యోగిననుచు గొంత యోగముగూర్చక మార్చు

యోగిననుచు గొంత యోగముగూర్చక
జగమునెల్లబట్ట చంపి తినుచు
ధనము కొఱకు వాడు తగవాడుచుండిన
యోగికాడు వాడె యోగువేమ !

యోనియందె పుట్టి యోనికి రుచిఁజేయు మార్చు

యోనియందె పుట్టి యోనికి రుచిఁజేయు
చన్నుగుడిచి పెరిగి చన్నుఁబట్టు
సృష్టిలోన నడఁగు సిగ్గెఱుగని జీవి
విశ్వదాభిరామ వినర వేమ!

యుగములఁ జల్లగఁ జూచును మార్చు

యుగములఁ జల్లగఁ జూచును
తగలక యుగయుగమునందు తపసుల కైన
వగవక యేవకయుండిన
నిగనిగమనుకాంతి మదిని నిలుచుర వేమా!