కురాన్ భావామృతం/అత్-తక్వీర్

కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

81. తక్వీర్‌ (చాపచుట్టలా)
(అవతరణ: మక్కా; సూక్తులు: 29)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
సూర్యుడు నిస్తేజమై చుట్టి వేయబడినప్పుడు, నక్షత్రాలు చెదరి కాంతి కోల్పోయి నప్పుడు, పర్వతాలు కదలి నడచినప్పుడు, పదినెలల సూడిఒంటెలు వాటిమానాన వదలి వేయబడినప్పుడు, క్రూరమృగాలు (భీతావహంతో) ఒకచోట గుమిగూడినప్పుడు, సముద్రం (ఉప్పొంగి తీవ్రంగా) ప్రజ్వరిల్లినప్పుడు, ఆత్మలు (దేహాలతో) అనుసంధానం చేయబడినప్పుడు, సజీవసమాధి చేయబడిన పసిబాలికను నీవు ఏతప్పు వల్ల చంప బడ్డావని అడిగినప్పుడు, (మానవుల) కర్మలచిట్టా తెరవబడినప్పుడు, ఆకాశానికున్న తెర తొలగించబడినప్పుడు, నరకం దహించబడినప్పుడు, స్వర్గం సమీపానికి తేబడినప్పుడు- ఆ.... అప్పుడు ప్రతి మనిషికీ తానేమి వెంట తెచ్చుకున్నాడో తెలుస్తుంది. (1-14)
కనుక నేను ఉదయించే, అస్తమించే నక్షత్రాల సాక్షిగా చెబుతున్నాను. ఇంకా అంతరిస్తున్న రాత్రి సాక్షిగా, ఊపిరిపోసుకుంటున్న ఉదయం సాక్షిగా చెబుతున్నాను. (ఈ వాణి పిచ్చివాడి వాగుడో లేక పిశాచపలుకులో ఎంతమాత్రం కాదు.) ఇది మహాశక్తి సంపన్నుడు, ఎంతో గౌరవనీయుడైన సందేశహరుని (జిబ్రీల్‌) వాక్కు. అతను సింహాస నాధీశుని కొలువులో గొప్ప హోదాఅంతస్తులు కలిగినవాడు. అక్కడ అతని ఆజ్ఞలు పాటించబడతాయి. అతను ఎంతో నమ్మకస్తుడు. (15-21)
(మక్కా ప్రజలారా! వినండి.) మీ సహచరుడు (ముహమ్మద్‌) పిచ్చివాడేమీ కాదు. ఇతనా సందేశహరుడ్ని ప్రకాశవంతమైన దిగ్మండలంపై ప్రత్యక్షంగా చూశాడు. ఇతను అతీంద్రియ (జ్ఞానం ప్రజలకు అందజేసే) వ్యవహరంలో ఏమాత్రం పిసినారితనం వహించడు. ఇది శాపగ్రస్తుడయిన షైతాన్‌కు సంబంధించిన వాక్కు కూడా కాదు. అలాంటప్పుడు మీరు (దారితప్పి) ఎటు పోతున్నారు? (22-26)
ఇది యావత్తు ప్రపంచవాసుల కోసం అవతరించిన హితవాణి. మీలో సన్మార్గం అవలంబించదలచిన ప్రతి వ్యక్తికీ కావలసిన హితబోధ ఇది. విశ్వప్రభువు తలచనంత వరకూ మీరు ఏది కోరుకున్నా ఎలాంటి ప్రయోజనం లేదు. (27-29)