అక్షరపరబ్రహ్మ యోగము


భగవద్గీత - తెలుగు అనువాదము (అక్షరపరబ్రహ్మ యోగము)




కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం

మార్చు

అర్జునుడిలా ఆడిగాడు: - పురుషోత్తమా! ఆ బ్రహ్మ ఏది?ఆధ్యాత్మం ఏది?కర్మ అంటే ఏమిటి?ఆధి భూతమని దేనిని అంటారు?ఆది దైవతమని దేనిని అంటారు.

అధియజ్ఞః కథం

మార్చు

మధుసూధనా! ఈ శరీరంలో ఎలా ఉన్నాడు?నిగ్రహ వంతులచేత మరణ సమయంలో నీవు ఎలా తెలియ బడతావు.

అక్షరం బ్రహ్మ పరమం

మార్చు

శ్రీ కృష్ణ భగవానుడు ఇలా చెప్పాడు: - పరమైనదీ బ్రహ్మము. ఆయన యొక్క స్వభావము ఆధ్యాత్మ మనబడుతుంది. జీవరాశిని పుట్టించే సృష్టి కార్యమునే కర్మ అంటారు.

అధిభూతం క్షరో భావః

మార్చు

నర శ్రేష్టుడా! నశించి పోయే తత్వం ఆది భూతం. జీవుడు ఆధి దైవతం. జీవుళ్ళలో ఆధి యజ్ఞుణ్ణి నేనే.

అన్తకాలే చ మామేవ

మార్చు

అంతకాలంలో కూడా నన్నే స్మరించుకుంటూ ఎవరు శరీరాన్ని వదిలి వెళుతున్నారో, అతడు నాతత్వాన్నే పొందుతాడు. ఇందులో సందేహంలేదు.

యం యం వాపి స్మరన్భావం

మార్చు

కుంతీ కుమారా మరణ సమయంలో ఏవిషయాన్ని స్మరిస్తూ కళేబరాన్ని వదులుతారో, నిత్యమూ ఆ విషయాన్నే తలచుకోవడం చేత దానినే పొందుతారు.

తస్మాత్సర్వేషు కాలేషు

మార్చు

అందుచేత నువ్వు అన్ని కాలాలలోనూ నన్నే స్మరించు, యుద్ధం చెయ్యి. మనో బుద్ధులను నాకు సమర్పించిన నీవు నన్నే పొందుతావు. ఈ విషయంలో సందేహం లేదు.

అభ్యాసయోగయుక్తేన

మార్చు

అర్జునా అభ్యాస యోగంతో కూడుకొని మనస్సు ఇతర విషయాలకు పోనప్పుడు, నిరంతర చింతన వలన దివ్యమైన పరమ పురుషుణ్ణి చేరుకుంటావు.

కవిం పురాణమనుశాసితార

మార్చు

సర్వజ్ఞుడు, సనాతనుడు, శాసకుడు, సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు, అందరిని భరించే వాడు, చింతించడానికి అలవికాని రూపం కల వడూ, సూర్యుని వలె తేజో వంతుడూ, తపస్సుకి అతీతమైన వాడూ, అయిన పురుషుణ్ణి ఎవరు నిత్యమూ ధ్యానిస్తారో,

ప్రయాణకాలే మనసాచలేన

మార్చు

అతడు ప్రాణం వదిలి పోయే సమయంలో చలించని మనసుతో, భక్తిని కలిగి ఉండి, యోగ బలంతో, ప్రాణాన్ని కనుబొమల మధ్య చక్కగా నిలిపి దివ్య మైన ఆపరమ పురుషుణ్ణి చేరుకుంటారు.

యదక్షరం వేదవిదో వదన్తి

మార్చు

వేదవేత్తలు దేనిని నాశనం లేనిదిగా చెబుతారో, రాగ రహితులైన రచయితలు దేనిని చేరుకుంటారో, దేనిని కోరి బ్రహ్మచర్యంలో చరిస్తారో ఆ పదాన్ని నీకు సంగ్రహంగా చెబుతాను.

సర్వద్వారాణి సంయమ్య మనో

మార్చు

ఇంద్రియ ద్వారాలన్ని నిరోధించి, మనసును ఆత్మలో నిలిపి, శిరస్సులో తన ప్రాణశక్తిని నిలబెట్టి యోగ నిష్టని అవలంబించాలి.

ఓమిత్యేకాక్షరం బ్రహ్మ

మార్చు

బ్రహ్మ వాచకమైన ఓం అనే ఏకాక్షరాన్ని ఉచ్చరిస్తూ, ఎప్పుడూ నన్ను స్మరిస్తూ, ఎవరు శరీరం విడిచి పెడతారో అతడు పరమ గతిని చేరుకుంటాడు.

అనన్యచేతాః సతతం

మార్చు

అర్జునా మనస్సు ఇతర విషయాలవైపు వెళ్ళ నీయకుండా, నిత్యమూ, నిరంతరమూ నన్ను ఎవరు స్మరిస్తారో నిత్య యుక్తుడైన ఆ యోగికి నేను సులభుణ్ణి.

మాముపేత్య పునర్జన్మ

మార్చు

పరమ పదమైన నామోక్ష పదాన్ని పొందిన మహాత్ములు, దుఃఖానికి ఉనికి పట్టూ, అశాశ్వతమూ అయిన పునర్జన్మని పొందరు.

ఆబ్రహ్మభువనాల్లోకాః

మార్చు

అర్జునా! బ్రహ్మ లోకం వరకూ అన్ని లోకాలూ తిరిగి వచ్చేవే (పునర్జన్మను ఇచ్చేవే). నన్ను చేరితే మాత్రం పునర్జన్మ ఉండదు.

సహస్రయుగపర్యన్తమహర్యద్బ్రహ్మణో

మార్చు

వేయి మహా యుగాలు బ్రహ్మకు ఒక పగటి కాలం. వేయి మహా యుగాలు బ్రహ్మకుఒక రాత్రి కాలం. ఇది తెలిసిన వారు అహో రాత్రుల గురించి తెలిసిన వారు.

అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః

మార్చు

బ్రహ్మ దేవునుని పగటి కాలంలో అవ్యక్తములో నుండి చరాచర వస్తు జాలమంతా జనిస్తుంది. రాత్రి కాగానే అవ్యక్తమన బ్రహ్మము లోనే అంతా లీనమై పోతుంది.

భూతగ్రామః స ఏవాయం

మార్చు

అర్జునా ఈ జీవ సముదాయమే కర్మ వశంగా అనేక జన్మలు ఎత్తుతూ (బ్రహ్మకు)రాత్రికాగానే నశిస్తుంది.

పరస్తస్మాత్తు భావోऽన్యోऽవ్యక్తోऽవ్యక్తాత్సనాతనః

మార్చు

ఆ అవ్యక్త ప్రకృతికంటే, భిన్నమూ, ఉత్తమమూ, ఇంద్రియాలకు గోచరం కానిదీ, సనాతనమూ అయిన భావం(పరమాత్మ)ప్రాణులన్నీ నశించినా నశించకుండా ఉంటుంది.

అవ్యక్తోऽక్షర ఇత్యుక్తస్తమాహుః

మార్చు

ఇంద్రియాలకు గోచరం కానిదీ, నాశనం లేనిదీ, అని చెప్ప బడిన ఆ పరమాత్మ భావమేచేరవలసిన ఉత్తమ మార్గమని ఋషులు చెబుతారు. దేనిని పొందితే ప్రాణులు జన్మించరో అదే, ఆ సర్వోత్తమ స్థానమే నేను.

పురుషః స పరః పార్థ భక్త్యా

మార్చు

అర్జునా ఎవనిలో అన్ని ప్రాణులు ఉన్నాయో, ఎవరు అంతటా వ్యాపించి ఉన్నారో ఆ పరమ పురుషుడు అనన్య భక్తి వలననే లభిస్తాడు.

యత్ర కాలే త్వనావృత్తిమావృత్తిం

మార్చు

భరతకుల శ్రేష్టుడా! ఏకాలంలో శరీరం వదిలి వెళ్ళిన యోగులు తిరిగి జన్మించరో. ఏ కాలంలో శరీరం విడిచి వెళ్ళిన యోగులు తిరిగి జన్మిస్తారో, ఆ కాలం గురించి చెబుతాను విను.

అగ్నిర్జ్యోతిరహః శుక్లః షణ్మాసా

మార్చు

అగ్ని, పగలు, శుక్లపక్షం, ఆరు నెలలు ఉత్తరాయణం అనే మార్గంలో బ్రహ్మ విధులు బ్రహ్మను చేరుకుంటారు.

ధూమో రాత్రిస్తథా కృష్ణః

మార్చు

పొగ, రాత్రి, కృష్ణపక్షం ఆరు నెలలు దక్షిణాయనం అనే మార్గంలో ప్రయాణించిన యోగి చంద్రుని జ్యోతిని పొంది తిరిగి వస్తాడు.

శుక్లకృష్ణే గతీ హ్యేతే

మార్చు

జగత్తులో శుక్ల, కృష్ణ అనే ఈరెండు మార్గాలు శాశ్వతం అని భావించబడుతున్నాయి. మొదటి దానివలన పునర్జమ కలగదు. రెండవ దాని వలన కలుగుతుంది.

నైతే సృతీ పార్థ జానన్యోగీ

మార్చు

పార్ధా ఈ రెండు మార్గాలను ఎరిగిన ఏ యోగీ భ్రమించడు. అందుచేత అన్ని కాలాలలోను నీవు యోగయుక్తుడివి కా.

వేదేషు యజ్ఞేషు

మార్చు

వేదాలు, యజ్ఞాలు, తపస్సులుదానాలలో ఏ పుణ్య ఫలం చెప్ప బడినదో దానినంతటిని ఇది అధిగమిస్తుంది. దీని ఎరిగిన యోగి ప్రధానమైన పరమమైన స్థానాన్ని అందుకుంటాడు.



భగవద్గీత - తెలుగు అనువాదము




భగవద్గీత సంస్కృతము (శ్లోకములు)
అథ ప్రథమోऽధ్యాయః | అథ ద్వితీయోऽధ్యాయః | అథ తృతీయోऽధ్యాయః | అథ చతుర్థోऽధ్యాయః | అథ పఞ్చమోऽధ్యాయః | అథ షష్ఠోऽధ్యాయః | అథ సప్తమోऽధ్యాయః | అథాష్టమోऽధ్యాయః | అథ నవమోऽధ్యాయః | అథ దశమోऽధ్యాయః | అథైకాదశోऽధ్యాయః | అథ ద్వాదశోऽధ్యాయః | అథ త్రయోదశోऽధ్యాయః | అథ చతుర్దశోऽధ్యాయః | అథ పఞ్చదశోऽధ్యాయః | అథ షోడశోऽధ్యాయః | అథ సప్తదశోऽధ్యాయః | అథాష్టాదశోऽధ్యాయః | గీతా మహాత్మ్యము
భగవద్గీత - తెలుగు అనువాదము
అర్జునవిషాద యోగము | సాంఖ్య యోగము | కర్మ యోగము | జ్ఞాన యోగము | కర్మసన్యాస యోగము | ఆత్మసంయమ యోగము | జ్ఞానవిజ్ఞాన యోగము | అక్షరపరబ్రహ్మ యోగము | రాజవిద్యారాజగుహ్య యోగము | విభూతి యోగము | విశ్వరూపసందర్శన యోగము | భక్తి యోగము | క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము | గుణత్రయవిభాగ యోగము | పురుషోత్తమప్రాప్తి యోగము | దైవాసురసంపద్విభాగ యోగము | శ్రద్దాత్రయవిభాగ యోగము | మోక్షసన్యాస యోగము | గీతా మహాత్మ్యము