భగవద్గీత - తెలుగు అనువాదము (విభూతి యోగము)




భూయ ఏవ మహాబాహో

మార్చు

శ్రీ భగవానుడు ఇలా చెప్పాడు:- ఓమహానుభావా! అర్జునా! నా మాటలకు సంతోషిస్తున్న నీకు మేలు కలగాలని, నేను చెప్తున్న శ్రేష్టమైన ఈ మాటలు మళ్ళీ విను.

న మే విదుః సురగణాః

మార్చు

నా పుట్టుకను గురించి దేవతలుకాని మహర్షులుకాని ఎరుగరు. దేవతలు మహర్షులు అందరికన్నా పూర్వపు వాణ్ణి నేను.

యో మామజమనాదిం

మార్చు

పుట్టుకా మొదలులేని వాడిగానూ, లోకాలకు ప్రభువుగాను నన్ను తెలుసుకున్న వాడు మనుష్యులలో జ్ఞాని అయి అన్ని పాపాలనుండి విముక్తి చెందుతాడు.

బుద్ధిర్జ్ఞానమసంమోహః

మార్చు

తెలివి, జ్ఞానం, మోహరాహిత్యము, ఓర్పు, సత్యము, మనో నిగ్రహము, సుఖ దుఃఖాలు, ఉండడమూ, లేకపోవడమూ, భయాభయాలు (నా వలననే కలుగుతాయి)

అహింసా సమతా

మార్చు

అహింస, సమత్వము, తృప్తి, తపస్సు, దానము, యశస్సు, అపయశస్సు మొదలైన వేరు వేరు భావాలు జీవుళ్ళలో నా వలననే కలుగుతాయి.

మహర్షయః సప్త పూర్వే

మార్చు

సృష్టి ఆరంభంలో ఉన్న సప్తఋషులు, నలుగురు మనువులు నా సంకల్పము వలన పుట్టిన వారే. వారి నుండి ఈ ప్రజలు వచ్చారు.

ఏతాం విభూతిం యోగం

మార్చు

ఈ నా విభూతి యోగాన్ని అసలు తత్వములో తెలుసుకున్నవాడు, చలించని యోగంలో నిలిచి పోతాడు. ఇందులో సందేహము లేదు.

అహం సర్వస్య ప్రభవో

మార్చు

నేను అన్నిటి పుట్టుకకి హేతువుని నా వలననే సమస్తమూ నడుస్తుందని తెలుసుకున్న వివేకులు భక్తి పూరితులై నన్ను సేవిస్తారు.

మచ్చిత్తా మద్గతప్రాణా

మార్చు

తమ మనసులను నాలో లీనము చేసి జీవితాలను నాకే అర్పించి, నన్ను గురించే పరస్పరమూ బోధించుకుంటూ, చెప్పుకుంటూ నిత్యమూ తృప్తి పడతారు, ఆనందిస్తారు.

తేషాం సతతయుక్తానాం

మార్చు

అలాసతతమూ మనసు నాయందుంచి, ప్రీతితో సేవించే వారికి నన్ను చేరుకోవడానికి కావలసిన జ్ఞానయోగాన్ని నేను కలుగచేస్తాను.

తేషామేవానుకమ్పార్థమహమజ్ఞానజం

మార్చు

వారిని కనికరించడం కోసమే నేను వారి మనస్సులలో నిలిచి, వారి అజ్ఞాన తమస్సుని ప్రకాశించే జ్ఞానదీపంతో నశింపజేస్తాను.

పరం బ్రహ్మ పరం ధామ

మార్చు

అర్జునుడు ఇలా అన్నాడు:- నీవు పరబ్రహ్మవి, పరంధాముడివి, పరమ పవిత్రుడివి, శాశ్వతుడివి, దివ్యుడివి, పరమ పురుషుడివి ఆది దేవుడివి. , పుట్టుక లేనివాడివి.

ఆహుస్త్వామృషయః సర్వే

మార్చు

అని అందరూ ఋషులు, దేవర్షి నారదుడూ, అలాగే అశితుడూ, దేవలుడూ, వ్యాసుడూ అంటారు. స్వయంగా నీవుకూడా అలాగే చెబుతున్నావు.

సర్వమేతదృతం మన్యే

మార్చు

కేశవా! నీవు నాతో చెప్పినదంతా నిజమేనని విశ్వశిస్తున్నాను నీవ్యక్త శరీరాన్ని దేవతలుకాని దానవులు కాని ఎరుగరు.

స్వయమేవాత్మనాత్మానం

మార్చు

భూత భావనుడా! భూతేశా! జగత్పతీ! పురుషోత్తమా! నిన్ను నీవే నీచేతనే స్వయంగా ఎరుగుదువు.

వక్తుమర్హస్యశేషేణ దివ్యా

మార్చు

ఏయేవిభూతులలో నీవు ఈలోకమంతటా వ్యాపించి వున్నావో ఆదివ్యమైన విభూతులను అశేషంగా చెప్పడానికి నీవే తగినవాడివి.

కథం విద్యామహం

మార్చు

ఓయోగీ! సదాధ్యానిస్తూ నేను నిన్ను ఎలా తెలుసుకోగలను?భగవంతుడా ఏయేరూపాలతో నిన్ను ధ్యానించవచ్చు?

విస్తరేణాత్మనో యోగం

మార్చు

ఓజనార్ధనా! నీ యోగాన్ని విభూతిని విస్తారంగా చెప్పు. అమృతతుల్యమైన నీమాటలు ఎంత విన్నా నాకు తృప్తి తీరదు.

హన్త తే కథయిష్యామి

మార్చు

శ్రీ భగవానుడన్నాడు:అర్జునా! నా దివ్య విభూతులలో ముక్యమైన వాటిని ఇప్పుడు నీకు చెబుతాను. నా విస్తారానికి అంతు అంటూ లేదు.

అహమాత్మా గుడాకేశ

మార్చు

గుడాకేశా! నేను అన్ని ప్రాణుల హృదయాలలో ఉంటాను. ప్రాణుల అది మధ్యంతాలు(సృష్టి స్థితి లయాలు)నేనే.

ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం

మార్చు

నేను ఆదిత్యులలో విష్ణువుని, వెలిగించే వాళ్ళలో కిరనాలు కలిగిన సూర్యుడిని. మరుత్తులలో మరీచినీ, నక్షత్రాలలో చంద్రుడిని.

వేదానాం సామవేదోఽస్మి

మార్చు

నేను వేదాలలో సామవేదాన్ని, దేవతలలో ఇంద్రుడిని, ఇంద్రియాలళో మనస్సుని, ప్రాణులలో చేతనత్వాన్ని.

రుద్రాణాం శంకరశ్చాస్మి

మార్చు

నేను రుద్రులలో శంకరుణ్ణి, యక్ష రాక్షసులలో కుబేరుడిని, వసువులలో పావకుడిని, పర్వతాలలో మేరువుని.

పురోధసాం చ ముఖ్యం

మార్చు

అర్జునా! నేను పురోహితులలో శ్రేష్టుడైన బ్రుహస్పతిని. సేనానాయకులలో కుమారస్వామిని, సరసులలో సాగరాన్ని అని తెలుసుకో.

మహర్షీణాం భృగురహం

మార్చు

మహర్షులలో భ్రుగువుని, శబ్దాలలో ఏకాకషరమైన ఓంకారాన్ని. యజ్ఞాలలో జపయజ్ఞాన్ని, స్థావరాలలో హిమాలయాన్ని.

అశ్వత్థః సర్వవృక్షాణాం

మార్చు

నేను వృక్షాలలో రావి చెట్టుని. దేవర్షులలో నారదుణ్ణి. గంధర్వులలో చిత్రరధుణ్ణి, సిద్ధులలో కపిల మునిని.

ఉచ్చైఃశ్రవసమశ్వానాం

మార్చు

నేను గుర్రాలలో అమౄతంతో పుట్టిన ఉచ్చైశ్వాన్ని, ఏనుగులలో ఇరావతాన్ని, మనుష్యులలో రాజుని.

ఆయుధానామహం వజ్రం

మార్చు

నేను ఆయుధాలలో వజ్రాన్ని. గోవులలో కామధేనువుని. పుట్టించేవాళ్ళల్లో మనమధుడిని, సర్పాలలో వాసుకిని.

అనన్తశ్చాస్మి నాగానాం

మార్చు

నేను నాగులలో అనంతుడిని, జలచరాలలో వ్రుణూడిని, పీరులలో ఆర్యముడిని, సమ్యమవంతులలో నిగ్రహాన్ని.

ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం

మార్చు

నేను దైత్యులలో ప్రహ్లాదుడీని, లెక్కలు కట్టేవాళ్ళల్లొ కాలాన్ని, మృగాలలో మృగేంద్రుడిని, పక్షులలో గరుత్మంతుడిని.

పవనః పవతామస్మి

మార్చు

నేను పావనం చేసేవాళ్ళల్లో వాయువుని శస్త్రధారులలో రాముడిని, జలచరాలలో ముసలిని, నదులలో గంగని.

సర్గాణామాదిరన్తశ్చ

మార్చు

అర్జునా! సృష్టులన్నిట్లో ఆదిమధ్యాంతాలు నేనే. విద్యలలో ఆధ్యాత్మ విద్యని, వాదించేవాళ్ళల్లో వాదాన్ని నేనే.

అక్షరాణామకారోఽస్మి ద్వన్ద్వః

మార్చు

నేను అక్షరాలలో అకారాన్ని, సమాసాలలో ద్వంద్వ సమాసాన్ని, నాశనంలేని కాలాన్ని. సర్వతోముఖంగా ఉండే ఈశ్వరుడిని.

మృత్యుః సర్వహరశ్చాహముద్భవశ్చ

మార్చు

నేను సర్వాన్ని హరించే మృత్యువుని, భవిష్యత్తులో ఊదయించబోయే వారి పుట్టుకని, స్త్రీలలో కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధా, ధృతి, క్షమా గుణాలు కూడానేనే.

బృహత్సామ తథా సామ్నాం

మార్చు

అలాగే నేను సామాలలో బృహత్సామాన్ని, చందస్సులలో గాయత్రిని, మాసాలలో మార్గశీర్షాన్ని, ఋతువులలో వసంత ఋతువుని.

ద్యూతం ఛలయతామస్మి

మార్చు

నేను మోసాలలో జూదాన్ని, తేజోవంతులలో తేజాన్ని, జయాన్ని ప్రయత్నాన్ని, సాత్వికులలో సత్వాన్ని.

వృష్ణీనాం వాసుదేవోఽస్మి

మార్చు

నేను వృష్టి వంశస్తులలో వాసుదేవుడిని, పాండవులలో, అర్జునుడిని, మునులలో వ్యాసుడిని, కవులలో శుక్రాచార్యుడిని.

దణ్డో దమయతామస్మి

మార్చు

శాసకులలో దండమూ, జయంకోరేవాళ్ళల్లోని నీతీ, రహస్యాలలో మౌనమూ, జ్ఞానులలో జ్ఞానమూ నేనే.

యచ్చాపి సర్వభూతానాం

మార్చు

అర్జునా! అన్ని ప్రాణుల యొక్క మూలకారణం నేను. చరాచర ప్రపంచంలో నేను లేనిదంటూ ఏదీ లేదు.

నాన్తోఽస్తి మమ దివ్యానాం

మార్చు

అర్జునా! నా దివ్యమైన విభూతులకు అంతులేదు. నా విభూతుల విస్తారాన్ని క్లుప్తంగానే చెప్పాను.

యద్యద్విభూతిమత్సత్త్వం

మార్చు

విశిష్టమైన గుణమూ, శోభా, శక్తీ కలిగినది ఏది ఉన్నదో ఆ ప్రతిదీ నా తేజము నుండి పుట్టినదని తెలుసుకో.

అథవా బహునైతేన

మార్చు

అర్జునా ఇన్ని మాటలు దేనికి ఈ యావత్ప్రపంచాన్ని నేను ఒక్క అంశతో భరించి నిలిచి ఉన్నాను.



భగవద్గీత - తెలుగు అనువాదము




భగవద్గీత సంస్కృతము (శ్లోకములు)
అథ ప్రథమోऽధ్యాయః | అథ ద్వితీయోऽధ్యాయః | అథ తృతీయోऽధ్యాయః | అథ చతుర్థోऽధ్యాయః | అథ పఞ్చమోऽధ్యాయః | అథ షష్ఠోऽధ్యాయః | అథ సప్తమోऽధ్యాయః | అథాష్టమోऽధ్యాయః | అథ నవమోऽధ్యాయః | అథ దశమోऽధ్యాయః | అథైకాదశోऽధ్యాయః | అథ ద్వాదశోऽధ్యాయః | అథ త్రయోదశోऽధ్యాయః | అథ చతుర్దశోऽధ్యాయః | అథ పఞ్చదశోऽధ్యాయః | అథ షోడశోऽధ్యాయః | అథ సప్తదశోऽధ్యాయః | అథాష్టాదశోऽధ్యాయః | గీతా మహాత్మ్యము
భగవద్గీత - తెలుగు అనువాదము
అర్జునవిషాద యోగము | సాంఖ్య యోగము | కర్మ యోగము | జ్ఞాన యోగము | కర్మసన్యాస యోగము | ఆత్మసంయమ యోగము | జ్ఞానవిజ్ఞాన యోగము | అక్షరపరబ్రహ్మ యోగము | రాజవిద్యారాజగుహ్య యోగము | విభూతి యోగము | విశ్వరూపసందర్శన యోగము | భక్తి యోగము | క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము | గుణత్రయవిభాగ యోగము | పురుషోత్తమప్రాప్తి యోగము | దైవాసురసంపద్విభాగ యోగము | శ్రద్దాత్రయవిభాగ యోగము | మోక్షసన్యాస యోగము | గీతా మహాత్మ్యము