కురాన్ భావామృతం/లుఖ్ మాన్

కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

31. లుఖ్మాన్‌
(అవతరణ: మక్కా; సూక్తులు: 34)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
అలిఫ్‌-లామ్‌-మీమ్‌. ఇవి యుక్తీ వివేకాలతో నిండిన గ్రంథంలోని సూక్తులు. ఈ సూక్తులు సహృదయుల పాలిట మార్గదర్శిని, కారుణ్యకడలి. ఆ సహృదయులు నమాజు (వ్యవస్థ) నెలకొల్పుతారు; (పేదల ఆర్థిక హక్కయిన) జకాత్‌) చెల్లిస్తారు; పరలోకాన్ని విశ్వసిస్తారు. అలాంటివారే తమ ప్రభువు నుండి లభించే సన్మార్గంలో ఉంటారు. వారే సార్థక జీవులు, సఫలీకృతులు. (1-5)
మానవుల్లో మనసును మభ్యపెట్టే వ్యర్థ వస్తువుని కొనితెచ్చేవాడు కూడా ఒకతను ఉన్నాడు. అతను (సరైన)జ్ఞానం లేకుండా ప్రజల్ని దైవమార్గం నుండి తప్పించి, ఆ ప్రచారాన్ని పరిహసించడానికే ఇలాంటి చేష్టలకు వడిగట్టాడు. ఇటువంటి వారికి అవ మానకరమైన శిక్ష కాచుకొని ఉంది. మా సూక్తులు విన్పించినప్పుడు అతను అహంకారం తో విర్రవీగుతూ, తాను చెవిటివాడన్నట్లు, తానసలు దాన్ని విననే లేదన్నట్లు ఎటో ముఖం తిప్పుకుంటాడు. సరే, అతని కోసం అత్యంత బాధాకరమైన యాతన ఎదురు చూస్తోందని శుభవార్త విన్పించు. (6-7)
సత్యాన్ని విశ్వసించి సదాచార సంపన్నులైనవారికి భోగభాగ్యాలతో నిండిన స్వర్గ సీమ సిద్ధంగా ఉంది. వారక్కడ కలకాలం (హాయిగా) ఉంటారు. ఇది దేవుడు చేస్తున్న తిరుగులేని వాగ్దానం. ఆయన అపార శక్తిమంతుడు, అసాధారణ వివేకవంతుడు. (8-9)
ఆయన మీకు గోచరించే ఆధారాలేమీ లేకుండాఉండే ఆకాశాన్ని సృష్టించాడు. భూమి మిమ్మల్ని తీసుకొని దొర్లిపోకుండా ఉండేందుకు ఆయన దానిపై పర్వతాలు పాతాడు. ఆయన ధరణిలో వివిధ రకాల జంతువుల్ని వ్యాపింపజేశాడు. ఆకాశం నుండి వర్షం కురిపించి తద్వారా భూమిపై రకరకాల మంచి చెట్లు మొలకెత్తిస్తున్నాడు. ఇదంతా దేవుని సృష్టి. ఇక ఇతరులు ఏం సృష్టించారో చెప్పండి నాకు. అసలీ దుర్మార్గులు పూర్తిగా దారితప్పారు. (10-11)
దేవుని పట్ల కృతజ్ఞుడయి ఉండమని చెబుతూ మేము లుఖ్మాన్‌కు వివేకాన్ని ప్రసా దించాము. ఎవరైనా (దేవునికి) కృతజ్ఞత చూపితే, ఆ కృతజ్ఞత అతనికే ప్రయోజనం చేకూర్చుతుంది. దీనికి భిన్నంగా కృతఘ్నుడైపోతే, దేవునికి కలిగే నష్టమేమీ లేదు. ఆయన నిరపేక్షాపరుడు, స్వతహాగా ప్రశంసనీయుడు. లుఖ్మాన్‌ తన కుమారునికి హితోపదేశం చేసిన సందర్భం గుర్తుకుతెచ్చుకో. అతను తన కుమారునితో “బాబూ! దేవునికి (ఆయన దైవత్వంలో) ఎవరినీ సాటి కల్పించకు. దేవునికి సాటి కల్పించడం ఘోరమైన పాపం, దారుణమైన అన్యాయం” అన్నాడు. (12-13)
తల్లిదండ్రులకు సేవచేయాలని మేము మానవుడ్ని ఆదేశించాము. అతని తల్లి బాధ మీద బాధ భరిస్తూ అతడ్ని తన గర్భంలో పెట్టుకొని మోసింది. అతడ్ని పాలు విడి పించడానికి రెండేండ్లు పట్టింది. (అందువల్ల మేమతనికి ఇలా ఉపదేశించాం:) “నాపట్ల కృతజ్ఞుడవయి ఉండు. నీ తల్లిదండ్రుల పట్ల కూడా కృతజ్ఞతాభావంతో మసలుకో. నీవు (చివరికి) నా దగ్గరికే రావలసిఉంది. అయితే నీకు తెలియనిదాన్ని నాకు సాటి కల్పించ మని వత్తిడిచేస్తే మటుకు నీవు వారిమాట ఎన్నటికీ వినకు. ప్రపంచంలో వారి పట్ల సత్ప్రవర్తన కలిగిఉండు. అనుసరణ విషయంలో మాత్రం నావైపు మరలినవారి మార్గాన్నే అనుసరించు. చివరికి మీరంతా నా దగ్గరికే తిరిగిరావలసి ఉంది. అప్పుడు నేను మీరు (ఐహిక జీవితంలో) ఎలా నడచుకునేవారో మీకు తెలియజేస్తాను.” (14-15)
(లుఖ్మాన్‌ తన కుమారునికి ఇలా ఉపదేశించాడు:) “కుమారా! ఏదయినా బండ రాయిలో గాని, ఆకాశంలోగాని, భూమిపైగాని, లేదా మరెక్కడైనా సరే ఆవగింజంత వస్తువు దాగివున్నా దేవుడు దాన్ని బయటికి తీయగలడు. ఆయన ఎంతో సూక్షగ్రాహి, సమస్తం తెలిసినవాడు. (కనుక) కుమారా! నీవు-

  • ప్రార్థనా (నమాజ్‌) వ్యవస్థ నెలకొల్పు.
  • (ప్రజలను) మంచిని గురించి ఆదేశించు, చెడు విషయాలనుండి వారించు.
  • కష్టాలు వచ్చినప్పుడు సహనం వహించు. ఇవి ఎంతో ధైర్యసాహసాలతో కూడిన విషయాలు.
  • జనమ్ముందు గర్వంతో మాట్లాడకు. భూమిపై నిక్కుతూ నీల్గుతూ నడవకు. తననుతాను పొగడుకునే, మిడిసిపడే వాడ్ని దేవుడు ఏమాత్రం మెచ్చుకోడు.
  • నీ నడవడికలో మధ్యేమార్గం అవలంబించు.
  • నీ కంఠస్వరం కాస్త తగ్గించుకో. అన్ని స్వరాల కంటే గాడిద స్వరం అత్యంత కఠోరమయినది.” (16-19)

దేవుడు మీకోసం భూమ్యాకాశాల్లోని సమస్త వస్తువుల్ని అదుపులో ఉంచిన సంగతి మీరు గమనించలేదా? అదీగాక ఆయన తన గోచర, అగోచర మహాభాగ్యాలు (ఎన్నో) మీకోసం సమకూర్చాడు. కాని మానవుల్లో కొందరు ఎలాంటి జ్ఞానంగాని, హితబోధగాని, కాంతి ప్రసాదించే గ్రంథంగాని లేకుండానే దేవుని విషయంలో జగడమాడుతున్నారు. దేవుడు పంపినదాన్ని అనుసరించండని చెబితే మా తాతముత్తాతల నుండి వస్తున్న దాన్నే అనుసరిస్తామని అంటారు. షైతాన్‌ తమను మండుతున్న నరకాగ్ని వైపు ఆహ్వా నిస్తున్నప్పటికీ వారు తమ తాతముత్తాతలనే అనుసరిస్తారా? (20-21)
తనను తాను దేవునికి అంకితం చేసుకున్న పుణ్యాత్ముడు నిజానికి దృఢమైన ఆధారం పట్టుకున్నాడు. సమస్త వ్యవహారాల తుది నిర్ణయం దేవుని చేతిలోనే ఉంది. అందువల్ల అవిశ్వాసుల తిరస్కారం చూసి నీవు బాధపడకు. చివరికి వారు మా దగ్గరికే రావలసి ఉంది. అప్పుడు మేము వారికి వారు ఏఏ పనులు చేశారో తెలియజేస్తాం. దేవునికి (తన దాసుల) హృదయాల్లో దాగివుండే రహస్యాలు సయితం తెలుసు. మేము వారికి కొంతకాలం సుఖాలు అనుభవించే అవకాశమిస్తున్నాం. ఆ తరువాత వారిని నిస్సహాయులుగా చేసి ఘోరమైన యాతన వైపు ఈడుస్తాం. (22-24)
నీవు వారిని భూమ్యాకాశాలను ఎవరు సృష్టించారని అడిగితే, వారు దేవుడేనని తప్పకుండా అంటారు. (కనుక) సమస్త స్తుతిస్తోత్రాలు దేవునికే శోభిస్తాయని చెప్పు. కాని వారిలో చాలామందికి (ఈసత్యం) తెలియదు. భూమ్యాకాశాల్లో ఉన్న సమస్తం దేవునిదే. ఆయన నిరపేక్షాపరుడు, స్వతహాగానే ప్రశంసనీయుడు. (25-26)
ప్రపంచంలోని చెట్లన్నిటిని కలాలు గాను, యావత్తు సముద్ర జలాలతో పాటు అదనంగా మరో ఏడు సముద్రాల నీటిని సిరాగాను మార్చి(రాసి)నా దేవునికి సంబంధిం చిన విషయాలు పూర్తికావు. దేవుడు అపార శక్తిమంతుడు, అసాధారణ వివేకవంతుడు. ఒక మనిషిని పుట్టించడం, మళ్ళీ బ్రతికించి లేపడం ఎంత తేలికో మిమ్మల్నందర్నీ పుట్టించడం, తిరిగి బ్రతికించి లేపడం కూడా ఆయనకు అంతే తేలికైన పని. దేవుడు సమస్తం వింటున్నాడు, గమనిస్తున్నాడు. (27-28)
దేవుడు రాత్రిని పగటిలోకి, పగటిని రాత్రిలోకి ఎలా జొన్పిస్తున్నాడో మీరు చూడ టం లేదా? ఆయన సూర్యచంద్రుల్ని (ఒక నియమావళికి కట్టుబడిఉండేలా) అదుపులో ఉంచాడు. ఇవన్నీ ఒక నిర్ణీతకాలం వరకు నడుస్తుంటాయి. మీరు చేసే ప్రతిపనీ దేవునికి తెలుసన్న సంగతి మీకు తెలియదా? వీటన్నిటికి కారణం దేవుడే సత్యం. అందు వల్లనే ఇవన్నీ ఇలా ఒక నియంత్రణకు లోబడి సాగుతున్నాయి. ఆయన్ని వదలి వారు ప్రార్థిస్తున్నవన్నీ మిధ్యాదైవాలే. దేవుడే మహోన్నతుడు, మహిమాన్వితుడు. (29-30)
దేవుని అనుగ్రహంతో ఓడలు సముద్రంలో ఎలా సాగిపోతున్నాయో మీరు గమ నించడం లేదా? దేవుడు మీకు తన సూచనలు, నిదర్శనాలు చూపడానికే ఇలా చేస్తు న్నాడు. సహనం వహించే, కృతజ్ఞత చూపేవారికి ఇందులో అనేక సూచనలున్నాయి. ఎప్పుడైనా కొండలాంటి పెద్దకెరటం వారిపైకి విజృంభించినప్పుడు వారు (మిధ్యాదైవా లను వదలి) నిజదేవుడ్ని (మాత్రమే) వేడుకోవడం ప్రారంభిస్తారు. తమ (జీవన) ధర్మాన్ని ఆయనకే ప్రత్యేకిస్తారు. కాని వారిని ఆయన ఆ ప్రమాదంనుండి కాపాడి తీరానికి చేర్చిన తర్వాత వారిలో కొందరు మాత్రమే రుజుమార్గంలో స్థిరంగా ఉంటారు. కృతఘ్నులు, ద్రోహులు తప్ప మా సూక్తులు ఎవరూ తిరస్కరించరు. (31-32)
మానవులారా! మీప్రభువు ఆగ్రహం నుండి తప్పించుకోండి. తండ్రి తన కొడుకుకు, కొడుకు తనతండ్రికి ఎలాంటి సహాయం చేయలేని (ప్రళయ)దినం గురించి భయ పడండి. దేవుని వాగ్దానం తప్పకుండా నెరవేరుతుంది. కనుక ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసగించకూడదు. ఆ మోసగాడు కూడా మిమ్మల్ని దేవుని విషయంలో మోసగించకూడదు. ఆ ఘడియ ఎప్పుడు సంభవిస్తుందో దేవునికి మాత్రమే తెలుసు. ఆయనే వర్షం కురిపిస్తున్నాడు. మాతృగర్భంలో ఏం పెరుగుతున్నదో కూడా ఆయనకే తెలుసు. రేపు తాను ఏం చేయనున్నాడో ఏ మనిషికీ తెలియదు. అలాగే తనకు ఏ భూభాగంలో మృత్యువు కాటువేస్తుందో కూడా ఎవరికీ తెలియదు. సమస్త విషయాలు దేవునికి మాత్రమే తెలుసు. ఆయన సర్వజ్ఞాని, సమస్తం ఎరిగినవాడు. (33-34)