కర్మ యోగము
భగవద్గీత - తెలుగు అనువాదము (కర్మ యోగము) | సంస్కృత శ్లోకములు→ |
జ్యాయసీ చేత్కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దనా తత్కిమ్ కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ
మార్చుఅర్జునుడు ఇలా అన్నాడు; జనార్ధనా! నీ అభిప్రాయంలో కర్మ కంటే జ్ఞానమే ఎక్కువైతే కేశవా! ఘోరకర్మలో నన్ను ఎందుకు నియోగించుతావు?
వ్యామిశ్రేణేవ వాక్యేన
మార్చుఅయోమయమైన మాటలతో నా బుద్ధికి భ్రాంతిని కలిగిస్తున్నావు.ఏది నాకు శ్రేయమో దానిని నిశ్చయముగా చెప్పు.
లోకేऽస్మిన్ ద్వివిధా నిష్ఠా
మార్చుభగవంతుడు ఇలాపలికాడు; పాప రహితుడా ఈ లోకంలో సాంఖ్యులకు జ్ఞానయోగం చేతను యోగులకు కర్మయోగం చేతను సాధన, సృష్టికి ముందే నాచేత చెప్పబడినది.
న కర్మణామనారమ్భాన్నైష్కర్మ్యం
మార్చుకర్మలను చేయనంత మాత్రాన నిష్కర్మ సిద్ధి కలగదు.కేవలం సన్యసించడం వలన సరైన సిద్ధి కలగదు.
న హి కశ్చిత్క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్|
మార్చుఎవరూ ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేరు.ప్రకృతి జన్యమైన గుణాల వలన అన్ని కర్మలు అవశ్యంగానే చేయబడుతున్నాయి.
కర్మేన్ద్రియాణి సంయమ్య య
మార్చుఎవరైతే కర్మేంద్రియాలను నిగ్రహించి మనస్సులో ఇంద్రియ విషయాలను స్మరిస్తూ ఉంటాడో,అతడు పరమ మూర్ఖుడు,కపటాచారి అని పిలవ బడతాడు.
యస్త్విన్ద్రియాణి మనసా
మార్చుఅర్జునా;జ్ఞానేంద్రియాలను మనస్సు ద్వారా నిగ్రహించి,కర్మేంద్రియాల ద్వారా అసక్త భావంతో కర్మయోగాన్ని ఎవరు ప్రారంభిస్తాడో అతడు విశిష్టుడు అవుతాడు.
నియతం కురు కర్మ త్వం
మార్చునీ విధ్యుక్త కర్మని నీవు చెయ్యి;కర్మ మానడం కంటే కర్మ చేయడం మేలు.కర్మ చేయకపోతే శరీర యాత్ర జరగదు.
యజ్ఞార్థాత్కర్మణోऽన్యత్ర
మార్చుయజ్ఞం కోసం చేసే కర్మలకంటే ఇతర కర్మలతో ఈ లోకం బంధింప బడి ఉన్నది.కుంతీకుమారా యజ్ఞ కర్మలనే సంగమము వదిలి కర్మలను చక్కగా చెయ్యి.
సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా
మార్చుయజ్ఞాలతో సహా ప్రజలను శృష్టించి ప్రజాపతి పూర్వం ఇలాచెప్పాడు.యజ్ఞం వలన మీరు వృద్ధి పొందండి.అది మీ ఇష్ట కామధేనువు.
దేవాన్భావయతానేన
మార్చుదేవతలను ఈ యజ్ఞంలో ఆరాధించండి.ఆదేవతలు మిమ్మలను అనుగ్రహిస్తారు.
ఇష్టాన్భోగాన్హి వో దేవా
మార్చుయజ్ఞం చేత ఆరాధించబడిన దేవతలు మీకు ఇష్ట భోగాలను ఇస్తారు.వారికి ఏమీ సమర్పించకుండా వాళ్ళు ఇచ్చిన వాటిని అనిభవించేవాడు చోరుడే అవుతాడు .
యజ్ఞశిష్టాశినః సన్తో
మార్చుయజ్ఞంలో దేవతలకు ఇవ్వగా మిగిలినది తినేసజ్జనుడు అన్ని పాపాలనుండి విముక్తుడు అవుతాడు.తమ కోసం మాత్రం ఎవరు వండు కునే పాపాత్ములు వాళ్ళు పాపాన్నే తింటారు.
అన్నాద్భవన్తి భూతాని
మార్చుఅన్నము వలన జీవులు పుట్టును,అన్నము మేఘము వలన పుట్టును,మేఘము యజ్ఞము వలన పుట్టును,యజ్ఞము కర్మ వలననే సంబవము.
కర్మ బ్రహ్మోద్భవం
మార్చుకర్మ బ్రహ్మదేవుని వలన జనించినది ఆ బ్రహ్మ అనంతమైన పరమాత్మ వలన ఉద్భవించాడు.కాబట్టి సర్వ వ్యాపకమగు పర బ్రహ్మము నిత్యమూ యజ్ఞములో ప్రతిష్టితమై ఉంటుందని తెలుసుకో.
ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః| అఘాయురిన్ద్రియారామో మోఘం పార్థ స జీవతి|| 3-16 ||
మార్చుఇలా పరిభ్రమించే చక్రాన్ని అనుసరించని వాడు పాపి,ఇంద్రియలోలుడు,అర్జునా;అతడు జీవించడం వ్యర్ధం.
యస్త్వాత్మరతిరేవ
మార్చుఆత్మలోనే రమిస్తూ,ఆత్మలో తృప్తి పడుతూ,ఆత్మలోనే పరిపూర్ణ తృప్తిని పొందే వాడికి చేయదగిన కార్యమంటూ లేదు.
నైవ తస్య కృతేనార్థో
మార్చుఅతడికి పని చేయడం వలన ప్రయోజనం కాని ,మానడంవలన దోషం ఏమీ ఉండదు.తన ప్రయోజనం కోసం సమస్త ప్రాణులలోనూ దేనిపైనా ఆధారపడడు.
తస్మాదసక్తః సతతం
మార్చుఅందుచే కర్మఫలములందు ఆసక్తి లేనివాడై తన ధర్మముగా భావించి మానవుడు కర్మ నాచరింపవలెను. ఆసక్తి లేకుండ పనిచేయుటచే మానవుడు పరమసత్యమును పొందును.
కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా
మార్చుజనకుడు మొదలైన వారు(నిస్కామ)కర్మల ద్వారానే మోక్షాన్ని పొందారు.లోకకల్యాణాన్ని దృష్టిలో ఉంచుకుని అయినా కర్మ చేయడమే నీకు తగును.
యద్యదాచరతి
మార్చుశ్రేష్టుడు దేనినైతే ఆచరిస్తాడో దానినే ఇతర జనులు ఆచరిస్తారు.అతడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో దానినే లోకం అనుసరిస్తుంది.
న మే పార్థాస్తి కర్తవ్యం
మార్చుఅర్జునా నాకు ఈ మూడు లోకాలలో చేయవలసిన పని లేదు.ఇంతకు ముందు పొందకుండా ఉన్నది ముందు పొందవలసినది ఏమీలేదు.అయిననూ కర్మలలో వర్తిస్తాను.
యది హ్యహం న వర్తేయం
మార్చుఅర్జునా;నేను విశ్రాంతి లేకుండా నిరంతరం పని చేయకపోతే,మనుష్యులు అన్ని విధాల నామార్గమే అనుసరిస్తారు.
ఉత్సీదేయురిమే లోకా
మార్చునేను కర్మలు చేయకపోతే ఈలోకాలన్నీ నశించి పోతాయి.వర్ణ సంకరానికి కారకుడనౌతాను.ఈ ప్రజలను నాశనం చేసిన వాడనౌతాను.
సక్తాః కర్మణ్యవిద్వాంసో
మార్చుఅర్జునా;అజ్ఞానులు కర్మతో మునిగి తేలుతూ ఎలా పని చేస్తారో వివేకి లోక శ్రేయస్సు కోరుతూ అలాగే పని చేయాలి.
న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం
మార్చుకర్మలలో ఇరుక్కు పోయిన అజ్ఞానుల బుద్ధిని వివేకి చెదర కొట్టరాదు.తాను యోగంలో నిలిచి చక్కగా పని చేస్తూ వాళ్ళని ఆ మార్గంలో నడుస్తూ కర్మలాచరించేలా ప్రోత్సహించాలి.
ప్రకృతేః క్రియమాణాని
మార్చుప్రకృతి గుణాల వలన అన్ని కర్మలు నిర్వహింప బడతాయి.అహంకార వలన భ్రమించిన మూఢుడూ తానే కర్తనని తలపోస్తాడు.
తత్త్వవిత్తు మహాబాహో
మార్చుమహాబలుడా;గుణకర్మ విభాగాల తత్వం తెలిసిన వాడుగుణాలు గూణాలలో వర్తిస్తాయని తెలిసి ఆ కర్మలలో తగుల్కోడు.
ప్రకృతేర్గుణసంమూఢాః
మార్చుప్రకృతి యొక్క గుణాల వలన మోహంలో పడిన వారు గుణ కర్మలలో మునుగుతుంటారు.సరిగా తెలియని మంద బుద్ధులను సర్వం తెలిసిన జ్ఞాని చెదర కొట్టరాదు.
మయి సర్వాణి కర్మాణి
మార్చుసర్వ కర్మలను నాయందు సమర్పించి,చిత్తాన్ని ఆత్మలో నిలిపి,ఆశా మమకారాలను వదిలి,ఆరాటాన్ని విసర్జించి యుద్ధం చెయ్యి.
యే మే మతమిదం
మార్చునాయీ మతాన్ని ఏమానవులు మత్సరం లేకుండా ఆచరిస్తారో వాళ్ళు కూడా కర్మల నుండి విడుదల పొందుతారు.
యే త్వేతదభ్యసూయన్తో
మార్చుఎవరైతే అసూయాపరులై నా ఈ మతాన్ని అనుష్టించరో ఆ తెలివితక్కువ వాళ్ళు సర్వ జ్ఞానములనుండి వంచితులై నశించిపోతారని తెలుసుకో.
సదృశం చేష్టతే స్వస్యాః
మార్చుజ్ఞానవంతుడైనా తన ప్రకృతి ననుసరించే వ్యవహరిస్తాడు.ప్రాణులు తమ ప్రకృతిని అనుసరిస్తాయి.నిగ్రహమేమి చేస్తుంది.
ఇన్ద్రియస్యేన్ద్రియస్యార్థే
మార్చుప్రతి ఇంద్రియ విషయంలోను రాగాద్వేషాలు ఉంటాయి కర్మయోగి వాటికి లోబడ రాదు.అవే అతనికి శత్రువులు.
శ్రేయాన్స్వధర్మో విగుణః
మార్చుబాగా ఆచరించిన పర ధర్మం కన్నా లోపభూయిష్టమైనది ఐనా స్వధర్మం మేలు.పర ధర్మం భయంకర మైనది.
అథ కేన ప్రయుక్తోऽయం
మార్చుఅర్జునుడు ఇలాఅడిగాడు; కృష్ణా ఇష్టం లేకపోయినా ఎవరో బలవంత పెడుతున్నట్లు మానవుడు పాపం ఎందుకు చేస్తున్నాడు?ఆ ప్రేరణశక్తి ఎవరిది?ఎవరి కారణంగా పాపం చేస్తాడు?
కామ ఏష క్రోధ ఏష
మార్చుశ్రీ భగవానుడన్నాడు; ఇవి కామము,క్రోధము,రజోగుణం నుండి ఉద్భవిస్తాయి.దానికి మహా ఆకలి.అది పాపిష్టిది.ఈలోకంలో అందరికి అదేశత్రువని తెలుసుకో.
ధూమేనావ్రియతే
మార్చుఅగ్నిని పొగ ఆవరించినట్లు,అద్దాన్ని దుమ్ము కప్పినట్లు,గర్భస్త శిశువుని మావి కప్పినట్లు జ్ఞానాన్ని కామం కప్పి వేస్తుంది.
ఆవృతం జ్ఞానమేతేన
మార్చుకామం తృప్తి పరచడానికి వీలులేని అగ్ని వంటిది.ఇది జ్ఞానానికి నిత్య శత్రువు.దీనితోజ్ఞాని జ్ఞానం కప్పబడి ఉంటుంది.
ఇన్ద్రియాణి మనో
మార్చుఇంద్రియాలు మనస్సు,భుద్ధి,కామానికి ఆధార స్థానాలు అని చెప్పబడుతున్నాయి.ఈ కామం జ్ఞానాన్ని కప్పి వేసి ఇంద్రియాల ద్వారా దేహధారిని వ్యామోహ పరుస్తుంది.
తస్మాత్త్వమిన్ద్రియాణ్యాదౌ
మార్చుఅందువలన భరత కుల శ్రేష్టుడా;ముందుగానీవు ఇంద్రియాలని నిగ్రహించి,జ్ఞాన విజ్ఞానాలను నాశనం చేసే పాపిష్టి కామాన్ని నిర్మూలించు.
ఇన్ద్రియాణి పరాణ్యాహురిన్ద్రియేభ్యః
మార్చుఇంద్రియాలు గొప్పవని చెబుతారు.ఇంద్రియాలకన్నా అధికమైనది మనస్సు.మనస్సు కన్నాగొప్పది బుద్ధి,బుద్ధి కంటే శ్రేష్టమైనది ఆత్మ.
ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా
మార్చుమహాబాహుడా ఇలా ఆత్మను బుద్ధికన్నా ఎక్కువైన దానిగా తెలుసుకొని నిన్ను నీవు నిగ్రహించుకొని,కామరూపి అయిన శత్రువుని జయించు.
భగవద్గీత - తెలుగు అనువాదము | సంస్కృత శ్లోకములు→ |