యాస్తమయానికి ముందు ఆయన్ని స్తుతిస్తూ, ఆయన (పవిత్రత)ని స్మరిస్తూ ఉండు. రాత్రి వేళలో కూడా ఆయన్ని స్మరించు; సాష్టాంగప్రణామాల తర్వాత కూడా. (38-40)
వినండి! ఏరోజు ప్రకటనకర్త సమీపం నుండి కేకవేస్తాడో, ఏరోజు మానవులు నమ్మకంగా భీకరగర్జన వింటారో అదే మృతులు నేలనుండి లేచే రోజవుతుంది. మేమే బ్రతికిస్తున్నాం; మేమే చంపుతున్నాం. చివరికి మా వైపుకే అందరూ తిరిగిరావలసి ఉంటుంది. ఆరోజు భూమి బ్రద్దలవుతుంది. అందులో నుంచి మానవులు బిలబిల బయటి కొచ్చి వడివడిగా పరుగెత్తుతారు. ఈ పునరుత్థానకార్యం నిర్వహించడం మాకు చాలాతేలిక. ప్రవక్తా! వీరి మాటలు మేము గమనిస్తూనే ఉన్నాం. బలవంతంగా ఒప్పించడం నీ పని కాదు. నా హెచ్చరికకు భయపడేవారికి ఖుర్‌ఆన్‌ ద్వారా హితోపదేశం చెయ్యి. (41-45)