వేమన పద్యాలు/ఊ
ఊరకుంట దెలియ నుత్తమయోగంబు
మార్చుఊరకుంట దెలియ నుత్తమయోగంబు
మానసంబు కలిమి మధ్యమంబు
ఆసనాది విధుల నధమ యోగంబురా
విశ్వదాభిరామ వినర వేమ!
ఊరనూరదిరుగు ఉద్యోగ దారియై
మార్చుఊరనూరదిరుగు ఉద్యోగ దారియై
వాడవాడదిరుగు వనితకొరకు
ఏడనేడ దిరిగి ఏరేమి కనిరయా!
విశ్వదాభిరామ వినురవేమ!
ఊరిబావిలోని యుదకమ్ము నిందించి
మార్చుఊరిబావిలోని యుదకమ్ము నిందించి
పాదతీర్థమునకు భ్రమయువారు
పాదతీర్థములను ఫలమేమి కందురా
విశ్వదాభిరామ వినర వేమ!
ఊర్వ్ధలోకమందు నుచితక్రమంబున
మార్చుఊర్వ్ధలోకమందు నుచితక్రమంబున
రూప మేమి లేక రూఢితోను
పరమయోగి చూచు పరమాత్ముఁ డితఁడని
విశ్వదాభిరామ వినర వేమ!
ఊరు ననుచునుండ నొగి సంతసింతురు
మార్చుఊరు ననుచునుండ నొగి సంతసింతురు
అడవియనుచు నుండ నడలుచుందు
రూరు నడవి రెండు నొకటిగాఁ జూచిన
నారితేఱు యోగి యతఁడు వేమా!
ఊరునడిమి బావి యుదకంబుగొని తెచ్చి
మార్చుఊరునడిమి బావి యుదకంబుగొని తెచ్చి
పాద తీర్ధమనుచు భ్రమయజేయ
పాద తీర్ధమన్న ఫలమేమి కద్దురా
విశ్వదాభిరామ వినురవేమ!
ఊరులు పల్లెలు మానుక
మార్చుఊరులు పల్లెలు మానుక
వారక యడవిం జరించువాఁ డరుదెంచు
పెరుగులు కూరలు మెసవెడు
వీఱిఁడికెట మోక్షపదవి వినరా వేమా!