వేమన పద్యాలు/న
నే నెఁవడను తలపెట్టఁగ
మార్చునే నెఁవడను తలపెట్టఁగ
మానసమునఁ దలపకున్న మనుజుని కకటా
కానఁబడు పడకముందే
మానుగఁ గనుగొనఁగవలయు మహిలో వేమా!
నే నెవ్వండని వలపడు
మార్చునే నెవ్వండని వలపడు
మానసమునఁ బుడమిలోని మనుజుండటరా
కానడు తనశవమును దా
మానుగఁ గనుగొనుట యెట్లు మహిలో వేమా!
నీ వాడిన నే నాడుదు
మార్చునీ వాడిన నే నాడుదు
నీవుండిన నేను నుందు నిర్విణ్ణుఁడనై
నీవు తలంచినఁదలఁపుదు
నీవు నగిన నేను నగుదు నిజముగ వేమా!
నక్క వినయములను నయగారములఁ బల్కి
మార్చునక్క వినయములను నయగారములఁ బల్కి
కుడువకెల్ల ధనము కూడఁ బెట్టు
కుక్క బోను వాతఁ గూడు చల్లిన రీతి
విశ్వదాభిరామ వినర వేమ!
నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు
మార్చునిక్కమైన మంచి నీల మొక్కటి చాలు
తళుకు బెళుకు రాళ్లు తట్టె డేల?
చదువఁ బద్య మరయఁ జాలదా యొక్కటి
విశ్వదాభిరామ వినర వేమ!
నిఖిలాకారుం డాతఁడు
మార్చునిఖిలాకారుం డాతఁడు
నిఖిలాత్ముఁడు సర్వసాక్షి నిజముగఁ దానై
నిఖిలంబు నిందుజూఁడగ
నిఖిలంబై యుండు నిచ్చ నిజముగ వేమా!
నీచుల వినుతులు సేయుచు
మార్చునీచుల వినుతులు సేయుచు
యాచకమున తిరిగి తిరిగి యలయుటకంటె
వీచిన నింద్రియపశువులఁ
గాచినవాఁ డిందు నందు ఘనుఁ డగు వేమా!
నిజము కల్ల నెఱిఁగి నిత్యుండు గాఁడాయె
మార్చునిజము కల్ల నెఱిఁగి నిత్యుండు గాఁడాయె
పలుకులోన బిందు పదిలపఱచి
వేడుకైన బిందు వెదఁబెట్టకుండదు
విశ్వదాభిరామ వినర వేమ!
నిజము వరుస నెఱిఁగి నిత్యుండు గావలె
మార్చునిజము వరుస నెఱిఁగి నిత్యుండు గావలె
పలుకులోనిపలుకు పదిలపఱపు
పలుకుఁజూడ నెవరొ పరికించి చూడరా
విశ్వదాభిరామ వినర వేమ!
నిజములాడువాని నిందించు జగమెల్ల
మార్చునిజములాడువాని నిందించు జగమెల్ల
నిజము లాడరాదు నీచుతోడ
నిజమహాత్ముఁగూడ నిజమాడవలయురా
విశ్వదాభిరామ వినర వేమ!
నోటి పుప్పి కెల్ల నొప్పిలేకుంటకు
మార్చునోటి పుప్పి కెల్ల నొప్పిలేకుంటకు
నాకు పోకసున్న మౌషధముగ
పెట్ట కుండెనేని పెనురోఁత వేయురా
విశ్వదాభిరామ వినర వేమ!
నీటిలోన వ్రాఁత నిలువకయున్నట్లు
మార్చునీటిలోన వ్రాఁత నిలువకయున్నట్లు
పాటిజగతిలేదు పరములేదు
మాటమాటకెల్ల మనసు కోరుచునుండు
విశ్వదాభిరామ వినర వేమ!
నాణెమైన చెడిప నయ మెఱింగి తిరుగు
మార్చునాణెమైన చెడిప నయ మెఱింగి తిరుగు
విటుని కుస్తరించు వివర మెఱుఁగు
బానిసైనతొత్తు పాటింపరాదయా
విశ్వదాభిరామ వినర వేమ!
నీతి వైరాగ్యభక్తిని నీచులకును
మార్చునీతి వైరాగ్యభక్తిని నీచులకును
ఫూతకులు కాని జ్ఞానసంకలితులకును
వ్రాల కందని పద్యముల్ వేల సంఖ్య
చేత నందుగ భువినిదాఁ జెప్పె వేమ!
నిత్యంబు కానియొడలికి
మార్చునిత్యంబు కానియొడలికి
నిత్యము దుఃఖమునఁబడును నిరతము ధరలో
నిత్యానందపు పదవికి
నిత్యంబును దుఃఖపడఁగ నేరదు వేమా!
నది నుదకంబులు చనుక్రియ
మార్చునది నుదకంబులు చనుక్రియ
మది నొదవెడు తత్వబుద్ధిమగ్నత లెల్లం
దుది పదవి గలయ ఘనుఁడగు
మదధిఁ బ్రవేశించి గంగ యొప్పున వేమా!
నాదబిందుకళల నయమొంది యాత్మ
మార్చునాదబిందుకళల నయమొంది యాత్మ
యం దంటి చపలచిత్త మమర నిల్పి
బ్రహ్మరంధ్రమునను బ్రబలిన యోగిరా
విశ్వదాభిరామ వినర వేమ!
నిద్రలోనినిద్ర నిజముగాఁ దెలిసిన
మార్చునిద్రలోనినిద్ర నిజముగాఁ దెలిసిన
భద్రమౌను విద్య బ్రహ్మవిద్య
నిద్రదెలియువాఁడు నిర్మలయోగిరా
విశ్వదాభిరామ వినర వేమ!
నిన్నుఁ జూచె నేని తన్నుఁ దా మఱచును
మార్చునిన్నుఁ జూచె నేని తన్నుఁ దా మఱచును
తన్నుఁ జూచె నేని నిన్ను మఱచు;
నే విధమున జనుఁడు నెఱుగు, నిన్నును దన్ను?
విశ్వదాభిరామ వినర వేమ!
నిన్నుఁజూచుచుండ నిండును దత్వంబు
మార్చునిన్నుఁజూచుచుండ నిండును దత్వంబు
తన్నుఁ జూచుచుండఁ దగులు మాయ
నిన్ను నెఱిఁగినపుడె తన్నుఁదా నెఱుఁగును
విశ్వదాభిరామ వినర వేమ!
నమశివ యనవచ్చు నారాయ ణనవచ్చు
మార్చునమశివ యనవచ్చు నారాయ ణనవచ్చు
మేలువారి నమ్మి మెచ్చవచ్చు
కొంగుకాసు విడిచి గొబ్బున నీరాదు
విశ్వదాభిరామ వినర వేమ!
నెయ్యి లేనికూడు నీయాన కసవది
మార్చునెయ్యి లేనికూడు నీయాన కసవది
కూరలేని తిండి కుక్కతిండి
ప్రియములేనికూడు పిండపుఁ గూడురా
విశ్వదాభిరామ వినర వేమ!
నర జన్మము తానెత్తియు
మార్చునర జన్మము తానెత్తియు
పరమాత్మ నెరుంగలేక పాపాత్ముఁడై
కొరగాని పనులొనర్చిన
తిరిగి యధోగతికి నేగు దిరముగ వేమా!
నరకులమునఁ దాఁబుట్టియు
మార్చునరకులమునఁ దాఁబుట్టియు
నరకులమునఁ దాని బెరిగి నరుఁడయ్యును దా
నరకులమును ఛీ ఛీ యని
హరకులమునఁ దిరిగెనేని హరుఁడగు వేమా!
నేర్చి నడుతునన్న నేరమి తా వచ్చు
మార్చునేర్చి నడుతునన్న నేరమి తా వచ్చు
నోర్చి నడతునన్న నోర్పురాదు
కూర్చి నడతునన్నఁ గూడంగ నీయదు
విశ్వదాభిరామ వినర వేమ!
నిరతం బెడతెగ కుండక
మార్చునిరతం బెడతెగ కుండక
బరిపూర్ణ బ్రహ్మ మాత్మపదమున నుండ
నిరవద్యమయిన యడవిని
జరియించును జగమెఱుంగ సత్యము వేమా!
నేరనిజనులకును నేర్పు నేరము లెల్లఁ
మార్చునేరనిజనులకును నేర్పు నేరము లెల్లఁ
జక్కఁజేయరిల నసాధుజనము
లొప్పుదుర్జనులను తప్పుగనెంతురు
విశ్వదాభిరామ వినర వేమ!
నేరనన్నవాఁడు నెరజాణ మహిలోన
మార్చునేరనన్నవాఁడు నెరజాణ మహిలోన
నేర్తునన్నవాఁడు వార్తకాఁడు
ఊరకున్నవాఁడె యుత్తమోత్తముఁ డెందు
విశ్వదాభిరామ వినర వేమ!
నోరెఱిఁగి తాము నేమియు
మార్చునోరెఱిఁగి తాము నేమియు
నేరజంతువులఁ జంపి నెమ్మదిఁ దినునా
క్రూరపు సంకర జాతుల
మారణ మేమందు నింక మహిలో వేమా!
నీరు కార మాయె కారంబు నీరాయె
మార్చునీరు కార మాయె కారంబు నీరాయె
కారమైన నీరుకార మాయె
కారమందు నీరు కడురమ్యమైయుండు
విశ్వదాభిరామ వినర వేమ!
నరుఁడటు పరమాత్మ గురుని జేరునపుడు
మార్చునరుఁడటు పరమాత్మ గురుని జేరునపుడు
హస్తమందె మోక్ష మపుడె చూపు
విఱివిసంపదలను విఱ్ఱవీగినజీవి
పర మెఱుఁగక యమునిపాలు వేమ!
నరుడయినను లేక నారాయణుండైన
మార్చునరుడయినను లేక నారాయణుండైన
తత్వబద్ధుడైన ధరణిమీద
కర్మభావములను ఘనతనొప్పగవలె
విశ్వదాభిరామ వినురవేమ!
నరుడెయైన లేక నారాయణుండైన
మార్చునరుడెయైన లేక నారాయణుండైన
తత్త్వబద్ధుడైన దరణి నరయ
మరణమున్నదనుచు మదిని నమ్మగవలె
విశ్వదాభిరామ వినుర వేమ!
నిరుపేదల రక్షించెడు
మార్చునిరుపేదల రక్షించెడు
సరసుఁడు నెఱవాతగాక సంపన్నులఁ దా
భరియించువాఁడు దాతయె
మెరమెచ్చులదాత యతఁడు మేదిని వేమా!
నల్లబోడితలలు తెల్లనిగొంగళ్లు
మార్చునల్లబోడితలలు తెల్లనిగొంగళ్లు
ఒడల బూడ్దెపూత యొంటిరోఁత
యిట్టివేషములును పొట్టకోసము సుమీ
విశ్వదాభిరామ వినర వేమ!
నీళ్లమీద బుగ్గ నిలచిన యప్పుడు
మార్చునీళ్లమీద బుగ్గ నిలచిన యప్పుడు
తళ్లువేగవచ్చి తాకుఁ గాక
విడెడుకుండకింత విభ్రాంతి పడుదురు
విశ్వదాభిరామ వినర వేమ!
నీళ్లలోన నోడ నిగిడి తిన్నగఁ బ్రాకు
మార్చునీళ్లలోన నోడ నిగిడి తిన్నగఁ బ్రాకు
బైట మూరెడైనఁ బ్రాక లేదు
నెలవు దప్పు చోట నేర్పరి కొఱ గాడు!
విశ్వదాభిరామ వినర వేమ!
నీళ్లలోనిచేప నెఱమాంస మాశకు
మార్చునీళ్లలోనిచేప నెఱమాంస మాశకు
గాలమందుఁజిక్కి కూలినట్లు
ఆశపుట్టి మనుజుఁ డారీతి జెడిపోవు
విశ్వదాభిరామ వినర వేమ!
నీళ్ళ మునుఁగనేల నిధుల మెట్టఁగనేల
మార్చునీళ్ళ మునుఁగనేల నిధుల మెట్టఁగనేల
మొనసి వేల్పులకును మ్రొక్కనేల
కపటకల్మషములు కడుపులో నుండఁగా
విశ్వదాభిరామ వినర వేమ!
నీళ్ళ లోన మొసలి నిగిడి యేనుఁగుఁ బట్టు
మార్చునీళ్ళ లోన మొసలి నిగిడి యేనుఁగుఁ బట్టు
బైట కుక్క చేత భంగ పడును
స్థాన బలిమి గాని తన బలిమి కాదయా
విశ్వదాభిరామ వినర వేమ!
నీళ్ళఁబోసి కడిగి నిత్యంబు శోధించి
మార్చునీళ్ళఁబోసి కడిగి నిత్యంబు శోధించి
కూఁడుబెట్టి మీఁద కోకగట్టి
యేమి పాట్లఁబడుదు రీ దేహమున కిల
విశ్వదాభిరామ వినర వేమ!
నీళ్ళమీఁదజూడు నెఱయ నోడలబల్మి
మార్చునీళ్ళమీఁదజూడు నెఱయ నోడలబల్మి
బట్టబయలఁ జూడు బండిబలిమి
ఆఁడుదాని బలిమి నాడనే చూడరా
విశ్వదాభిరామ వినర వేమ!
నీళ్ళమీదఁ జూడు నెరయ నోడలపర్వు
మార్చునీళ్ళమీదఁ జూడు నెరయ నోడలపర్వు
బయలుమీఁదఁ జూడు పక్షిపర్వు
నాఁడువారిగమన మీలాగు నుండురా
విశ్వదాభిరామ వినర వేమ!
నవ్వును చదువును పాడును
మార్చునవ్వును చదువును పాడును
నొవ్వక తానిట్లు మెచ్చు నుడువును మఱచు
నివ్వటిలియుండు ముదిమియు
నివ్విధమునఁ జూడఁజూడ నెవ్వడు వేమా!
నీవు నిలిచియుండు నిఖిలంబు నిలువదు
మార్చునీవు నిలిచియుండు నిఖిలంబు నిలువదు
నిలిచియుండు నెండు నీరువలెను
నీవు నిశ్చయంబు నిఖిలంబు మాయయౌ
విశ్వదాభిరామ వినర వేమ!
నీవుగలుగుచోటు నెళువు దెలియువాఁడు
మార్చునీవుగలుగుచోటు నెళువు దెలియువాఁడు
వసుధయందు త్రోవ వదలఁ డెందుఁ
కాలు కదలనీక గ్రక్కునఁ జేరురా
విశ్వదాభిరామ వినర వేమ!
నాసికంబునడుమ ననుఁజూచు యోగికి
మార్చునాసికంబునడుమ ననుఁజూచు యోగికి
వాసి వన్నె లేదు వసుధలోన
కాశినాథునైనఁ గనఁగలఁ డాయోగి
విశ్వదాభిరామ వినర వేమ!
నొసలు బత్తుఁడయ్యె నోరు తోడే లయ్యె
మార్చునొసలు బత్తుఁడయ్యె నోరు తోడే లయ్యె
మనసు భూతమువలె మలయఁగాను
శివునిఁ గనియె నన్నసిగ్గెట్లు గాదొకొ
విశ్వదాభిరామ వినర వేమ!
నూఱుపలుకవచ్చు నొకటి వ్రాయఁగరాదు
మార్చునూఱుపలుకవచ్చు నొకటి వ్రాయఁగరాదు
వ్రాఁతకన్న సాక్షి వలవ దెన్న
పరగవ్రాతలేని పక్షానికప్పుడు
సుద్దిసాక్షి తగనిబుద్ధి వేమా
నడుచునిచ్చు నతని బత్తెమిచ్చిన వాని
మార్చునడుచునిచ్చు నతని బత్తెమిచ్చిన వాని
కడుపు చల్లజేసి ఘనత విడుచు
నడుప నేర నేర నతడు నాలి ముచ్చేగదా
విశ్వదాభిరామ వినురవేమ!
నలుగురు కల చోటను దా
మార్చునలుగురు కల చోటను దా
దల చూపుచు మెలగుచుండి ధన్యాత గనగా
దలచెడి యాతడు నిచ్చలు
గల మాటలే పలుకుచుండగా దగు వేమా!
నిజమాకల్ల రెండు నీలకంఠుడెఱుంగు
మార్చునిజమాకల్ల రెండు నీలకంఠుడెఱుంగు
నిజములాడకున్న నీతిదప్పు
నిజములాడునపుడు నీ రూపమనవచ్చు
విశ్వదాభిరామ వినుర వేమ!
నిజము తెలిసియున్న సుజినుడానిజమునె
మార్చునిజము తెలిసియున్న సుజినుడానిజమునె
పలుకవలయుగాని పరులకొరకు
చావకూడ దింక నోపదవ్యం పల్క
విశ్వదాభిరామ వినురవేమ!
నిమిషమైనను మది నిల్చి నిర్మలముగ
మార్చునిమిషమైనను మది నిల్చి నిర్మలముగ
లింగ జీవావేశులను గాంచి భంగపడక
పూజ మదియందు జేరుట పూర్ణపదవి
పరము గోరిన నిదిచేయ బాగు వేమా !
నీవనినను నేననినను
మార్చునీవనినను నేననినను
భావమ్మున నెఱుకయొక్క పద్ధతియగునా
భావంబు దెలిసి మదిని
ర్భావముగా నిన్ను గనుట పరమగు వేమా
నీళ్ల మునుగునేల? నిధుల మెట్టగనేల
మార్చునీళ్ల మునుగునేల? నిధుల మెట్టగనేల
మొనసి వేల్పులకును మ్రొక్కనేల
కపట కల్మషములు కడుపులో నుండగా
విశ్వదాభిరామ వినుర వేమ!
నేయి వెన్న కాచి నీడనే యుంచిన
మార్చునేయి వెన్న కాచి నీడనే యుంచిన
బేరి గట్టిపడును పెరుగురీతి
పోరిపోరి మదిని పోనీక పట్టుము
విశ్వదాభిరామ వినురవేమ !