కురాన్ భావామృతం/అల్-ఖలమ్

(కలం (అల్-ఖలమ్ ) నుండి మళ్ళించబడింది)
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

68. ఖలం (కలం)
(అవతరణ: మక్కా; సూక్తులు: 52)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
నూన్‌...కలం సాక్షి! వ్రాసేవారు వ్రాస్తున్నదాని సాక్షి!! నీ ప్రభువు దయవల్ల నీవు ఏమాత్రం పిచ్చివాడవు కావు. నీకు తప్పకుండా ఎన్నటికీ అంతంకాని గొప్ప ప్రతిఫలం లభిస్తుంది. నిస్సందేహంగా నీవు అత్యున్నత సుగుణసంపత్తి కలవాడవు. మీలో ఎవరు ఉన్మాదులో త్వరలోనే నీకూ తెలుస్తుంది; వారికీ తెలుస్తుంది. (1-6)
నీ ప్రభువుకు తనమార్గం నుండి ఎవరు తప్పిపోయారో బాగా తెలుసు. ఆలాగే ఎవరు సన్మార్గంలో ఉన్నారో కూడా ఆయనకు తెలుసు. కనుక నీవు సత్యతిరస్కారులు తెచ్చే వత్తిళ్ళకు ఏమాత్రం తలవొగ్గకు. నీవు కొంచెం మెత్తబడితే వారు కూడా కాస్త వెనక్కి తగ్గుదామని భావిస్తున్నారు. (7-9)
నీవు వారికి ఏమాత్రం లొంగకు. (ముఖ్యంగా) చీటికిమాటికి ఒట్లు వేసుకునే తుచ్ఛుడు, ఎత్తిపొడిచేవాడు, చాడీలు చెబుతూ తిరిగేవాడు, సత్కార్యాల నుండి నిరోధిం చేవాడు, మితిమీరిన దౌర్జన్యాలకు పాల్పడేవాడు, ఘోరపాపి, పరమ దుర్మార్గుడు, వీటన్నిటికి తోడు ఏమాత్రం నీతిలేని నికృష్టుడు... (ఇలాంటివాడికి లొంగకు). అతను తన సంతానం, సిరిసంపదలు చూసుకొని మిడిసిపడుతున్నాడు. అతని ముందు మా సూక్తులు చదువుతున్నప్పుడు “ఇవి పూర్వీకుల పుక్కిటిపురాణాలు మాత్రమే” అంటాడు. త్వరలోనే మేమతని ముక్కుమీద వాతపెట్టి అతని పీచం అణచివేస్తాం. (10-16)
మేము పూర్వం ఓతోట యజమానులకు పరీక్ష పెట్టినట్లు (ఇప్పుడు మక్కా)వారికి కూడా పరీక్ష పెట్టాం. ఆ తోటయజమానులు ప్రమాణం చేసి తాము (రేపు) ఉదయాన్నే తోటకెళ్ళి తప్పక పండ్లు కోస్తామని అన్నారు. వారు ‘దేవుడు తలిస్తే (పండ్లు కోస్తాం)’ అనలేదు. ఆరాత్రి వారు గాఢనిద్రలో ఉన్నప్పుడు నీప్రభువు నుండి వారి తోటపైకి విపత్తు వచ్చిపడి, దాన్ని పంటకోయబడిన పొలంలా ధ్వంసం చేసింది. (17-20)
తెల్లవారగానే వారు ఉత్సాహంతో ఒకర్నొకరు కేకవేసి పిలుచుకుంటూ “పండ్లు కోయాలనుకుంటే పెందలాడే తోటకు బయలుదేరండి” అన్నారు. ఇలా వారందరూ బయలుదేరారు. (దారిలో) మాట్లాడుకుంటూ “ఈరోజు మన తోటలోకి పేదవాళ్ళెవరూ రాకుండా చూసుకోవాలి” అన్నారు. వారు ఎవరికీ చిల్లిగవ్వ కూడా ఇవ్వరాదని నిర్ణ యించుకొని, తొందర తొందరగా వెళ్ళారు పెద్ద మొనగాళ్ళులా. (21-25)
అయితే తోట వద్దకు చేరుకొని (నిర్ఘాంతపోయి) చూస్తూ “ఏమిటీ మనం దారి తప్పి వచ్చామా...? కాదుకాదు, మన దురదృష్టమే మన కొంపముంచింది” అన్నారు. వారందరిలో కాస్త మంచివాడు “మీరు దేవుడ్ని ఎందుకు స్మరించరని నేను చెప్పలేదా?” అన్నాడు. అప్పుడు వారు“ (నిజం) మనప్రభువు ఎంతోపవిత్రుడు. మనమే దుర్మార్గులం” అన్నారు. ఆతర్వాత వారు ఒకర్నొకరు నిందించుకున్నారు. (26-30)
చివరికి ఇలా అన్నారు: “అయ్యో! ఎంత దుర్గతి పట్టింది మనకు! నిజంగా మనం చాలా దుర్మార్గులై పోయాం. (ఇప్పుడైనా) మనం పశ్చాత్తాపం చెంది మన ప్రభువుని క్షమాపణ కోరుకుందాము. బహుశా మన ప్రభువు (మనల్ని కనికరించి) ఇంతకంటే మంచితోట ప్రసాదించవచ్చు.” ఇలాఉంటుంది (ఇహలోక) శిక్ష. పరలోక శిక్ష ఇంతకంటే తీవ్రంగా ఉంటుంది. వీరీ సత్యం తెలుసుకుంటే ఎంత బాగుండు! భయభక్తులుకలవారి కోసం వారిప్రభువు దగ్గర భోగభాగ్యాలతో కూడిన స్వర్గవనాలున్నాయి. మేము విధేయు లైనవారిని, అపరాధులను ఒకే దృష్టితో ఎందుకు చూస్తాం? (31-35)
(మీరిక్కడ అష్టయిశ్వర్యాలు అనుభవిస్తున్నంత మాత్రాన దేవుడు మీపట్ల ప్రసన్ను డయ్యాడని, పరలోకంలోనూ తమకు భోగభాగ్యాలు ప్రసాదిస్తాడని భావిస్తున్నారా?) ఏమైంది మీకు ఇలాంటి నిర్ణయానికొచ్చారు? మీరు కోరుకున్నవన్నీ అక్కడ తప్పక లభి స్తాయని మీరేదైనా గ్రంథంలో చదివారా? అలాంటిగ్రంథం మీదగ్గరుందా? (36-38)
లేక మీరు కోరిందల్లా మీకు లభించడానికి మేము మీకేదైనా ప్రళయందాకా ఉండే వాగ్దానం చేశామా? దీనికి మీలో ఎవరు బాధ్యులని అడుగు. లేక వారి మిధ్యాదైవాలా (దీనికి బాధ్యులు)? అలాగైతే వారు తమ మిధ్యాదైవాలను (సాక్ష్యంగా) తీసుకురావాలి. వారి వాదన నిజమయితే ఈపని చేసితీరాలి మరి. (39-41)
(ప్రాపంచిక మైకపు)తెరలు తొలగి యదార్థం ముందుకొచ్చే రోజు (విశ్వప్రభువుకు) సాష్టాంగప్రణామం చేయడానికి మానవులు పిలవబడతారు. అప్పుడు వీరు సాష్టాంగ పడలేరు. వారి చూపులు క్రిందికి వాలిపోతాయి. నైచ్యం, అవమానం వారిని చుట్టు ముడ్తాయి. (ఇహలోకంలో) నిక్షేపంగా ఉన్నప్పుడు వీరిని సాష్టాంగప్రణామం కోసం పిలవడం జరుగుతుండేది. (కాని వీరప్పుడు తిరస్కరిస్తుండేవారు). (42-43)
సరే, ప్రవక్తా! ఈ వాణిని తిరస్కరించేవారి సంగతి నాకు వదలెయ్‌. మేము వారిని వారికేమాత్రం తెలియనిరీతిలో క్రమేణా పతనాగాధంలోకి నెట్టివేస్తాం. నేను వారిని చూసీ చూడనట్లు వదిలేస్తున్నాను. నా పన్నాగం ఎంతో పకడ్బందీగా ఉంటుంది. (44-45)
(సందేశప్రచారం కోసం) నీవేదైనా ప్రతిఫలం అడుగుతున్నావా, ఆ సుంకం బరువు క్రింద వీరు అణగిపోవడానికి? వారి దగ్గరకు అగోచర విషయాలకు సంబంధించిన సమాచార మేదైనా వస్తోందా, దాన్ని వ్రాసుకోవడానికి? (46-47)
కనుక (ప్రవక్తా!) నీ ప్రభువు నిర్ణయం వచ్చేవరకు ఓపిక పట్టు. మత్స్యబాధితుడిలా (యూనుస్‌ ప్రవక్తలా అసహనంతో) ప్రవర్తించకు. అతను పుట్టెడుదుఃఖంతో (మమ్మల్ని) ఎలుగెత్తి వేడుకున్నాడు. అతడ్ని గనక అతని ప్రభువు కరుణించక పోయివుంటే, అతను దుస్థితికి గురయి, ఎలాంటి చెట్లుచేమలు లేని మైదానంలో విసరేయబడేవాడు. చివరికి అతని ప్రభువు అతడ్ని కటాక్షించి సజ్జనులలో చేర్చాడు. (48-50)
ఈ అవిశ్వాసులు (మా)వాణి వింటున్నప్పుడు నిన్ను మింగివేస్తామన్నట్లు కొరకొర చూస్తారు. ఇది యావత్తు ప్రపంచవాసుల కోసం అవతరించిన హితవాణి. అయినా వీరు (కారుకూతలు కూస్తూ) “ఇతను కచ్చితంగా పిచ్చివాడే” అంటున్నారు. (51-52)