కురాన్ భావామృతం/అల్-అహ్ ఖఫ్

కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

46. అహ్‌ఖాఫ్‌ (ఇసుకొండల నేల)
(అవతరణ: మక్కా; సూక్తులు: 35)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
హా-మీమ్‌. ఇది అపార శక్తిసంపన్నుడు, అసామాన్య వివేకవంతుడైన దేవుని దగ్గర నుండి అవతరించిన గ్రంథం. మేము భూమ్యాకాశాల్ని, వాటి మధ్యనున్న సమస్తాన్ని సత్యం ప్రాతిపదికపై ఒక నిర్ణీతవ్యవధి కోసం సృష్టించాం. కాని ఈ అవిశ్వాసులు తమను హెచ్చరించి చెప్పిన యదార్థానికి విముఖులైపోయారు. (1-3)
ప్రవక్తా! వారినిలా అడుగు: “దేవుడ్ని వదలి మీరు ప్రార్థిస్తున్న శక్తులేమిటో ఎప్పుడైనా మీరు కళ్ళు తెరచి చూశారా? అవి లోకంలో ఏం సృష్టించాయో కాస్త నాకు చూపించండి. పోనీ ఆకాశ నిర్మాణంలో వాటి పాత్ర ఏమిటో చెప్పండి. మీ అభిప్రాయం నిజమయితే దీనికి పూర్వం (మీ నమ్మకాలకు రుజువుగా) వచ్చిన గ్రంథంగాని, లేదా ఏదైనా (దైవిక)జ్ఞానంలోని కొన్ని అంశాలుగాని మీ దగ్గరుంటే తీసుకురండి.” (4)
దేవుడ్ని వదలి ప్రళయందాకా తమ ప్రార్థనలకు స్పందించని మిధ్యాదైవాలను మొరపెట్టుకునేవాడి కంటే మించిన మార్గభ్రష్టుడు మరెవరుంటారు? పైగా మొరపెట్టు కునేవారు తమను మొరపెట్టుకుంటున్నారన్న సంగతి కూడా ఆ మిధ్యాదైవాలకు తెలియదే! అంతేకాదు, మానవులంతా సమావేశపరచబడే (ప్రళయ)దినాన వారు తమను ప్రార్థించినవారికి శత్రువులైపోతారు; వారి పూజాపురస్కారాలను తిరస్కరిస్తారు. (5-6)
విషయస్పష్టత కలిగిన మా సూక్తులు విన్పించడం ద్వారా సత్యం వారి ముందుకు వచ్చినప్పుడు ఈ సత్యతిరస్కారులు దాన్ని గురించి “ఇదంతా మాయాజాలం” అంటారు. దైవప్రవక్త దీన్ని కల్పించుకున్నాడని అంటున్నారా వీరు? అయితే వారికిలా చెప్పు: “నేనొకవేళ దీన్ని కల్పించుకుంటే, దేవుని పట్టు నుండి మీరు నన్ను ఏ విధంగానూ కాపాడ లేరు. మీరు కల్పించి చెబుతున్న మాటలను గురించి దేవునికి బాగా తెలుసు. (ఈ విషయంలో) నాకూ మీకూ మధ్య దేవుడే సాక్షి. (కనుక ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకుంటే) ఆయన ఎంతో క్షమించేవాడు, కరుణించేవాడు.” (7-8)
చెప్పు: “నేనేమీ కొత్తగా వచ్చిన ప్రవక్తను కాను. (పూర్వం కూడా ఎందరో ప్రవక్తలు వచ్చిపోయారు.) రేపు మీ విషయమైనా, నా విషయమైనా ఏమవుతుందో నేను చెప్ప లేను. నేను నా దగ్గరికొస్తున్న దివ్యావిష్కృతిని అనుసరిస్తున్నవాడ్ని మాత్రమే. నేను (విషయం గురించి ప్రజలను) స్పష్టంగా హెచ్చరించేవాడ్ని తప్ప మరేమీ కాను.” (9)
వారికిలా చెప్పు: “ఇది దేవుని దగ్గర్నుండే వచ్చిన వాణి అయివుండి, దాన్ని మీరు తిరస్కరిస్తే (ప్రళయదినాన మీ గతేమవుతుంది)? దీన్ని గురించి ఆలోచించారా మీరు? ఇలాంటిదే (గతంలో) ఒకవాణి వచ్చినప్పుడు ఇస్రాయీల్‌ సంతతికి చెందిన ఒక సాక్షి దానికి అనుకూలంగా సాక్ష్యమిచ్చాడు. (అది బోధించే సత్యాన్ని) అతను విశ్వసించాడు. కాని మీరు మాత్రం గర్వపోతులయి పోయారు. అలాంటి దుర్మార్గులకు దేవుడు ఎన్నటికీ సద్బుద్ధి ప్రసాదించడు.” (10)
అవిశ్వాసులు విశ్వసించినవారిని విమర్శిస్తూ “ఈ గ్రంథాన్ని విశ్వసించడం మంచి పనయితే, దీని విషయంలో (సమాజంలో ఎలాంటి పేరూ ఊరూ లేని) వీరు మమ్మల్ని మించిపోయేవారు కాదు” అంటున్నారు. ఈగ్రంథం నుండి సన్మార్గం పొందలేకపోయారు గనక వారు దీన్ని పాతకాలంనాటి పుక్కిటి పురాణమని తప్పకుండా అంటారు. దీనికి పూర్వం మూసా (ప్రవక్త)కు ఇవ్వబడిన (తౌరాత్‌) గ్రంథం (మానవుల పాలిట) మార్గదర్శి నిగా, (దైవ)కారుణ్యంగా వచ్చింది. ఇప్పుడీ గ్రంథం దాన్ని (సత్యతను) ధృవీకరిస్తూ దుర్మార్గుల్ని హెచ్చరించడానికి, సన్మార్గ వైఖరి అవలంబించేవారికి శుభవార్త అందజేయ డానికి అరబీభాషలో అవతరించింది. (11-12)
దేవుడే తమ ప్రభువని పలికి, ఆమాట పైన్నే స్థిరంగా ఉండేవారికి (పరలోకంలో) ఎలాంటి భయంగాని, దుఃఖంగాని ఉండదు. అలాంటివారికే స్వర్గ ప్రవేశం లభిస్తుంది. వారు భూలోకంలో చేసిన సత్కార్యాలకు ప్రతిఫలంగానే ఈ స్వర్గభాగ్యం లభిస్తుంది. అక్కడే వారు కలకాలం (సుఖసంతోషాలతో) ఉంటారు. (13-14)
మేము మానవునికి తన తల్లిదండ్రుల పట్ల సత్ప్రవర్తన కలిగివుండాలని ఆదే శించాం. అతని తల్లి అతడ్ని ఎంతో శ్రమకోర్చి తన గర్భంలో పెట్టుకొని మోసింది. ఎంతో శ్రమపడి అతడ్ని కన్నది. అతడ్ని గర్భంలో పెట్టుకొని మోయడానికి, ఆ తర్వాత పాలు మాన్పించడానికి ముప్ఫయి నెలలు పట్టింది. చివరికతను పూర్తిగా శక్తిమంతుడవుతాడు. (అలా) నలభై యేళ్ళ ప్రాయానికి చేరుకున్న తర్వాత అతను (దేవుడ్ని) ఇలా ప్రార్థిస్తాడు:
“ప్రభూ! నీవు నాకు, నా తల్లిదండ్రులకు చేసిన మేళ్ళకు నేను నీపట్ల కృతజ్ఞుడయి ఉండే సద్బుద్ధి ప్రసాదించు. నీ ప్రసన్నతాభాగ్యం లభించేటటువంటి సత్కార్యాలు చేసే సద్బుద్ధి కూడా ప్రసాదించు. నా సంతానాన్ని కూడా సజ్జనులుగా చేసి నాకు సుఖాన్నివ్వు. నేను నీకు విధేయుణ్ణయిన దాసుడ్ని. నా పాపాలకు నేను పశ్చాత్తాపపడుతూ నన్ను క్షమించమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాను.” (15)
ఇలా మేము మానవుల దుష్కర్మల్ని క్షమించి వారి సత్కర్మల్ని స్వీకరిస్తున్నాం. ఇలాంటివారే తమకు చేయబడిన సత్యవాగ్దానాల ప్రకారం స్వర్గవాసుల్లో చేరిపోతారు#
దీనికి భిన్నంగా మరొక వ్యక్తి తన తల్లిదండ్రుల్ని ఈసడించుకుంటూ “ఛీ! మీపోరు ఎక్కువయిపోయింది. నేను చనిపోయాక (మళ్ళీ బ్రతికించి) సమాధి నుండి నన్ను లేపు తారని మీరు నన్ను బెదరగొడ్తున్నారా? మరి నాకు పూర్వం ఎన్నో తరాలు గతించాయి కదా! (వారిలో ఒక్కరూ సమాధి నుండి లేచి రాలేదే!!)” అని అంటాడు. దానికి అతని తల్లిదండ్రులు దైవాన్ని మొరపెట్టుకున్న తర్వాత “ఓరి దౌర్భాగ్యుడా! (మామాట) నమ్ము. దైవవాగ్దానం సత్యమైనది” అనంటారు. కాని ఆ వ్యక్తి (తలబిరుసుతో) “ఇవన్నీ పూర్వ కాలంనాటి పుక్కిటి పురాణాలు తప్ప మరేమీ కాదు” అనంటాడు. (16-17)
ఇలాంటివారికే (నరక)శిక్ష నిర్ణయం వర్తిస్తుంది. (ఇలాంటి చేష్టలకు పాల్పడి) గతించిన జిన్‌, మానవ జాతుల్లో వీరూ చేరిపోయారు. వీరు తప్పక నష్టపోతారు. ప్రతి వర్గానికీ దాని కర్మల్ని బట్టి అంతస్తులుంటాయి. వారు చేసుకున్న కర్మలకు ప్రతిఫలం ఇవ్వడానికే ఇలా జరుగుతుంది. వారికెలాంటి అన్యాయం జరగదు. (18-19)
తర్వాత ఈ అవిశ్వాసుల్ని నరకాగ్ని ముందు నిలబెట్టి వారితో (దైవదూతలు) ఇలా అంటారు: “మీరు ప్రపంచ జీవితంలో మీవాటాకు వచ్చిన సిరిసంపదలన్నీ తనివితీరా అనుభవించి కాజేశారు. పైగా అక్కడ ఎలాంటి నీతి న్యాయం లేకుండా అహంకారంతో విర్రవీగేవారు. ఎన్నో అక్రమాలకు, అధర్మాలకు పాల్పడ్డారు. అందువల్ల ఈరోజు మీరు అత్యంత అవమానకరమైన శిక్షగా (నరక) యాతనలకు గురికాబోతున్నారు.” (20)
ఆద్‌(జాతి) సోదరుని వృత్తాంతం విన్పించు. అప్పుడతను (హూద్‌ప్రవక్త) ఇసుక కొండల నేలయిన ‘అహ్‌ఖాఫ్‌’లో తన జాతిప్రజలను ఒక ఉపద్రవం గురించి హెచ్చ రించాడు- ఇలా హెచ్చరించేవారు గతంలో, ఆ తర్వాత కూడా వచ్చిపోయారు- “దేవుడ్ని తప్ప మరెవరినీ ఆరాధించకండి. నేను మీ విషయంలో ఒక భయంకర దినాన సంభ వించే ఉపద్రవం గురించి భయపడుతున్నాను” అని హెచ్చరించాడతను. (21)
దానికి అతని జాతిప్రజలు (సత్యాన్ని అంగీకరించడానికి నిరాకరిస్తూ) “మమ్మల్ని మా దేవతల నుండి దూరం చేయడానికి వచ్చావా? సరే, నీవు సత్యవంతుడవైతే, మమ్మల్ని బెదరగొడ్తున్న ఆ ఉపద్రవం ఏమిటో తీసుకురా చూద్దాం” అన్నారు. (22)
“ఆ సంగతి దేవునికే తెలుసు. నేను నాకిచ్చి పంపిన సందేశం మాత్రమే మీకు అందజేస్తున్నాను. కాని మీరు చాలా అజ్ఞానం, మూఢత్వాలతో ప్రవర్తిస్తున్నట్లు అన్పి స్తోంది నాకు” అన్నాడు వారి సోదరుడు. (23)
(ఒక రోజుజు) ఆ విపత్తు మేఘాలరూపంలో తమ లోయల వైపు రావడం చూసి “ఈ మేఘాలు మనకెంతో ప్రయోజనం కలిగిస్తాయి” అన్నారు వారు (సంబరపడి పోతూ)... “కాదు, ఇది మీరు లోగడ తొందరపెట్టిన ఉపద్రవం. ఇదొక పెనుతుఫాన్‌, ఘోరమైన ఆపద మోసుకొస్తోంది. అది తన ప్రభువాజ్ఞతో (మిమ్మల్ని) సర్వనాశనం చేస్తుంది.” (24)
చివరికి ఆ ఉపద్రవం వారిపై విరుచుకుపడి, వారి నివాస స్థలాలు తప్ప పూర్తిగా తుడిచి పెట్టింది. ఇలా మేము పాపాత్ములకు ప్రతిఫలమిస్తున్నాం. మేము వారికి మీకివ్వని సిరిసంపదలెన్నో ఇచ్చాం. వారికి మేము కళ్ళు, చెవులు, హృదయాలు కూడా ఇచ్చాం. కాని వారి కళ్ళుగాని, చెవులుగాని, హృదయాలుగాని ఏవీ వారికి ఉపయోగపడ లేదు. కారణం వారు దేవుని సూక్తుల్ని (హేళనచేస్తూ) నిరాకరిస్తుండేవారు. చివరికి వారు హేళనచేసిన దాని ఉచ్చులోనే పడిపోయారు. (25-26)
మీ చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని అనేక ఊళ్ళను మేము నాశనం చేశాము. ఆ ప్రజలు తమ వైఖరి మానుకుంటారేమోనని, మేము మా సూక్తులు పంపి అనేకసార్లు అనేక విధాలుగా నచ్చజెప్పాం. వారు దేవుడ్ని వదలి ఇతర శక్తుల్ని దైవసామిప్య సాధనా లుగా భావించి పూజించేవారు. మరి అవి వారిని (ఆపద సమయంలో) ఎందుకు ఆదుకోలేదు? అసలవి వారి నుండి (ఎప్పుడో) కనుమరుగయి పోయాయి. ఇదీ వారి అసత్యాలు, అభూతకల్పనల పర్యవసానం. (27-28)
(వారికి మరో సంఘటన విన్పించు:) మేము జిన్నుల సమూహం ఒకదాన్ని ఖుర్‌ఆన్‌ వాణి వినేందుకు నీదగ్గరకు పంపాము. వారు (నీవు ఖుర్‌ఆన్‌ పఠిస్తున్న) స్థలానికి చేరుకొని పరస్పరం నిశ్శబ్దంగా ఉండండని అన్నారు. ఖుర్‌ఆన్‌ పఠనం ముగి సిన తర్వాత వారు హెచ్చరించేవారుగా తమ జాతిప్రజల దగ్గరికెళ్ళి ఇలా అన్నారు:
“మాజాతి సోదరులారా! మేమొక (అద్భుత)గ్రంథం విన్నాం. ఇది మూసా నిష్క్ర మణ తర్వాత అవతరించింది. పూర్వం అవతరించిన (దైవ)గ్రంథాలను ధృవీకరిస్తోంది. సత్యం, సన్మార్గాల వైపు మార్గదర్శనం చేస్తుంది. కనుక మాజాతి సోదరులారా! దేవుని వైపు పిలిచేవాని పిలుపు అందుకోండి. ఆయన్ని విశ్వసించండి. దేవుడు మీ తప్పులు మన్నిస్తాడు. మిమ్మల్ని ఘోరశిక్ష నుండి రక్షిస్తాడు.” (29-31)
దైవసందేశ ప్రచారకుని మాట విననివాడు లోకంలో దేవుని పట్టునుండి తప్పించు కోలేడు. దేవుడు తప్ప అతనికి ఏ సహాయకుడూ, సంరక్షకుడూ ఉండడు. ఇలాంటివారే స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడివుండేవారు. భూమ్యాకాశాల్ని సృష్టించినవాడికి, వాటిని సృష్టించడంలో ఏమాత్రం అలసిపోనివాడికి మృతుల్ని బ్రతికించే శక్తి కూడా ఉంటుందని వారికి తెలియదా? ఆయనకు ప్రతిదానిపై అదుపు, అధికారం ఉన్నాయి. (32-33)
ఈ అవిశ్వాసులను నరకాగ్ని ముందుకు తెచ్చి నిలబెట్టే రోజు “ఇది వాస్తవం కాదా?” అని వారిని అడుగుతారు (దైవదూతలు). దానికి వారు “వాస్తవమే. మాప్రభువు సాక్షి! (ఇది వాస్తవమే)” అంటారు. అప్పుడు “అయితే మీ తిరస్కారానికి ఫలితంగా (నరక)యాతన చవిచూడండి” అని చెప్పడం జరుగుతుంది. (34)
కనుక ప్రవక్తా! అనన్య ధైర్యసాహసాలుగల ప్రవక్తలు సహనం వహించినట్లు నీవూ సహనం వహించు. వీరి విషయంలో తొందరపడకు. వీరు తమకు హెచ్చరించబడుతున్న దాన్ని చూసే రోజు వచ్చినప్పుడు, వీరికి తాము భూలోకంలో ఒక ఘడియ కాలం కన్నా ఎక్కువసేపు లేమన్నట్లు అన్పిస్తుంది. (నీ బాధ్యత నెరవేరింది.) విషయం (వారికి) అంద జేయబడింది. ఇక దురాత్ములు తప్ప ఎవరు నాశనమవుతారు? (35)