శ్రద్దాత్రయవిభాగ యోగము
భగవద్గీత - తెలుగు అనువాదము (శ్రద్దాత్రయవిభాగ యోగము) | సంస్కృత శ్లోకములు→ |
యే శాస్త్రవిధిముత్సృజ్య
మార్చుఅర్జునుడన్నాడు:కృష్ణా! ఎవరైనా శాస్త్ర విధిని వదిలిపెట్టి శ్రద్ధతో ఆరాధిస్తే వాళ్ళ నిష్ట ఎలాంటిది?సాత్వికమా, రాజసికమా, తామసికమా?
త్రివిధా భవతి శ్రద్ధా
మార్చుశ్రీ భగవానుడన్నాడు:మనుష్యుల శ్రద్ధ సాత్వికము, రాజసికము, తామసికము అని మూడు విధాలుగా ఉంటుంది. అది స్వభావం నుండి జనిస్తుంది. వాటిని గురించి విను.
సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా
మార్చుఅర్జునా! ప్రతివారిలోని వ్యక్తి యొక్క స్వభావాన్ని అనుసరించి అతని శ్రద్ధ ఉంటుంది. ఈ మానవుడు శ్రద్ధా మయుడు. ఎవరి శ్రద్ధ ఎటువంటిదో వాళ్ళ వ్యక్తిత్వం అటువంటిది ఔతుంది.
యజన్తే సాత్త్వికా
మార్చుసాత్వికులు దేవతలను, రాజసికులు యక్షరాక్షసులను, తామసికులు భూత ప్రేత గణాలను ఆరాధిస్తారు.
అశాస్త్రవిహితం ఘోరం
మార్చుఢంభాహంకారాలతో, ప్రబలమైన కామరాగాలతో కూడి శాస్త్ర విరుద్ధమైన, పీడా కరమైన తపస్సు చేసే వారూ,
కర్షయన్తః శరీరస్థం
మార్చుతెలివి తక్కువగా శరీరంలోని జీవకణాలనూ, శరీరంలో ఉండేనన్ను కూడా హింసించే వాళ్ళు అసురిక నిశ్చయం కలవారని తెలుసుకో.
ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో
మార్చుమానవులకు మూడు విధాలైన ఆహారం ప్రియమౌతుంది. యజ్ఞమూ, తపస్సూ, దానమూ కూడా అలాగే ఉంటుంది. వాటిలోని భేదాన్ని విను.
ఆయుఃసత్త్వబలారోగ్యసుఖప్రీతివివర్ధనాః
మార్చుఆయువు సత్వగుణం, బలం, ఆరోగ్యం, సుఖం ప్రీతి వీటిని పెంచేవీ, రసంతో నిండినివీ, జిడ్డుతో నిగనిగలాడేవీ, కడుపులో చాలా కాలం ఉండేవీ, మనస్సునాకర్షించేవీ అయిన ఆహారాలు సాత్వికులకు ప్రియంగా ఉంటాయి.
కట్వమ్లలవణాత్యుష్ణతీక్ష్ణరూక్షవిదాహినః
మార్చుచేదూ, పులుపూ, ఉప్పూ, వేడీ, కారమూ, అన్నీ అతిగా కలిగి, పొడిపొడిగా ఉండి, దాహం పుట్టిస్తూ, దుఃఖాన్నీ, శోకాన్నీ, రోగాన్నీ కలిగించేవి రాజసికులకు ఇష్టం.
యాతయామం గతరసం
మార్చువండిన తరువాత ఝాము దాటి పోయినదీ, రుచి పూర్తిగా పోయినదీ, పాసిపోయినదీ, వాసన గొట్టుతుందీ, ఎంగిలిదీ, అశుభ్రమైనదీ అయిన భోజనం తామసికులకు ఇష్టం.
అఫలాకాఙ్క్షిభిర్యజ్ఞో
మార్చుఫలాపేక్ష లేకుండా, శాస్త్రాలలో విధింపబడిన ప్రకారంగానూ, తను ఆ కర్మ చేయడం కర్తవ్యమనే స్థిర చిత్తంతో చేయబడే యజ్ఞం సాత్విక యజ్ఞం.
అభిసంధాయ తు ఫలం
మార్చుఅర్జునా! ఫలాన్ని ఆశిస్తూనో, డంభం కోసంమో చేయబడే యజ్ఞం రాజసిక యజ్ఞం అని తెలుసుకో
విధిహీనమసృష్టాన్నం
మార్చుశాస్త్ర విధి లేకుండా అన్నదానం చేయకుండా, మంత్రాలు లేకుండా, దక్షిణ ఇవ్వకుండా, శ్రద్ధ లేకుండా చేయబడే యజ్ఞం తామసిక యజ్ఞం అని చెప్పబడుతుంది.
దేవద్విజగురుప్రాజ్ఞపూజనం
మార్చుదేవతలను, బ్రాహ్మణులను, గురువులను, విద్వాంసులను పూజించడం, శుచిత్వం, సూటియైన ప్రవర్తన, బ్రహ్మచర్యం అహింస ఇవి శారీరక తపస్సులు.
అనుద్వేగకరం వాక్యం
మార్చుఇతరులను బాధింపనిదీ, సత్యనమూ, ప్రయమూ, హితమూ అయిన వాక్కు, స్వాధ్యాన్ని అభ్యసించడమూ ఇది వాచికమైన తపస్సు.
మనః ప్రసాదః సౌమ్యత్వం
మార్చుప్రసన్నమైన మనస్సూ, మంచితనమూ, మౌనమూ, మనోనిగ్రహమూ, శుద్ధమైన భావాలూ-ఇవి మానసిక తపస్సు.
శ్రద్ధయా పరయా తప్తం
మార్చుపై మూడు రకాల తపస్సు పూర్తి శ్రద్ధతో, ఏ లాభమూ కోరకుండా, నిగ్రహంచేత చేయబడినప్పుడు, సాత్వికమైన తపస్సుగా చెప్పబడుతుంది.
సత్కారమానపూజార్థం
మార్చుసత్కారంకోసమూ, మాన మర్యాద కోసమూ డంభంతోనూ ఏ తపస్సు చేయబడుతుందో దానిని నిలకడా, స్తిరత్వమూ లేని రాజసిక తపస్సుఅంటారు.
మూఢగ్రాహేణాత్మనో
మార్చుసరిగ్గా అర్ధం చేసుకోకుండా, తన్ను తాను హింసించు కుంటూ లేదా ఇతరుకలకు పీడా కరంగా చేయబడే తామసికము అనబడుతుంది.
దాతవ్యమితి యద్దానం
మార్చుదానం చేయడం కర్తవ్యం అనేభావంతో, తిరిగి ఉపకారం చేయని వారికి దేశకాల పాత్రలని చూచి, చేసిన దానం సాత్వికమని చెప్పబడుతుంది.
యత్తు ప్రత్యుపకారార్థం
మార్చుప్రత్యుపకారం ఊద్దేశించిగాని, ఫలాన్ని ఆశించిగాని, బలవంతంగానూ, భాధపడుతూ ఇచ్చే దానిని రాజిసిక దాన మంటారు.
అదేశకాలే యద్దానమపాత్రేభ్యశ్చ
మార్చుఅపాత్రునికి, తగని తగని సమయంలో, ఇవ్వకూడని చోట, అగౌరవంతో, అవమానిస్తూ ఇచ్చేది తామసిక దానమని చెప్పబడుతుంది.
ఓంతత్సదితి నిర్దేశో
మార్చుఓం తత్ సత్ అనే బ్రహ్మపదార్ధన్ని నిర్ధేశించే మూడు సంకేతాలని చెప్పబడుతుంది, వీటితోనే పూర్వం బ్రాహ్మణులు, వేదాలు, యజ్ఞాలు ఏర్పరుపబడినాయి.
తస్మాదోమిత్యుదాహృత్య
మార్చుఅందుచేత "ఓం"అంటూ బ్రహ్మవాదుల చేత శాస్త్ర విధాన ప్రకారం నిత్యమూ యజ్ఞ దాన తపః కర్మలు చేయబడు తున్నాయి.
తదిత్యనభిసన్ధాయ ఫలం
మార్చు"తత్"అంటూ మోక్షాన్ని కాక్షించే వారు ఫలం ఆశించకుండా, వివిధాలైన యజ్ఞాలూ, తపస్సులూ చేస్తుంటారు.
సద్భావే సాధుభావే
మార్చుపరమసత్యానికీ, మంచితనానికి సూచనగా "సత్"అనే పదాన్ని ప్రయోగిస్తారు. అర్జునా! మంచి కర్మలకు కూడా"సత్"అనే పదం ప్రయోగిప పడుతుంది.
యజ్ఞే తపసి దానే
మార్చుయజ్ఞ దాన తపస్సులలో నిలిచి ఉండడం"సత్"అని చెప్పబడుతుంది. దాని కోసం చేసే కర్మని కూడా "సత్"అనే అంటారు.
అశ్రద్ధయా హుతం దత్తం
మార్చుఅలాంటిఅర్జునా! శ్రద్ధలేని హోమం, దానం, తపస్సు, మరి యే క్రియ అయినా సరే అది"అసత్"అని చెప్పబడుతుంది. అలాంటి కర్మ ఇహంలో కానీ, పరంలో కానీ ఫలం ఇవ్వదు.
భగవద్గీత - తెలుగు అనువాదము | సంస్కృత శ్లోకములు→ |