వేమన పద్యాలు/ఘ
ఘంటారావము మదిలో
మార్చుఘంటారావము మదిలో
వింటిన్నే కంటఁగంటి విమలపుకాంతి
వెంటాడక బ్రహ్మంబును
గంటిని వగ కాదు నన్నుఁ గనుగొన వేమా!
ఘటము జలములందు గగనంబు కనఁబడు
మార్చుఘటము జలములందు గగనంబు కనఁబడు
ఘటము జలము లేమి గగనమేది
ఘటములోన జ్యోతిఁ గ్రమమునఁ దెలియుఁడీ
విశ్వదాభిరామ వినర వేమ!
ఘటముఁగాన్గఁజేసి కామ మెద్దుగఁజేసి
మార్చుఘటముఁగాన్గఁజేసి కామ మెద్దుగఁజేసి
తెలిసి కర్మములను తిలలుఁ జేసి
తెలిసి గాను గాఁడు తిలకార కాత్మయు
విశ్వదాభిరామ వినర వేమ!