కురాన్ భావామృతం/అల్-ఖసస్

(గాధలు (అల్-ఖసస్ ) నుండి మళ్ళించబడింది)
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

28. ఖసస్‌ (గాధలు)
(అవతరణ: మక్కా; సూక్తులు: 88)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
తా-సీన్‌-మీమ్‌. ఇవి విషయస్పష్టత కలిగిన గ్రంథానికి చెందిన సూక్తులు. విశ్వ సించినవారి ప్రయోజనం కోసం మేమిప్పుడు మూసా, ఫిరౌన్‌లకు సంబంధించిన వాస్తవ స్థితిగతులు కొన్నింటిని నీకు విన్పించబోతున్నాం. (1-3)
ఫిరౌన్‌ ధరణిలో తలెత్తి అహంకారంతో విర్రవీగుతున్నాడు. అతను తన దేశపౌరుల్ని (విభిన్న) వర్గాలుగా విభజించాడు. వాటిలో ఒక వర్గాన్ని అతినీచంగా చూస్తున్నాడు. ఆ వర్గంలో ఆడపిల్లలను మాత్రమే జీవించిఉండేలా వదలి, మగపిల్లలను చంపుతున్నాడు. ఈవిధంగా అతను పరమ దుర్మార్గుడై పోయాడు. (4)
కనుక ప్రపంచంలో అణచివేయబడిన ఈ (దళిత) జనాన్ని కనికరించాలని మేము నిర్ణయించుకున్నాం. వారికి (ప్రపంచ)నాయకత్వం ప్రసాదించి, వారిని (భూమికి) వారసు లుగా చేయాలని సంకల్పించాం. వారికి ప్రపంచంలో పాలనాధికారం ఇవ్వాలని భావించాం. అంతేకాకుండా వారిద్వారా మరోవైపు ఫిరౌన్‌, హామాన్‌లకు, వారి సైన్యాలకు వారు భయపడుతున్నదానిని చూపాలని కూడా మేము నిశ్చయించాం. (5-6)
మేము మూసా తల్లికి దివ్యావిష్కృతి ద్వారా ఇలా సూచించాము: “నీవు మూసాకు పాలు త్రాగిస్తూ ఉండు. అతని ప్రాణానికి ముప్పు వాటిల్లే సూచనలు కన్పిస్తే అతడ్ని నదిలో వదలిపెట్టు. నువ్వేమీ భయపడకు, దిగులుపడకు. ఆ తరువాత మేమతడ్ని తిరిగి నీ దగ్గరికే చేర్చుతాం. అతడ్ని మేము దైవప్రవక్తగా చేస్తాం.” (7)
చివరికి ఫిరౌన్‌ కుటుంబీకులు అతడ్ని (నది నుండి) తీసేసుకున్నారు, అతను తమకు విరోధిగా, దుఃఖదాయిగా కావాలని! ఫిరౌన్‌, హామాన్‌, వారి మనుషులు చాలా తప్పు చేశారు. ఫిరౌన్‌తో అతని భార్య ఇలా అన్నది: “ఈ పిల్లవాడు మన కంటిచలువ. ఇతడ్ని చంపకండి. ఇతడు మనకు ప్రయోజనకారి కావచ్చు లేదా మనం ఇతడ్ని కొడుకుగానైనా చేసుకుందాం.” (దీని పర్యవసానం ఏమిటో) వారికి తెలియదు. (8-9)
అటు మూసా మాతృమూర్తి హృదయం తల్లడిల్లిపోసాగింది. మేమామెకు ధైర్యం కలిగించకపోతే, ఆమె ఈ రహస్యాన్ని బట్టబయలు చేసివుండేది. ఆమె విశ్వాసులలో చేరాలన్న ఉద్దేశ్యంతో కూడా ఇలా చేశాం. ఆమె పిల్లవాడి అక్కతో “నువ్వితని వెన కాలగా నడచివెళ్ళు” అని చెప్పింది. ఆ బాలిక తనను గురించి (శత్రువులకు) ఎలాంటి అనుమానం రాకుండా దూరం నుంచి అతడ్ని గమనిస్తూ నడిచింది. (10-11)
మేము ముందుగానే పిల్లవాడికి పాలుపట్టే స్త్రీల పాలిండ్లను నిషేధించాం. (అందువల్ల పిల్లవాడు ఏ స్త్రీ దగ్గర కూడా పాలు త్రాగడానికి సిద్ధంకాలేదు.) అప్పుడా బాలిక వారితో “ఈ పిల్లవాడి పోషణభారం వహించేవారెవరో, వారిల్లెక్కడో నేను మీకు తెలుపనా? వారు బాబుని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు కూడా” అని అన్నది. (12)
ఇలా మేము మూసాను తిరిగి అతని తల్లి దగ్గరకు చేర్చాం, ఆమె కళ్ళు చల్లబడా లని, దిగులు పడకూడదని. అదీగాక దేవుని వాగ్దానం నిజమైన వాగ్దానమని ఆమె తెలుసుకోవాలని కూడా మేమిలా చేశాం. కాని చాలామందికి ఈ సంగతి తెలియదు. మూసా యౌవనదశకు చేరి పరిపూర్ణ వికాసంచెందిన తర్వాత మేమతనికి జ్ఞానం, వివేకం ప్రసాదించాం. ఇలా మేము సత్పురుషులకు (తగిన)బహుమానం అందజేస్తాం. (13-14)
(ఓరోజు) నగరవాసులు ఏమరుపాటులో ఉన్నప్పుడు మూసా నగరంలో ప్రవేశిం చాడు. అతను ఒకచోట ఇద్దరు పోట్లాడుకోవడం చూశాడు. వారిలో ఒకడు తనజాతికి చెందినవాడే. రెండోవాడు అతని విరోధిజాతికి చెందినవాడు. మూసాజాతికి చెందినవాడు విరోధి జాతివాడికి వ్యతిరేకంగా తనకు సహాయం చేయవలసిందిగా మూసాను పిలిచాడు. అప్పుడు మూసా వచ్చి ఒక్క పిడిగుద్దుతో అతడ్ని కడతేర్చాడు.
(ఈ హఠాత్పరిణామానికి) మూసా (కంగారుపడుతూ) “ఇది షైతాన్‌ చర్య. షైతాన్‌ (మానవులకు) బద్ధవిరోధి; పెడదారి పట్టించే పరమదుర్మార్గుడు” అన్నాడు. ఆ తరువాత “ప్రభూ! నేను నా ఆత్మకు అన్యాయం చేసుకున్నాను. నన్ను క్షమించు” అని వేడుకు న్నాడు. దేవుడు అతడ్ని క్షమించాడు. ఆయన గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడు#
ఆ తరువాత మూసా “ప్రభూ! నీవు నాకెంతో మేలు చేశావు. ఇకముందు ఎప్పుడూ నేను నేరస్థులకు సహయపడను” అని ప్రతిజ్ఞ చేశాడు. (15-17)
మరునాడు ఉదయం మూసా భయపడుతూ, ప్రమాద సూచనలు పసిగడ్తూ నగరంలో ప్రవేశించాడు. అకస్మాత్తుగా ఒకచోట నిన్న తనను సహాయం కోసం పిలిచిన వాడే ఈరోజు కూడా తనను పిలుస్తూ కన్పించాడు. అప్పుడు మూసా అతనితో “నీవు పెద్ద దుర్మార్గుడిలా (జగడాలమారిగా) కన్పిస్తున్నావే!” అన్నాడు. (18)
ఆ తరువాత మూసా తన విరోధి జాతికి చెందిన వాడిపై దాడి చేయబోయాడు. వెంటనే రెండోవాడు గగ్గోలుపెడుతూ “మూసా నిన్న నీవు ఒక మనిషిని చంపావు. అలాగే ఈరోజు నన్ను చంపడానికి సిద్ధమయ్యావా? నువ్వీ దేశంలో క్రూరుడుగా ఉండ దలిచావా? సంస్కరణ కార్యాలు చేయడం ఇష్టం లేదా?” అని అడిగాడు. (19)
కాస్సేపటికి నగరం అగ్రభాగం నుండి ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి “మూసా! ఉన్నతాధికారులు నిన్ను చంపే విషయమై చర్చలు జరుపుతున్నారు. నువ్వు (తొందరగా ఎటయినా) పారిపో. నేను నీ శ్రేయాభిలాషిని, చెబుతున్నా” అన్నాడు. (20)
ఈ సంగతి వినగానే మూసా భయపడి నగరం నుంచి మెల్లిగా జారుకున్నాడు. అప్పుడతను “ప్రభూ! నన్ను దుర్మార్గుల బారినుండి కాపాడు” అని ప్రార్థించాడు. (21)
మూసా (ఈజిప్టు నుంచి బయలుదేరి) మద్యన్‌ దారి పట్టాడు. ఆ సమయంలో “నా ప్రభువు నన్ను సరైన దారిలో నడిపిస్తాడని ఆశిస్తున్నాను” అన్నాడతను. (22)
ఆవిధంగా అతను మద్యన్‌ ప్రాంతంలోని ఒక బావి దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ అనేకమంది తమ పశువులకు నీళ్ళు త్రాగిస్తూ కన్పించారు. వారికి కొంచెం ఎడంగా ఇద్దరు స్త్రీలు తమ పశువుల్ని ఆపుకొని (నీటికోసం నిరీక్షిస్తూ) నిలబడి ఉన్నారు.
మూసా ఆ స్త్రీలను ఉద్దేశించి “మీ బాధేమిటీ?” అని అడిగాడు. దానికి వారు “ఈ కాపరులు తమ పశువుల్ని తోలుకెళ్ళనంతవరకు మేము మా పశువులకు నీళ్ళు త్రాగించలేం. మా నాన్నగారు చాలా ముసలివారయి పోయారు” అన్నారు. (23)
ఈ సంగతి విని మూసా ఆ స్త్రీల పశువులకు నీళ్ళు తాగించాడు. ఆ తరువాత ఓ చోట నీడపట్టున కూర్చొని “ప్రభూ! నీవు నాకు ఎలాంటి శ్రేయస్సు పంపినా అది నాకు ఎంతో అవసరం” అన్నాడు. (24)
కాస్సేపటికి ఆ ఇద్దరిలో ఒక స్త్రీ సిగ్గుపడుతూ నడచి అతని దగ్గరకొచ్చింది. ఆమె అతనితో “మిమ్మల్ని మానాన్నగారు పిలుస్తున్నారు. మీరు మా పశువులకు నీరు తాగించి చేసిన మేలుకు ఆయన మీకు ప్రతిఫలం ఇవ్వడానికి పిలుస్తున్నారు” అని అన్నది.
మూసా ఆ వృద్ధుని దగ్గరికెళ్ళి తన గాధంతా వివరించాడు. అది విని అతను “భయపడకు. ఇప్పుడు నీవా దుర్మార్గుల బారినుండి బయటపడ్డావు” అన్నాడు. ఆ ఇద్దరు స్త్రీలలో ఒకామె తన తండ్రితో “నాన్నా! ఇతడ్ని మనం సేవకునిగా పెట్టుకుందాం. బలిష్ఠుడు, నిజాయితీపరుడైనవాడే మనకు మంచి సేవకుడు” అని అన్నది. (25-26)
ఆమె తండ్రి (మూసాతో) ఇలా అన్నాడు: “నేను నా కుమార్తెలిద్దరిలో ఒకామెను నీకిచ్చి పెళ్ళి చేయాలనుకుంటున్నాను. అయితే నీవు నాదగ్గర ఎనిమిదేండ్ల పాటు సేవకునిగా పనిచేయాలి. పదేండ్లు చేస్తే (ఇంకా మంచిది.) అది నీ ఇష్టం. నేను నీ మీద వత్తిడి చేయదలచుకోలేదు. దేవుడు తలిస్తే నీవు నన్ను మంచివాడిగా చూస్తావు.” (27)
మూసా ఇలా అన్నాడు: “ఈ వ్యవహారం మీకూ, నాకూ మధ్య జరిగింది. ఈ రెండు గడువుల్లో ఏదో ఒకదాన్ని నేను పూర్తి చేస్తాను. ఆ తర్వాత నామీద మరెలాంటి భారం వేయకూడదు. మనం చేసుకుంటున్న ఈ ఒప్పందానికి దేవుడే సాక్షి.” (28)
నిర్ణీతకాలం ముగిశాక మూసా తన కుటుంబం తీసుకొని బయలుదేరాడు. దారిలో తూర్‌కొండ వైపునుండి అతనికి ఒక అగ్ని(మంట) కన్పించింది. అప్పుడతను తన గృహస్థులతో “ఆగండి, నాకేదో నిప్పు కన్పిస్తోంది. నేను వెళ్ళి ఏదైనా సమాచారం తెస్తాను లేదా మీరు చలికాచుకోవడానికి ఓ నిప్పు కొరివినైనా తెస్తాను” అన్నాడు. (29)
మూసా అక్కడకు చేరుకోగానే లోయ కుడివైపున్న పవిత్ర స్థలంలోని ఓ చెట్టు నుండి “మూసా! నేనే దేవుడ్ని. సర్వలోక ప్రభువుని” అంటూ ఓ (అదృశ్య)వాణి విన్పించింది. ఆ తర్వాత “నీ చేతికర్ర క్రిందపడెయ్యి” అని దేవుడు ఆదేశించాడు. (మూసా తన చేతికర్ర కింద పడేశాడు.) ఆ కర్ర పాములా మెలికలు తిరుగుతూ ప్రాకడం మొదలెట్టింది. దాన్ని చూడగానే అతను పరుగు లంకించుకున్నాడు. వెనక్కితిరిగైనా చూడలేదు.
“మూసా! భయపడకు, వచ్చేయి. నీకెలాంటి ప్రమాదం ఉండదు. నీ చేతిని కాస్త చొక్కా క్రింద చంకలో పెట్టి తీసేయి. అది నీకెటువంటి బాధ కల్గించకుండా ప్రకాశిస్తూ బయటికి వస్తుంది. భయం పోగొట్టుకోవడానికి నీ (కుడి)భుజం అదుముకో. ఇవి రెండు ఫిరౌన్‌, అతని సభాసదుల ముందు ప్రదర్శించడానికి నీప్రభువు తరఫున ఇవ్వ బడిన మహిమలు. వారు చాలా దుర్మార్గులైపోయారు” అన్నాడు దేవుడు. (30-32)
అప్పుడు మూసా ఇలా అన్నాడు: “ప్రభూ! నేను వారి మనిషి నొకడ్ని చంపి ఉన్నాను. అంచేత వారు నన్ను చంపేస్తారేమోనని భయపడుతున్నాను. నా సోదరుడు హారూన్‌ వాక్పటిమ గలవాడు. అతడ్ని నాకు సహాయకారిగా నియమించు. అతను నన్ను సమర్థిస్తాడు. వారు నన్ను తిరస్కరిస్తారేమోనని భయంగా ఉంది.” (33-34)
దానికి దేవుడిలా అన్నాడు: ‘మేము నీ సోదరుని ద్వారా నీకు బలం చేకూర్చుతాం. మీ ఇద్దరికీ విశేషశక్తి ప్రసాదిస్తాము. దీనివల్ల వారు మిమ్మల్నేమీ చేయలేరు. మా మహిమల శక్తితో మీరు, మిమ్మల్ని అనుసరించేవారే విజయం సాధిస్తారు.’ (35)
ఆ తర్వాత మూసా మా మహిమలు తీసుకొని వారి దగ్గరకు వెళ్ళాడు. కాని వారు (వీటిని చూసి) “ఇదంతా అతని మంత్రజాలం తప్ప మరేమీ కాదు. ఈమాటలు మేము మా తాతముత్తాతల కాలంలో ఎప్పుడూ వినలేదు” అన్నారు. (36)
“నా ప్రభువు దగ్గర్నుండి హితోపదేశం తెచ్చిన మనిషిని గురించి ఆ ప్రభువుకు బాగా తెలుసు. అంతిమ పర్యవసానం ఎవరిది మంచిదవుతుందో కూడా ఆయనకే తెలుసు. ఏమైనా దుర్మార్గులు మాత్రం ఎన్నటికీ సఫలం కాలేరు” అన్నాడు మూసా (37)
“సభాసదులారా! మీకు నేను తప్ప మరొక దేవుడున్నట్లు నేనెరగను. హామాన్‌! కాస్త ఇటుకలు కాల్చి ఒక ఎత్తయిన కట్టడం కట్టించు. నేను దానిపై ఎక్కి మూసా దేవుడు (ఎక్కడైనా) ఉన్నాడేమో చూస్తాను. నేను మాత్రం మూసా అబద్ధాలరాయుడని భావిస్తున్నా” అన్నాడు ఫిరౌన్‌ (వెటకారంగా). (38)
ఫిరౌన్‌, అతని సైనికమూకలు హద్దుమీరిన అధికార గర్వంతో విర్రవీగిపోయారు. వారు మా దగ్గరికి ఎన్నడూ తిరిగిరావడం జరగదని భావించారు. చివరికి మేము అతడ్ని, అతని సైన్యాలను పట్టుకొని సముద్రంలో విసిరిపడేశాం. కనుక దుర్మార్గులకు ఎలాంటి గతి పట్టిందో కాస్త చూడండి. మేమా దుర్మార్గుల్ని నరకం వైపు పిలిచే నాయ కులుగా చేశాం. ప్రళయ దినాన వారికి ఎలాంటి సహాయం లభించదు. వారిని మేమీ లోకంలో శాపగ్రస్తులుగా చేశాం. ఇక ప్రళయ దినానయితే వారు దారుణమైన దుస్థితిలో చిక్కుకుంటారు. (39-42)
పాత తరాలను నాశనం చేసిన తరువాత మేము మూసాకు (తౌరాత్‌) గ్రంథం ప్రసాదించాము. ప్రజలు గుణపాఠం నేర్చుకోవడానికి మేము దాన్ని హితబోధినిగా, మార్గదర్శినిగా, కారుణ్యప్రదాయనిగా చేశాము. (43)
ప్రవక్తా! మేము మూసాకు ఈ (తౌరాత్‌) ఆజ్ఞలు ప్రసాదిస్తున్న సమయంలో నీవు (తూర్‌పర్వతం) పశ్చిమభాగాన లేవు. పైగా నీవు (ఆ దృశ్యం చూసిన) సాక్షుల్లో కూడా లేవు. ఈ సంఘటన తర్వాత మేము అనేక తరాలను లేపాము. వాటిమధ్య ఎంతో కాలం గడచింది. అదీగాక నీవు మద్యన్‌ వాసులకు మాసూక్తులు విన్పించడానికి ఆనాడు నీవు వారి దగ్గర లేవు. (ఆనాటి విశేషాలు) మేమే నీకు తెలియజేస్తున్నాం. (44-45)
మేము (మూసాను మొదటిసారిగా) పిలిచినప్పుడు నీవు తూర్‌(కొండ) సమీపంలో కూడా లేవు. అయినా (ఈ సమాచారం నీకు అందజేయబడుతున్నదంటే) ఇది నీ ప్రభువు అనుగ్రహం. నీకు పూర్వం వీరి దగ్గరకు హెచ్చేరించేవారు ఎవరూ రానందువల్ల స్పృహలోకి వస్తారేమోనని నీవు వీరిని హెచ్చరించేందుకు మేమిలా చేశాము. ఇలా చేయకపోతే వారిపై వారి (దుష్‌)కార్యాల కారణంగా ఏదైనా ఆపద వచ్చిపడితే “ప్రభూ! మా దగ్గరకు ప్రవక్తను ఎందుకు పంపలేదు? పంపివుంటే మేము నీ సూక్తులు పాటించి విశ్వాసులలో చేరేవాళ్ళం కదా!” అని వారు అనవచ్చు. (ఈ ఆరోపణలకు ఆస్కారం లేకుండా మేము నిన్ను వీరి దగ్గరకు ప్రవక్తగా పంపాము). (46-47)
అయితే మా దగ్గర్నుండి వారి దగ్గరకు సత్యం వచ్చిన తరువాత “మూసాకు ఇవ్వ బడినవే (మహిమలు) ఇతనికెందుకు ఇవ్వబడలేదు?” అని చెప్పసాగారు. ఇంతకు పూర్వం మూసాకు ఇవ్వబడినవాటిని వీరు తిరస్కరించలేదా? వారు (ఖుర్‌ఆన్‌, తౌరాత్‌ లను గురించి) ఈ రెండూ పరస్పరం సమర్థించుకునే మంత్రజాలాలు (తప్ప మరేమీ కావు) అన్నారు. పైగా మేము ఏ ప్రవక్తనూ నమ్మం అని కూడా అన్నారు. (48)
“మీ అభిప్రాయం నిజమైతే దేవుని దగ్గర్నుండి ఈ రెండిటికన్నా మెరుగైన మార్గం చూపే మరేదైనా గ్రంథం ఉంటే తీసుకురండి, నేను దాన్ని అనుసరిస్తాను” అని చెప్పు. ఈ సవాలును గనక ఎదుర్కోకపోతే, వీరసలు తమ మనోవాంఛలకు బానిసలై పోయా రని తెలుసుకో. దేవుని మార్గదర్శకత్వం లేకుండా మనోవాంఛలకు బానిసయి పోయిన వాడికంటే మించిన మార్గభ్రష్టుడు మరెవడు కాగలడు? అలాంటి దుర్మార్గులకు దేవుడు ఎన్నటికీ దారి చూపడు. వారు ఏమరుపాటు నుండి స్పృహలోకి రావడానికి మేము అనేక సార్లు విషయాన్ని వారికి అందజేశాము. (49-51)
పూర్వం మేము గ్రంథం ఇచ్చినవారు ఈగ్రంథాన్నీ నమ్ముతున్నారు. దీన్ని విన్పించి నప్పుడు “మేము దీన్ని విశ్వసిస్తున్నాం. నిజంగా ఇది మాప్రభువు నుండి వచ్చిన సత్యం. మేము పూర్వం నుండే విధేయులై (ముస్లిములై) ఉన్నాం” అంటారు వారు#
(సన్మార్గంలో) స్థిరంగా ఉన్నందుకు వారికి రెట్టింపు ప్రతిఫలం ఇవ్వబడుతుంది. వారు సత్కార్యాల ద్వారా చెడులను దూరం చేస్తారు. మేము ప్రసాదించిన సంపద నుండి (కొంత మా మార్గంలో కూడా) ఖర్చుచేస్తారు. ఏదైనా పనికిమాలిన విషయం వింటే వారు (ఎలాంటి వాదనకు దిగకుండా) “మీకర్మలు మీకు, మాకర్మలు మాకు. మీకో దండం. మేము మూర్ఖుల వైఖరి అవలంబించ లేము” అంటూ అక్కడ్నుంచి తప్పుకుంటారు. (52-55)
ప్రవక్తా! నీవు కోరినవాడికి సన్మార్గం చూపలేవు. దేవుడే తాను కోరిన వాడికి సన్మార్గం చూపుతాడు. సన్మార్గం అవలంబించేవారెవరో ఆయనకు బాగా తెలుసు. (56)
వారు (సత్యాన్ని నిరాకరిస్తూ) “మేము నీతోపాటు ఈ హితబోధను అవలంబిస్తే (ఈ నేలమీద మాకు పుట్టగతులుండవు.) మమ్మల్ని మా దేశం నుండి తరిమేస్తారు” అనంటారు. మేము శాంతినిలయమైన ప్రతిష్ఠాలయం (పరిసరాల)లో నివసించేందుకు వారికి చోటు కల్పించలేదా? అక్కడకు మావైపు నుండి వారికి ఉపాధిగా రకరకాల వస్తు సామగ్రి చేరడంలేదా? కాని వారిలో చాలామందికి (వాస్తవం) తెలియదు. (57)
మేము ఎన్నో జనపదాలను నాశనం చేశాం. అక్కడి ప్రజలు తమ ఆర్థిక ప్రగతి చూసుకొని విర్రవీగి పోతుండేవారు. కనుక చూడు (శిథిలావస్థలో ఉన్న) వారి ఇండ్లను. వారి తర్వాత ఆఇండ్లలో బహుకొద్దిమంది మాత్రమే నివసించారు. చివరికి మేమే వాటికి వారసులైపోయాము. మాసూక్తులు విన్పించే ఒక ప్రవక్తను కేంద్ర జనపదానికి (మక్కాకు) పంపనంత వరకు మేము దాని చుట్టుపక్కలుండే ఏ జనపదాన్నీ నాశనం చేయము. అలాగే మేము ఏ జనపదాలను కూడా అక్కడి ప్రజలు దుర్మార్గులు కానంత వరకు నాశనం చేసేవారం కాము. మీకు ఇవ్వబడినదంతా ప్రాపంచిక జీవన సంపద, క్షణికమైన దాని తళుకుబెళుకులు మాత్రమే. దేవుని దగ్గర ఉన్నది ఇంతకంటే ఎంతో శ్రేష్ఠమైనది, శాశ్వతమైనది. మీరు బుద్ధి నుపయోగించి ఆలోచించరా? (58-60)
మేము ఒక వ్యక్తికి మంచికి సంబంధించి వాగ్దానం చేశాం. అది అతనికి లభించే అవకాశముంది. మరొకతనికి మేము (క్షణభంగురమైన) ప్రాపంచిక జీవనసామగ్రి మాత్రమే ఇచ్చాం. తర్వాత అతడ్ని ప్రళయదినాన శిక్ష కోసం మాముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ ఇద్దరు సమానమవుతారా? ఆరోజు దేవుడు వారిని పిలిచి “మీ ఊహా జనితాలైన నా భాగస్వాములు ఇప్పుడు ఎటుపోయారు?” అని ప్రశ్నిస్తాడు. (61-62)
(నరక శిక్ష) మాట ఎవరికి వర్తిస్తుందో వారిలా అంటారు: “ప్రభూ! మేము మార్గ భ్రష్టులుగా చేసిన వారు వీరే. మేము (మా మనోవాంఛలకు బానిసలయి) ఎలా మార్గ భ్రష్టులై పోయామో అలాగే వీరిని కూడా మార్గభ్రష్టులుగా చేశాము. నిజానికి వీరు మమ్మల్ని ఆరాధించలేదు. (వీరు తమ మనోవాంఛలకు బానిసలైపోయారు.) కనుక వారి మార్గభ్రష్టతకు మేము బాధ్యులం కామని విన్నవించుకుంటున్నాం.” (63)
అప్పుడు మేము “ఇక మీరు కల్పించుకున్న సహవర్తులను (అంటే మిధ్యాదైవా లను) పిలుచుకోండి” అంటాము. వారు (తమతమ ఇష్టదేవతలను) పిలుచుకుంటారు. కాని వారికి అవి ఎలాంటి సమాధానం ఇవ్వవు. చివరికి వారు (నరక)యాతనలు చూసు కుంటారు. వారు సన్మార్గం అవలంబించిఉంటే ఎంత బాగుండేది! దేవుడు వారిని పిలిచి “మేము పంపిన ప్రవక్తలకు మీరేం సమాధానమిచ్చార”ని అడుగుతాడు. అప్పుడు వారికి ఏం సమాధానమివ్వాలో తోచదు. వారు ఒకర్నొకరు సంప్రదించుకోలేరు కూడా. అయితే చేసిన తప్పులకు ఈరోజు పశ్చాత్తాపం చెంది, సత్యాన్ని విశ్వసించి సర్కర్మలు ఆచరించే వారు మాత్రం రేపక్కడ మోక్షం పొందేవారిలో ఉంటారు. (64-67)
నీ ప్రభువు తలచుకున్నదాన్ని సృజిస్తాడు. తాను కోరిన వ్యక్తిని (ప్రవక్తగా) ఎంచు కుంటాడు. ఈ ఎంపిక వీరు చేయవలసిన పనికాదు. వారికా అధికారం లేదు. వారు చేస్తున్న బహుదైవారాధనకు దేవుడు ఎంతోఅతీతుడు, ఉన్నతుడు, పరమపవిత్రుడు. (68)
వారు తమ హృదయాల్లో ఏం దాచారో, బయటికి ఏం వెలిబుచ్చుతున్నారో అంతా నీ ప్రభువుకు తెలుసు. ఆయనే అల్లాహ్‌. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఇహం లోనూ, పరంలోనూ సకలవిధాల ప్రశంసలు, స్తోత్రాలు ఆయనకే శోభిస్తాయి. ఆయనకే (విశ్వ)పాలానాధికారం ఉంది. మీరంతా ఆయన వద్దకే మరలి పోవలసిఉంది. (69-70)
ముహమ్మద్‌ (స)! వారిని ఇలా అడుగు: “దేవుడు ప్రళయం దాకా రాత్రిని మీపై ఆవరింపజేసి ఉంచితే, ఆయన తప్ప మరే దేవుడు మీకు పగటి వెల్తురు ఇవ్వగలడు? మీరు వినరా?” ఇంకా అడుగు: “అలాగే దేవుడు ప్రళయం దాకా మీపై పగటి వెల్తురిని శాశ్వతంగా ఉంచితే, ఆయన తప్ప మరే దేవుడు మీరు విశ్రాంతి పొందడానికి రాత్రిని తెస్తాడు? దీన్ని గురించి మీరెప్పుడైనా ఆలోచించారా?” (71)
(ప్రతి రోజూ సంభవిస్తున్న) ఈ అద్భుత రేయింబవళ్ళు) మీకు కన్పించడం లేదా? మీరు విశ్రాంతి పొందడానికి, మీప్రభువు అనుగ్రహం అన్వేషించడానికి ఆయన మీకోసం రాత్రింబవళ్ళను సృష్టించాడు, మీరు కృతజ్ఞత చూపుతారేమోనని. ఇదంతా ఆయన అనుగ్రహమే. (72-73)
దేవుడు వారిని పిలిచి మీ ఊహాజనితాలయిన నా భాగస్వాములు ఏమయ్యారు? అని అడిగే రోజు (గురించి గుర్తుంచుకోవాలి.) మేము ప్రతి అనుచర సముదాయం నుండి ఒక సాక్షిని తెచ్చి “మీ (మిధ్యాదైవారాధనకు) ప్రమాణాలేమిటో తీసుకురండి” అని వారిని నిలదీస్తాము. అప్పుడు వారికి తెలిసొస్తుంది సత్యం దేవుని వైపున్నదని. వారి అసత్యాలు, అభూతకల్పనలన్నీ కనుమరుగైపోతాయి. (74-75)
ఖారూన్‌ అనేవాడు మూసాజాతికి చెందిన వ్యక్తి. అయితే అతను తన జాతికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ విద్రోహిగా మారాడు. మేమతనికి అపార సిరిసంపదలు, నిక్షేపాలు ప్రసాదించాము. వాటికి సంబంధించిన తాళపు చెవుల్ని బలిష్ఠులైన కొందరు వ్యక్తుల సమూహం అతికష్టం మీద పైకెత్త గలుగుతుంది.
ఓసారి అతని జాతిప్రజలు అతనికిలా ఉపదేశించారు: “మిడిసిపడకు. మిడిసిపడే వారిని దేవుడు ప్రేమించడు. దేవుడు నీకు ప్రసాదించిన ఐశ్వర్యంతో పరలోకగృహం నిర్మించుకోవడానికి ప్రయత్నించు. ప్రపంచం నుండి కూడా నీ భాగాన్ని (పరలోకానికి తీసికెళ్ళడం) మరచిపోకు. దేవుడు నీకు మేలు చేసినట్లు నీవు కూడా (ప్రజలకు) మేలు చెయ్యి. ధరణిలో కలహాలు, సృష్టించకు. దేవుడు కలహకారుల్ని ప్రేమించడు.” (76-77)
ఈ మాటలు విని అతడు (మరింత నీల్గుతూ) “ఇదంతా నాకు నా జ్ఞానం, తెలివి తేటల వల్ల లభించింది” అన్నాడు. దేవుడు పూర్వం ఇతనికంటే ఎక్కువ శక్తిసామర్థ్యాలు, మందీమార్బలం కలవారిని నాశనం చేశాడు. ఈ సంగతి అతనికి తెలియదా? పాపాత్ము లను వారి పాపాలను గురించి అడగటం జరగదు (నిజాన్ని ఒప్పుకోరు గనక). (78)
ఓరోజు అతను పూర్తి ఠీవి-దర్పాలతో తనజాతి ప్రజల ముందుకొచ్చాడు. అప్పుడు ఐహిక వ్యామోహపరులు కొందరు అతడ్ని చూసి “ఖారూన్‌కు లభించిన సిరిసంపదలు మనకూ లభించివుంటే బావుండు! ఖారూన్‌ అదృష్టవంతుడు” అన్నారు. అయితే (దైవిక) జ్ఞానం కలవారు (వారి ఆలోచనాధోరణిని విమర్శిస్తూ) “మీ వైఖరి చాలా విచారకరం. విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి దేవుని (దగ్గరున్న) ప్రతిఫలం ఎంతో శ్రేష్ఠమైనది. సహనం వహించేవారికే ఈ మహాభాగ్యం లభిస్తుంది” అన్నారు. చివరికి మేము ఖారూన్‌ని, అతని ఇంటిని (హఠాత్తుగా) భూమిలోకి దిగబడిపోయేలా చేశాము. అప్పుడు దేవునికి వ్యతిరేకంగా అతడ్ని ఆదుకునే వారెవరూ లేకపోయారు. అతను కూడా తనను తాను కాపాడుకోలేక పోయాడు. (79-81)
నిన్నటిరోజు అతని హోదా అంతస్తులు చూసి అలాంటివి తమకూ కావాలని కోరు కున్నవారు ఇప్పుడు విచారం వెలిబుచ్చుతూ ఇలా అన్నారు: “మనం ఒక విషయం మరచిపోయాం. దేవుడు ఎవరికి పుష్కలంగా ఉపాధి ఇవ్వదలచుకుంటాడో వారికే పుష్కలంగా ఉపాధి లభిస్తుంది. ఆయన మరెవరికి పరిమితంగా ఉపాధి ఇవ్వాలని భావి స్తాడో వారికి పరిమితంగానే లభిస్తుంది. దేవుడు మనల్ని అనుగ్రహించి ఉండకపోతే ఆయన మనల్ని కూడా భూమిలోకి అణగద్రొక్కేవాడు. అయ్యో! అవిశ్వాసులు సాఫల్యం చెందరన్న సంగతి (అప్పుడు) మనకు కొంచెం కూడా గుర్తుకు రాలేదే!” (82)
ప్రపంచంలో అధికులు కావాలనుకొని అరాచకం సృష్టించగోరని వారికి మాత్రమే మేము పరలోక గృహం కేటాయిస్తాం. దైవభీతిపరులు ఎంతో మంచి పర్యవసానం అనుభవిస్తారు. మంచితనం తెచ్చేవారికి అంతకంటే ఎక్కువ మంచి జరుగుతుంది. చెడు తెచ్చేవారికి వారు చేసిన చెడుపనుల మేరకే ప్రతిఫలం లభిస్తుంది. (83-84)
ప్రవక్తా! నీపై ఈ ఖుర్‌ఆన్‌ని అవతరింపజేసిన దేవుడు నిన్ను తప్పకుండా అత్యంత శ్రేష్ఠమైన స్థానానికి చేర్చుతాడు. “ఎవరు సన్మార్గగామి అయివచ్చాడో, ఎవరు స్పష్టమైన దుర్మార్గంలో పడివున్నాడో నా ప్రభువుకు బాగా తెలుసు” అని వారికి చెప్పు. (85)
నీపై (దైవ) గ్రంథం అవతరిస్తుందని నీవు ఏనాడూ ఆశించి ఉండలేదు. ఇది నీ ప్రభువు అనుగ్రహం మాత్రమే. కనుక నీవు సత్యతిరస్కారులకు సహాయకునిగా మారకు. నీపై దేవుని సూక్తులు అవతరించినప్పుడు సత్యతిరస్కారులు నిన్ను వాటికి దూరంగా ఉంచడమన్నది ఎన్నటికీ సంభవించకూడదు సుమా! నీవు (ప్రజలను) నీ ప్రభువు (సందేశం) వైపు పిలుస్తూ ఉండు. అంతేగాని, బహుదైవారాధకుల్లో చేరిపోకు. అల్లాహ్‌ తప్ప మరే దైవాన్నీ ప్రార్థించకు. ఆయన తప్ప మరే ఆరాధ్యదైవం లేడు. అల్లాహ్‌ అస్తిత్వం తప్ప ప్రతి వస్తువూ నశించిపోయేదే. ఆయనకే (ప్రతిచోటా) పాలనాధికారం ఉంది. మీరంతా ఆయన సన్నిధికే మరలిపోవలసి ఉంది. (86-88)