జ్ఞాన యోగము
భగవద్గీత - తెలుగు అనువాదము (జ్ఞాన యోగము) | సంస్కృత శ్లోకములు→ |
ఇమం వివస్వతే యోగం
మార్చుశ్రీ కృష్ణభగవానుడు పలికినది:- అవ్యయమైన ఈ కర్మయోగాన్ని నేను సూర్యుడికి భోదించాను.సూర్యుడు మనువుకి చెప్పాడు.మనువు ఇక్ష్వాకుడికి చెప్పాడు.
ఏవం పరమ్పరాప్రాప్తమిమం
మార్చుఇలా పరంపరగా ప్రాప్తమైన కర్మయోగాన్ని రాజర్షులుఎరుగుదురు.ఓ పరంతపా కాలగతిలో ఈ గొప్పయోగం ఈ లోకంలో నశించి పోయింది.
స ఏవాయం మయా
మార్చుఆ సనాతనమైన యోగాన్నే నా భక్తుడవు,స్నేహితుడవు ఐన నీకు భోధించాను.ఇది ఉత్తమమైనదీ రహస్యమైనదీ కూడా.
అపరం భవతో జన్మ
మార్చుఅర్జునుడు ఇలా అడిగాడు:- నీ జన్మ ఇటీవలది.సూర్యుని జన్మ ఎంతో ముందున్నది.నీవు సూర్యునికి ఉపదేశించావని అన్నావు.దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి?
బహూని మే వ్యతీతాని
మార్చుశ్రీ కృష్ణభగవానుడు ఇలా పలికాడు:- అర్జునా! నాకూ నీకూ కూడా ఎన్నో జన్మలు గడిచిపోయాయి.నేను వాటన్నిటిని ఎరుగుదును.నీవు ఎరుగవు.
అజోऽపి సన్నవ్యయాత్మా
మార్చుజన్మ లేనివాడినీ,అవ్యయుడినీ,జీవులందరికి అధిపతినైనా,నాప్రకృతిని అధిరోహించి నామాయవలన జన్మిస్తుంటాను.
యదా యదా హి ధర్మస్య
మార్చుఅర్జునా! ఎప్పుడు ధర్మము క్షీణించి అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడు నన్ను నేను సృజించుకుంటాను.
పరిత్రాణాయ సాధూనాం
మార్చుసాధువులను రక్షించడానికి,దుష్టులను నాశనం చేయడానికీ,ధర్మాన్ని నెలకొల్పడానికి యుగ యుగంలోను నేను జన్మిస్తాను.
జన్మ కర్మ చ మే దివ్యమేవం
మార్చుఅర్జునా! దివ్యమైన నా జన్మ కర్మల తత్వాన్ని ఎవరు యధార్ధంగా తెలుసుకుంటారో,అతడు ఈ శరీరాన్ని వదలిన తరవాత తిరిగి పుట్టడు.
వీతరాగభయక్రోధా
మార్చురాగ భయ క్రోధాలను విడిచి నన్ను గురించిన ఆలోచనలతో నిండి నన్ను ఆశ్రయించిన వారు ఎందరో జ్ఞానతపస్సు వలన నన్ను అందుకున్నారు.
యే యథా మాం ప్రపద్యన్తే
మార్చుఅర్జునా నన్ను ఎవరు ఎలా కొలిస్తే నేను వారిని అలాగే అనుగ్రహిస్తాను.మనుష్యులెప్పుడూ నాజాడలోనే సంచరిస్తారు.
కాఙ్క్షన్తః కర్మణాం సిద్ధిం
మార్చుకర్మల ఫలితాన్ని కోరుకునే వాళ్ళు దేవతలను ఆరాధిస్తారు,మానవ లోకంలో కర్మల వలన కలిగే ఫలం త్వరగా లభిస్తుంది కదా!
చాతుర్వర్ణ్యం మయా సృష్టం
మార్చునాలుగు విదాలైన వర్ణాలు గుణ కర్మల విభజనలను అనుసరించి నా వలన సృష్టించ బడ్డాయి.వాటిని సృష్టించిన వాడినైనా,నేను కర్తను కాననీ,మార్పులేని వాడిననీ తెలుసుకో.
న మాం కర్మాణి లిమ్పన్తి
మార్చునన్ను కర్మలంటవనీ నాకు కర్మ ఫలంలో కోరిక లేదనీ ఎరిగినవాడు కర్మలచేత కట్టుబడడు.
ఏవం జ్ఞాత్వా కృతం కర్మ
మార్చుఇది తెలుసుకొనియే పూర్వం ముముక్షువుల చేత కర్మ చేయబడినది.అందువలన పూర్వీకుల చేత పూర్వం చేయబడినట్లే నీవు కూడా నిష్కామ కర్మనే చేయి.
కిం కర్మ కిమకర్మేతి
మార్చుకర్మ ఏది అకర్మ ఏది అనే విషయంలో ఋషులు సైతం భ్రాంతిలో పడతారు.దేనిని తెలుసుకుంటే నీవు అశుభం నుండి విముక్తి పొందుతావో ఆ కర్మ విషయం నీకు చెబుతాను.
కర్మణో హ్యపి బోద్ధవ్యం
మార్చుకర్మల గురించి తెలుసుకోవాలి.వికర్మల అకర్మల గురించి కూడా తెలుసుకోవాలి.కర్మల యొక్క స్వభావం చాలా నిగూఢమైనది.
కర్మణ్యకర్మ యః పశ్యేదకర్మణి
మార్చుకర్మలో అకర్మనీ అకర్మలో కర్మనీ ఎవరు దర్శిస్తారో అతడు మనుష్యులలో అందరికంటే బుద్ధిమంతుడు.అతడే యోగి యావత్తు కర్మని పూర్తిగా చేసిన వాడవుతాడు.
యస్య సర్వే సమారమ్భాః
మార్చుఎవరు కామసంకల్పం లేకుండా అన్ని కర్మలను చక్కగా ప్రారంభిస్తారో,జ్ఞానాగ్నిలో కర్మలన్నిటినీ కాల్చివేసిన అతణ్ణి వివేకి అని విద్వాంసులంటారు.
త్యక్త్వా కర్మఫలాసఙ్గం
మార్చుకర్మ ఫలంతో సంగాన్ని వదిలి నిత్యతృప్తుడై దేనిమీద ఆధారపడని వాడై,కర్మలలో నిమగ్నుడై ఉండేవాడు ఏకర్మనీ చేయని వాడే అవుతాడు.
నిరాశీర్యతచిత్తాత్మా
మార్చుఆశలేక,మనశరీరాలను నిగ్రహించి,అన్నిటియందు పరిగ్రహ భావాన్ని వదిలి,కేవలం శరీరంతో కర్మ చేసేవాడు ఏ పాపాన్నీ పొందడు.
యదృచ్ఛాలాభసంతుష్టో
మార్చుయాదృచ్చికంగా లభించిన దానితో సంతృప్తుడై,ద్వందాలకు అతీతుడై,మాత్సర్యం లేకుండా,ఫలం లభించినపుడు కూడా సమంగా ఉండేవాడు కర్మ చేసినా బద్ధుడు కాడు.
గతసఙ్గస్య ముక్తస్య
మార్చుసంగభావం పోయి ముక్తుడై,జ్ఞానంలో నిలిచిన మనస్సుతో యజ్ఞం కోసం ఆచరించే వాని కర్మ పూర్తిగా నశిస్తుంది.
బ్రహ్మార్పణం బ్రహ్మ
మార్చుకర్మనే బ్రహ్మమని స్థిరంగా భావించే వారకి బ్రహ్మమే హవిస్సు,బ్రహ్మమనే అగ్నిలో బ్రహ్మం చేత అర్పించ బడుతుంది.అతనిచే అందుకో బడిన గమ్యం కూడా బ్రహ్మమే
దైవమేవాపరే యజ్ఞం
మార్చుకొందరు యోగులు దైవ యజ్ఞాన్నే చక్కగా చేస్తారు.కొందరు బ్రహ్మమనే అగ్నిలో యజ్ఞం ద్వారా యజ్ఞాన్ని (తనలోని జీవభావాన్ని)అర్పిస్తారు.
శ్రోత్రాదీనీన్ద్రియాణ్యన్యే
మార్చుశ్రవణం మొదలైన ఇంద్రియాలను కొందరూ నిగ్రహమనే అగ్నిలో వేల్చుతారు.మరి కొందరు ఇంద్రియము అనే అగ్నిలో శబ్ధాది విషయాలను వేల్చుతారు.
సర్వాణీన్ద్రియకర్మాణి
మార్చుమరికొందరు జ్ఞానేంద్రియ,కర్మేంద్రియ కర్మలన్నింటిని జ్ఞానంతో వెలిగింపబడిన మనస్సంయమనమనే అగ్నిలో వేల్చుతారు.
ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా
మార్చుమరికొందరు కఠినమైన నియమాలతో ప్రయత్నం చేస్తూ ద్రవ్య,తపో,యోగ,స్వాధాయ,జ్ఞాన యజ్ఞాలుగా కలిగి ఉన్నారు.
అపానే జుహ్వతి ప్రాణం
మార్చుఅలాగే ప్రాణాయామ పరాయణులైన మరి కొందరు ఉచ్వాస నిచ్వాసములను నిరోధించి ఆపానానికి ప్రాణాన్ని ప్రాణాన్ని ఆపానానికి ఆహుతులుగా అర్పిస్తారు.
అపరే నియతాహారాః
మార్చుమరికొందరు నియమితమైన ఆహారాన్ని స్వీకరిస్తూ,ప్రాణాన్ని ప్రాణానికి ఆహుతులుగా అర్పిస్తారు.వీరందరూ యజ్ఞానాలను ఎరిగినవారే.యజ్ఞం వలన కల్మషాలను హరింప చేసుకుంటారు.
యజ్ఞశిష్టామృతభుజో
మార్చుఅర్జునా! యజ్ఞములో సమర్పించగా మిగిలిన ఆహారం అమృతము.యజ్ఞము చేయని వారికి ఈ లోకమేలేదు,పరలోకమెక్కడ?
ఏవం బహువిధా
మార్చుఈ విధంగా అనేక విధాల యజ్ఞాలు వేదాలలో విస్తరించబడి ఉన్నాయి.అవి అన్నీ కర్మల వలన జనిస్తాయని తెలుసుకో.ఇలా తెలుసుకుంటే విముక్తుడవు అవుతావు.
శ్రేయాన్ద్రవ్యమయాద్యజ్ఞాజ్జ్ఞానయజ్ఞః
మార్చుఅర్జునా! పరంతపా! ద్రవ్యంతో చేసేయజ్ఞంకంటే జ్ఞాన యజ్ఞం శ్రేష్టమైనది.అన్ని రకాల కర్మలూ జ్ఞానంలో లీనమౌతాయి.
తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన
మార్చుజ్ఞానాన్ని ఆత్మార్పణభావం,సేవ,ప్రశ్నించడం ద్వారా తెలుసుకో,జ్ఞానులు,తత్వవేత్తలూ ఐనవారు నీకు ఉపదేశిస్తారు.
యజ్జ్ఞాత్వా న పునర్మోహమేవం
మార్చుఅర్జునా! దేనిని పొందాక తిరిగి ఇలా మోహంలో పడవో దేనిచేత అశేషమైన జీవరాశుల్ని నీలోను,నాలోను చూడగలుగుతావో ఆ జ్ఞానాన్ని పొందు.
అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః
మార్చుపాపులందరిలోకి ఎక్కువ పాపం చేసిన వాడివైనా పాపాన్నంతటినీ జ్ఞానమనే పడవతో దాటగలవు.
యథైధాంసి సమిద్ధోऽగ్నిర్భస్మసాత్కురుతేऽర్జున
మార్చుఅర్జునా జ్వలించే అగ్ని కట్టెలను కాల్చినట్లుగా,జ్ఞానమనే అగ్ని కర్మలను కాల్చివేస్తుంది.
న హి జ్ఞానేన సదృశం
మార్చుజ్ఞానంలాగ పవిత్రమైనది ఇంకొకటి లేదు.యోగ సంసిద్దిని పొందినవాడు దానిని కాలక్రమేణా తనలోనే పొందుతాడు.
శ్రద్ధావాఁల్లభతే జ్ఞానం
మార్చుశ్రద్ధతో కూడిన ఇంద్రియ నిగ్రహాన్ని కలిగివుండి,జ్ఞానానుభవాన్ని లక్ష్యంగా పెట్టుకున్న సాధకుడు ఈ అనుభవాన్ని పొందుతాడు.జ్ఞానానుభవాన్ని పొంది త్వరలోనే పరమైన శాంతిని పొందుతాడు.
అజ్ఞశ్చాశ్రద్దధానశ్చ
మార్చుజ్ఞానం,శ్రద్ధలేని సంశయాత్ముడు నశించిపోతాడు.సంశయంలో పడ్డవాడికి ఈ లోకంలేదు పరలోకమూ లేదు.సుఖం కూడా లేదు.
యోగసంన్యస్తకర్మాణం
మార్చుఅర్జునా యోగం వలన కర్మలను వదిలించుకొని,జ్ఞానం వలన సంశయాలను నివృత్తి చేసుకున్న ఆత్మ నిష్టుడిని కర్మలు బంధించలేవు.
తస్మాదజ్ఞానసమ్భూతం
మార్చుఅందుచేత అజ్ఞానం వలన జనించి నీహృదయంలో ఉన్న సంశయాన్ని ఆత్మజ్ఞానమనే ఖడ్గంతో ఛేదించి,యోగాన్ని అవలంబించు.అర్జునా! లేచి నిలబడు.
భగవద్గీత - తెలుగు అనువాదము | సంస్కృత శ్లోకములు→ |