కర్మసన్యాస యోగము
భగవద్గీత - తెలుగు అనువాదము (కర్మసన్యాస యోగము) | సంస్కృత శ్లోకములు→ |
సంన్యాసం కర్మణాం కృష్ణ
మార్చుఅర్జునుడు ఇలా అడిగాడు: - ఓ కృష్ణా ఒకసారి కర్మ సన్యాసాన్ని, మరొకసారి కర్మ యోగాన్ని పొగుడుతున్నావు. ఈ రెండింటిలో ఏది శ్రేయస్కరమో దానిని నాకు తెలుపుము.
సంన్యాసః కర్మయోగశ్చ
మార్చుశ్రీ కృష్ణుడన్నాడు: - కర్మసన్యాసమూ, కర్మయోగమూ రెండూ కూడా ఉత్తమమైన ఆనందానికి తీసుక వెళతాయి. ఐతే ఈ రెండింటిలో కర్మ యోగము కర్మసన్యాసము కంటే మెరుగైనది.
జ్ఞేయః స నిత్యసంన్యాసీ
మార్చుఎవరైతే ద్వేషించకుండా, కాంక్షించకుండా ఉంటారో, అతడే నిత్యసన్యాసీ అని తెలుసుకో. ఓ మహాబాహూ! ద్వందాలు లేనివాడే బంధాలనుండి తేలికగా విడుదల పొందుతాడు.
సాంఖ్యయోగౌ పృథగ్బాలాః
మార్చుపసివారు (అజ్ఞానులు) మాత్రమే సాంఖ్యమూ, యోగమూ వేరు వేరు అని అంటారు. విద్వాంసులు అనరు. ఎవరైతే ఒకదానిలో సరిగా నిలబడ్డారో అతడికి రెండింటి ఫలం దొరుకుతుంది.
యత్సాంఖ్యైః ప్రాప్యతే
మార్చుసాంఖ్యులచేత ఏస్థానం పొందబడుతుందో, ఆస్థానమే యోగులుచేత పొందబడుతుంది. సాంఖ్య యోగాన్ని ఒకటిగా ఎవరు చూస్తున్నారో వాళ్ళే నిజమైన దృష్టి కలిగిన వారు.
సంన్యాసస్తు మహాబాహో
మార్చుఓ మహాబాహో! కర్మయోగం చెయ్యని వాళ్ళకు కర్మసన్యాసాన్ని సాధించడం కష్టం. కర్మ యోగంతో కూడిన మానవుడు త్వరలోనే తేలికగా బ్రహ్మమును చేరుకుంటాడు.
యోగయుక్తో విశుద్ధాత్మా
మార్చుకర్మ యోగంతో కూడుకుని, విశుద్ధం ఐన బుద్ధితో మనస్సు, ఇంద్రియాలను జయించి, అన్ని ప్రాణులలోని ఆత్మను తన ఆత్మగా తెలుసుకున్న వాడు కర్మలను చేసినా బంధంలో చిక్కుకోడు.
నైవ కించిత్కరోమీతి
మార్చుపరమసత్యాన్ని ఎరిగిన యోగయుక్తుడు చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, స్పృసిస్తున్నప్పుడు, వాసన చూస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, పడుకుంటున్నఫ్ఫుడు, ఊపిరి పీలుస్తున్నప్పుడు
ప్రలపన్విసృజన్గృహ్ణన్నున్మిషన్నిమిషన్నపి
మార్చుమాట్లాడుతున్నప్పుడు, వదిలేస్తున్నప్పుడు, పట్టుకుంటున్నప్పుడు. కనురెప్పలు తెరుస్తూ మూస్తున్నప్పుడు ఇంద్రియాలు విషయాలలో సంచరిస్తున్నాయని తాను ఏమీ చేయడం లేదనీ భావిస్తాడు.
బ్రహ్మణ్యాధాయ కర్మాణి
మార్చుఎవరైతే కర్మలను బ్రహ్మముకు అర్పించి, సంగభావాన్ని వదిలి పనిచేస్తారో, అట్టివాడు నీటిలో ఉన్న తామరాకు ఎలా నీటివలన తాకబడదో అలాగే పాపం చేత తాకబడడు.
కాయేన మనసా బుద్ధ్యా
మార్చుయోగులు తమ అంతఃకరణ శుద్ధి కోసం సంగభావాన్ని వదిలి కేవలం శరీర, మనో, బుద్ధి. ఇంద్రియాలతో మాత్రమే కర్మలు చేస్తారు.
యుక్తః కర్మఫలం త్యక్త్వా
మార్చుయోగయుక్తుడైన వాడు కర్మఫలాన్ని వదిలి పెట్టి శాశ్వత మైన శాంతిని పొందుతాడు. యోగికానివాడు కోరికల కారణంగా కర్మఫలానికి అతుక్కు పోయి బంధింప బడతాడు.
సర్వకర్మాణి మనసా
మార్చుమానసికంగా అన్ని కర్మల్ను సన్యసించి, పూర్తిగా తనను తాను స్వాధీనంలో ఉంచుకున్న దేహధారి, తొమ్మిది ద్వారాల పురంలో తాను ఏమీ చేయకుండా, ఎవరిచేత చేయించ కుండా సుఖంగా ఉంటాడు.
న కర్తృత్వం న కర్మాణి
మార్చుభగవంతుడు కర్తృత్వాన్ని గానీ, కర్మలని గానీ సృజించడం లేదు. కర్మ ఫలంతో సంయోగాన్ని ఆయన చేయడు. ప్రకృతే ఆ ప్రకారంగా వ్యవహరిస్తుంది.
నాదత్తే కస్యచిత్పాపం
మార్చుభగవంతుడు పాపాలను కాని, పుణ్యాలని కాని స్వీకరించడు. జ్ఞానం అజ్ఞానంచేత కప్పబడుతుంది. అందుచేత ప్రాణులు భ్రాంతులౌతారు.
జ్ఞానేన తు తదజ్ఞానం
మార్చుఎవరిలో ఐతే సమగ్రమైన జ్ఞానం ద్వారా అజ్ఞానం నాశనం చేయబడినదో వారిలో ఆ పరమాత్మ జ్ఞానము సూర్యునివలె ప్రకాశింప బడుతుంది.
తద్బుద్ధయస్తదాత్మానస్తన్నిష్ఠాస్తత్పరాయణాః
మార్చుఆత్మలోనే బుద్ధిని నిలిపి, ఆత్మభావంతో మనసు నింపి, ఆత్మనే అంతిమ లక్ష్యంగా పెట్టుకుని అత్మాభ్యాసం చేసేవాళ్ళు పాపములు నశింప బడిన వారై తిరిగిరాని స్థితి ని పొందుతారు.
విద్యావినయసంపన్నే
మార్చుమహాత్ములు విద్యా వినయాలతో కూడిన బ్రాహ్మణుడిలో, గోవులో, ఏనుగులో, కుక్కలో, కుక్కమాంసాన్ని వండుకుని తినే చంఢాలునిలో కూడా పండితులు సమాన తత్వాన్నే చూస్తారు.
ఇహైవ తైర్జితః సర్గో
మార్చుఎవరి మనస్సు సామ్యస్థితిలో నిలిచి ఉంటుందో, వారు ఈ శరీరంలో ఉండగానే సంసారాన్ని జయిస్తారు. నిర్దోషమైన బ్రహ్మము అన్నింటా సమంగా ఉన్నందున వాళ్ళు కూడా బ్రహ్మమంలోనే నిలిచి ఉంటారు.
న ప్రహృష్యేత్ప్రియం
మార్చుస్థిరమైన బుద్ధితో, బ్రాంతి రహితుడై బ్రహ్మతత్వంలోనిలిచి ఉన్న బ్రహ్మజ్ఞాని ప్రియమైనది లభించినపుడు సంతోషించడు అప్రియమైనది లభించినప్పుడు ఉద్వేగాన్ని పొందడు.
బాహ్యస్పర్శేష్వసక్తాత్మా
మార్చుబాహ్య స్పర్శలో తగుల్కోనివాడు, ఆత్మలో ఉండే సుఖాన్ని పొందుతాడు. బ్రహ్మతత్వానుసంధానంలో నిలిచిన ఆ యోగి అనంతమైన ఆనందాన్ని పొందుతాడు.
యే హి సంస్పర్శజా భోగా
మార్చుకుంతీకుమారా! బాహ్య విషయ స్పర్శలవల్ల జనించేభోగాలన్నీ దుఃఖాలకు మూలమే. ఆది, అంతములతో కూడుకున్న ఆ క్షణిక సుఖాలలో వివేకవంతుడు రమించడు.
శక్నోతీహైవ యః సోఢుం
మార్చుఏవరైతే ఈ శరీరం ఉండగానే కామక్రోధాల నుండి పుట్టిన ప్రేరణలని తట్టుకోవడానికి సమర్ధుడౌతాడొ, అతడే యోగి, అతడే సుఖవంతుడు ఔతాడు.
యోऽన్తఃసుఖోऽన్తరారామస్తథాన్తర్జ్యోతిరేవ యః
మార్చుఎవరైతే తనలోనే సుఖాన్ని పొందుతూ, తనలో తాను ఆనందిస్తూ తనలో నే జ్ఞాన జ్యోతిని నిలుపుకున్న యోగి బ్రహ్మ స్వరూపుడై మోక్షాన్ని పొందుతాడు.
లభన్తే బ్రహ్మనిర్వాణమృషయః
మార్చుకల్మషాలు నశించి, భేదభావం తొలగిపోయి, మనస్సుని నిగ్రహించి, అన్ని ప్రాణుల హితాన్ని కోరే ఋషులు బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతారు
కామక్రోధవియుక్తానాం యతీనాం
మార్చుకామక్రోధాలనుండి విడిపడి, మనస్సును జయించి, ఆత్మ స్వరూపాన్ని ఎరిగిన యతులకు బ్రహ్మ నిర్వాణస్థితి అంతటా ఉంటుంది.
స్పర్శాన్కృత్వా బహిర్బాహ్యాంశ్చక్షుశ్చైవాన్తరే
మార్చుబాహ్యస్పర్శలన్నీ అరికట్టి, దృష్టిని భ్రకుటి మీద నిలిపి , నాసికలో సంచరించేప్రాణాపాలనుసమానం చేసి
యతేన్ద్రియమనోబుద్ధిర్మునిర్మోక్షపరాయ
మార్చుఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి, మోక్షమే తన అంతిమ లక్ష్యంగా పెట్టుకుని కోరికలను, భయమును, కోపాన్ని వదిలిన ఋషి ఎప్పుడూ ముక్తుడే.
భోక్తారం యజ్ఞతపసాం
మార్చుయజ్ఞాలకు తపస్సులకి భోక్తగా, అన్ని లోకాలకు ప్రభువుగా, అన్ని ప్రాణుల హితం కోరేవాడిగా నన్ను తెలుసుకున్న వాడు శాశ్విత శాంతి పొందుతాడు.
భగవద్గీత - తెలుగు అనువాదము | సంస్కృత శ్లోకములు→ |