కురాన్ భావామృతం/అల్-బఖరా

(గోవు (అల్-బఖరా ) నుండి మళ్ళించబడింది)
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

2. బఖరా (గోవు)
(అవతరణ: మదీనా; సూక్తులు: 286)
{{{2}}}కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
అలిఫ్‌-లామ్‌-మీమ్‌. ఇది ఎలాంటి సందేహానికి ఆస్కారంలేని (దైవదత్త) గ్రంథం. ఈ గ్రంథం భయభక్తులు కలవారికి రుజుమార్గం చూపుతుంది. వారు అగోచరాలు, అతీంద్రియాలను విశ్వసిస్తారు; ప్రార్థన (వ్యవస్థ) స్థాపిస్తారు; మేము ప్రసాదించిన సంపద నుండి (మామార్గంలో) ఖర్చుపెడతారు; నీపై అవతరించిన ఈ గ్రంథాన్ని, నీకు పూర్వం గతప్రవక్తలపై అవతరించిన గ్రంథాలను విశ్వసిస్తారు. పరలో కాన్ని కూడా విశ్వసిస్తారు. అలాంటి దైవభీతిపరులే తమ ప్రభువు నుండి వచ్చిన రుజు మార్గంలో నడిచేవారు. అలాంటివారే సాఫల్యం చెందేవారు; మోక్షం పొందేవారు.
కనుక నీవు అవిశ్వాసుల్ని హెచ్చరించినా, హెచ్చరించకపోయినా ఒకటే. వారు విశ్వసించరు. దేవుడు వారి హృదయకవాటాలు మూసివేశాడు. వారి చెవులకు సీలు వేశాడు. వారి కళ్ళపై పొరలు కమ్మాయి. ఇక వారికి తీవ్రమైన యాతన తప్పదు.
{{{2}}} కొందరు దైవాన్ని, పరలోకాన్ని విశ్వసించామని చెప్పుకుంటారు. కాని వారు నిజ మైన విశ్వాసులు కారు. వారు దేవుడ్ని, విశ్వాసుల్ని మోసగింపజూస్తున్నారు. నిజానికి వారు తమనుతామే మోసగించుకుంటున్నారు. ఆ సంగతి వారు గ్రహించడంలేదు. వారి హృదయాల్లో ఒక విధమైన రోగముంది. దేవుడు దాన్ని మరింత ముదిరేలా చేశాడు. వారి అసత్య ప్రేలాపనలకుగాను వారి కోసం దుర్భర యాతన కాచుకొని వుంది.
ఎప్పుడైనా వారితో ప్రపంచంలో కలహాలు రేకెత్తించకండని అంటే, “మేము సంఘ సంస్కర్తలం, శాంతికాముకులం” అంటారు. తస్మాత్‌ జాగ్రత్త! వారే అసలైన కలహ కారులు, శాంతివిఘాతకులు. వారా సంగతి గ్రహించడం లేదు. మరెప్పుడైనా వారితో, ఇతరులు విశ్వసించినట్లు మీరూ విశ్వసించండని అంటే “ఏమిటీ! బుద్ధిహీనుల్లా మేము కూడా విశ్వసించాలా?” అంటారు వారు. గుర్తుంచుకోండి, వారే అసలు బుద్ధిహీనులు. వారా సంగతి తెలుసుకోవడం లేదు. (8-13)

{{{2}}} ఈ కపటులు విశ్వాసుల్ని కలుసుకున్నప్పుడు తాము విశ్వసించామని అంటారు. కాని విడిగా తమ పిశాచమిత్రమూకను కలుసుకున్నప్పుడు “మేమేదో పరిహాసానికి అలా అన్నాం గాని, మేమసలు మీతోనే వున్నాం” అంటారు. వినండి, నిజానికి దేవుడే వారితో పరిహాసమాడుతున్నాడు. ఆయన వారిని చూసీచూడనట్లు వదిలేస్తున్నాడు. వారు గర్వాం ధకారంలో పడి అంధుల్లా తచ్చాడుతూ తిరుగుతున్నారు. వారే మార్గదర్శనానికి బదులు మార్గవిహీనత కొనితెచ్చుకున్న దౌర్భాగ్యులు. కనుక వారు చేపట్టిన ఈ వ్యాపారం వారికి ఏమాత్రం లాభదాయకంగా లేదు. వారసలు సరైన మార్గంలో నడవడం లేదు. వారినిలా పోల్చవచ్చు: “ఒక వ్యక్తి అగ్ని రాజేసి పరిసరాలు ప్రకాశవంతం చేశాడు. అప్పుడు దేవుడు వారి కంటిచూపు పోగొట్టి చీకటిలో తచ్చాడేలా వదలిపెట్టాడు.” అలా వుంది వీరి స్థితి. వీరు బధిరులు, అంధులు, మూగలు. ఇక వీరు ఎన్నటికీ దారికి రారు. (14-18)

{{{2}}} వారిని ఈ విధంగా కూడా పోల్చవచ్చు: “ఆకాశం నుండి కుండపోతగా వర్షం కురుస్తోంది. దానికితోడు కారుమేఘాలు కూడా దట్టంగా కమ్ముకున్నాయి. ఉరుములు, మెరుపులు కూడా వున్నాయి. అలాంటి భయానక వాతావరణంలో ఈ కపటుల స్థితి చూడండి. వీరు గుండెలను అదరగొట్టే ఉరుములు విని, ప్రాణభీతితో చెవులలో వ్రేళ్ళు దూర్చుకుంటారు. దేవుడు సత్యతిరస్కారులకు నలువైపుల నుండి ఉచ్చు బిగిస్తున్నాడు. ఆకాశం మెరిసినప్పుడల్లా ఆ మెరుపు తమ చూపును పోగొడ్తుందా అన్నట్లు వారు తల్లడిల్లి పోతారు. అయితే ఆకాశం మెరిసినప్పుడు కాస్త వెలుగు కనిపించగానే వారు రెండు మూడడుగులు ముందుకు నడుస్తారు. కాని అంతలోనే చీకటి ఆవరించడంతో ఠక్కున ఆగిపోతారు.” దేవుడు తలచుకుంటే వారి దృష్టిని, వినికిడిశక్తిని పూర్తిగా హరించి వేయగలడు. నిస్సందేహంగా ఆయన సమస్త విషయాలపై అదుపు, అధికారం కలిగిన సమర్థుడు, సర్వ శక్తిమంతుడు.

{{{2}}} మానవులారా! మిమ్మల్ని, మీ పూర్వీకుల్ని సృష్టించిన మీ ప్రభువును ఆరాధిం చండి. అప్పుడే మీరు రక్షించబడతారని ఆశించగలరు. ఆయనే మీ కోసం నేలను పడకగా, నింగిని కప్పుగా చేశాడు. పైనుండి వర్షం కురిపించేవాడు కూడా ఆయనే. ఆ వర్షం ద్వారా ఆయన రకరకాల పండ్లూ, పంటలు పండించి మీకు ఆహారం సమ కూర్చి పెడ్తున్నాడు. కనుక ఈ యదార్థాలు తెలిసిన తరువాత మీరు ఇతర శక్తుల్ని దేవునికి సాటి కల్పించకండి. (21-22)
ఒకవేళ మా దాసునిపై అవతరింపజేసిన ఈ గ్రంథం గురించి మీకేదైనా అనుమాన ముంటే ఇందులోని అధ్యాయం లాంటి ఓ అధ్యాయం రచించి తీసుకురండి. ఈ పని కోసం ఒక్క దేవుడ్ని వదలి మీ మద్దతుదారులందర్నీ పిలుచుకోండి. మీరు సత్యవంతు లైతే ఈ పని చేసిచూపండి. మీరీ పని చేయలేకపోతే....ఎంతమాత్రం చేయలేరు... మనుషులు, రాళ్ళు ఇంధనం కాగల నరకాగ్నికి భయపడండి. సత్యతిరస్కారుల కోసం అది సిద్ధపరచబడి ఉంది. (23-24)
(ముహమ్మద్‌!) సత్యాన్ని విశ్వసించి తదనుగుణంగా సత్కార్యాలు చేసేవారికి సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలు ఉన్నాయని శుభవార్త విన్పించు. ఆ స్వర్గవనాల్లోని పండ్లు చూడటానికి ఇహలోకంలోని పండ్లు మాదిరిగా ఉంటాయి. వారికి ఏవైనా పండ్లు తినడానికి ఇచ్చినప్పుడు, ఇలాంటి పండ్లే తమకు ప్రపంచంలో కూడా ఇవ్వబడేవని అంటారు వారు. వారికి ఈడు-జోడు, తోడు-నీడగా అక్కడ పవిత్ర సహచరులు కూడా వుంటారు. ఆ స్వర్గవనాల్లో వారు శాశ్వతంగా వుంటారు. (25)
దేవుడు (సత్యనిరూపణకు) ఎలాంటి ఉపమానం ఇవ్వడానికైనా సిగ్గుపడడు. చివరికి దోమ లేదా అంతకంటే అల్పజీవికి సంబంధించిన ఉపమానమైనా సరే. విశ్వాసులు (మాత్రం) ఇది తమ ప్రభువు నుండి వచ్చిన సత్యమని నమ్ముతారు. కాని అవిశ్వాసులు ఈ ఉదాహరణలు చూసి, ఇలాంటి ఉదాహరణలు ఇవ్వడంలో దేవుని ఆంతర్యం ఏమిటో! అంటారు. ఈ విధంగా దేవుడు ఒకే విషయం ద్వారా కొందరిని దారితప్పిస్తే, మరి కొందరికి దారిచూపిస్తాడు. (26)
దేవునితో చేసిన పటిష్ఠమయిన ప్రమాణాలను ఉల్లంఘించే, కలపమని దేవుడు ఆదేశించిన దాన్ని త్రెంచివేసే, ప్రపంచంలో కలహాలు రేకెత్తించే దుర్మార్గులను మాత్రమే దేవుడు మార్గభ్రష్టత్వంలో పడవేస్తాడు. అలాంటివారే నష్టపోయేవారు. (27)
అసలు మీరు దేవుని పట్ల అవిశ్వాసవైఖరి ఎలా అవలంబిస్తారు? మీరు నిర్జీవు లుగా ఉన్నప్పుడు ఆయన మీకు జీవం పోశాడు. చివరికి ఆయనే మీ ప్రాణాలు తీసే వాడు. (మరణానంతరం) మీకు తిరిగి ప్రాణంపోసి లేపేవాడు కూడా ఆయనే. చివరికి ఆయన సన్నిధికే మీరు మరలి పోవలసివుంది. ఆయనే మీకోసం ప్రపంచంలోని వస్తువు లన్నిటినీ సృష్టించాడు. తరువాత ఆయన ఆకాశం వైపు దృష్టిసారించి, దాన్ని సప్తాకా శాలుగా రూపొందించాడు. ఆయన సమస్త విషయాలు తెలిసినవాడు. (28-29)
నీ ప్రభువు దైవదూతలతో ‘భూలోకంలో నేనొక ఖలీఫా ని నియమించబోతున్నా’ నని అన్నప్పుడు దైవదూతలు ఏమన్నారో తెలుసా? “ఏమిటీ! మీరు ప్రపంచ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసి, రక్తపాతానికి వడిగట్టేవాడ్ని భూలోకంలో నియమించబోతున్నారా? మేము మిమ్మల్ని అనుక్షణం స్తుతిస్తూ, మీ పవిత్రతను స్థుతిస్తూనే వున్నాంకదా?” అని అన్నారు. దానికి దేవుడు “మీకు తెలియని విషయాలెన్నో నాకు తెలుసు” అన్నాడు. (30)
ఆ తరువాత ఆయన ఆదంకు సమస్త వస్తువుల పేర్లు తెలియజేశాడు. ఆపై వాటిని దైవదూతల ముందు ప్రవేశపెట్టి “మీ అభిప్రాయం సరైనదయితే కాస్త ఈ వస్తువుల పేర్లేమిటో చెప్పండి” అని అడిగాడు. (31)
“మీరు పరిశుద్ధులు, మీరు మాకు తెలియజేసినంత మేరకే మాకు తెలుసు. దానికి మించి ఒక్క విషయం కూడా మాకు తెలియదు. వాస్తవానికి మీరే అన్నీ తెలిసిన వారు, వివేకవంతులు” అన్నారు దైవదూతలు. (32)
ఆతర్వాత దేవుడు ఆదంతో “ఈ వస్తువుల పేర్లేమిటో వారికి చెప్పు”అన్నాడు. ఆదం వాటి పేర్లన్నీ చెప్పాడు. అప్పుడు దేవుడు దైవదూతలతో ఇలా అన్నాడు: “భూమ్యాకాశాల్లో గుప్తంగా వున్న సమస్తవిషయాలు నాకు తెలుసని నేను ముందే మీతో అనలేదా? మీరు పైకి వెలిబుచ్చే విషయాలు, లోన దాచే విషయాలు సైతం నాకు తెలుసు.” (33)
ఆ తర్వాత మేము ఆదంకు గౌరవసూచకంగా అభివాదం చెయ్యండని దైవదూత లను ఆదేశించాం. అప్పడు ఇబ్లీసు తప్ప అందరూ అభివాదం చేశారు. ఇబ్లీసు తనేదో గొప్పవాణ్ణన్న అహంకారంతో విర్రవీగుతూ, తిరస్కరించి అవిధేయుడై పోయాడు. (34)
ఆతర్వాత మేము ఆదంకు ఇలా చెప్పాము: “నీవు,నీభార్య స్వర్గంలో నివసించండి. ఇక్కడ మీరు కోరుకున్నదల్లా తింటూ హాయిగా ఉండండి. అయితే అదిగో...! ఆ చెట్టు దరిదాపులకు మాత్రం వెళ్ళకండి. వెళ్తే మీరు కూడా దుర్మార్గులై పోతారు.” (35)
అయితే షైతాన్‌ (వారుభయుల్ని నిషేధిత వృక్షం గురించి లేనిపోని ఆశలు కల్పించి) వారిని పూర్వస్థితి నుండి దిగజార్చి స్వర్గసౌఖ్యాలకు దూరంచేశాడు. అప్పుడు మేము వారితో “మీరంతా ఇక్కడ్నుంచి దిగిపోండి. మీరు ఒకరికొకరు శత్రువులు. ఒక నిర్ణీతకాలం వరకు మీరు భూలోకంలో జీవితం గడపవలసివుంది” అన్నాము. (36)
తరువాత ఆదం తన ప్రభువు నుండి కొన్ని మాటలు గ్రహించి, పశ్చాత్తాపంతో క్షమాపణ చెప్పుకున్నాడు. దాన్ని అతని ప్రభువు స్వీకరించాడు. ఆయన గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడు. మేమిలా అన్నాం: “మీరంతా ఇక్కడ్నుంచి దిగిపోండి. నా నుండి మీ దగ్గరకు ఏదైనా మార్గదర్శకత్వం వస్తే దాన్ని అనుసరించాలి. దాన్ని అనుస రించేవారికి ఎలాంటి భయంగాని, దుఃఖంగాని ఉండదు. నా మార్గదర్శకత్వాన్ని నిరాక రించి, నా సూక్తుల్ని ధిక్కరించేవారు నరకానికి పోతారు. అక్కడే వారు (నానాయాతనలు అనుభవిస్తూ) ఎల్లకాలం పడివుంటారు. (37-39)
ఇస్రాయీల్‌ సంతతి ప్రజలారా! నేను మీకు చేసిన మేళ్ళు గుర్తుకు తెచ్చుకొని, మీరు నా విషయంలో చేసిన ప్రమాణాన్ని పాటించండి. నేను మీకు చేసిన వాగ్దానం నెరవేరుస్తాను. మీరు నాకు మాత్రమే భయపడుతూ నేను పంపిన ఈ గ్రంథాన్ని విశ్వ సించండి. మీ దగ్గర ఇంతకుపూర్వం నుంచే ఉన్న గ్రంథాన్ని ఇది ధృవీకరిస్తోంది. కనుక అందరికంటే ముందు మీరే దీన్ని తిరస్కరించినవారు కాకూడదు. స్వల్ప మూల్యానికి నా సూక్తులు అమ్ముకోకండి. నా ఆగ్రహం నుండి తప్పించుకోండి. సత్యాన్ని అసత్యంతో కలగాపులగం చేయకండి. తెలిసి కూడా సత్యాన్ని దాచకండి. (40-42)
పార్థనా వ్యవస్థ నెలకొల్పండి. పేదల ఆర్థికహక్కు (జకాత్‌) చెల్లిస్తూ ఉండండి. నా ముందు మోకరిల్లేవారితో పాటు మీరు కూడా నా ముందు మోకరిల్లండి. ఏమిటీ, మీరు మంచిపనులు చేయమని ఇతరులకైతే హితబోధ చేస్తారు. కాని మిమ్మల్ని మీరు మరచిపోతున్నారే! మీరు గ్రంథ పఠనం కూడా చేస్తున్నారు కదా! (ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు?). మీరు బుద్ధి నుపయోగించరా? (43-44)
(సరే, మీకేవైనా ఇబ్బందులుంటే) సహనం, ప్రార్థనల ద్వారా (నా) సహాయాన్ని అర్థించండి. ప్రార్థన (నమాజ్‌) కాస్త కష్టమైన పనే, సందేహం లేదు. కాని ఒకరోజు తమ ప్రభువును కలుసుకోవలసిఉందని, ఆయన సన్నిధికే మరలిపోవలసి ఉందని భావించే దైవభీతిపరులకు మాత్రం ప్రార్థన (నమాజ్‌) చేయడం కష్టమేమీ కాదు. (45-46)
ఇస్రాయీల్‌ సంతతిప్రజలారా! నేను మీకు చేసిన మేలు గుర్తుకు తెచ్చుకోండి. ప్రపంచజాతులన్నిటిపై మీకు ప్రసాదించిన ప్రత్యేక గౌరవోన్నతుల్ని కూడా జ్ఞాపకం తెచ్చు కోండి. ఒకరికొకరు ఏవిధంగానూ తోడ్పడలేని (ప్రళయ)దినం గురించి భయపడండి. ఆరోజు ఎవరి సిఫారసు చెల్లదు. ఏ ఒక్కర్నీ పాపపరిహారం తీసుకొని వదలేయడం జరగదు. అసలా రోజు పాపాత్ములకు ఎలాంటి సహాయమూ లభించదు. (47-48)
మేము మిమ్మల్ని ఫిరౌనీయుల బానిసత్వం నుండి విముక్తి కలిగించిన రోజులు కూడా కాస్త గుర్తుకు తెచ్చుకోండి. ఆనాడు మిమ్మల్ని వారు తీవ్రయాతనలకు గురిచేస్తూ ఉండేవారు. మీ మగపిల్లలను హతమార్చి, ఆడపిల్లలను (మాత్రమే) బ్రతకనిస్తుండేవారు. అది మీకు మీ ప్రభువు నుండి ఎదురైన అత్యంత కఠినపరీక్ష. (49)
మీకోసం మేము సముద్రం చీల్చి, దారి ఏర్పరచి మిమ్మల్ని క్షేమంగా దరికి చేర్చాం. ఆతర్వాత మీ కళ్ళముందే ఫిరౌనీయులను (సముద్రంలో) ముంచివేశాం. (50)
మేము మూసాను నలభై రోజుల గడువుపై (తూర్‌ పర్వతం దగ్గరకు) పిలిపిం చాము. ఆ తర్వాత అతను మీ మధ్య లేకపోవడం చూసి మీరు ఆవుదూడ (విగ్రహం)ను దైవంగా చేసుకున్నారు. మీరు దుర్మార్గంలో చాలా హద్దుమీరి పోయారు. అయితే ఆ తరువాతయినా మీరు కృతజ్ఞులయి వుంటారేమోనన్న ఉద్దేశ్యంతో అంతటి ఘోరపాపాన్ని సయితం ఉపేక్షించి మిమ్మల్ని క్షమించివేశాము. (51-52)
మీరు సన్మార్గం పొందడానికి మూసాకు దివ్యగ్రంథాన్ని, మంచీ చెడుల్ని వేరుచేసి చూపే గీటురాయిని ప్రసాదించాము. ఆ సంగతి కూడా గుర్తు చేసుకోండి. మూసా (ఈ మహాభాగ్యం తీసుకొని) తన జాతిప్రజల దగ్గరికి తిరిగొచ్చినప్పుడు వారి దుస్థితి చూసి ఇలా అన్నాడు: “ప్రజలారా! మీరు ఆవుదూడను దైవంగా చేసుకొని మీ ఆత్మలకు చాలా అన్యాయం చేసుకున్నారు. కనుక (తక్షణమే) పశ్చాత్తాపంచెంది మీ సృష్టికర్తకు క్షమాపణ చెప్పుకోండి. తర్వాత మీ(లో భ్రష్టులైపోయినవారి) ప్రాణాల్ని హతమార్చండి. మీ సృష్టికర్త దృష్టిలో అదే మీకు శ్రేష్ఠమయినది.” ఆ తరువాత మీ ప్రభువు మిమ్మల్ని క్షమించాడు. ఆయన ఎంతో గొప్ప క్షమాశీలి, అపార కృపాశీలుడు. (53-54)
మరో సంఘటన. మీరు మూసాతో “మేము మాకళ్ళతో దేవుడ్ని ప్రత్యక్షంగా చూడ నంతవరకు నీ మాటలు నమ్మం” అన్నారు. అప్పుడు మీరు చూస్తుండగానే ఓ భయం కరమైన పిడుగు మీపై పడింది. దాంతో మీరంతా మృత్యువాత పడ్డారు. అయితే మేము చేసిన మేలుకు మాపట్ల కృతజ్ఞులై ఉంటారని మిమ్మల్ని మళ్ళీ బ్రతికించాం. (55-56)
మేము మీపై (ఎండ నుండి కాపాడడానికి) మేఘచ్ఛాయ కల్పించాం. ఆహారంగా మీకు మన్న, సల్వాలు సమకూర్చి, “మేము ప్రసాదించిన ఈ పరిశుద్ధ వస్తువులు తినండి” అన్నాం. (కాని మీపూర్వీకులు వాటికి విలువ నివ్వలేదు. ఇలాంటి తలబిరుసు తో) వారు మాకేమీ నష్టం కల్గించలేదు, తమకుతామే నష్టం కల్గించుకున్నారు. (57)
వేరొక సంఘటన (వినండి). అప్పుడు మేము మీతో ఇలా అన్నాం :“ఈ పట్టణం లో ప్రవేశించి ఇక్కడి ఆహారపదార్థాలను మీకిష్టమైనట్లు హాయిగా తినండి. అయితే పట్టణ ప్రధానద్వారం గుండా ప్రవేశిస్తున్నప్పుడు సాష్టాంగపడి ‘క్షమాభిక్ష, క్షమాభిక్ష’ అంటూ నడవండి. మేము మీ తప్పులు మన్నిస్తాం. మంచివారికి మరింత(భాగ్యం) అనుగ్రహిస్తాం.” కాని దుర్మార్గులు మేము సూచించిన మాట మార్చివేశారు. చివరికి మేము ఆ దుర్మార్గులపై ఆకాశం నుండి ఘోరమైన విపత్తు తెచ్చి పడవేశాము. ఇది వారు చేసిన దౌష్ట్యాలకు తగిన శిక్ష. (58-59)
(దీనికి ముందు) మూసా తన జాతి కోసం మంచినీటికై మమ్మల్ని ప్రార్థించాడు. అప్పుడు మేమతనితో “నీ చేతిలో ఉన్న కర్రతో చట్టుబండ మీద ఓ దెబ్బ వెయ్యి” అన్నాం. అతనలా చేయగానే ఆ రాతి నుండి పన్నెండు నీటిఊటలు పెల్లుబికాయి. అప్పుడు (పన్నెండు తెగల) ప్రజలు తమతమ నీటిపట్టును గుర్తించి వాడుకోనారం భించారు. “దేవుడు ప్రసాదించిన వస్తువులు తినండి, త్రాగండి. అయితే ప్రపంచంలో కల్లోలాన్ని మాత్రం రేకెత్తించకండి” (అని ఆదేశించాము). (60)
(కాని ఆ తరువాత కొన్నాళ్ళకే) మీరు (కష్టపడకుండా లభిస్తున్న ఎంతో శ్రేష్ఠమయిన ఆహారం పట్ల అసంతృప్తిచెంది) మూసాతో ఇలా అన్నారు: “మూసా! మేమిక ఒకే విధమైన ఈ తిండి తింటూ వుండలేము. మాకోసం నేల నుండి ఉత్పత్తి అయ్యే కూరగాయలు, దోసకాయలు, వెల్లుల్లి, గోధుమలు, పప్పు ధాన్యాలు, ఉల్లిపాయలు మొదలైన ఆహార పదార్థాలు పండింపజేయమని నీ ప్రభువును ప్రార్థించు.”
దానికి మూసా “ఎంతో శ్రేష్ఠమైన పదార్థాలు వుండగా వాటిని వదలి హీనమైన పదార్థాలు కోరుతున్నారా! అలాగయితే ఏదైనా జనావాసంలోకి పదండి. అక్కడ మీరు కోరిన వస్తువులు దొరుకుతాయి” అన్నాడు.
చివరికి వారు అవమానం, అప్రతిష్ఠలకు గురయి దౌర్భాగ్యం, దుర్భర దారిద్య్రా లలో కూరుకుపోయారు. వారు దేవుని సూక్తులు తిరస్కరిస్తుండేవారు. దైవప్రవక్తల్ని అన్యాయంగా హతమార్చుతుండేవారు. దేవునికి అవిధేయులైపోయి హద్దుమీరి ప్రవర్తి స్తుండేవారు. అందువల్లనే ఇలా దేవుని ఆగ్రహం వారిపై విరుచుకుపడింది. (61)
ముస్లింలుగాని, యూదులుగాని, క్రైస్తవులుగాని, సాబీలు (నక్షత్రోపాసకులు)గాని, మరే మతానికి, వర్గానికి, జాతికి చెందినవారయినా సరే అల్లాహ్‌ను, ప్రళయదినాన్ని విశ్వసించి సత్కార్యాలు చేస్తుంటే, అలాంటివారికి వారి ప్రభువు వద్ద తప్పకుండా మంచి ప్రతిఫలం లభిస్తుంది. వారికి ఎలాంటి భయంగాని, దుఃఖంగాని ఉండదు. (62)
మీమీద తూర్‌ పర్వతం ఎత్తిపట్టి మీచేత ప్రమాణంచేయించిన సందర్భం గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు మేమిలా ఆదేశించాం: “మేము మీకిచ్చిన గ్రంథాన్ని దృఢంగా పట్టుకోండి. అందులోని ఆజ్ఞల్ని, హితవుల్ని గుర్తుంచుకోండి. అలాచేస్తే మీరు భయ భక్తుల జీవితం గడుపుతారు.” (దీన్ని మీరు అంగీకరించారు కూడా.) కాని తర్వాత మీరా ప్రమాణం ఉల్లంఘించారు. (దాన్ని కూడా దేవుడు ఉపేక్షించాడు.) మీపై దేవుని కరుణా కటాక్షాలే గనక లేనట్లయితే మీరు (ఎప్పుడో) నాశనమయి పోయేవారు. (63-64)
శనివారం నియమం ఉల్లంఘించినవారి సంగతి మీకు తెలిసిందే. మేము వారిని “కోతులుగా మారిపోయి, తుచ్ఛమైన బ్రతుకు బ్రతకండ”ని శపించాము. ఈ విధంగా మేము వారి దుష్పరిణామాన్ని ఆనాటి ప్రజలకు, రాబోవు తరాలకు గుణ పాఠంగా, దైవభీతిపరులకు హితబోధినిగా చేశాము. (65-66)
మూసా తన జాతిప్రజలతో “దేవుడు మిమ్మల్ని ఒక ఆవును బలివ్వమని ఆదేశి స్తున్నాడ”ని అన్నాడు. ఆ సంఘటన కూడా గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు వారు “ఏమిటీ, నీవు మాతో పరిహాసమాడుతున్నావా?” అన్నారు. దానికి మూసా “మూర్ఖులు పలికే ఇలాంటి విషయాల బారి నుండి నేను దేవుని శరణు కోరుతున్నాను” అన్నాడు.
“అయితే ఆ ఆవు గురించిన వివరాలు ఏమిటో నీ ప్రభువుని అడిగి చెప్పు” అన్నారు వారు. “ఆ ఆవు ఇటు ముసలిదిగాని, అటు లేతదిగాని కాకుండా మధ్య వయస్సుదయి ఉండాలని దేవుడు ఆదేశిస్తున్నాడు. కనుక మీకివ్వబడిన ఆదేశం ప్రకారం పని చేయండి” అన్నాడు మూసా. (67-68)
“సరే, దానిరంగు ఎలావుండాలో కూడా నీ ప్రభువుని అడిగి తెలియజేయి” అన్నారు వారు మళ్ళీ. “దాని రంగు పసుపుపచ్చగా, చూపరులకు సంతోషం కలిగేలా మెరిసిపోతూ వుండాలని మీ ప్రభువు ఆదేశిస్తున్నాడ”ని అన్నాడు మూసా. (69)
“చాలా ఆవులు చూడటానికి ఒకేవిధంగా ఉన్నట్లు కన్పిస్తాయి. అందువల్ల ఆ ఆవు ఇంకా ఏఏ లక్షణాలు కలిగినదయి ఉండాలో నీ ప్రభువుని ప్రార్థించి మాకు చెప్పు. దైవం తలిస్తే మేము దాన్ని కనుగొంటాము” అన్నారు వారు మళ్ళీ. (70)
“మీ ప్రభువు ఆదేశిస్తున్నాడు- అది ఎలాంటి పనులకు ఉపయోగించ బడనిదై ఉండాలి. నేలను దున్నినదిగాని, మోటబావికి వాడబడినదిగాని కాకూడదు. అదీగాక అది ఎలాంటి లోపం లేనిదైఉండాలి. దాని వంటిమీద ఎలాంటి కృత్రిమ మచ్చలు కూడా ఉండకూడదు” అన్నాడు మూసా. దానికి వారు “ఇప్పుడు నీవు అన్ని విషయాలు కచ్చితంగా తెలియజేశావు” అన్నారు. చివరికి వారు (ఎంతో శ్రమపడి సంపాదించి ఎలాగో) దాన్ని బలిచ్చారు. నిజానికి వారు అలా చేసేవారిలా అన్పించలేదు. (71)
మీకీ సంఘటన కూడా గుర్తుండి ఉంటుంది: మీరొక వ్యక్తిని చంపి, ఆ విషయం లో పరస్పరం పోట్లాడుకుంటూ హత్యానిందను ఒకరి మీద మరొకరు రుద్దడానికి ప్రయ త్నించారు. కాని మీరు దాచుతున్న విషయాన్ని దేవుడు బట్టబయలు చేయదలిచాడు. ఆవు మృతకళేబరంలోని కొంతభాగంతో హతుని భౌతికకాయంపై చరచండని మేము ఆజ్ఞాపించాం. మేమా సందర్భంలో “ఈవిధంగా దేవుడు మృతుల్ని (పునరుత్థాన దినాన) తిరిగి బ్రతికిస్తాడు. మీరు విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఆయన తన మహిమల్ని ఇలా చూపిస్తాడు” అని అన్నాము వారితో. (72-73)
అయితే అంతటి గొప్ప మహిమ చూసినా మీలో ఎలాంటి మార్పు రాలేదు. పైగా మీ హృదయాలు పాషాణాల్లా కఠినమైపోయాయి. కాదు, అంతకంటే కూడా కఠినమయి పోయాయి. పాషాణాలలో కొన్నిటి నుంచి నీటిఊటలు ఉబికి వస్తాయి. మరికొన్ని పగిలి పోయి వాటి నుంచి కూడా నీళ్ళు వస్తాయి. ఇంకా కొన్ని రాళ్ళయితే దైవభీతితో కంపించి క్రింద పడిపోతాయి. దేవుడు మీ చేష్టలను గమనించడంలేదని భావించకండి. (74)
ముస్లిములారా! వీరు మీ మాటలు విని సత్యాన్ని విశ్వసిస్తారని ఇంకా మీరు ఆశలు పెట్టుకున్నారా? వారిలో కొందరు దైవవాణి (తౌరాత్‌) చదివి బాగా అర్థం చేసు కున్నప్పటికీ, దాన్ని ఉద్దేశ్యపూర్వకంగా తారుమారు చేస్తుంటారు. (75)
వారు విశ్వాసుల్ని కలసినప్పుడు తాము (ముహమ్మద్‌ ప్రవక్తను) విశ్వసించామని చెప్పుకుంటారు. కాని వారు ఏకాంతంలో కలుసుకున్నప్పుడు మాత్రం “ఏమిటీ, దేవుడు మనకు తెలియజేసినదాన్ని వారి ముందు బహిర్గతం చేస్తారూ? దాని ఆధారంగా వారు (ప్రళయదినాన) మన ప్రభువు ముందు మనపై నింద మోపడానికా? మీకా మాత్రం జ్ఞానంలేదా?” అనంటారు. వారు తాము దాచుతున్న దేమిటో, బహిర్గతం చేస్తున్న దేమిటో దేవునికి తెలియదనుకుంటున్నారా? ఆయనకు అంతా తెలుసు. (76-77)
వారిలో కొందరు నిరక్షరాస్యులు కూడా ఉన్నారు. వారికి గ్రంథజ్ఞానం బొత్తిగా లేదు. అయినా వారు లేనిపోని ఆశలు కల్పించుకొని ఊహాకెరటాలపై తేలిపోతుంటారు.
మరికొందరున్నారు. వారు తమచేజేతులా గ్రంథం వ్రాసుకొని, దానికి ప్రతిఫలంగా అత్యల్ప (ప్రాపంచిక)ప్రయోజనాలు పొందడానికి, ఇది దేవుని వద్ద నుండి వచ్చిన గ్రంథ మని అంటారు. అలాంటివారికి వినాశం ఉంది. వారు కల్పించి వ్రాసుకున్నది వారి వినాశానికే కారణభూతమవుతుంది. తద్వారా వారు సంపాదించుకున్న ప్రాపంచిక సొత్తు కూడా వారికి వినాశమే తెచ్చిపెడుతుంది. (78-79)
పైగా వారు “ఈ నరకాగ్ని మమ్మల్ని తాకనైనా తాకదు. కాకపోతే కొన్నాళ్ళు కాస్తంత బాధ కలిగిస్తుందేమో!” అంటారు. అలాగైతే “మీరు దేవునితో ఏదైనా ఒడంబడిక చేసు కున్నారా, దాన్ని ఆయన ఉల్లంఘించకపోవడానికి? లేక మీరు దేవుని విషయంలో మీకే మాత్రం తెలియని మాటలంటున్నారా?” అని అడగండి వారిని. దుష్టకార్యాలు చేసేవారు చివరికా పాపపంకిలంలో పూర్తిగా కూరుకుపోతారు. అలాంటివారే నరకవాసులు. అక్కడే వారు ఎల్లకాలం పడిఉంటారు. సత్యాన్ని విశ్వసించి, తదనుగుణంగా సత్కార్యాలు చేసేవారు స్వర్గవాసులవుతారు. స్వర్గంలోనే వారు కలకాలం ఉంటారు. (80-82)
వేరొక సంఘటన కూడా గుర్తుకు తెచ్చుకోండి: అల్లాహ్‌ను తప్ప మరెవర్నీ ఆరాధించరాదని; తల్లిదండ్రుల పట్ల, బంధువుల పట్ల, అనాథల పట్ల, నిరుపేదల పట్ల సద్భావనతో మెలగాలని; ప్రజలతో (చిరునవ్వు మోముతో) మంచిమాటలు పలకాలని; ప్రార్థనా వ్యవస్థ (నమాజ్‌) స్థాపించాలని; (పేదల ఆర్థికహక్కు) జకాత్‌ చెల్లిస్తూ ఉండా లని మేము ఇస్రాయీల్‌ సంతతి చేత ప్రమాణం చేయించాం. (కాని ఆ తరువాత) మీలో కొందరు తప్ప అంతా దానికి విముఖులయిపోయారు. ప్రమాణం చేసి ఉల్లం ఘించడం మీకు అలవాటేగా! (83)
పరస్పరం రక్తపాతం జరుపుకోరాదని, ఒకర్నొకరు ఇండ్లనుండి గెంటివేసుకోరాదని మేము మీచేత (మరో)ప్రమాణం చేయించాం. ఆ సందర్భం కూడా జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు మీరు ఆ ప్రమాణాన్ని ఒప్పుకున్నారు కూడా. దానికి మీరే సాక్షులు. అయినప్ప టికీ మీరు తిరిగి అవే (తప్పుడు)పనులు చేయసాగారు. మీ సొంత మనుషులనే హత మార్చారు. మీలోనే ఒక వర్గాన్ని అన్యాయంగా వారి ఇండ్ల నుంచి వెడలగొట్టారు. దౌర్జన్యం, పాపకార్యాల్లో మీరు వారికి వ్యతిరేకంగా ఇతరులకు మద్దతు కూడా ఇచ్చారు. అదీగాక, యుద్ధఖైదీలుగా మీ దగ్గరికి వచ్చినప్పుడు నష్టపరిహారం తీసుకొని వారిని విడుదల చేసేవారు. అసలు వారిని వారి ఇండ్లనుండి వెడలగొట్టడమే పెద్దతప్పు, నిషిద్ధ కార్యం. (పైపెచ్చు వారి విడుదల కోసం నష్టపరిహారం తీసుకోవడం కూడానా?)
ఏమిటీ, మీరు గ్రంథంలోని కొంతభాగం విశ్వసించి మరికొంత భాగం తిరస్క రిస్తారా? మీలో అలాంటి దుశ్చర్యలకు పాల్పడేవారికి శిక్షగా ఇహలోక జీవితంలో వారు అవమానం, అప్రతిష్ఠలపాలవుతారు; అటు పరలోకంలో తీవ్రమైన (నరక)యాతనలకు గురవుతారు. దేవుడు మీ చర్యలను గమనించడం లేదని భావించకండి. (84-85)
పరలోక జీవితం అమ్ముకొని ఇహలోక జీవితం కొనుక్కున్నవారు వీరే. కనుక వీరి శిక్ష ఏమాత్రం తగ్గించడం జరగదు. వారికి ఎలాంటి సహాయం కూడా లభించదు. (86)
మూసాకు మేము గ్రంథం ప్రసాదించాము. అతని తరువాత ఒకరి తరువాత ఒకరు అనేకమంది ప్రవక్తలను పంపుతూ వచ్చాము. మర్యం కుమారుడు ఈసాకు స్పష్టమైన నిదర్శనాలు ఇచ్చి పంపాము. పరిశుద్ధాత్మ (జిబ్రయీల్‌ దూత) ద్వారా కూడా అతనికి సహాయం చేశాము. కాని ఏ దైవప్రవక్తయినా మీ మనోవాంఛలకు వ్యతిరేకంగా వుండే విషయాలు తెచ్చినప్పుడల్లా మీరు తలబిరుసుతో వ్యవహరించేవారు. దైవ ప్రవక్తలలో కొందరిని తిరస్కరించారు; మరికొందరిని హతమార్చి వేశారు. (87)
(ఇన్ని దారుణాలకు వడిగట్టి కూడా పశ్చాత్తాపం చెందడానికి బదులు) వారు “మా హృదయాలు సురక్షితంగా ఉన్నాయి” అంటారు. కాదు, అసలు విషయం అదికాదు. వారి తలబిరుసు, తిరస్కారాల వైఖరి కారణంగా వారిపై దేవుని అభిశాపం విరుచుకు పడింది. అందుకే వారిలో బహుకొద్దిమంది మాత్రమే సత్యాన్ని విశ్వసిస్తున్నారు. (88)
దేవుని వైపు నుంచి వారి వద్దకు ఇప్పుడు వారి దగ్గరున్న గ్రంథాన్ని ధృవీకరించే మరొక గ్రంథం వచ్చినా వారి ధోరణి మారలేదు. గతంలో వారు అవిశ్వాసులపై తమకు విజయం ప్రసాదించమని మమ్మల్ని వేడుకునేవారు. చివరికి వారు కోరిన సహాయం (ఖుర్‌ఆన్‌ రూపంలో) వచ్చింది; వారు దీన్ని గుర్తించారు కూడా. అయినా వారు దీన్ని తిరస్కరించారు. ఇలాంటి తిరస్కారులపై దేవుని అభిశాపం పడుగాక! (89)
దేనికి బదులుగా వారు తమ అంతరాత్మల్ని అమ్ముకున్నారో అది పరమనీచమైన విషయం. దేవుడు (వారి జాతికి చెందిన వ్యక్తికి గాకుండా) తాను తలచుకున్న దాసునికి తన కటాక్షం (దైవదౌత్యం) ప్రసాదించాడన్న అక్కసుతో వారు దేవుడు పంపినదాన్ని (ఖుర్‌ ఆన్‌ని) మొండిగా తిరస్కరిస్తున్నారు. కనుక వారు (దేవుని) ఆగ్రహానికి గురయ్యారు. ఇలాంటి తిరస్కారులకు అత్యంత అవమానకరమైన శిక్ష ఎదురుచూస్తోంది. (90)
దేవుడు అవతరింపజేసిన దాన్ని విశ్వసించండని చెబితే, వారు (తలబిరుసుతో) “మా వద్దకు అవతరించిన దాన్ని మాత్రమే మేము విశ్వసిస్తాము” అంటారు. అంటే వారు తమ దగ్గరున్న గ్రంథం తప్ప బయట మరేగ్రంథం అవతరించినా, అది పూర్తిగా సత్యమైనదైనా, వారి దగ్గరున్న గ్రంథాన్ని ధృవీకరిస్తున్నా దాన్ని నమ్మరన్న మాట! సరే, “మీరు (సత్యాన్ని) విశ్వసించినవారైతే ఇంతకు పూర్వం (మీ జాతిలోనే ఆవిర్భవించిన) దైవప్రవక్తలను ఎందుకు సంహరించారు?” అని అడగండి వారిని. (91)
మూసా మీ దగ్గరకు ఎన్నెన్నో అద్భుతమైన మహిమలు, స్పష్టమైన ప్రమాణాలు తీసుకువచ్చాడు. కాని అతను, కాస్త అటు (తూర్‌ కొండకు) వెళ్ళగానే మీరు ఆవు దూడను దైవంగా చేసుకొని ఆరాధించసాగారే! మీరెంత దుర్మార్గులు!! (92)
మేము మీమీద తూర్‌ కొండ ఎత్తిపట్టి మీచేత ప్రమాణం చేయించిన సంఘటన గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు మేము మీకందజేస్తున్న బోధనలను గట్టిగా పాటించా లని, వినాలని ఆదేశించాము. దానికి మీ పూర్వీకులు “మేము విన్నాం, కాని వాటిని పాటించం” అన్నారు. ఈ తిరస్కార వైఖరికి కారణం, వారి హృదయాల్లో ఆవుదూడ (భక్తి) తిష్ఠవేసుకొని వుండటమే. వారితో అనండి: “అసలు మీరు విశ్వాసులేనా! అయితే మీరు అవలంబించిన ఈ విశ్వాసవైఖరి ఎలాంటి అకృత్యాలకు ప్రేరేపిస్తోంది!!” (93)
వారిని అడుగు: “ప్రపంచ ప్రజలందర్నీ కాదని పరలోకగృహం దేవుని వద్ద మీ కొక్కరికే ప్రత్యేకించబడిందని భావిస్తున్నారా? మీ అభిప్రాయం నిజమైతే మీరు చావును కోరుకోవాలి.” కాని వారు చేజేతులా చేసుకొని పంపుకున్న (పాప) కార్యాల కారణంగా చావును ఎన్నటికీ కోరుకోరు. దుర్మార్గుల వైఖరి ఏమిటో దేవునికి బాగా తెలుసు. నీవు వారి వైఖరి గమనిస్తే జీవితం మీద అందరికంటే అత్యాశ వారికే ఉందని గ్రహిస్తావు. ఈ విషయంలో వారు బహుదైవారాధకుల్ని కూడా మించిపోయారు. వారిలో ప్రతి ఒక్కడూ వెయ్యేండ్ల పాటు జీవించి ఉండాలని కోరుకుంటాడు. అంతటి దీర్ఘాయుష్షు పొందినా అది వారిని (నరక)శిక్ష నుండి మాత్రం తప్పించ లేదు. వారు చేస్తున్న పనులే మిటో దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. (94-95)
వారికి చెప్పు: “జిబ్రీల్‌ పట్ల విరోధభావం ఉన్నవారు ఒక విషయం తెలుసుకోవాలి. జిబ్రీల్‌ దేవుని ఆజ్ఞతోనే ఈ గ్రంథం నీ మీద అవతరింపజేశాడు. ఇది గతంలో అవత రించిన గ్రంథాలను ధృవీకరిస్తోంది; విశ్వసించేవారికి సన్మార్గం చూపి, సాఫల్య శుభవార్త నందజేస్తుంది. కనుక (వినండి!) దేవునికి, ఆయన దూతలకు, ఆయన ప్రవక్తలకు, జిబ్రీల్‌కు, మీకాయిల్‌కు ఎవరు శత్రువులవుతారో అలాంటి తిరస్కారులకు దేవుడు శత్రువవుతాడు.” (96-98)
మేము మీ దగ్గరకు స్పష్టంగా సత్యాన్ని తెలిపే సూక్తులు పంపాము. దుర్జనులు తప్ప ఎవరూ వాటిని నిరాకరించరు. వారు ఏదైనా ప్రమాణం చేసినప్పుడు వారిలో ఒక వర్గం దాన్ని పూచికపుల్లలా విసరిపారేస్తూ వచ్చింది. అసలు వారిలో చాలామంది చిత్త శుద్ధితో సత్యాన్ని విశ్వసించేవారే కాదు. వారి వద్దకు దేవుని వైపునుంచి ఏ ప్రవక్తయినా వారి గ్రంథాన్ని ధృవీకరిస్తూ వచ్చినప్పుడు ఆ గ్రంథప్రజల్లో ఒక వర్గం తనకసలు ఏమీ తెలియనట్లు దైవగ్రంథాన్ని అటక మీద ఎత్తిపెట్టింది. (99-101)
పైగా వారు, సులైమాన్‌ పాలనాకాలం పేరుతో దయ్యాలు చెప్పే విషయాల్ని పాటించనారంభించారు. కాని సులైమాన్‌ ఎన్నడూ సత్యతిరస్కారం జోలికే పోలేదు. జనానికి భూతవిద్య నేర్పుతుండిన ఆ దయ్యాలే సత్యతిరస్కారానికి పాల్పడ్డాయి.
అంతేకాదు, బాబిల్‌లో హారూత్‌, మారూత్‌ అనే ఇద్దరు (మానవాకారంలో వచ్చిన) దైవదూతలపై అవతరించిన విషయాల్ని కూడా వారు పట్టుకువ్రేలాడారు. కాని ఆ దైవ దూతలు జనానికి ఆ విషయాలు నేర్పేముందు “మేము ప్రజల్ని పరీక్షించడానికి పంప బడిన వాళ్ళం మాత్రమే. అందువల్ల మీరు అవిశ్వాసానికి (అంటే సత్యతిరస్కారానికి) పాల్పడకండి” అని వారికి స్పష్టంగా చెప్పేవారు. అయినా వారు భార్యాభర్తల్ని విడదీసే ఆ క్షుద్రవిద్యనే నేర్చుకోవడానికి ఉబలాటపడేవారు.
దైవాజ్ఞ లేనిదే ఆ చేతబడి వల్ల కూడా ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లేదికాదు. దాన్ని కొన్నవాడికి పరలోక (స్వర్గ)ంలో ఎలాంటి చోటు లేదని వారికి బాగా తెలుసు. అయినా వారు లాభానికి బదులు తమకు నష్టం కలిగించే దానినే నేర్చుకోవడానికి ఉత్సాహపడ్డారు. వారు తమ అంతరాత్మలను అమ్ముకొని ఎంతటి నీచమైన సరుకు కొన్నారు! వారికీ విషయం తెలిసివుంటే ఎంత బాగుండేది! వారు గనక విశ్వసించి భయభక్తుల వైఖరి అవలంబించి వుంటే, వారికి దేవుని వద్ద ఎంతో మంచి ప్రతిఫలం లభించి వుండేది. వారికీ విషయం తెలిసివుంటే ఎంత బాగుండేది! (102-103)
విశ్వాసులారా! మీరు (దైవప్రవక్త ముందు) “కాస్త మా మాటలు వినండ”ని అనకండి. దానికిబదులు “కాస్త మమ్మల్ని అర్థం చేసుకోనివ్వండ”ని పలకండి. విషయం శ్రద్ధగా వినండి. సత్యతిరస్కారులకు దుర్భరయాతన కాచుకొని ఉంది. (104)
సత్యాన్ని నిరాకరించేవారు గ్రంథప్రజలైనా, బహుదైవారాధకులైనా, మీ ప్రభువు నుంచి మీ దగ్గరికొచ్చే ఏ మంచివిషయం కూడా వారికి నచ్చదు. కాని దేవుడు తన కారుణ్యం కోసం తాను కోరుకున్నవారిని ఎంచుకుంటాడు. ఆయన గొప్ప అనుగ్రహశీలి.
మేమేదైనా సూక్తిని రద్దుచేస్తే లేదా మరపింపజేస్తే దాని స్థానంలో అంతకంటే మంచి సూక్తి జారీచేస్తాము. లేదా అలాంటిదే మరో సూక్తి జారీచేస్తాము. దేవుడు ప్రతి విషయంపై అధికారం కలవాడని నీవెరుగవా? భూమ్యాకాశాల సార్వభౌమత్వం అల్లాహ్‌ దేనని, ఆయన తప్ప మీకెవరూ శ్రేయోభిలాషి గాని, సహాయకుడు గాని లేరని నీకు తెలియదా? (105-107)
పూర్వం మూసాను (యూదులు) అడిగినటువంటి (పనికిమాలిన) ప్రశ్నలు, కోరికలు మీరు కూడా మీ ప్రవక్తను అడగదలిచారా? ఎవరు విశ్వాస వైఖరికి బదులు అవిశ్వాస వైఖరి అవలంబిస్తాడో అతను రుజుమార్గం తప్పినట్లేనని తెలుసుకోవాలి. గ్రంథప్రజల్లో చాలామంది మిమ్మల్ని ఎలాగైనా విశ్వాసం నుండి తప్పించి అవిశ్వాసం వైపు లాగాలని చూస్తున్నారు. సత్యం వారిముందు స్పష్టంగా వెల్లడైనప్పటికీ వారు అసూయతో మండిపోతూ మిమ్మల్ని అవిశ్వాసులుగా మార్చదలిచారు. కాబట్టి దేవుడు వారి విషయంలో ఒక నిర్ణయం తీసుకునేవరకు వారిని క్షమించి, చూసీ చూడనట్లు వదిలేయండి. దేవుడు ప్రతిపనీ చేయగల సమర్థుడు, సర్వశక్తిమంతుడు. (108-109)
(కనుక మీరు దైవధర్మంపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించి) నమాజ్‌ (ప్రార్థనా) వ్యవస్థ నెలకొల్పండి. (పేదల ఆర్థిక హక్కయిన) జకాత్‌ చెల్లిస్తూ ఉండండి. మీ పరలోక శ్రేయస్సు కోసం మీరు ఏ సత్కార్యం చేసినా అది దేవుని వద్ద మీకు లభిస్తుంది. మీరు చేస్తున్న పనులన్నిటినీ దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. (110)
యూదుడుగా లేక క్రైస్తవుడుగా మారనంతవరకు ఏఒక్కడూ స్వర్గానికి పోలేడని అంటారు వారు. ఇవి వారి భ్రమలు మాత్రమే. మీమాట నిజమైతే దానికి ప్రమాణం తీసుకురండి” అని అడుగు. కాదు, ఎవరైనా సరే తనను తాను దేవునికి సమర్పించు కొని సదాచార సంపన్నుడైవుంటే అతనికా ప్రతిఫలం అతని ప్రభువు దగ్గర లభిస్తుంది. అలాంటివారికి ప్రళయదినాన ఎలాంటి భయం, దుఃఖం ఉండవు. (111-112)
క్రైస్తవులు సన్మార్గంలో లేరని యూదులు అంటారు. అలాగే యూదులు సన్మార్గం లో లేరని క్రైస్తవులు అంటారు. నిజానికి వారుభయులూ దైవగ్రంథం పఠిస్తున్నవారే. గ్రంథజ్ఞానంలేని ప్రజలు (బహుదైవారాధకులు) కూడా ఇలాంటి ప్రగల్భాలే పలుకుతారు. వారుభయుల మధ్య ఏర్పడిన ఈ విభేదాలను గురించి రేపు ప్రళయదినాన దేవుడు తీర్పుచేస్తాడు. (అప్పుడు తెలుస్తాయి నిజానిజాలు). (113)
దేవుని ఆరాధనాలయాల్లో ఆయన పేరు స్మరించనీయకుండా నిరోదిస్తూ వాటి వినాశానికి పాల్పడేవాడి కంటే పరమదుర్మార్గుడు ఎవరుంటారు? అలాంటి దుర్మార్గులు దేవుని ఆరాధనాలయాల్లో అడుగుపెట్టడానికే అర్హులుకారు. ఒకవేళ వారందులో ప్రవేశిం చినా భయపడుతూ ప్రవేశిస్తారు. వారికి ఇహలోకంలో పరాభవం, పరాజయాలే ఎదురవు తాయి. ఇక పరలోకంలోనైతే వారు ఘోరమైన (నరక)యాతనలు చవిచూస్తారు. (114)
తూర్పు, పడమరలు అన్నీ అల్లాహ్‌కు చెందినవే. (ప్రార్థన చేయడానికి) మీరు ఏ దిక్కుకు మరలితే ఆ దిక్కుకే ఆయన ఉంటాడు. నిస్సందేహంగా దేవుడు సర్వోప గతుడు, సర్వజ్ఞుడు. (115)
దేవుడు ఒకర్ని తన కుమారుడిగా చేసుకున్నాడని అంటారు వారు. (లేదు) ఆయన ఎంతో పరిశుద్ధుడు, పవిత్రుడు. భూమ్యాకాశాలలోని సమస్తం ఆయనవే. సర్వ సృష్టిరాసులు ఆయన పట్ల విధేయత కలిగివున్నాయి. భూమ్యాకాశాలను (అందులోని సమస్త సృష్టితాలను) ఆయనే సృష్టించాడు. (ఏ ఒక్కర్నీ కుమారుడిగా చేసుకోవాల్సిన అగత్యం ఆయనకు ఎంతమాత్రం లేదు.) ఆయన ఏదైనా చేయదలచుకుంటే ‘అయిపో’ అంటే చాలు, అది ఇట్టే అయి తృటిలో ఉనికిలోకి వస్తుంది. (116-117)
“దేవుడు మాతో ఎందుకు మాట్లాడడు?” అంటారు అజ్ఞానులు. లేక “మా దగ్గరకు దేవుడు ఏదయినా మహిమను ఎందుకు పంపడు?” అంటారు వారు. వారికి పూర్వం కూడా కొందరు ఇలాంటి మాటలే అన్నారు. వారందరి మనస్తత్వం ఒకే విధంగా ఉంది. నమ్మేవారికి మేము స్పష్టమైన మహిమలు చూపే ఉన్నాము. (ప్రవక్తా!) మేము నిన్ను సత్యపూరిత జ్ఞానంతో శుభవార్త అందజేసేవానిగా, హెచ్చరించేవానిగా నియ మించి పంపాము. (ఇంతకంటే గొప్ప మహిమ వారికి ఇంకేం కావాలట!) నరక వాసుల విషయంలో నీవు జవాబుదారుడవు కావు. వారి స్వయంకృతాపరాధానికి నీవు ఏమాత్రం బాధ్యుడవు కావు. (118-119)
యూదులుగాని, క్రైస్తవులుగాని వారి ఆచార వ్యవహారాలను నీవు పాటించనంత వరకూ నీతో ఎన్నటికీ రాజీపడరు. కనుక దేవుడు చూపిన మార్గమే సన్మార్గమని (అది తప్ప మరో ముక్తిమార్గం లేదని) వారికి స్పష్టంగా చెప్పు. ఒకవేళ నీకు (మా గ్రంథ) జ్ఞానం అందిన తరువాత కూడా నీవు వారి మనోకాంక్షల్ని అనుసరిస్తే మాత్రం నిన్ను దేవుని బారి నుండి కాపాడేవాడే ఉండడు. ఏ స్నేహితుడూ, సహాయకుడూ మా పట్టు నుంచి నిన్ను కాపాడలేడు. మేము గ్రంథం ప్రసాదించినవారు దాన్ని పఠించవలసిన విధంగా పఠిస్తారు. వారు మనస్ఫూర్తిగానే దాన్ని విశ్వసిస్తారు. దాన్ని నిరాకరించేవారు మాత్రమే నష్టపోయేవారు. (120-121)
ఇస్రాయీల్‌ సంతతి ప్రజలారా! నేను చేసిన మహోపకారాలు జ్ఞాపకం చేసుకోండి. నేను మీకు యావత్ప్రపంచ జాతులపై గౌరవం, ఔన్నత్యాలు ప్రసాదించాను. కనుక ఎవరూ ఎవరికీ ఏవిధంగానూ సహాయపడలేని (ప్రళయ)దినానికి భయపడండి. ఆరోజు ఎవరి నుండీ ఎలాంటి పాపపరిహారం స్వీకరించబడదు. ఎవరి సిఫారసు కూడా చెల్లదు. నేరస్థులకు ఎలాంటి సహాయమూ లభించదు. (122-123)
ఇబ్రాహీంప్రభువు కొన్ని విషయాల్లో ఇబ్రాహీంని పరీక్షించగా అందులో అతను కృతార్థుడయ్యాడు. అప్పుడు దేవుడు అతనితో “నేను నిన్ను యావత్తు మానవజాతికి నాయకుడిగా నియమించబోతున్నాను” అన్నాడు. దానికతను “ప్రభూ! మరి నా సంతానంలో కూడా (ఎవరికైనా ప్రపంచ నాయకత్వం ప్రసాదిస్తావా)?” అని అడిగాడు. దానికి దేవుడు “మా ఈ వాగ్దానం దుర్మార్గులకు వర్తించదు” అన్నాడు. (124)
మేము కాబాలయాన్ని ప్రజల కోసం (ఆరాధనా) కేంద్రంగాను, శాంతి నిలయం గాను చేసి, ఇబ్రాహీం నిలబడిన చోటును ప్రార్థనా స్థలంగా చేసుకోవలసిందిగా ప్రజలను ఆదేశించాము. మరోవైపు “నా ఈ ఆలయాన్ని ప్రజలు ప్రదక్షిణ చేయడానికి, అందులో ధ్యానించడానికి, మోకరిల్లడానికి, సాష్టాంగపడటానికి పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంచాల”ని ఇబ్రాహీంని, ఇస్మాయీల్‌ని కూడా ఆజ్ఞాపించాము. (125)
ఇబ్రాహీం దేవుడ్ని ప్రార్థిస్తూ “ప్రభూ! ఈ పట్టణాన్ని శాంతినగరంగా చెయ్యి. ఇక్కడ నివసించే ప్రజల్లో దైవాన్ని, పరలోకాన్ని విశ్వసించేవారికి తినేందుకు అన్ని విధాల పండ్లు ఫలాలు ప్రసాదించు” అని అన్నాడు. దానికి దేవుడు “(ఈ మూన్నాళ్ళ ప్రపంచంలో) నేను విశ్వసించనివారిక్కూడా ఎంతోకొంత ఉపాధినిస్తాను. అయితే ఆ తరువాత వారిని నరకాగ్ని వైపు ఈడుస్తాను. అది అత్యంత ఘోరమైన ప్రదేశం” అని అన్నాడు. (126)
ఇబ్రాహీం, ఇస్మాయీల్‌ ఇద్దరూ దైవగృహానికి పునాదులు తీసి గోడలు నిర్మిస్తూ ఇలా వేడుకున్నారు:“ప్రభూ! మాఈ సేవ స్వీకరించు. నీవే (అందరి మొరలు) ఆల కించేవాడవు, సర్వం తెలిసినవాడవు. ప్రభూ! మాఇద్దర్నీ నీకు విధేయులైన దాసులుగా చెయ్యి. మా సంతతి నుండి నీకు విధేయులైవుండే ఒక జాతిని ఆవిర్భవింపజేయి. నిన్ను ఆరాధించే పద్ధతేమిటో మాకు తెలియజేయి. మా పొరపాట్లు మన్నించు. నిస్సందేహంగా నీవు మన్నించేవాడవు, కరుణించేవాడవు. ప్రభూ! ఆ జాతిప్రజలకు నీ సూక్తులు విన్పించే, నీ గ్రంథజ్ఞానాన్ని, వివేకాన్ని నేర్పి వారి జీవితాలను సంస్కరించే ఒక ప్రవక్తను ఆ జాతిలో పుట్టించు. నీవు ఎంతో శక్తిమంతుడవు, వివేకవంతుడవు.” (127-129)
(ఇదీ ఇబ్రాహీం గాధ. అలాంటి) ఇబ్రాహీం పాటించిన జీవనసరళిని మూర్ఖులు తప్ప ఎవరు ద్వేషిస్తారు? మేము ప్రపంచంలో (మా కార్యసాధనకై) ప్రత్యేకంగా ఇబ్రా హీంను ఎన్నుకున్నాం. పరలోకంలో అతను పుణ్యాత్ములలో చేర్చబడతాడు. (130)
ఇబ్రాహీంని అతని ప్రభువు “నిన్ను నీవు (మాకు) సమర్పించుకో”అని ఆదేశించ గానే అతను (ఏమాత్రం తటపటాయించకుండా) “నన్ను నేను సర్వలోక ప్రభువుకు సమర్పించుకుంటున్నా”నని అన్నాడు. తరువాత అతను తన కుమారులక్కూడా ఈ (స్వయం సమర్పణ) విధానాన్నే ఉపదేశించాడు. యాఖూబ్‌ కూడా తన కొడుకులకు హితవు చేస్తూ “బిడ్డలారా! దేవుడు మీకోసం ఈ జీవనవిధానాన్నే నిర్ణయించాడు. కనుక చనిపోయే వరకూ (ముస్లిములు)గానే జీవించాలి” అన్నాడు. (131-132)
మరి యాఖూబ్‌ ఇహలోకం వీడిపోతున్నప్పుడు (అక్కడ) మీరున్నారా? అతను తుదిశ్వాస వదలుతున్నప్పుడు తన కొడుకులను పిలిచి “బిడ్డలారా! నేను వెళ్ళిపోయిన తరువాత మీరు ఎవరిని ఆరాధిస్తారు?” అని అడిగాడు. దానికి వారంతా “మీరు, మీ తాత ముత్తాలయిన ఇబ్రాహీం ఇస్మాయీల్‌, ఇస్‌హాఖ్‌ (అలైహి)లు ఆరాధించిన ఏకేశ్వరుడ్ని మాత్రమే మేము ఆరాధిస్తాం. ఆయనకే మేము విధేయులై (ముస్లిములై) ఉంటాము” అని సమాధానమిచ్చారు. (133)
ఇవి గతించిన సమాజాలు. వారు చేసుకున్న కర్మలు వారికే, మీ కర్మలు మీకే. అంతేగాని వారు చేసినదాన్ని గురించి మిమ్నల్ని ప్రశ్నించడం జరగదు. (134)
యూదులైపోతే సన్మార్గంలో ఉంటారని యూదులు, క్రైస్తవులైపోతేనే రుజుమార్గం లభిస్తుందని క్రైస్తవులు అంటారు. చెప్పు: “(మేము మాత్రం) ఇబ్రాహీం ధర్మం (అనుసరి స్తున్నాం). ఇబ్రాహీం స్వచ్ఛమైన ఏకదైవారాధకుడు, బహుదైవారాధకుడు కాదు.” (135)
ముస్లిములారా! ఇలా అనండి: “మేము అల్లాహ్‌ను విశ్వసించాము; మా దగ్గరకు అవతరించినదాన్ని; ఇబ్రాహీం, ఇస్మాయీల్‌, ఇస్‌హాఖ్‌, యాఖూబ్‌, యాఖూబ్‌ సంతతిపై అవతరించినదాన్ని; మూసా, ఈసా తదితర దైవప్రవక్తలందరికీ వారి ప్రభువు నుండి లభించిన దాన్ని కూడా మేము విశ్వసించాము. వారి మధ్య మేము ఎలాంటి విచక్షణ చేయము. మేము దేవునికే విధేయులం (ముస్లిములం).” (136)
మీరు ఎలా విశ్వసించారో అలా విశ్వసిస్తేనే వారు సన్మార్గం పొందగలరు. మీలా విశ్వసించకుండా ముఖం తిప్పుకుంటే వారు మొండిపట్టుదలకు పోయి మీతో విభేది స్తున్నారన్న మాట. ఏమైనా వారికి వ్యతిరేకంగా మీకు సహాయం చేయడానికి దేవుడే చాలు. ఆయన సమస్తం వింటున్నాడు. ఆయనకు అన్ని విషయాలు తెలుసు. (137)
చెప్పండి: “దేవుని రంగు అవలంబించండి. దేవుని రంగు కన్నా మరెవరి రంగు శ్రేష్ఠమయినది? మేము ఆయన్నే ఆరాధిస్తాము.” (138)
ముహమ్మద్‌! వారితో ఇలా అను: “మీరు దేవుని విషయంలో మాతో పోట్లాడుతా రెందుకు? ఆయన మీకూ ప్రభువే, మాకూ ప్రభువే కదా! మీ కర్మలు మీవెంట, మా కర్మలు మావెంట ఉంటాయి. మేము పూర్తిగా ఆయనకే అంకితమై పోయాము.” లేదా వారిని ఇలా అడుగు: “మీరు ఇబ్రాహీం, ఇస్మాయీల్‌, ఇస్‌హాఖ్‌, యాఖూబ్‌, యాఖూబ్‌ సంతానం- వీరంతా యూదులని అంటున్నారా? లేక క్రైస్తవులని అంటున్నారా?”
వారికి చెప్పు: “ఈ విషయం గురించి మీకు బాగా తెలుసా లేక దేవునికా? దేవుని దగ్గర్నుండి వచ్చిన సాక్ష్యం వెల్లడించకుండా దాచిపెట్టేవాడి కంటే పరమ దుర్మార్గుడు మరెవరు ఉంటారు? మీ చర్యలను దేవుడు గమనించడం లేదని భావించకండి.” ఆ సమాజం గతించి పోయింది. వారు చేసుకున్న కర్మలు వారికే; మీరు చేసుకున్న కర్మలు మీకే. వారు చేసిన దాన్ని గురించి మిమ్మల్ని విచారించడం జరగదు. (139-141)
“ఏమయింది వీరికి, నిన్నటిదాకా ఒక దిక్కుకు తిరిగి ప్రార్థన చేస్తూవుండిన వీరు ఈ రోజు హఠాత్తుగా మరో దిక్కుకు తిరిగారు?” అంటారు మూఢులు. ప్రవక్తా! చెప్పు: “తూర్పుపడమరలన్నీ దేవుని దిక్కులే. ఆయనతాను కోరినవారికి సన్మార్గం చూపుతాడు.” ఈవిధంగా మేము మిమ్మల్ని మధ్యస్థ సమాజంగా చేశాము, మీరు ప్రపంచప్రజలకు సాక్షులుగా ఉండాలని, ప్రవక్త మీకు సాక్షిగా ఉండాలని.
దైవప్రవక్తను ఎవరు అనుసరిస్తారు, ఎవరు విముఖులవుతారని పరీక్షించడానికి మేము మొదట మీరు (ప్రార్థనకై) మరలే దిక్కును ఆరాధనా దిశగా నిర్ణయించాం. ఇది ప్రజలకు చాలాకష్టం అన్పించింది. కాని దేవుని మార్గదర్శకత్వం లభించినవారికి ఇది ఏమాత్రం కష్టమన్పించలేదు. దేవుడు మీ విశ్వాసాన్ని అనవసరంగా వృధాచేయడు. ఆయన మానవుల పాలిట అపారకృపాశీలుడు, అమిత దయామయుడు. (142-143)
ముహమ్మద్‌! నీవు మాటిమాటికి ముఖం పైకెత్తి ఆకాశం వైపు చూడటాన్ని మేము గమనిస్తూనే ఉన్నాము. కనుక నీకు ప్రియమైన దిశకే (ప్రార్థనకై) మేము నిన్ను మరలి స్తున్నాం. ఇక నుంచి మీరు ప్రతిష్ఠాలయం (కాబా) వైపు తిరగండి. మీరు ఎక్కడున్నా దాని వైపుకే తిరిగి ప్రార్థన చేయండి. (ప్రార్థనాదిశ మార్పుకు చెందిన) ఈ ఆదేశం తమ ప్రభువు నుండి వచ్చిన సత్యమని గ్రంథప్రజలకు బాగా తెలుసు. (అయినా వారు తమ పంతం మానలేకపోతున్నారు.) వీరి చర్యల్ని దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. (144)
గ్రంథప్రజలకు నీవు ఎన్ని నిదర్శనాలు చూపినా వారు మీ ప్రార్థనాదిశను అనుస రించరు. మీరూ వారి ప్రార్థనాదిశను అనుసరించలేరు. వారిలో కూడా ఒక వర్గం వారు అనుసరించే ప్రార్థనాదిశను మరొక వర్గంవారు అనుసరించరు. ఒకవేళ (మా గ్రంథ) జ్ఞానం అందిన తరువాత కూడా వారి కోరికలను అనుసరిస్తే మాత్రం నీవు దుర్మార్గు లలో చేరినట్లు పరిగణించబడతావు. (145)
మేము గ్రంథం ప్రసాదించినవారు తమ కన్నకొడుకుల్ని గుర్తిస్తున్నట్లు దీన్ని (సంకోచం లేకుండా) గుర్తిస్తున్నారు. కాని వారిలో ఒకవర్గం వాస్తవాన్ని బుద్ధిపూర్వకంగా కప్పిపుచ్చుతోంది. నిస్సందేహంగా ఇది నీ ప్రభువు నుండి వచ్చిన పరమసత్యం. కనుక నీవు ఎలాంటి అనుమానానికి ఆస్కారమివ్వకు. ప్రతి వర్గానికీ ఒక ప్రార్థనాదిశ ఉంది. వారా వైపుకు తిరుగుతారు. మీరు సత్కార్యాలు చేయటంలో ఒకర్నొకరు మించిపోవడా నికి ప్రయత్నించండి. మీరు ఎక్కడున్నా దేవుడు మిమ్మల్నందర్నీ ఒక చోటికి చేరుస్తాడు. ఆయన ప్రతిపనీ చేయగల సమర్థుడు, సర్వశక్తి మంతుడు. (146-148)
మీరు ఏప్రాంతానికి వెళ్ళినా అక్కడ్నుంచి ప్రతిష్ఠాలయం వైపుకే తిరిగి ప్రార్థన చేయండి. నిస్సందేహంగా ఇది మీ ప్రభువు నుండి వచ్చిన సత్యం. మీరు చేసే పనుల న్నిటినీ దేవుడు చూస్తూనేఉంటాడు. మీరు ఎక్కడున్నా, ఏప్రాంతానికెళ్ళినా అక్కడ్నుంచి మీరు ప్రతిష్ఠాలయం వైపుకే అభిముఖులుకండి. మీకు వ్యతిరేకంగా ఇతరులు ఎలాంటి మాట అనడానికైనా ఆస్కారమివ్వకుండా మీరు దాని వైపుకే తిరిగి ప్రార్థన చేయండి. ఇక దుర్మార్గుల విషయానికొస్తే, వారు ఎల్లప్పుడూ మీకు వ్యతిరేకంగా ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు. కనుక మీరు వారికి భయపడకూడదు, నాకే భయపడాలి.
మీకు నా సూక్తులు వినిపిస్తూ, గ్రంథాన్ని, వివేకాన్ని బోధించడంతో పాటు మీకు తెలియనివిషయాలు నేర్పి, మీ జీవితాలను తీర్చిదిద్దే ఒక ప్రవక్తను నేను మీజాతి నుండే మీలో పుట్టించాను. అలాగే మీకు నాఅనుగ్రహాలు ప్రసాదించడానికి, మీరు సన్మార్గంలో నడవడానికి ఆజ్ఞలు ఇస్తున్నాను. కనుక మీరు నన్ను స్మరిస్తూఉండండి, నేను మిమ్మల్ని గుర్తుంచుకుంటాను. నాకు కృతజ్ఞులైఉండండి, కృతఘ్నులు కాకండి. (149-152)
విశ్వాసులారా! సహనం వహించి, ప్రార్థనచేస్తూ (మా)సహాయం అర్థిస్తూ ఉండండి. దేవుడు సహనం వహించేవారికే తోడుగా ఉంటాడు. దైవమార్గంలో చంపబడినవారిని గురించి, వారు చనిపోయారని అనకండి. వారు సజీవంగానే ఉన్నారు. మీరా విషయం గ్రహించలేరు. (153-154)
భయం, ఆకలి, ధనప్రాణ, పంటల నష్టాలు కలిగించి మిమ్మల్ని మేము తప్పని సరిగా పరీక్షిస్తాము. అలాంటి స్థితిలో సహనం వహించి, ఆపద వచ్చినప్పుడు “మేము దేవుని ఆస్తులం. దేవుని వైపుకే పోవలసినవాళ్ళం”అని పలికేవారికి వారిప్రభువు కారుణ్య కటాక్షాలు లభిస్తాయని శుభవార్త విన్పించు. అలాంటివారే సన్మార్గగాములు. (155-157)
సఫా, మర్వాలు దేవుని సూచనలే. కనుక కాబా (సందర్శనం) హజ్‌, ఉమ్రాలు చేసేవారు ఆ రెండుకొండల మధ్య తిరగడంలో తప్పులేదు. (అది పుణ్యకార్యం.) పుణ్య కార్యం చేసేవారిని దేవుడు (తప్పక) ఆదరిస్తాడు. ఆయన సమస్తం తెలిసినవాడు. (158)
మేము మా గ్రంథంలో యావత్తు మానవుల మార్గదర్శనం కొరకు స్పష్టమైన ఆజ్ఞ లను, హితవులను జారీచేశాము. అలాంటి ఆజ్ఞలు, హితవులను (ప్రజల ముందు వెల్ల డించకుండా) దాచేవారిని దేవుడు శపిస్తున్నాడు. శపించేవారు కూడా వారిని శపిస్తు న్నారు. అయితే జరిగిన దానికి పశ్చాత్తాపం చెంది, వ్యవహారశైలిని సరిదిద్దుకొని, దాచిన దైవాజ్ఞలను ప్రజలకు వెల్లడించేవారిని నేను క్షమిస్తాను. నేను క్షమాశీలిని, కరుణా మయుడ్ని. అయితే అవిశ్వాసులైపోయి, అవిశ్వాస స్థితిలోనే అంతిమశ్వాస విడిచేవారిని దేవుడు, దైవదూతలు, యావత్తు మానవులు శపిస్తారు. వారు ఎల్లప్పుడూ శాపగ్రస్తులుగానే ఉంటారు. అలాంటివారికి నరక యాతనలు తగ్గించడంగాని, మరొక అవకాశం ఇవ్వడం గాని ఎట్టి పరిస్థితిలోనూ జరగదు. (159-162)
మానవులారా! మీ ఆరాధ్యదైవం ఒక్కడే. కరుణామయుడు, కృపాసాగరుడయిన ఆ దేవుడు తప్ప (మీకు) మరోదేవుడు లేనేలేడు. భూమ్యాకాశాల సృజనలో, రేయిం బవళ్ళ చక్రభ్రమణంలో, సముద్రాలలో పయనిస్తూ మానవులకు ప్రయోజనం చేకూర్చే ఓడలలో, దేవుడు పైనుంచి కురిపించే వర్షపునీటిలో, తద్వారా ఆయన మృతభూమికి జీవంపోసే (చెట్లూ చామల్ని పచ్చదనంచేసే) పనిలో, పుడమిపై పలువిధాల జీవరాసుల్ని విస్తరింపజేసే ఆయన సృష్టి నైపుణ్యంలో, గాలుల సంచారంలో, నేలకు నింగికి మధ్య నియమబద్ధంగా సంచరించే మేఘాలలో బుద్ధిమంతులకు (దేవుని ఆస్తిత్వాన్ని, ఆయన ఏకత్వాన్ని తెలిపే) అనేకనేక నిదర్శనాలు ఉన్నాయి. (163-164)
అయితే (సృష్టిలో దేవుని ఏకత్వాన్ని తెలిపే ఎన్నో నిదర్శనాలు కళ్ళెదుట స్పష్టంగా కన్పిస్తున్నా బుద్దినుపయోగించి వాటిని గమనించని) కొందరు నిజదేవుడ్ని వదలి, మిధ్యా దైవాలను పట్టుకు వ్రేలాడుతున్నారు. పైగా వారు వాటిని నిజదేవుడ్ని అభిమానిస్తున్నట్లు అమితంగా అభిమానిస్తున్నారు. విశ్వాసులు మాత్రం అందరికన్నా అల్లాహ్‌నే అత్యధికంగా అభిమానిస్తున్నారు. దుర్మార్గులు (నరక)యాతన చూసినప్పుడు ‘సర్వశక్తులు సర్వాధికా రాలు అల్లాహ్‌కే ఉన్నాయని, ఆయన అతి కఠినంగా శిక్షించేవాడని’ తెలుసుకుంటారు. ఆ విషయం వారు (ఈనాడే) తెలుసుకుంటే ఎంత బాగుంటుంది! (165)
(సత్యతిరస్కారులైన) నాయకులు ఆరోజు తమ అనుయాయుల్ని అసహ్యించు కుంటూ, వారితో తమకు ఎలాంటి సంబంధం లేదన్నట్లు ప్రవర్తిస్తారు. అయితే శిక్ష మాత్రం (వారంతా) చవిచూస్తారు. వారి మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. అప్పుడు వారి అనుయాయులు (పశ్చాత్తాపంతో కుమిలిపోతూ) తమకు మరొక సారి (ఇహలోకానికి) తిరిగివెళ్ళే అవకాశం లభిస్తే, ఇప్పుడు వీరు తమల్ని అసహ్యించుకున్నట్లు తాము వీరిని అసహ్యించుకుంటాం అంటారు. ఈవిధంగా దేవుడు, వారు ఇహలోకంలో చేసిన దుర్మార్గం, దుష్టకార్యాలను వారి పశ్చాత్తాపానికి కారణభూతంగా చేసి చూపిస్తాడు. వారిక నరకాగ్ని నుండి ఏవిధంగానూ బయటపడలేరు. (166-167)
మానవులారా! మీరు ప్రపంచంలో లభించే ధర్మసమ్మతమైన పరిశుద్ధపదార్థాలే తినండి. షైతాన్‌ అడుగుజాడలలో నడవకండి. వాడు మీకు ఆగర్భశత్రువు. మిమ్మల్ని వాడు దుష్టకార్యాలకు, అశ్లీలచేష్టలకు పురిగొల్పుతాడు. దేవుని విషయంలో మీకేమాత్రం తెలియని విషయాల్ని దేవునిపేర పలకమని మిమ్మల్ని పురిగొల్పుతాడు. (168-169)
దేవుడు అవతరింపజేసిన దాన్ని అనుసరించండని అంటే “కాదు, మా తాత ముత్తాతలు అనుసరించినదాన్నే అనుసరిస్తాం” అంటారు వారు. మరి వారి తాతముత్తా తలు తెలివిహీనులైనా, సన్మార్గంలో లేకపోయినా (వారినే గుడ్డిగా అనుసరిస్తారా)? కాపరి పిలుపు తప్ప మరేపిలుపూ వినలేని పశువుల్లా వుంది (ఈ) తిరస్కారుల ధోరణి. వారు (సత్యం వినలేని) బధిరులు, (సత్యం పలకలేని) మూగలు, (సత్యం కానలేని) అంధులు. అందువల్ల వారికిక ఏ విషయమూ తలకెక్కదు. (170-171)
విశ్వాసులారా! మీరు దేవుడ్ని మాత్రమే ఆరాధించేవారైతే మేము ప్రసాదించిన పరిశుద్ధ పదార్థాలనే తిని (దేవునికి) కృతజ్ఞులైఉండండి. ఆయన మీకు చచ్చిన పశువుల్ని, రక్తాన్ని, పందిమాంసాన్ని, దైవేతరులకు నైవేద్యం పెట్టిన పదార్థాలను, (అక్కడి మాంసా హారాన్ని) నిషేధించాడు. అయితే దైవాజ్ఞలు ఉల్లంఘించే ఉద్దేశ్యం లేకుండా, హద్దు మీరకుండా గత్యంతరంలేని పరిస్థితిలో మాత్రం (ఈ నిషేధితాలు) తినవచ్చు. అందులో తప్పు లేదు. దేవుడు క్షమించేవాడు, కరుణించేవాడు. (172-173)
అత్యల్ప ప్రాపంచిక ప్రయోజనాలు ఆశించి, దేవుడు అవతరింపజేసిన విషయా లను దాచిపెట్టేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటున్నారు. అలాంటి వారితో దేవుడు ప్రళయదినాన మాట్లాడడు. వారిని పరిశుద్ధపరచడు. వారికోసం దుర్భరమైన (నరక)యాతన (సిద్ధంచేయబడి) ఉంది. వీరే రుజుమార్గానికి బదులు మార్గ భ్రష్టత్వాన్ని, మన్నింపుకు బదులు (నరక)యాతనను కొని తెచ్చుకున్నవారు. ఎంత ధైర్యం వీరికి, నరకాగ్నిని సైతం భరించడానికి సిద్ధమయ్యారు! (174-175)
దేవుడు సత్యపూరిత గ్రంథం అవతరింపజేసినప్పటికీ దాన్ని గురించి వారు విభేదాలు సృష్టించుకొని, పంతానికిపోయి నిజధర్మానికి దూరమైపోయారు. (176)
మీ ముఖాలు తూర్పు లేక పడమరకు తిప్పుకోవడమే పుణ్యకార్యం కాదు. దేవుడ్ని, అంతిమదినాన్ని, దైవదూతలను, దేవుడు పంపిన (అంతిమ)గ్రంథాన్ని, ఆయన ప్రవక్త లను హృదయపూర్వకంగా విశ్వసించి, దేవుని మీది ప్రేమాభిమానాలతో మీకత్యంత ప్రియమైన ధనాన్ని బంధువుల కోసం, అనాథలకోసం, నిరుపేదల కోసం, బాటసారుల కోసం, సహాయార్థుల కోసం, బానిసల విముక్తి కోసం ఖర్చుచేయాలి; ప్రార్థనావ్యవస్థ నెలకొల్పాలి; జకాత్‌ చెల్లించాలి; ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి; కష్టకాలంలో, (సత్యా సత్యాల మధ్య జరిగే) పోరాటంలో సహనం వహించాలి. ఇలాంటి సత్కార్యాలు చేసే వారే సన్మార్గగాములు. వారే (దేవునిపట్ల) భయభక్తులు కలిగినవారు. (177)
విశ్వాసులారా! మీకోసం హత్య వ్యవహారంలో రక్తపరిహారానికి సంబంధించిన ఆజ్ఞ జారీచేశాము. స్వేచ్ఛాపరునికి బదులు స్వేచ్ఛాపరుడ్ని, బానిసకు బదులు బానిసను, స్త్రీకి బదులు స్త్రీని మాత్రమే హతమార్చాలి. ఒకవేళ హంతకుని పట్ల అతని (మానవతా) సోదరుడు (అంటే హతుని బంధువు) కొంత మృదువైఖరి అవలంబించడానికి సిద్ధపడితే, రక్తపరిహార సమస్య సామరస్యంగా పరిష్కారమవ్వాలి. దానిప్రకారం హంతకుడు నిర్ణీత రక్తపరిహారాన్ని సంతోషంగా ఇచ్చివేయాలి. ఇది మీ ప్రభువు నుండి లభిస్తున్న సౌలభ్యం, దైవానుగ్రహం. ఆపై కూడా ఎవరైనా హద్దుమీరితే అతనికి (పరలోకంలో) దుర్భర శిక్ష పడుతుంది. కనుక బుద్ధిమంతులారా! (ఇలాంటి) ప్రతిక్రియలోనే మానవ జీవితానికి భద్రత ఉందని తెలుసుకోండి. తద్వారా మాత్రమే మీరు హత్యా రక్తపాతాలకు దూరంగా ఉండ గలుగుతారు. (178-179)
మీపై (మరో)బాధ్యత మోపబడుతోంది (వినండి). మీలో ఎవరికైనా మరణకాలం ఆసన్నమైతే, అతను ఆస్తి కూడా వదలిపోతున్న పక్షంలో తల్లిదండ్రులకు, బంధువులకు ఆస్తి పంపిణీ విషయమయి తగిన వీలునామా రాసిపోవాలి. ఇది (దేవుని పట్ల) భయభక్తులు వున్నవారు నెరవేర్చవలసిన విధ్యుక్త ధర్మం. (180)
ఒకవేళ వీలునామాలోని విషయాలు విన్న తరువాత వాటిని ఎవరైనా మార్చివేస్తే మాత్రం ఆ పాపం వారినే చుట్టుకుంటుంది. దేవుడు సర్వం వినేవాడు, సమస్తం తెలిసిన వాడు. వీలునామా రాసిన వ్యక్తి పక్షపాతానికి పాల్పడ్డాడనిగాని, లేదా ఎవరి హక్కైనా హరించి వేశాడనిగాని (వారసుల్లో) ఎవరికైనా అనుమానం వస్తే, అతను (వీలునామాను మార్చివేసి) వారసుల మధ్య రాజీ కుదుర్చవచ్చు. అందులో ఎలాంటి దోషం లేదు. దేవుడు క్షమించేవాడు, కరుణించేవాడు. (181-182)
విశ్వాసులారా! గతప్రవక్తల అనుయాయులకు ఏవిధంగా ఉపవాసాలు విధించ బడ్డాయో అదేవిధంగా (ఇప్పుడు) మీక్కూడా ఉపవాసాలు విధించాం. దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశముంది. ఈ ఉపవాసాలు కొన్నాళ్ళ పాటు మాత్రమే. ఒకవేళ మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తుడయితే లేదా ప్రయాణావస్థలో ఉంటే అలాంటి వ్యక్తి ఆ తప్పిపోయిన ఉపవాసాలను ఇతర దినాలలో పాటించి (నెల ఉపవాసాలు) పూర్తి చేయాలి. ఉపవాసం పాటించే శక్తి ఉండి కూడా దానిని పాటించనివారు మాత్రం పాప పరిహారం చెల్లించవలసి ఉంటుంది. ఒక ఉపవాస దినానికి పరిహారంగా ఒక నిరు పేదకు భోజనం పెట్టాలి. ఎవరైనా తమంతట తాము సంతోషంగా మరింత పుణ్యం చేయదలచుకుంటే అది వారికే మేలు చేకూర్చుతుంది. (ఏమైనప్పటికీ) మీరు విషయం గ్రహించగలిగితే ఉపవాసం పాటించడమే మీకు శ్రేయస్కరం. (183-184)
రమజాన్‌ ఖుర్‌ఆన్‌ అవతరించిన నెల. ఈ గ్రంథం మానవాళికి మార్గదర్శిని. ఇందులో రుజుమార్గం తెలిపే, సత్యాసత్యాలను, మంచీచెడులను వేరుపరచి చూపే స్పష్టమైన బోధనలు ఉన్నాయి, కనుక ఇకనుండి మీలో రమజాన్‌ నెలను పొందేవారు ఆ నెలంతా విధిగా ఉపవాసం పాటించాలి. అయితే రోగగ్రస్తులు, ప్రయాణీకులు (తప్పిపోయిన) ఉపవాసాలను ఇతర దినాలలో పాటించి (ఆ సంఖ్యను) పూర్తిచేయాలి. దేవుడు మీకు సౌలభ్యం చేకూర్చదలిచాడుగాని, మిమ్మల్ని ఇబ్బంది పాల్జేయాలని భావించడంలేదు. మీరు ఉపవాసాల సంఖ్యను పూర్తిచేసుకోవడానికి, దేవుడు మీకు సన్మార్గం చూపినందుకు ఆయన ఔన్నత్యాన్ని కొనియాడటానికి, ఆయనకు కృతజ్ఞులయి ఉండటానికిగాను ఈ సౌలభ్యం ప్రసాదించాడు. (185)
(ప్రవక్తా!) నా దాసులు నా గురించి అడిగితే నేను వారికి చేరువలోనే ఉన్నానని చెప్పు. మొర పెట్టుకునేవాడు నన్ను మొర పెట్టుకుంటున్నప్పుడు నేనతని మొరాలకించి, దానికి సమాధానం ఇస్తానని తెలియజెయ్యి. అయితే వారు నా సందేశాన్ని స్వీకరించి నాపట్ల పూర్తివిశ్వాసం కలిగివుండాలి. అప్పుడే వారు సన్మార్గం పొందగలరు. (186)
ఉపవాసకాలం రాత్రివేళల్లో మీరు మీ భార్యల దగ్గరకు పోవడం ధర్మసమ్మతం చేయబడింది. వారు మీకు, మీరు వారికి దుస్తుల్లాంటివారు. మీరు (మీ భార్యల చెంతకు పోవడానికి సంకోచిస్తూ) ఆత్మద్రోహం చేసుకుంటున్న సంగతి దేవునికి తెలుసు. అందువల్ల ఆయన మిమ్మల్ని కనికరించి మీ పొరపాట్లు మన్నిస్తున్నాడు. ఇప్పుడిక మీరు మీభార్యలతో నిస్సంకోచంగా రాత్రులు గడపవచ్చు. దేవుడు మీకు ధర్మసమ్మతం చేసిన దాన్ని (దాంపత్య సుఖాన్ని) అనుభవించండి. మీరు (ఉపవాస కాలంలో) కడరేయి నలుపు (చీకటి) తగ్గి తొలిజాము తెలుపు (ఉషోదయకాంతి) కనపడేవరకు హాయిగా తినండి, త్రాగండి. ఆ తరువాత సూర్యాస్తమయమై చీకటి పడేవరకు ఉపవాసం పాటించాలి. అయితే మీరు మసీదుల్లో ఎతెకాఫ్‌ (తపోనిష్ఠ) పాటిస్తున్నప్పుడు మాత్రం మీ భార్యలను కలుసుకోకూడదు. ఇవి దేవుడు నిర్ణయించిన హద్దులు. వాటి దరిదాపు లకు వెళ్ళకండి. ప్రజలు (పెడత్రోవ తొక్కకుండా) భయభక్తులతో మెలిగేందుకే దేవుడు ఈవిధంగా తన ఆదేశాలను విడమరచి తెలియజేస్తున్నాడు. (187)
మీరు ఒకరి ధనాన్ని మరొకరు అక్రమంగా కబళించకండి. ఇతరుల సొత్తు కాజేసే ఉద్దేశ్యంతో ఆ వ్యవహారాన్ని అధికారుల దగ్గరకు తీసికెళ్ళకండి. (188)
(ప్రవక్తా!) ప్రజలు నిన్ను నెలవంక గురించి (ఈ తరిగే పెరిగే చంద్రకళల సంగతే మిటని) అడుగుతున్నారు. ఇవి ప్రజల అవసరాలకు, హజ్‌యాత్ర తేదీల నిర్ణయానికి సంకేతాలని చెప్పు. వారికింకా ఇలా తెలియజెయ్యి: “మీరు మీ ఇండ్లలోకి దొడ్డిదారిన ప్రవేశించడం ఏమాత్రం పుణ్యకార్యం కాదు. (అంధవిశ్వాసాలకు, అక్రమ పద్ధతులకు దూరంగా మసలుకుంటూ) దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటమే అసలైన పుణ్య కార్యం. కనుక మీరు మీఇండ్లలోకి వాటి ముఖద్వారం గుండానే ప్రవేశించండి. మీరు సఫలం కావడానికి ఎల్లప్పుడూ దేవునికి భయపడుతూ ఉండండి. (189)
మీతో పోరాడే వారితో మీరు (ఆత్మ రక్షణార్థం) దైవమార్గంలో పోరాడండి. అయితే హద్దుమీరకూడదు. హద్దుమీరి ప్రవర్తించేవారిని దేవుడు ఎన్నటికీ ప్రేమించడు. (యుద్ధ భూమిలో) వారు మీకు ఎక్కడ ఎదురైనా సరే వారిని హతమార్చండి. వారు మిమ్మల్ని ఎక్కడ నుండి వెళ్ళగొట్టారో అక్కడ నుండి మీరూ వారిని వెళ్ళగొట్టండి. హత్య తీవ్రమైన విషయమే కాని, హింసాపీడనలు అంతకన్నా తీవ్రమైన విషయాలు. వారు ప్రతిష్ఠా లయం (కాబా) దగ్గర (మీతో) పోరాడనంతవరకూ మీరు కూడా వారితో పోరాడకండి. అయితే వారు అక్కడా కయ్యానికి కాలుదువ్వితే మీరు కూడా వారిని నిస్సంకోచంగా ఎదుర్కొని హతమార్చండి. సత్యతిరస్కారులకు ఇదే తగిన శిక్ష. (190-191)
ఒకవేళ వారు యుద్ధం మానుకొని తిరుగుబాటు వైఖరికి స్వస్తిచెబితే, దేవుడు ఎంతో క్షమాశీలి, కరుణామయుడు. (వారి తిరుగుబాటు వైఖరిని ఆయన క్షమించ వచ్చు.) అయితే (వారు యుద్ధవిరమణ చేయని పక్షంలో) మీరు అధర్మం, అరాచకం పూర్తిగా సమసిపోయి, దేవుడు నిర్దేశించిన ధర్మపథం మాత్రమే నిలిచి పోయేవరకు వారితో పోరాడాలి. తరువాత వారు తమ ఆగడాలు మానుకుంటే, మీరు దౌర్జన్యపరుల్ని తప్ప మరెవరినీ అణచి వేయకండి. (192-193)
నిషిద్ధమాసానికి బదులు నిషిద్ధమాసమే సరిపోతుంది. నిషేధితాలన్నిటినీ అందరూ సమానంగా గౌరవించవలసిందే. ఒకవేళ ఎవరైనా (నిషిద్ధమాసంలో లేదా పవిత్ర స్థలం దగ్గర) మీపై దాడిచేస్తే మీరుకూడా వారిపై దాడిచేయండి. అయితే దేవునికి భయ పడుతూ మసలుకోవాలి. దేవునికి భయపడేవారికే ఆయన అండగా నిలుస్తాడు. దైవ మార్గంలో (సంపద) ఖర్చుపెట్టండి. చేజేతులా నాశనం కొనితెచ్చుకోకండి. సత్కార్యాలు చేయండి. సత్కార్యాలుచేసేవారిని దేవుడు తప్పకుండా ప్రేమిస్తాడు. (194-195)
దేవుని ప్రసన్నత కోసం హజ్‌యాత్ర చేయండి. ఉమ్రా ఆచారం కూడా పాటిం చండి. మార్గమధ్యలో మీకేదైనా అవరోధం ఎదురైతే, మీకు అందుబాటులో ఉన్న బలి దానాన్నే దేవునికి సమర్పించుకోండి. అయితే బలిదానం, దాని స్థానానికి చేరుకోనంత వరకు మీరు శిరోముండనం చేయించుకోకండి. ఒకవేళ మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తు లయితే లేదా శిరోబాధకు లోనయి (బలిపశువు నిర్ణీతస్థలానికి చేరుకోకముందే) శిరో ముండనం చేయించు కోవలసివస్తే అలాంటివారు దానికి పరిహారంగా ఉపవాస వ్రతం పాటించాలి; లేదా దానం చేయాలి; లేదా బలిదానం (ఖుర్బాని) ఇవ్వాలి.
తరువాత (అవరోధం తొలగిపోయి లేదా) ప్రశాంత పరిస్థితి ఏర్పడినప్పుడు మీలో ఎవరైనా హజ్‌ దినాలు రాకముందే యాత్రాస్థలానికి చేరుకొని ఉమ్రా ఆచారం పాటిస్తే, అలాంటివారు తమ స్తోమతను బట్టి బలిదానం ఇవ్వాలి. బలిదానం ఇవ్వలేనివారు హజ్‌ కాలంలో మూడురోజులు, ఇంటికి తిరిగొచ్చిన తరువాత ఏడురోజులు చొప్పున మొత్తం పదిరోజులు ఉపవాసం పాటించాలి. ప్రతిష్ఠాలయం సమీపంలో ఇల్లూ వాకిలి లేనివారికి మాత్రమే ఈ సౌలభ్యం వర్తిస్తుంది. దేవుని పట్ల భయభక్తులు కలిగిఉండండి. ఆయన (ఆజ్ఞోల్లంఘనకు పాల్పడేవారిని) కఠినంగా శిక్షిస్తాడని గుర్తుంచుకోండి. (196)
హజ్‌ నెలలు మీకు తెలిసినవే. ఆ నెలల్లో హజ్‌ చేయడానికి సంకల్పించుకున్న వారు హజ్‌ నియమాలు పాటించే రోజులలో లైంగికచేష్టలకు, చెడుపనులకు, ఘర్షణ లకు దూరంగా ఉండాలి. మీరు చేసే ప్రతి సత్కార్యం దేవునికి తెలుసు. హజ్‌యాత్రకు బయలుదేరినప్పుడు ప్రయాణసామగ్రి వెంట తీసికెళ్ళండి. అన్నిటికంటే శ్రేష్ఠమైన ప్రయాణసామగ్రి దైవభీతే. కనుక విజ్ఞులారా! నాపట్ల భయభక్తులు కలిగివుండండి. (197)
హజ్‌ దినాలలో మీరు దేవుని అనుగ్రహం (ఉపాధి) అన్వేషించ దలచుకుంటే నిరభ్యంతరంగా అన్వేషించవచ్చు. అందులో ఎలాంటి తప్పు లేదు. అరఫాత్‌ నుండి తిరిగివస్తూ మష్‌అరిల్‌ హరాం (ముజ్దల్ఫా)లో ఆగి అల్లాహ్‌ను ఆయన నేర్పిన విధంగా స్మరించండి. దీనికి పూర్వం మీరు దారితప్పి నడుస్తుండేవారు. (198)
ఆ తరువాత ప్రజలు ఏ స్థలం నుండి వెనక్కి మరలి వస్తారో మీరు కూడా అదే స్థలం నుండి వెనక్కి మరలండి. దేవుడ్ని క్షమాపణ కోరుకోండి. దేవుడే మీ పొరపాట్లను క్షమించేవాడు. ఆయన ఎంతో దయామయుడు. హజ్‌ నియమాలు నెరవేర్చిన తరువాత మీరు పూర్వం మీ తాత ముత్తాతలను ఏవిధంగా జ్ఞాపకం చేసుకునేవారో అదేవిధంగా లేదా అంతకంటే మరింత అధికంగానే ఇప్పుడు దేవుడ్ని స్మరించండి.
కొందరు ప్రజలు దేవుడ్ని ప్రార్థిస్తూ “ ప్రభూ! మాకు (నీవు ప్రసాదించేవన్నీ) ప్రపంచంలోనే ప్రసాదించు” అంటారు. అలాంటివారికి (ప్రపంచంలోనే తప్ప) పరలోక (స్వర్గ)ంలో ఎలాంటి వాటా లభించదు. మరికొందరున్నారు. వారు “ప్రభూ! మాకు ఇహ లోకంలోనూ, పరలోకంలోనూ మంచిని ప్రసాదించు. మమ్మల్ని నరక యాతనల నుండి రక్షించు” అని వేడుకుంటారు. ఇలాంటివారికి వారి సంపాదనను బట్టి (ఉభయలోకా ల్లోనూ) తగిన వాటా (ప్రతిఫలం) లభిస్తుంది. దేవుడు త్వరలోనే (కర్మలను గురించి) లెక్క తీసుకుంటాడు. (199-202)
మీరు కొన్నాళ్ళే (అక్కడ) దైవనామ స్మరణలో గడపవలసి ఉంటుంది. ఎవరైనా రెండ్రోజుల్లోనే త్వరగా అక్కడ్నుండి వెళ్ళినా లేదా ఆలస్యంగా వెళ్ళినా తప్పు లేదు. ఏమైనా మీరక్కడ ఉన్నంతకాలం భయభక్తులతో ఉండాలి. దేవుని పట్ల భయభక్తులు కల్గివుండండి. చివరికి మీరంతా ఆయన సన్నిధికే చేరుకోవలసి వుంటుంది. (203)
కొందరు ఇహలోక జీవితాన్ని గురించి చెప్పేమాటలు నిన్నెంతో ఆకట్టుకుంటాయి. వారు తమ అంతరంగాల్లో వున్న భావాలు పరమ పవిత్రమైనవని తెలిపేందుకు మాటి మాటికి దేవుడ్ని సాక్షిగా తీసుకువస్తారు. కాని వారు సత్యానికి బద్ధవిరోధులు. (204)
అలాంటివారికి అధికారం లభించగానే ప్రపంచంలో కల్లోలాల వ్యాప్తికి, పంట పొలాల విధ్వంసానికి, మానవ వినాశానికే వారు సదా ప్రయత్నిస్తారు. దేవుడు కలహాలు, కల్లోలాలు, విధ్వంసం, వినాశాలను ఎంతమాత్రం సహించడు. దేవునికి భయపడండని అంటే (వారు పెట్రేగిపోతారు.) వారి అహంకారం వారిని మరింత పాపకూపంలోకి నెట్టి వేస్తుంది. అలాంటివారికి నరకమే తగిన శిక్షాస్థలం. అది పరమ చెడ్డస్థలం. (205,206)
మరికొందరున్నారు. వారు దేవుని ప్రసన్నత కోసం తమ ప్రాణాలను సైతం ధార పోస్తారు. అటువంటి దాసులను దేవుడు ఎంతో ప్రేమిస్తాడు, అనుగ్రహిస్తాడు. (207)
విశ్వసించిన ప్రజలారా! ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించండి. షైతాన్‌ అడుగుజాడల్లో నడవకండి. వాడు మీకు ఆగర్భ శత్రువు. స్పష్టమైన బోధనలు అందినప్పటికీ మీరు తిరిగి తప్పటడుగులు వేస్తే మటుకు, బాగా తెలుసుకోండి! దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వం తెలిసిన మహావివేకి. (208-209)
(ఎన్ని విధాల నచ్చిజెప్పినా ప్రజలు తమ నడవడికను మార్చుకోకపోతే ఇక దేని కొరకు ఎదురుచూస్తున్నట్లు?) దైవదూతలు వెంటరాగా మేఘచ్ఛాయల క్రింద దేవుడు దివినుండి దిగివచ్చి తమను గురించి అటోఇటో తేల్చిచెప్పే సమయం కోసం వారు ఎదురుచూస్తున్నారా? చివరికి సమస్త వ్యవహారాలు దేవుని వద్దకే చేరుతాయి. (210)
ముహమ్మద్‌! మేము ఇస్రాయిలీయులకు ఎన్ని స్పష్టమైన నిదర్శనాలు చూపామో వారినడుగు. దైవానుగ్రహం లభించిన తర్వాత దాన్ని (ఆచరించడానికి బదులు) దౌర్భా గ్యంగా మార్చుకున్న జాతిని ఎంత కఠినంగా శిక్షించాడో కూడా వారినే అడుగు. (211)
సత్యతిరస్కారులకు ఇహలోక జీవితం ఎంతో మనోహరంగా, ఆకర్షణీయంగా కనిపించేలా చేయబడింది. వారు విశ్వసించినవారిని హేళన చేస్తున్నారు. అయితే అలా హేళనచేసినవారి కంటే దైవభీతిపరులే ప్రళయదినాన ఉన్నత స్థానంలో ఉంటారు. ప్రపంచంలో దేవుడు తాను కోరినవారికి విస్తృతంగా సిరిసంపదలు ప్రసాదిస్తాడు. (212)
ప్రారంభంలో మానవులంతా ఒకే ధర్మాన్ని అనుసరిస్తూ ఒకే దారిన నడుస్తుండే వారు. (ఆతర్వాత వారిలో విభేదాలు వచ్చాయి.) తర్వాత దేవుడు వారి దగ్గరకు (సన్మార్గం అవలంబించేవారికి) శుభవార్తలు తెలిపే, (అపమార్గంలోనే పడివుండేవారిని) హెచ్చరించే ప్రవక్తలను పంపుతూ వచ్చాడు. సత్యం గురించి ప్రజలలో వచ్చిన విభేదాలను పరిష్క రించడానికి ఆయన ప్రవక్తలపై సత్యపూరిత గ్రంథాలను కూడా అవతరింపజేశాడు.
ఈ విభేదాలు సృష్టించినవారు సత్యజ్ఞానం ప్రసాదించబడినవారే. స్పష్టమైన హితోక్తులు లభించిన తరువాత కూడా వారు మూర్ఖత్వంతో సత్యాన్ని వదిలేసి విభిన్న పద్ధతులు సృష్టించుకున్నారు. ఏ సత్యం గురించి వారు విభేదాలు సృష్టించారో ఆ సత్యాన్ని పొందే మార్గం దేవుడు దయతో (ఇప్పుడీ) విశ్వాసులకు చూపాడు. దేవుడు తాను తలచుకున్న వారికి సన్మార్గం చూపుతాడు. (213)
విశ్వాసులారా! మీకు పూర్వం విశ్వాసులకు వచ్చిన (కష్టాల)న్నీ మీపై రాకముందే మీకు ఇట్టే స్వర్గప్రవేశం లభిస్తుందని భావిస్తున్నారా? ఆనాటి విశ్వాసులపై ఎన్నో కష్టాలు, కడగండ్లు విరుచుకుపడ్డాయి. వారు తీవ్రఆందోళన చెందారు. చివరికి అప్పటి దైవప్రవక్త, ఆయన సహచరులైన విశ్వాసులు (ఆ కష్టాలకు తట్టుకోలేక) “దైవసహాయం ఎప్పుడు వస్తుంది?” అని అరిచారు. అప్పుడు వారికి “ఇదిగో దైవసహాయం సమీపంలోనే ఉంది” (అని ధైర్యం చెప్పడం జరిగింది). (214)
వారు (దైవమార్గంలో) సంపద ఏ విధంగా ఖర్చుచేయాలని అడుగుతున్నారు. వారికి ఇలా చెప్పు: “మీరు ఖర్చుచేయ దలచుకున్నది మీ తల్లిదండ్రులు, బంధువులు, అనాథలు, అగత్యపరులు, బాటసారుల శ్రేయస్సు కోసం ఖర్చుచేయండి. ఎవరు ఏ సత్కార్యం చేసినా దాన్ని గురించి దేవునికి బాగా తెలుసు. (215)
మీరు (దైవమార్గంలో) విధిగా యుద్ధం చేయాలని ఆజ్ఞ అయింది. కాని అది మీకు రుచించడంలేదు. ఒక విషయం మీకు నచ్చక పోవచ్చు. కాని అందులోనే మీ శ్రేయస్సు ఉండవచ్చు. అలాగే ఒక విషయం మీకు నచ్చవచ్చు. కాని అందులోనే మీకు హాని ఉండవచ్చు. (మంచీచెడులు) దేవునికే బాగా తెలుసు, మీకు తెలియదు. (216)
ప్రజలు నిన్ను పవిత్ర మాసాలలో యుద్ధం చేయడం గురించి అడుగుతున్నారు. వారికిలా చెప్పు: “ఆ మాసాలలో యుద్ధం చేయడం ఘోరమైన విషయం. అయితే దైవమార్గంలో అవరోధాలు సృష్టించడం, దేవుడు పంపిన సందేశాన్ని నిరాకరించడం, దైవభక్తుల్ని ప్రతిష్ఠాలయంలో ప్రవేశించనీయకుండా నిరోధించడం, అక్కడ ఉండేవారిని బయటికి గెంటివేయడం- ఇవన్నీ దేవుని దృష్టిలో అంతకన్నా ఘోరమైన చర్యలు. హింసాపీడనలు హత్యా రక్తపాతాల కన్నా చాలా ఘోరమయినవి. వారికి సాధ్యపడితే మిమ్మల్ని మీ ధర్మం నుండి మరలించేవరకు మీతో పోరాడుతూనే ఉంటారు. అప్పుడు మీలో ఎవరైనా ఈ ధర్మాన్ని వదలి అవిశ్వాసిగా మారి, చివరికి అదే స్థితిలో చనిపోతే మాత్రం అతని ఇహపర కర్మలన్నీ వ్యర్థమైపోతాయి. ఇలాంటి ఉభయభ్రష్టులే నరక వాసులు. నరకంలోనే వారు ఎల్లకాలం పడివుంటారు.” (217)
దీనికి భిన్నంగా (సత్యాన్ని) విశ్వసించి, (దేవుని ప్రసన్నత కోసం) ఊరూ, వాడా వదలి వలసపోయి దైవమార్గంలో నిరంతరం పోరాటం సలిపేవారు మాత్రమే దైవా నుగ్రహాన్ని ఆశించగలరు. దేవుడు గొప్ప క్షమాశీలి, అపార దయామయుడు. (218)
వారు నిన్ను మద్యం, జూదాలను గురించి అడుగుతున్నారు. ఈ రెండిటిలోనూ ఎంతో నష్టముందని చెప్పు. వీటిలో ప్రజలకు కొన్ని ప్రయోజనాలున్నా, ఆ ప్రయోజనాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా దైవమార్గంలో ఏం ఖర్చు పెట్టాలని కూడా వారు నిన్నడుగుతున్నారు. తమ అవసరాలకు పోగా మిగిలింది ఖర్చుచేయాలని చెప్పు వారికి. మీరు ఇటు ప్రపంచం గురించి, అటు పరలోకం గురించి యోచిస్తారని దేవుడు ఈ విధంగా తన ఆజ్ఞలను మీకు స్పష్టంగా వివరిస్తున్నాడు. (219)
వారు నిన్ను అనాథబాలలను గురించి అడుగుతున్నారు. వారికిలా తెలియజేయి: “వారిని తీర్చిదిద్దగల ఏ పనైనా మంచిదే. వారితో మీరు కలసిమెలసి ఉండదలిస్తే తప్పు లేదు. వారు మీసహోదరులే. కీడుచేసే వారెవరో, మేలుచేసే వారెవరో దేవునికి తెలుసు. దేవుడు తలుచుకుంటే ఈ విషయంలో మీపట్ల కఠినంగా వ్యవహరించేవాడే. కాని ఆయన సర్వశక్తిమంతుడు కావడంతోపాటు ఎంతో వివేచనాపరుడు కూడా.” (220)
బహుదైవారాధకురాలైన స్త్రీలు (సత్యాన్ని) విశ్వసించనంత వరకు వారిని మీరు ఎట్టి పరిస్థితిలోనూ వివాహమాడకండి. బహుదైవారాధకురాలైన స్త్రీ మీకు ఎంత నచ్చినా, ఆమెకంటే విశ్వసించిన బానిసమహిళే ఎంతో మేలు. అలాగే బహుదైవారాధకులైన పురుషులు (సత్యాన్ని) విశ్వసించనంతవరకు వారితో మీ స్త్రీల వివాహం చేయకండి. బహుదైవారాధకుడైన పురుషుడు మీకు ఎంతనచ్చినా, అతనికంటే విశ్వసించిన బానిస పురుషుడే ఎంతో శ్రేష్ఠుడు. బహుదైవారాధకులు మిమ్మల్ని నరకాగ్ని వైపు పిలుస్తారు. దేవుడు మిమ్మల్ని దయతో స్వర్గం వైపు, క్షమాభిక్ష వైపు పిలుస్తున్నాడు. ప్రజలు దారికి వచ్చేందుకు దేవుడు తన ఆజ్ఞల్ని ఇలా విడమరచి తెలియజేస్తున్నాడు. (221)
వారు నిన్ను రుతుస్రావం గురించి అడుగుతున్నారు. వారికిలా చెప్పు: “అది అపరి శుద్ధావస్థ. ఆ స్థితిలో మీరు స్త్రీల (పడకల)కు దూరంగా ఉండండి. వారు పరిశుద్ధులు కానంతవరకు వారిదగ్గరకు వెళ్ళకండి. వారు పరిశుద్ధులైన తరువాత దేవుడు మిమ్మల్ని ఆదేశించిన రీతిలో వారి దగ్గరకు యథాప్రకారం వెళ్ళవచ్చు. దేవుడు తన వైపు మరలే వారిని, పవిత్రంగా పరిశుభ్రంగా ఉండేవారిని మాత్రమే ప్రేమిస్తాడు. (222)
మీ భార్యలు మీకు వ్యవసాయ క్షేత్రాల్లాంటివారు. మీరు మీ వ్యవసాయ క్షేత్రా లకు మీకిష్టమైన రీతిలో వెళ్ళవచ్చు. కాకపోతే మీరు మీ భవిష్యత్‌ (పరలోకం) గురించి జాగ్రత్త వహించండి. దేవుని పట్ల సదా భయభక్తులు కలిగిఉండాలి. ఒకరోజు మీరంతా ఆయన సన్నిధికే పోవలసిఉంది. ప్రవక్తా! సత్యస్వీకారులకు శుభవార్త విన్పించు. (223)
మంచికి, దైవభీతికి, ప్రజల మధ్య రాజీ కుదర్చడానికి సంబంధించిన పనులు మానుకునే విషయంలో మీరు ప్రమాణం చేయవలసివస్తే, అలాంటి పనులను గురించి దేవుని పేరుతో ప్రమాణం చేయకండి. దేవుడు అన్నీ వింటున్నాడు. ఆయనకు సమస్త విషయాలు తెలుసు. మీరు అసంకల్పికంగా, ఆషామాషిగా చేసే అర్థంపర్థంలేని ప్రమాణాలను గురించి దేవుడు మిమ్మల్ని ప్రశ్నించడు. మీరు మనస్ఫూర్తిగా కావాలని చేసే ప్రమాణాలను గురించే ఆయన మిమ్మల్ని నిలదీస్తాడు. (జరిగిందేదో జరిగింది) దేవుడు ఎంతో క్షమాశీలి, అపార కృపాశీలుడు. (224-225)
తమ భార్యలను కలుసుకోమని ప్రమాణం చేసేవారికి నాలుగు నెలల గడువు ఉంటుంది. ఒకవేళ వారు (ఈ గడువులోగా) దాన్ని ఉపసంహరించుకుంటే దేవుడు క్షమించేవాడు, కరుణించేవాడు (అని తెలుసుకోండి). దానికి బదులు వారు విడాకులు ఇవ్వడానికే నిర్ణయించుకుంటే గుర్తుంచుకోండి; దేవుడు అన్నీ వింటున్నాడు, ఆయనకు సమస్త విషయాలు తెలుసు. (226-227)
విడాకులు పొందిన స్త్రీలు తమంతట తాము మూడు రుతువుల దాకా వేచి వుండాలి. దేవుడు వారి గర్భాలలో సృజించిన దాన్ని (పైకి చెప్పకుండా) దాచడం వారికి భావ్యంకాదు. అల్లాహ్‌ను, అంతిమదినాన్ని విశ్వసించేవారైతే వారీ విషయాన్ని బహిర్గతం చేయాలి. వారి భర్తలు పూర్వసంబంధాలను పునరుద్ధరించుకోదలిస్తే ఈ గడువులోగా తమ భార్యల్ని తిరిగి దాంపత్యంలోకి తీసుకునేందుకు వారికి పూర్తి హక్కుంది.
సాధారణంగా స్త్రీలపై పురుషులకు ఎలాంటి హక్కులున్నాయో న్యాయపరంగా పురుషులపై స్త్రీలకు కూడా అలాంటి హక్కులే ఉన్నాయి. కాకపోతే పురుషులకు స్త్రీలపై ఒక మెట్టు ఆధిక్యత ఉంది. దేవుడు శక్తిమంతుడు, వివేచనాపరుడు. (228)
విడాకులు ఇస్తున్నానని రెండుసార్లు మాత్రమే చెప్పాలి. ఆ తరువాత (నిర్ణయం మార్చుకుంటే) సముచిత రీతిలో (భార్యను) వివాహబంధంలో కొనసాగించాలి; లేదా (అంటే నిర్ణయం మార్చుకోకపోతే విడాకులిస్తున్నానని మూడవసారి కూడా చెప్పేసి ఆమెను) ఉత్తమ రీతిలో వదిలేయాలి. అప్పుడు మీరామెకు (మహర్‌ లేదా ఇతర కానుకల రూపంలో) ఇచ్చిన వస్తువులలో కొంతయినా సరే, వాపసు తీసుకోవడం మీకు ధర్మసమ్మతం కాదు. ఒకవేళ దంపతులు దైవనిర్ణీత పరిమితులకు కట్టుబడి ఉండ లేమని అనుకుంటే, అది వేరే విషయం.
దంపతులిద్దరు దైవనిర్ణీత పరిమితులకు కట్టుబడి ఉండలేమని భయపడినప్పుడు స్త్రీ తన భర్తకు ఏమైనా ఇచ్చేసి అతని నుండి వేరుపడ దలచుకుంటే వారిద్దరి మధ్య ఏదైనా ఒప్పందం కుదరడంలో తప్పు లేదు. ఇవి దేవుడు నిర్ణయించిన పరిమితులు. వాటిని అతిక్రమించకండి. దైవపరిమితుల్ని అతిక్రమించేవారే దుర్మార్గులు. (229)
(మూడవసారి కూడా) విడాకులిస్తే, ఇక ఆ స్త్రీని దాంపత్యబంధంలోకి తీసుకోవడం అతనికి ధర్మం కాదు, ఆమె మరోవ్యక్తిని వివాహమాడి అతనామెకు విడాకులిస్తే తప్ప. ఒకవేళ మొదటిభర్త, ఈస్త్రీ, ఇద్దరూ తాము దైవనిర్ణీత పరిమితులకు కట్టుబడి ఉండగల మనుకుంటే (ఇలా) వారు తిరిగి ఏకమవడంలో తప్పు లేదు. ఇవి దేవుడు నిర్ణయించిన పరిమితులు. వీటిని ఆయన వివేచనాపరుల కోసం వివరిస్తున్నాడు. (230)
మీరు స్త్రీలకు (రెండుసార్లు) విడాకులిచ్చిన సందర్భంలో వారి గడువు పూర్తికా వస్తున్నప్పుడు వారిని సక్రమంగా (మీ ఇంట) ఉండనివ్వండి. లేదా (మూడవసారి కూడా విడాకులిస్తున్నట్లు ప్రకటించి) సహృదయంతో సాగనంపండి. అంతేగాని, చీటికి మాటికి వేదిస్తూ అన్యాయం తలపెట్టే ఉద్దేశ్యంతో వారిని ఆపి ఉంచకండి. ఇలా ప్రవర్తించేవాడు నిజానికి తనకు తానే అన్యాయం చేసుకుంటున్నాడు.
దేవుని ఆజ్ఞల్ని నవ్వులాటగా చేసుకోకండి. ఆయన మీకు ప్రసాదించిన మహా భాగ్యాలను ఓసారి గుర్తుకు తెచ్చుకోండి. మీ శ్రేయస్సు కోసం అవతరింపజేసిన దివ్య గ్రంథాన్ని, (అందులోని) వివేకవంతమైన విషయాలను గౌరవించడం నేర్చుకోవలసిందిగా ఆయన మీకు ఉపదేశిస్తున్నాడు. (ప్రతి విషయంలోనూ) దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఆయన సర్వం ఎరిగినవాడని తెలుసుకోండి. (231)
మీరు మీ స్త్రీలకు విడాకులు ఇచ్చివేయడం, వారి గడువు తీరిపోవడం జరిగాక, వారు తమ పూర్వపు భర్తలను లేదా ఇతర పురుషులను వివాహమాడదలచిన పక్షంలో, అందుకు వారుభయుల మధ్య ధర్మయుక్తంగా పరస్పరం అంగీకారం కూడా కుదిరితే, మీరు వారి వివాహాన్ని అడ్డుకోకండి, దైవాన్ని, అంతిమదినాన్ని విశ్వసించేవారికి ఈ ఆదేశం ద్వారా హితోపదేశం చేయబడుతోంది. ఇది మీకోసం ఎంతో సంస్కారవంతమైన పవిత్ర విషయం. అన్ని విషయాలు దేవునికే తెలుసు, మీకు తెలియవు. (232)
తల్లులు తమ బిడ్డలకు గడువుకాలం పూర్తయ్యేవరకు పాలు పట్టదలచుకుంటే పూర్తిగా రెండు సంవత్సరాలు పాలుపట్టాలి. అప్పుడు బిడ్డతండ్రి ఆమెకు తగిన రీతిలో తిండి, బట్ట సమకూర్చవలసి ఉంటుంది. అయితే వారుభయుల్లో ఏ ఒక్కరిపైనా శక్తికి మించిన భారం మోపకూడదు. బిడ్డను కన్నందుకు ఇటు తల్లినీ కష్టపెట్ట కూడదు; బిడ్డజన్మకు కారకుడయినందుకు అటు తండ్రినీ వేధించకూడదు.
బిడ్డకు పాలుపట్టే తల్లి పట్ల బిడ్డతండ్రికి ఎంత బాధ్యత ఉందో అతని వారసుల క్కూడా అంతే బాధ్యత ఉంది. ఒకవేళ తల్లిదండ్రులు ఒకర్నొకరు సంప్రదించుకొని పరస్పరామోదంతో బిడ్డకు పాలు మాన్పించదలచుకుంటే తప్పులేదు. అలాగే మీరు మీ పిల్లలకు వేరే స్త్రీలచేత పాలు పట్టించాలనుకున్నా తప్పులేదు. కాకపోతే పాలుపట్టేవారికి తగిన ప్రతిఫలం ముట్టజెప్పాలి. మీరు దేవుని పట్ల భయభక్తులతో వ్యవహరించాలి. గుర్తుంచుకోండి! మీరు చేస్తున్న పనులన్నిటినీ ఆయన గమనిస్తూనే ఉన్నాడు. (233)
మీలో ఎవరైనా చనిపోయి, వారి భార్యలు బ్రతికివుంటే అలాంటి స్త్రీలు నాలుగు నెలల పదిరోజులు తమను తాము నిగ్రహించుకోవాలి. ఈ విధంగా గడువుకాలం ముగిసిన తర్వాత వారు తమకు నచ్చినపని (పునర్వివాహం) తగినరీతిలో చేసుకోవచ్చు. దానికి మీపై ఎలాంటి బాధ్యతలేదు. మీరు చేసే పనులన్నీ దేవునికి తెలుసు. (234)
గడువుకాలంలో మీరు ఆ వితంతు స్త్రీని వివాహమాడ దలచినట్లు సూచన ప్రాయంగా తెలియజేసినా లేదా మీ ఉద్దేశ్యాన్ని మీ మనసులోనే దాచివుంచినా సరే ఎలాంటి తప్పులేదు. మీరీ విషయాన్ని ఆమె దగ్గర ప్రస్తావిస్తారని దేవునికి తెలుసు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి- మీరు చాటుమాటుగా ఎలాంటి ఒప్పందం చేసుకోకండి. ఏది చేసినా ధర్మయుక్తంగానే చేయాలి. గడువుకాలం తీరనంతవరకు మీరు పెళ్ళి విషయంలో గట్టినిర్ణయం తీసుకోకూడదు. మీ హృదయాల్లో మెదిలే ప్రతివిషయం దేవునికి తెలుసు. కనుక ఆయనకు భయపడండి. అదీగాక దేవుడు (మీ చిన్న చిన్న పొరపాట్లను) మన్నించేవాడని, సహించేవాడని కూడా తెలుసుకోండి. (235)
మీరు మీ భార్యలను కలుసుకోవడానికి ముందు వారి మహర్‌ నిర్ణయంకాని పక్షంలో వారికి విడాకులిస్తే తప్పులేదు. అలాంటి స్థితిలో వారికి ఎంతో కొంత (సొమ్ము) తప్పనిసరిగా ముట్టజెప్పాలి. ధనికుడైనా, పేదవాడైనా తమతమ శక్తి మేరకు తగిన రీతిలో దీన్ని అందజేయాలి. ఇది సత్పురుషులు నెరవేర్చవలసిన విధి. (236)
మీరు మీభార్యలను కలుసుకోడానికి ముందే వారికి విడాకులు ఇవ్వవలసివస్తే, నిర్ణీత మహర్‌లో సగం సొమ్ము చెల్లించవలసి ఉంటుంది. అయితే స్త్రీ మృదువైఖరి అవలంబించి (మహర్‌ అసలు తీసుకోకపోయి)తే, లేదా వివాహబంధం తన అధీనంలో వున్న పురుషుడు మృదువైఖరి అవలంబించి (మహర్‌ పూర్తిగా ఇచ్చివేసి)తే అది వేరే విషయం. మీరే (అంటే పురుషులే) సహృదయంతో మీ హక్కును వదలుకుంటే మరీ మంచిది. ఇది దైవభీతికి చాలా దగ్గరి మార్గం. పరస్పరం ఉదార స్వభావంతో మసలు కోవడం మరచిపోకండి. మీరు చేసే పనులన్నీ దేవునికి బాగా తెలుసు. (237)
మీరు మీ ప్రార్థన (నమాజు)లన్నిటినీ, ముఖ్యంగా మధ్యస్థ ప్రార్థనను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ జాగ్రత్తగా కాపాడుకోండి. దేవుని సన్నిధిలో వినయ విధేయతలతో నిలబడండి. మీరొకవేళ ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే నడుస్తూవున్నా, వాహనమెక్కి వున్నా ఎలా సాధ్యమైతే అలా ప్రార్థన చేయండి. తరువాత మీ భయాందోళనలు తొలగి మనసు కుదుటపడితే దేవుడు నేర్పిన పద్ధతి ప్రకారం ఆయన్ని ధ్యానించండి. నిజానికి ఈ పద్ధతి మీరు ఇదివరకు ఎన్నడూ ఎరగరు. (238-239)
మీలో ఎవరికైనా మరణకాలం ఆసన్నమైనప్పుడు వారి భార్యలు జీవించివుంటే, ఒక ఏడాదిపాటు వారి (పోషణ)ఖర్చులు భరించాలని, ఇంటినుండి వెడలగొట్టరాదని వారు (వారసులకు) విల్లు రాసిపోవాలి. ఆ స్త్రీలు తమంతట తాము ఇంటి నుండి వెళ్ళి పోయి తమకు నచ్చినపని (పునర్వివాహం) ధర్మసమ్మతంగా చేసుకోదలిస్తే దానికి మీపై ఎలాంటి బాధ్యత ఉండదు. దేవుడు సర్వశక్తిమంతుడు, ఎంతో వివేచనాపరుడు. (240)
విడాకులు పొందిన స్త్రీలక్కూడా సముచిత రీతిలో ఎంతోకొంత ఇచ్చిపంపాలి. ఇది దైవభీతిపరులు నెరవేర్చవలసిన విధ్యుక్తధర్మం. మీరు విషయాన్ని అర్థం చేసుకుంటారని దేవుడు ఇలా తన ఆజ్ఞలు మీకు విడమరచి బోధిస్తున్నాడు. (241-242)
ముహమ్మద్‌! కేవలం చావుకు భయపడి తమ ఇండ్లనుండి పారిపోయిన వేలాది మంది జనాన్ని నీవు చూడలేదా? దేవుడు వారిని చావమని ఆదేశించాడు; ఆ తరువాత వారిని మళ్ళీ బ్రతికించాడు కూడా. నిస్సందేహంగా దేవుడు మానవుల పట్ల ఎంతో దయామయుడు. కాని చాలామంది ఆయనకు కృతజ్ఞత చూపరు. (243)
విశ్వాసులారా! దైవమార్గంలో పోరాడండి. దేవుడు ప్రతి విషయం వింటున్నాడని, సమస్తం ఎరిగినవాడని బాగా తెలుసుకోండి. (244)
మీలో ఎవరయినా దేవునికి శ్రేష్ఠమైన రుణదానం అందజేసేవారు ఉన్నారా? ప్రతిఫలంగా ఆయన దాన్ని అనేక రెట్లు పెంచి తిరిగి మీకు అందజేస్తాడు. దేవుడే మీ ఉపాధిని తగ్గించేవాడు. దాన్ని వృద్ధి చేసేవాడు కూడా ఆయనే. చివరికి ఆయన సన్నిధికే మీరంతా మరలి పోవలసి ఉంది. (245)
మూసా (నిర్యాణం) తరువాత ఇస్రాయీల్‌ సంతతి నాయకులకు ఎదురయిన పరిస్థితుల్ని గురించి నీకు తెలుసా? వారు (అప్పటి) తమ ప్రవక్త దగ్గరకెళ్ళి “మేము దైవమార్గంలో యుద్ధం చేయడానికి వీలుగా మాకు సారథ్యం వహించేందుకు ఒక రాజును నియమించు” అని విన్నవించుకున్నారు.
దానికి దైవప్రవక్త “(సరే, అలాగే నియమిస్తా.) కాని తీరా మిమ్మల్ని యుద్ధం చేయమని ఆదేశిస్తే మీరు నిరాకరిస్తారేమో!” అన్నాడు.
“అదెలా! మమ్మల్ని మా ఇండ్లనుండి వెళ్ళగొట్టారు. మా పిల్లాజెల్లలను మాకు దక్కకుండా చేశారు. అలాంటప్పుడు మేము దైవమార్గంలో యుద్ధం ఎందుకు చేయం?” అన్నారు వారు. కాని తీరా యుద్ధం చేయమని ఆజ్ఞ కాగానే వారిలో కొందరు తప్ప అందరూ వెన్నుజూపి పారిపోయారు. దుర్మార్గుల సంగతి దేవునికి బాగాతెలుసు. (246)
(సరే,) దైవప్రవక్త (వారి కోరికను మన్నించి) “దేవుడు మీకు తాలూత్‌ని రాజుగా నియమించాడు” అని తెలియజేశాడు. అది విని వారు (ధనగర్వంతో విర్రవీగుతూ) “రాచరికం చేయడానికి మేమే ఎక్కువ అర్హులం, హక్కుదారులం గాని, అతనెలా అవుతాడు? అతను ఏమంత స్థితిపరుడు కూడా కాదే?” అన్నారు.
అప్పుడు దైవప్రవక్త ఇలా అన్నాడు: “దేవుడు మీకు బదులు అతడ్నే (ఈ పనికోసం) ఎంచుకున్నాడు. ఆయన అతనికి (కార్యసాధనకు కావలసిన) బుద్ధిబలాన్ని, కండబలాన్ని కూడా పుష్కలంగా ప్రసాదించాడు. దేవుడు తాను తలచుకున్న వారికి రాజ్యాధికారం ప్రసాదిస్తాడు. ఆయన విశాలదృష్టి కలవాడు, సర్వం తెలిసినవాడు.” (247)
దైవప్రవక్త (మరింత వివరంగా తెలియజేస్తూ) ఇలా అన్నాడు: “దేవుడు మీపై అతడ్ని రాజుగా నియమించడానికి నిదర్శనంగా (లోగడ మీరు కోల్పోయిన పవిత్ర) పేటిక మీకు తిరిగి లభిస్తుంది. అందులో మీ ప్రభువు వైపున మీకు శాంతీ సంతృప్తులు కలిగించే సామగ్రిఉంది. అందులో మూసా, హారూన్‌ కుటుంబీకులు వదలివెళ్ళిన పవిత్ర అవశేషాలు కూడా ఉన్నాయి. ఆ పేటికను ప్రస్తుతం దైవదూతలు కాపాడుతున్నారు. మీరు నిజంగా విశ్వసించినవారైతే (దీన్ని నమ్మండి) మీకిది గొప్ప నిదర్శనం.” (248)
ఆ తరువాత తాలూత్‌ సైన్యం తీసుకొని యుద్ధానికి బయలుదేరుతూ వారితో ఇలా అన్నాడు: “దేవుడు (దారిలో) ఒక నది ద్వారా మిమ్మల్ని పరీక్షించబోతున్నాడు. ఆ నదిలో నీరు త్రాగేవాడు నావాడు కాదు; త్రాగనివాడే నావాడు. అయితే (ప్రాణం కాపాడుకోవడానికి) దోసిలితో కొంచెం నీళ్ళు త్రాగితే పర్వాలేదు.” కాని (తీరా నది దగ్గరకు చేరుకోగానే) కొందరు తప్ప అందరూ (కడుపారా) త్రాగారు.
ఆ తర్వాత తాలూత్‌, విశ్వాసులైన అతని సహచరులు నది దాటి ఆవలకు చేరు కున్నప్పుడు వారిలో చాలామంది “ఈరోజు జాలూత్‌ని, అతని సైన్యాన్ని ఎదుర్కొనే శక్తి మాలో లేదు” అన్నారు. అయితే ఒకరోజు దేవునికి ముఖం చూపించవలసి ఉందని నమ్ముతున్నవారు (శత్రువులకు భయపడకుండా) “గతంలో కొద్దిసంఖ్యలో వున్న సైన్యం కూడా దైవానుగ్రహంతో అత్యధిక సంఖ్యలో వున్న (శత్రు)సైన్యాన్ని మట్టి కరిపించింది. దేవుడు స్థిరంగానిలబడి ధైర్యంగా పోరాడేవారికే అండగాఉంటాడు” అనిఅన్నారు. (249)
వారు యుద్ధమైదానంలో జాలూత్‌కు, అతని సైనికులకు ఎదురుగా వచ్చినప్పుడు “ప్రభూ! మాకు సహనం, స్థయిర్యం ప్రసాదించు. (యుద్ధంలో) మా కాళ్ళకు నిలకడ చేకూర్చి అవిశ్వాసులపై మాకు విజయం ప్రసాదించు” అని వేడుకున్నారు. (250)
అప్పుడు వారు దేవుని అనుగ్రహంతో జాలూత్‌ సైన్యాన్ని చిత్తుగా ఓడించారు. జాలూత్‌ని దావూద్‌ వధించాడు. (ఆ తరువాత) దేవుడు దావూద్‌కు రాజ్యాధికారం, బుద్ధి కౌశల్యం ప్రసాదించాడు. ఇంకా కావలసినవన్నీ అతనికి నేర్పాడు. ఈవిధంగా దేవుడు కొందరి ద్వారా కొందరిని నిర్మూలించకపోతే ప్రపంచం అరాచకం, అల్లకల్లోలాలతో నిండి పోతుంది. దేవుడు ప్రపంచ మానవుల పట్ల ఎంతో దయామయుడు. (అందుకే ఆయన ఈ విధంగా అశాంతి, అరాచకాలు నిర్మూలించే ఏర్పాట్లు చేస్తుంటాడు.) . (251)
ఇవన్నీ దేవుని సూక్తులు. వీటిని మేము నీకు యథాతథాంగా వినిపిస్తున్నాము. నిస్సందేహంగా నీవు మా ప్రవక్తలలో ఒక ప్రవక్తవు. (252)
ఈ దైవప్రవక్తలలో మేము కొందరికి ఉన్నతస్థానాలు ప్రసాదించాం. వారిలో కొందరితో దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడాడు. మరికొందరికి ఇతర విషయాల్లో ఔన్నత్యం ఇచ్చి ఆదరించాడు. అలాగే మర్యంకుమారుడయిన ఈసాకు కూడా మేము స్పష్టమైన మహిమలు ప్రసాదించాము. పరిశుద్ధాత్మను పంపి అతనికి సహాయం చేశాము.
దేవుడు తలచుకుంటే స్పష్టమైన సూచనలు, నిదర్శనాలను చూసిన ప్రజలు ప్రవక్తల(నిర్యాణం) తర్వాత పరస్పరం కలహించుకునేవారు కాదు. (అయితే మానవులు తమ స్వేచ్ఛాస్వాతంత్య్రాలతో విభేదాలకు లోనుకాకుండా వారిని బలవంతంగా ఆపడం దేవుని అభిమతం కాదు. అందువల్ల) వారు పరస్పరం విభేదాలకు గురైపోయారు. కొందరు సత్యాన్ని విశ్వసించారు; మరికొందరు తిరస్కరించారు. దేవుడు తలిస్తే వారు కలహించుకునేవారు కాదు. కాని దేవుడు తాను తలచుకున్నది చేసితీరుతాడు. (253)
విశ్వాసులారా! ఎలాంటి క్రయ విక్రయాలు జరగని, స్నేహసహకారాలు ఉపయోగ పడని, ఎవరి సిఫారసు కూడా చెల్లని (పరలోక తీర్పు) దినం రాకముందే మేము మీకు ప్రసాదించిన సంపద నుండి (కొంత దైవమార్గంలో కూడా) ఖర్చుపెట్టండి. (మా మాటలు నమ్మని) సత్యతిరస్కారులే పరమ దుర్మార్గులు. (254)
(అసలైన ఆరాధ్యుడు) అల్లాహ్‌యే. ఆయన తప్ప మరో దేవుడు లేడు. ఆయన నిత్యజీవుడు; ఎన్నటికీ నిద్రించనివాడు; కునుకుపాట్లు కూడా పడనివాడు. భూమ్యాకాశా లలో వున్న సమస్తం ఆయనదే. ఎవరి విషయంలోనైనా సరే, ఆయన అనుమతి లేకుండా ఆయన సన్నిధిలో ఎవరు సిఫారసు చేయగల్గుతారు? వారి ముందున్న దేమిటో, వారికి గోచరించకుండా రహస్యంగా ఉన్నదేమిటో అంతా ఆయనకు తెలుసు. ఆయన తలచుకుంటే తప్ప ఆయనకున్న జ్ఞానసంపదలోని ఏ విషయం కూడా ఎవరికీ తెలియదు. ఆయన రాజ్యాధికారం భూమ్యాకాశాలను పరివేష్ఠించి ఉంది. వాటి రక్షణ ఆయనకు ఏ మాత్రం కష్టమైన పనికాదు. ఆయన సర్వాధికారి, సర్వోన్నతుడు. (255)
ధర్మస్వీకరణలో ఎలాంటి బలవంతం, బలాత్కారాలు లేవు. సత్యం అసత్యం నుండి స్పష్టంగా వేరుచేయబడింది. కనుక ఇకనుండి మిథ్యాదైవాలను నిరాకరించి అల్లాహ్‌ను విశ్వసించినవాడు ఎన్నటికీ ఏమాత్రం చెక్కుచెదరని దృఢమైన ఆశ్రయం పొందినట్లే. (ఆ) దేవుడు సర్వం వింటాడు, సమస్తం తెలిసినవాడు. (256)
విశ్వసించినవారికి దేవుడే సహాయకుడు, శ్రేయోభిలాషి. ఆయన వారిని చీకటి నుండి తీసి వెలుగులోకి ప్రవేశపెడ్తాడు. సత్యాన్ని తిరస్కరించేవారికి పిశాచశక్తులే నేస్తాలు. వారిని ఈ పిశాచ శక్తులు వెలుగు నుండి తీసి చీకటిలోకి తీసికెళ్తాయి. వారే నరక వాసులు. నరకంలోనే వారు ఎల్లకాలం పడివుంటారు. (257)
ఇబ్రాహీంతో అతని ప్రభువు విషయంలో వాదనకు దిగిన వ్యక్తి గురించి నీవు ఆలోచించావా? దేవుడు అతనికి రాజ్యాధికారం ప్రసాదించాడు. అంచేత అతను (అధి కారగర్వంతో విర్రవీగుతూ దేవుని విషయంలో వాదనకు దిగాడు.) “ఎవరి అధీనంలో జీవన్మరణాలున్నాయో ఆయనే నా ప్రభువు” అని ఇబ్రాహీం అన్నప్పుడు, “చావు బ్రతుకులు నా అధీనంలో కూడా ఉన్నాయ”ని అన్నాడతను. “అయితే దేవుడు సూర్యుడ్ని తూర్పునుండి ఉదయింపజేస్తున్నాడు కదా, నీవు అతడ్ని పడమర నుండి ఉదయింప జెయ్యి చూద్దాం” అని అడిగాడు ఇబ్రాహీం. దానికి ఆ తిరస్కారి సమాధానం ఇవ్వలేక తెల్లమొహం వేశాడు. దేవుడు దుర్మార్గులకు ఎన్నటికీ సన్మార్గం చూపడు. (258)
సరే, ఒక వ్యక్తి ఉదంతం గురించి ఆలోచించావా? అతను ఒక గ్రామం మీదుగా ప్రయాణం చేయసాగాడు. ఆ గ్రామం ఇండ్ల కప్పులు కూలిపోయి సర్వనాశనమైఉంది. అతను (సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ) “చచ్చిపోయిన ఈ ఊరిజనాన్ని దేవుడు మళ్ళీ ఎలా బ్రతికిస్తాడో!” అనుకున్నాడు (తనలోతాను). అప్పుడు దేవుడు (వెంటనే) అతని ప్రాణం తీశాడు. ఆ విధంగా అతను (నిర్జీవస్థితిలో) వందేళ్ళపాటు పడివున్నాడు.
ఆ తరువాత దేవుడు అతనికి మళ్ళీ ప్రాణం పోసి లేపాడు. అప్పుడతనితో “నీవీ స్థితిలో ఎంతకాలం ఉన్నావో చెప్పగలవా?”అని అడిగాడు. దానికా వ్యక్తి “ఒక రోజో లేక అంతకంటే తక్కువ కాలమో ఉన్నాననుకుంటాను” అని అన్నాడు.
అప్పుడు దేవుడు ఇలా చెప్పాడు:“కాదు, నీవు వందేళ్ళు (ఇలా) ఉన్నావు. సరే, నీవు వెంట తెచ్చుకున్న అన్నపానీయాల వైపు చూడు, (ఇన్నేళ్ళు గడచినా) అవి ఏమాత్రం చెడి పోలేదు. నీ గాడిద వైపు కూడా ఓసారి చూడు (దాని ఎముకలు సయితం ఎలా జీర్ణమయి పోయాయో). మేము నీ ఉదంతం ద్వారా ప్రజలకు గుణపాఠం గరపడానికే ఇలా చేశాము. ఈ ఎముకలగూడు సరిచేసి దానిపై తిరిగి మాంసం సృష్టించి ఎలా లేపుతామో చూడు.” ఈవిధంగా అతను యదార్థం కళ్ళారా చూసి “దేవుడు ప్రతిపనీ చేయగల సమర్థుడు, సర్వశక్తిమంతుడనీ నాకు తెలుసు” అన్నాడు. (259)
మరో సంఘటన. అప్పుడు ఇబ్రాహీం“ప్రభూ! నీవు మృతుల్ని ఎలా బ్రతికిస్తావో ఓసారి నాకు చూపు” అన్నాడు. దానికి దేవుడు“ నీకు (మామీద) నమ్మకం లేదా?” అని అడిగాడు. “ఎందుకు లేదూ, ఉంది. కాని నా మనోతృప్తి కోసం అడుగుతున్నాను” అన్నాడు ఇబ్రాహీం. “అయితే నాలుగు పక్షులు తీసుకో. వాటిని (పోషించి) మచ్చిక చేసుకో. తర్వాత (వాటిని కోసి) వాటిభాగాలు ఒక్కోదాన్ని ఒక్కో కొండపై ఉంచి వాటిని పిలువు. అవి ఎగిరి నీ దగ్గరకు వచ్చేస్తాయి. (అప్పుడు) దేవుడు సర్వశక్తిమంతుడు, అత్యంత వివేచనాపరుడన్న విషయం బాగా గుర్తుంచుకో” అన్నాడు దేవుడు. (260)
దైవమార్గంలో సంపద ఖర్చుచేసేవారి (ఖర్చు) పోలిక, ఒక విత్తనం నాటగా అది ఏడు వెన్నులు ఈని ప్రతి వెన్నులో వందేసి గింజలున్నట్లు ఉంటుంది. అదే విధంగా దేవుడు తాను తలచుకున్న వారి కర్మఫలాన్ని అనేక రెట్లు పెంచుతాడు. దేవుడు ఎంతో ఉదార స్వభావుడు, సర్వం తెలిసినవాడు. (261)
దైవమార్గంలో ధనాన్ని ఖర్చుచేయడంతో పాటు, చేసిన మేలు గుర్తుచేసి (దాన గ్రహీత) మనస్సు నొప్పించనివారి కోసం వారి ప్రతిఫలం వారి ప్రభువు దగ్గర ఉంది. వారికి ఎలాంటి భయంగాని, దుఃఖంగాని ఉండదు. దానంచేసి (దాన గ్రహీత) మనస్సు నొప్పించే పని కన్నా మృదువుగా మాట్లాడటం, క్షమించడం అనేవి శ్రేష్ఠమైన పనులు. దేవుడు నిరపేక్షాపరుడు, విశాలహృదయుడు. (262-263)
(కనుక) విశ్వాసులారా! లోకులమెప్పు కోసం ప్రదర్శనా బుద్ధితో దానధర్మాలు చేసే వాడిలా, మీరు మీ దానధర్మాలను ఎత్తిపొడుపు మాటలద్వారా, (గ్రహీత) మనస్సు నొప్పించి వృధా చేసుకోకండి. అతనికి దేవునిమీద, పరలోకమ్మీద నమ్మకం లేదు. అలాంటి వ్యకి ((చేసే దానం) భారీవర్షం కురవగానే పైనున్న పల్చటి మట్టిపొర కాస్తా తుడిచి పెట్టుకుపోయి నున్నగా మిగిలిపోయే రాతి (ప్రదేశం)తో సమానం. అలాంటి వారు సత్కార్యాలు చేసి ఎలాంటి పుణ్యఫలం పొందలేరు. సత్యతిరస్కారులకు దేవుడు ఎన్నటికీ సన్మార్గం చూపడు. (264)
కేవలం దైవప్రసన్నత కోసం చిత్తశుద్ధితో తమ సంపదను ఖర్చు చేసే వారు మెరక ప్రాంతంలో ఉండే తోట లాంటివారు. ఆతోట వర్షాలు బాగా ఉంటే రెండింతలు ఫలసాయాన్నిస్తుంది. అంతగా వర్షాలు లేకుండా సన్నటి జల్లులు పడినా దానికి సరి పోతుంది. మీరు చేసే పనులన్నీ దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. (265)
మీలో ఎవరికైనా కాలువలు ప్రవహించే ఒక పండ్లతోట ఉందనుకోండి. తోటలో అతనికోసం రకరకాల పండ్లు ఫలాలు పుష్కలంగా పండి సిద్ధంగా ఉంటాయి. అప్పుడ తనికి వృద్ధాప్యం వస్తుంది. అయితే అతని పిల్లలు ఇంకా పిన్నవయస్సులోనే ఉంటారు. అలాంటి స్థితిలో ఓరోజు హఠాత్తుగా తీవ్రమైన వడగాల్పులకు తోట మొత్తం మాడి మసయిపోతుంది. ఇలా సంభవించడాన్ని అతను ఇష్టపడతాడా? మీరు (సత్యాన్ని) అర్థం చేసుకోవడానికి దేవుడు ఇలా తన సూక్తుల్ని మీ ముందు వివరిస్తున్నాడు. (266)
(కాబట్టి) విశ్వాసులారా! మీరు సంపాదించిన దానిలోనూ, మేము నేలనుండి మీ కోసం ఉత్పత్తిచేసిన దానిలోనూ శ్రేష్ఠమైనదాన్ని దైమార్గంలో ఖర్చుచేయండి. దైవ మార్గంలో ఖర్చు చేయడానికి నాసిరకం వస్తువుల్ని ఏరితీసే ప్రయత్నం చేయకండి. అలాంటి వస్తువుల్ని మీకే గనక ఎవరయినా ఇస్తే మీరు తీసుకోవడానికి ఇష్టపడతారా? కళ్ళు మూసుకొని స్వీకరిస్తారేకాని, మనస్పూర్తిగా మీరు ఎన్నటికీ వాటిని స్వీకరించరు. దేవుడు నిరపేక్షాపరుడు, స్వతహాగా ప్రశంసనీయుడని తెలుసుకోండి. (267)
షైతాన్‌ మిమ్మల్ని పేదరికం గురించి భయపెట్టి సిగ్గుమాలిన పనులకు పాల్పడేలా ప్రేరేపిస్తాడు. కాని దేవుడు మిమ్మల్ని క్షమిస్తానని, అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ఎంతో ఉదారస్వభావుడు, సర్వం తెలిసినవాడు. తాను తలచుకున్న వారికి వివేకం, విచక్షణ జ్ఞానం ప్రసాదిస్తాడు. వివేకం, విచక్షణల జ్ఞానం లభించినవాడు ఎంతో అదృష్టవంతుడు. నిజంగా అతనికి అపార సంపదలు లభించినట్లే. బుద్ధిమంతులు మాత్రమే (మా) హితోపదేశం గ్రహిస్తారు. (268-269)
మీరు (దైవమార్గంలో) ఖర్చు చేసినదైనా, లేక మీరు మొక్కుబడి చేసుకున్నదైనా సరే, అంతా దేవునికి తెలుసు. దుర్మార్గులకు ఎవరూ సహాయం చేయరు. మీరు దాన ధర్మాలు బహిరంగంగా చేసినా మంచిదే; ఒకవేళ మీరు ఇతరుల కంట పడకుండా రహస్యంగా అగత్యపరులకు దానం చేస్తే అది మరీ మంచిది. అలాంటి దానం మీ పాపాలను కడిగి వేస్తుంది. మీరు చేసేదంతా దేవునికి తెలుసు. (270-271)
(ముహమ్మద్‌!) ప్రజలను సన్మార్గానికి తీసుకొచ్చే బాధ్యత నీమీద లేదు. దేవుడు మాత్రమే తాను తలచిన వారిని దారికి తెస్తాడు.
మీసంపద నుండి మీరు (దైవమార్గంలో) ఏది ఖర్చుచేసినా అది మీకే లాభదా యకం. మీరు చేసేదంతా దైవప్రసన్నత కోసమే కదా! దైవప్రసన్నత కోసం మీరు ఏది ఖర్చుచేసినా దాని పుణ్యఫలం మీకు పూర్తిగా లభిస్తుంది. మీకేమాత్రం అన్యాయం జరగదు. ముఖ్యంగా దైవకార్యాల్లో నిమగ్నులైపోయి, జీవనోపాధి కోసం ధరణిపై తిరిగే అవకాశంలేని నిరుపేదలకు (ఆర్థికసహాయం చేయండి). వారి స్థితిగతులు ఎరగనివారు వారి ఆత్మాభిమానం చూసి వారు స్థితిపరులేనని భావిస్తారు. కాని వారి ముఖాలు చూస్తే మీరు వారి నిజస్థితి గ్రహిస్తారు. వారు (సిగ్గువదలి) ప్రజల వెంటబడి అర్థించే (యాచకు ల్లాంటి) వారుకాదు. వారి సహాయం కోసం మీరు చేసే ఏఖర్చయినా దేవునికి తెలియ కుండా ఉండదు. రాత్రింబవళ్ళు బహిరంగంగానూ, గోప్యంగానూ (దైవమార్గంలో) తమ సంపద ఖర్చు చేసేవారి కోసం తగినప్రతిఫలం వారి ప్రభువు దగ్గర సిద్ధంగా ఉంది. వారికి (అక్కడ) ఎలాంటి భయంగాని, దుఃఖంగాని ఉండదు. (272-274)
పోతే వడ్డీతినేవాడు పిశాచం పట్టిన పిచ్చివాడిలా (బిత్తరచూపులతో సమాధి నుండి) లేస్తాడు. దీనిక్కారణం వారు వ్యాపారం కూడా వడ్డీ లాంటిదే కదా అనంటారు. కాని దేవుడు వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేశాడు. వడ్డీని అధర్మకార్యంగా నిర్ణయించాడు. కనుక ఈ హితబోధ అందినవారు ఇకముందు వడ్డీ తినటాన్ని మానుకోవాలి. జరిగిందేదో జరిగింది. ఇకనుండి మానుకోవాలి. ఆలాంటివారి వ్యవహారం (రేపు) దేవుడు పరిష్క రిస్తాడు. ఒకవేళ ఈ ఆదేశం అందిన తర్వాత కూడా మళ్ళీ ఎవరైనా ఈ పాపకార్యానికి పాల్పడితే వారు నరకం పాలవుతారు. నరకంలోనే ఎల్లకాలం పడివుంటారు. (275)
దేవుడు వడ్డీని తుదముట్టిస్తాడు. దానధర్మాలకు వృద్ధివికాసాలు కలిగిస్తాడు. కృతఘ్నుడు, పాపాత్ముడయినవాడ్ని దేవుడు ఎన్నటికీ ప్రేమించడు. అయితే (సత్యాన్ని) విశ్వసించి సదాచార సంపన్నులయి నమాజు (విధి) నిర్వహిస్తూ, (పేదల ఆర్థిక హక్కు) జకాత్‌ నెరవేరుస్తూ ఉండేవారికి వారిప్రతిఫలం వారిప్రభువు వద్ద సిద్ధంగా ఉంది. వారికి (పరలోకంలో) ఎలాంటి భయంగాని, దుఃఖంగాని ఉండదు. (276-277)
విశ్వాసులారా! దేవునికి భయపడండి. మీరు నిజంగా విశ్వసించిన వారయితే మీకు రావలసిన వడ్డీ వదిలేయండి. మీరిలా చేయకపోయారా, జాగ్రత్త! దేవుని తరఫున, ఆయన ప్రవక్త తరఫున మీకు వ్యతిరేకంగా యుద్ధప్రకటన వెలువడినట్లేనని తెలుసు కోండి. కనుక ఇకనయినా పశ్చాత్తాపం చెంది (వడ్డీ తీసుకోవడాన్ని మానేసి)నట్లయితే మీకు మీ మూల ధనం తీసుకునే హక్కు ఉంటుంది. దానివల్ల మీకూ నష్టం ఉండదు; ఇతరులకూ నష్టం ఉండదు. (278-279)
ఒకవేళ రుణగ్రస్తుడు ఇబ్బందులతో సతమతమౌతుంటే పరిస్థితి చక్కబడే వరకు అతనికి అవకాశమివ్వండి. రుణం మాఫీచేస్తే మరీమంచిది. మీరు గ్రహించగల్గితే ఇది మీకెంతో శ్రేయస్కరమైనది. మీరంతా చివరికి దేవుని సన్నిధికి చేరుకోవలసిన దినం గురించి కాస్త భయపడండి. (ఆరోజు) ప్రతివ్యక్తికీ అతను చేసుకున్న కర్మలకు పూర్తి ప్రతిఫలం లభిస్తుంది. ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదు. (280-281)
విశ్వాసులారా! మీరు ఒక నిర్ణీత కాలానికిగాను అప్పు ఇచ్చిపుచ్చుకోవడం గురించి మాట్లాడుకుంటే ఆ విషయాన్ని వ్రాతపూర్వకంగా నమోదు చేసుకోండి. అయితే రుణపత్రం రాసే వ్యక్తి ఎవరికీ ఎలాంటి నష్టం కలగనీయకుండా న్యాయంగా, నిష్పక్షపాతంగా వ్రాయాలి. దేవుడు తనకు నేర్పినవిధంగా వ్రాయాలి. అతను దస్తావీజు వ్రాయడానికి నిరాకరించకూడదు. బాధ్యత పైబడిన వ్యక్తి (రుణగ్రస్తుడు) ఆ విషయం చెప్పి వ్రాయించాలి. అతను తన నిజప్రభువయిన దేవునికి భయపడుతూ నిర్ణీత వ్యవహారంలో ఎలాంటి తగ్గింపు చేయకుండా వ్రాయించాలి.
ఒకవేళ అప్పు తీసుకునే వ్యక్తి బుద్ధిమాంద్యం కలవాడో, బలహీనుడో అయినట్ల యితే లేదా చెప్పి వ్రాయించే శక్తి లేనివాడైతే అతని సంరక్షకుడు చెప్పి న్యాయంగా వ్రాయించాలి. (దీనికి) మీలో ఇద్దరు పురుషుల్ని సాక్షులుగా పెట్టుకోండి. పురుషులు ఇద్దరు లభించకపోతే ఒక పురుషుడు, ఇద్దరు స్త్రీలయినా చాలు. వారిలో ఒకస్త్రీ మరచి పోతే రెండోస్త్రీ అయినా గుర్తుచేస్తుంది. సాక్షులు మీకు ఆమోదయోగ్యమైనవారుగా ఉండాలి. సాక్ష్యం కోసం పిలిచినప్పుడు సాక్షులు (సాక్ష్యమివ్వడానికి) నిరాకరించకూడదు.
గడువు నిర్ణయించిన రుణవ్యవహారం చిన్నదైనాపెద్దదైనా దస్తావీజుగా రాయడంలో అశ్రద్ధ చేయకండి. ఇది దేవుని దృష్టిలో ఎంతో న్యాయమైన పద్ధతి. సాక్షమివ్వడానికి కూడా చాలా మంచిపద్ధతి. దానివల్ల మీరు ఎలాంటి అనుమానాలకు లోనయ్యే తావుం డదు. పోతే మీరు పరస్పరం ఎప్పటికప్పుడు అక్కడికక్కడ జరుపుకునే క్రయవిక్రయాల విషయంలో దస్తావీజు వ్రాసుకోకపోయినా పర్వాలేదు. మీరు వ్యాపార ఒప్పందాలు చేసుకునేటప్పుడు సాక్ష్యం పెట్టుకోండి. దస్తావీజు వ్రాసే వ్యక్తికి గాని, సాక్షులుగా ఉండే వారికిగాని నష్టం వాటిల్లరాదు. అలాంటి నష్టం జరిగితే మీకది పాపకార్యంగా పరిణ మిస్తుంది. దేవునికి భయపడండి. చూడండి, ఆయన మీకు ఎలాంటి మంచి విషయాలు నేర్పుతున్నాడో! దేవుడు సమస్త విషయాలు ఎరిగినవాడు. (282)
మీరు ప్రయాణావస్థలో ఉన్నప్పుడు దస్తావీజు వ్రాసేవారు లభించకపోతే ఏదైనా వస్తువు తాకట్టు పెట్టి అప్పు తీసుకోండి. అప్పిచ్చేవాడు అప్పు తీసుకునే వ్యక్తిని నిజాయితీపరుడని భావించి తాకట్టు లేకుండానే అప్పు ఇస్తే రుణగ్రహీత నిజాయితీగా దాన్ని (గడువు తీరగానే) రుణదాతకు తిరిగి చెల్లించాలి. అతను తన నిజప్రభువయిన దేవునికి భయపడాలి. సాక్ష్యాన్ని దాచకూడదు. సాక్ష్యం దాచేవాడి ఆంతర్యం పాపపంకి లంతో నిండిపోతుంది. మీరు చేసేదంతా దేవుడు గమనిస్తూనే ఉంటాడు. (283)
భూమ్యాకాశాలలో ఉన్న సమస్తం దేవునిదే. మీరు మీహృదయాల్లో ఉన్న విష యాన్ని వెలిబుచ్చినా, దాచినా ఎట్టి పరిస్థితిలోనూ దాన్నిగురించి దేవుడు మీనుండి లెక్క తీసుకుంటాడు. ఆతర్వాత ఆయన తాను తలచిన విధంగా కొందరిని క్షమిస్తాడు. మరి కొందరిని శిక్షిస్తాడు. దేవుడు ప్రతిపనీ చేయగల సమర్థుడు, సర్వశక్తిమంతుడు. (284)
దైవప్రవక్త తన ప్రభువు నుండి తనపై అవతరించిన దివ్యగ్రంథాన్ని విశ్వసించాడు. అలాగే విశ్వాసులు కూడా. వారంతా దేవుడ్ని, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను విశ్వసిస్తున్నారు. వారిలా అంటారు: “మేము ఆయన ప్రవక్తలలో ఎవరినీ భేదభావంతో చూడము. (మా దృష్టిలో అందరూ సత్యవంతులైన ప్రవక్తలే. మేము (దైవాజ్ఞ) విన్నాము. దాన్ని పాటిస్తున్నాము. ప్రభూ! మాకు క్షమాభిక్ష ప్రసాదించు. (చివరికి) మేము నీ సన్నిధికే తిరిగి రావలసిన వాళ్ళము.” (285)
దేవుడు ఏమనిషి పైనా అతని శక్తికి మించిన భారం వేయడు. ప్రతివ్యక్తి సంపా దించే సుకృతఫలం అతనికే లభిస్తుంది. తన దుష్కృత పర్యవసానం కూడా అతనే చవి చూస్తాడు. (ఇలా ప్రార్థించండి:) “ప్రభూ! మేము మరచిపోయి ఏదైనా పొరపాటు చేసి వుంటే దాన్ని పట్టకు. మాకు పూర్వం గతప్రజలపై మోపినభారం మాపై మోపకు. ప్రభూ! మేము మోయలేని భారం మామీద వేయకు. మా పట్ల మృదువుగా ప్రవర్తించు. మా పొరపాట్లు పట్టించుకోకు. మమ్మల్ని క్షమించు, కనికరించు. నీవే మా స్వామివి, సంరక్ష కుడివి. అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయం చెయ్యి.” (286)