దైవాసురసంపద్విభాగ యోగము
భగవద్గీత - తెలుగు అనువాదము (దైవాసురసంపద్విభాగ యోగము) | సంస్కృత శ్లోకములు→ |
అభయం సత్త్వసంశుద్ధిర్జ్ఞానయోగవ్యవస్థితిః
మార్చుఅభయం సత్వసుద్ధి జ్ఞానయోగంలో నిలవడం, ఇంద్రియ నిగ్రహం, యజ్ఞం, స్వాధ్యాయం, తపస్సు, నిజాయితీ(దైవీ పురుషుడికి కలుగుతాయి)
అహింసా సత్యమక్రోధస్త్యాగః
మార్చుఅహింస, సత్యం, కోపము లేకపోవడం, మృదుస్వభావం, సిగ్గు, చాపల్యం లేకపోవడం
తేజః క్షమా ధృతిః
మార్చుతేజస్సు, ఓర్మి, పట్టుదల, శుచిత్వం, ద్రోహచింతన లేకపోవడం, అభిమాన రాహిత్యం. . . అర్జునా! ఇవి దైవీ సంపదతో పుట్టిన వానికి కలుగుతాయి.
దమ్భో దర్పోऽభిమానశ్చ క్రోధః
మార్చుఅర్జునా! దంభం, దర్పం, అభిమానం, క్రోధం, పరుషత్వం, అజ్ఞానం. . . ఈ లక్షణాలు అసుర సంపదతో పుట్టిన వానికి కలుగుతాయి.
దైవీ సంపద్విమోక్షాయ
మార్చుదైవీ సంపద మోక్షానికి, అసుర సంపద సంసార బంధానికి కారణం. అర్జునా! విచారించకు, నీవు దైవీ సంపదతోనే పుట్టావు.
ద్వౌ భూతసర్గౌ లోకేऽస్మిన్దైవ
మార్చుఈ లోకంలో దైవం, అసురం అని ప్రాణుల సృష్టి రెండు రకాలు. దైవసృష్టిని గురించి విస్తారంగా చెప్పబడినది. అర్జునా! అసుర సృష్టి గురించివిను.
ప్రవృత్తిం చ నివృత్తిం చ
మార్చుఅసుర స్వభావం కలవారు ప్రవృత్తిని కాని నివృత్తిని గాని ఎరుగరు. వాళ్ళలో శౌచమూ, ఆచారమూ, సత్యమూ ఉండవు.
అసత్యమప్రతిష్ఠం తే
మార్చుజగత్తు మిధ్య అనీ, దానికి ధర్మా ధర్మాలు ఆధారము ఉండవని, ఈశ్వరుడే లేడనీ ఈ ప్రపంచములోని ప్రాణులు స్త్రీ పురుషుల కలయిక వలననే పుట్టినదనీ వారు అంటారు. అందుచేత ఈ జగత్తుకి కారణం కామమే అంటారు అసుర జనులు.
ఏతాం దృష్టిమవష్టభ్య
మార్చుఈ దృష్టినే పట్టుకుని వేలాడుతూ వీళ్ళు ధర్మ భ్రష్టులై సంకుచిత బుద్ధులై, ప్రపంచానికి శత్రువులై, కౄరకర్ములై లోక నాశనం కోసం పుడతారు.
కామమాశ్రిత్య దుష్పూరం
మార్చువాళ్ళుతృప్తి పరచడానికి వీలులేనంత కోరికలను పెట్టుకొని దంభ, మాన, మదాలతో నిండి, భ్రాంతి వలన అసత్యమైన వాటి వెంట అనాచారంగా ప్రవర్తిస్తారు.
చిన్తామపరిమేయాం
మార్చువాళ్ళు మరణించే వరకు అపరిమితములైన యోచనలలో మునిగి తేలుతూ, కామ భోగాలు తప్ప జీవితానికి వేరే లక్ష్యం లేదని నిశ్ఛయించుకున్న వాళ్ళు.
ఆశాపాశశతైర్బద్ధాః
మార్చువాళ్ళు వందలాది ఆశా పాశాలతో కట్టుబడి, కామక్రోధాలకు వశులై తమ కామభోగానికిగాను, అన్యాయంగానైనా సరే సంపదలను సమకూర్చుకోవాలని అనుకుంటారు.
ఇదమద్య మయా
మార్చుఈ రోజు ఇంత సంపద నాకు లభించింది. ఈ కోరికలని తీర్చుకుంటాను. ఇంత ధనం నాకుంది. ఇక ముందు ఇంకా ఇంత ధనం వస్తుంది.
అసౌ మయా హతః
మార్చుఈ శత్రువు నాచే చంపబడినాడు, ఇతరులను కూడా చంపేస్తాను. నేను ఈశ్వరుణ్ణి, భోగిని, సిద్ధుణ్ణి, బలవంతుణ్ణి, సుఖిని.
ఆఢ్యోऽభిజనవానస్మి
మార్చునేను ధనవంతుణ్ణి, కులమున్న వాడిని, నాకు సమానులు ఎవరున్నారు?యజ్ఞం చేస్తాను. దానాలిస్తాను, సంతోషిస్తాను ఇలా అజ్ఞానంతో భ్రాంతి చెందుతారు.
అనేకచిత్తవిభ్రాన్తా
మార్చుఅనేక రకాల ఆలోచనలతో భ్రాంత చిత్తులై అజ్ఞానపు వలలో చిక్కుకొని, కామభోగాలలో మరులుగొని అపవిత్రమైన నరకంలో పడతారు.
ఆత్మసంభావితాః స్తబ్ధా
మార్చుతమని తాము మెచ్చుకునే వాళ్ళు, మొండి వారు ధన మాన మదాలతో కూడుకుని, గుడ్డి వాళ్ళై దంభం కోసం శాస్త్ర పద్ధతిని వర్ణించి నామమాత్రంగా యజ్ఞాలు చేస్తారు.
అహంకారం బలం దర్పం
మార్చుఅహంకారాన్ని, బలాన్ని, దర్పాన్ని, కామ క్రోధాలను ఆశ్రయించుకొని, తమలోను, ఇతరులలోను ఉన్న నన్ను ద్వేషించే కౄరులు, దుష్టులు నరాధములను నేను నిత్యము అసురీ యోనుల్లోకి విసిరేస్తాను.
తానహం ద్విషతః
మార్చుఇలా నన్ను ద్వేషించే కౄరులు, దుష్టులు, నరాధములను నిత్యమూ నేను అసురీ యోనుల్లోకి విసిరేస్తాను.
ఆసురీం యోనిమాపన్నా
మార్చుఅర్జునా! అసురీ జన్మను పొందిన మూర్ఖులు ప్రతి జన్మలోను నన్ను చేరకుండానే ఇంకా అధోగతికి పోతారు.
త్రివిధం నరకస్యేదం ద్వారం
మార్చుఆత్మ నాశనానికి దారి తీసే నరక ద్వారాలు మూడు-కామం, క్రోధం, లోభం. అందుచేత ఈ మూడింటిని త్యజించాలి.
ఏతైర్విముక్తః కౌన్తేయ
మార్చుకౌంతేయా! నరక ద్వారాలైన ఈ కామ క్రోధ లోభాలు మూడింటి నుండి విడుదల పొందిన నరుడు, తనకు శ్రేయస్సును కలిగించే కర్మలు చేస్తాడు. దాని వలన పరమగతిని పొందుతాడు.
యః శాస్త్రవిధిముత్సృజ్య
మార్చుతన కోరికల కారణంగా శాస్త్రాన్ని ఉల్లంఘించి ప్రవర్తించిన వాడు కార్యసిద్ధిని పొందడు. సుఖాన్ని పరమగతిని కూడా పొందడు.
తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే
మార్చుఅందుచేత కర్తవ్యాన్ని, అకర్తవ్యాన్నినిర్ధారించుకోవడానికి శాస్త్రం ప్రమాణం. శాస్త్రం చెప్పిన విధిని తెలుసుకుని ఇక్కడ నీవు కర్మ చెయ్యడం మంచిది.
భగవద్గీత - తెలుగు అనువాదము | సంస్కృత శ్లోకములు→ |