వదరుబోతు
1917, 1918 సం॥ లో
అనంతపుర విద్యార్థి సంఘమువారిచే
ప్రకటితమయిన పక్షపత్రికల నుండి.
సాధన ప్రకటనాలయము
అనంతపురము.
1932
సర్వస్వామ్యములు
ప్రకాశకులవి.
వెల 0-12-0
ప్రకాశకుల మనవి.
వదరుఁబోతు వ్యాసములలో లభించినవి మాత్రము ఇప్పుడు ప్రకటించితిమి. సగానకు సగము దుర్లభములై యున్నవి. నశించిన వనియే భయము. ఇప్పుడు దొరకినవిగూడ హిం దూపురమందలి శ్రీ॥ పక్కా గురురాయాచార్యుల వారి ఆంధ్రసార్వతాభిమానపు బలమున బ్రతికినవి. ఎంతో భద్రముగా చాఁచియుంచినవానిని వారు ప్రకటనార్థము ప్రార్థించిన వెంటనే మాకు దయ చేసిరి. వారికి మేము చాల కృతజ్ఞులము. ఇవి గూడ నశించునేమోయని యింతయాత్రముగా ప్ర కటించితిమి.తక్కినవి మా భాగ్యముచే ఎవరి వద్దనేని యుండినచో వారు దయయుంచి మాకు తెలియఁబఱచెదరేని ధన్యుల మగుదుము. ముందు ప్రకటింతుము.
ఇందలి వ్యాసములకు పెట్టిన పేరులు మొదటీ ప్రకటనమందు లేవు. చదువరుల యానుకూ ల్యమునకై యిప్పుడు ఊహింపఁబడినవి. ప్రతివ్యాసము తుదను కర్తగుర్తుగా వేసికొన్న యక్షర ములు మొదటనుండినవి, యిప్పటి ప్రచురణము లో పొరఁబాటున వదలఁబడినవి. సాధ్యమైనంత పుట:వదరుబోతు.pdf/4 పుట:వదరుబోతు.pdf/5 పుట:వదరుబోతు.pdf/6
శ్రీ
ప్రస్తావన.
కడచిన ప్రపంచమహాసంగ్రామము మనువ్యజాతి - దృష్టినే. క్రొత్తత్రోవకుఁ దిప్పినదనుట సుప్రసిద్ధవిషయము. నీతి, మతము, ధర్మము,సంఘము మొదలగువాని దృఢమూలములగు కట్టు దిట్టముల నన్నింటిని కదలించి మన మనోవాక్కాయములను దిక్కుదిక్కులకు పరవశముగాఁ ద్రోసిన పెనుతుపానుగా నాయుద్ధము పరిణమించినది. తీవ్రముగ యోజించు స్వభావముగల యనంతపురపుఁ దరుణులలోని యొకరిద్దఱి హృదయములందా యుద్ధకాలమునఁ గలిగిన కదలిక ఫలమే, యీ 'వదరుబోతు'.
ఇవి రచింపబడి యించుమించుగా పదునైదు వర్షములు గడచినవి.ఈపదునైదు సంవత్సరములలో మన త్రికరణములు నడవడులందుఁ గలిగిన మార్పు అత్యద్భుతము. స్వాతంత్య్రకాంక్ష. యిపుడు శాఖోపశాఖలుగా పుంఖానుపుంఖములుగా పాఁకుచున్నది. కాని యప్పటి సన్నివేశములు వేఱు. ఇప్పటి కాయలును పండ్లును అప్పుడు పిందెలుగానో పూపలుగానో యుండి నవి. తమ యందలి యాజీవశక్తిని బలవంతముగా రవులుకొల్పి బయలు దేర్పఁగల యుత్సాహమును, ఉద్రేకమును గలవా రాకాలమునఁ గొందఱే. ఈ వ్యాసకర్తలకు ఆకొందఱిలోఁ జేరుట కధికారము గలదు కాని ఉత్సాహోద్రేకము లున్న వారి కందఱికిని ఫలముగాని పనిచేయు త్రోవలు కాని ఒక తీరున నుండవు. భరత ఖండమునకు స్వాతంత్య్రమును శక్తిని సంపాదించు నాత్రముతో పనిచేసిన దేశ వీరులలో కర్మాగారములను స్థాపించినవారు కొందఱు, కారాగారములకు పోయినవారు కొందఱు; అసెంబ్లీలకుఁ బోయినవారు కొందఱు, అండమాను దీవులకుఁ బోయినవారు కొందఱు; అందినను అందుకున్నను జుట్టుపట్టుకొని పోరాడబోయినవారు కొందఱు, కాళ్ళు పట్టుకొని విదిలిం పులు తన్నులుఁ దిన్న వారు కొందఱు; చంపినవారు కొందఱు, చచ్చినవారు కొందఱు; తామొక్కరు కష్టపడి త్యాగము చూపుటకంటె ప్రజలలో నుద్బోధము గలిగించుట యుత్తమమని తలఁచి మఱికొంద ఱుపన్యాసముల మూలమున నాపని చేయుదురు. ఇంక కొందఱు - తమ వా క్ఛక్తిమేర నెఱిఁగినవారు - వ్రాత మూలమున నా పనిచేయఁ దొడఁగుదురు. ఈ వ్యాసకర్తలట్టివారు.
స్వాతంత్య్రమనఁగా స్వరాజ్యమని మాత్రమేకాదు. కేవలము దానికై పోరాడుచు ప్రజలలోని నీతి మత ధర్మాదులయందుఁగల దాస్యమును దైన్యమును గమనింపక విడిచిన స్వతంత్రవాది ప్రాయశః స్వార్థపరులలో మొదటివాఁడని భావించి మనము దూరముగా తొలఁగి పోవలయును. రాజకీయ స్వాతంత్య మొకకొమ్మలోని పండేకాని పంటయంతయు నదేకాదు. తక్కినవానితోపాటదియు పండును. దానికై ప్రత్యేకముగా శ్రమించి తక్కినవానిని వదలుట వెఱ్ఱిసేద్యము. కావుననే యీవ్యాసకర్తలు భరతఖండ రాజకీయ స్వాతంత్య్రమునుగూర్చి యెక్కువ జోక్యము చూపలేదు. వీరు పొమ్మనువారుగారు, పొగఁబెట్టువారు.
ఇట్టి ప్రజోద్బోధ కార్యమునకు ఇంగ్లీషు సారస్వతము నందలి అడిసన్ దొర ఆశ్రయించిన పేరులేని యుపన్యాసములను పంచిపెట్టు పద్ధతి చాల అనుకూలముగా ఈ వ్యాసకర్తలకుఁ దోఁచినది. అడిసను ప్రకటించిన 'స్పెక్టేటరు', అతని మిత్రుఁడగు స్టీలు ప్రచురించిన 'టాట్లరు' వ్యాసములకుఁ గల ప్రసిద్ధియు విలువయు ఆంగ్ల సారస్వతముతో పరిచయముగల వారందఱు నెఱుఁగుదురు. ఈ 'వదరుఁబోతు' వ్యాసకర్తలకన్న మునుపే అనగా 1903 వ సంవత్సరముననే ఈ కార్యము చేయుటకు ప్రారంభించినవారు సుగృహీతనామధేయులగు శ్రీ పానుగంటి లక్ష్మీనరసింహరాయ కవీశ్వరులు. వారు అడిసన్ దొరయొక్క 'స్పెక్టేటరు' పదమునే 'సాక్షి' గా భాషాంతరీకరించి ఆపేరుతో తమ యమూల్యవ్యాసములను సువర్ణలేఖ పత్రికలో తొలుదొల్త ప్రచురింప మొదలిడి కొన్నా ళ్ళ కెందులలో నిలిపివేసిరి. తరువాత 1920 యవ సంవత్సరమునుండి పుంఖానుపుంఖములుగా ఆంధ్రపత్రికయందు బయలు వెడలుచుండిన వారి 'సాక్షి'వ్యాసములను చదివి ఆనందింపని యాం ధ్రుఁడుండఁడు. కాని యీవ్యాసకర్తలు ఆ మొదటి 'సాక్షి' వ్యాసముల నేఱుఁగరు. వీరేకాదు, ఆం ధపత్రికలో వచ్చు వఱకును ఏ కొందఱికోకాని ఆంధ్రదేశమున 'సాక్షి' పేరు తెలిసి యుండలేదని స్పష్టముగాఁ జెప్పవచ్చును. కావున 1917 లో ‘వదరుఁబోతు' జననమునకు 'సాక్షి'తో నేసంబంధ మును లేడనుట నిక్కము . ఇరువురకును ఒక విధమైన యుత్సాహోద్రేకములే యుండినను నరసింహారావుగారికి, 'స్పెక్టేటరు' అను అడిసను దొరయుంచిన పేరే తామును తెలుఁగులో తమ వ్యాసముల కుంచుకోవలెనని తోచినది. ప్రకృత వ్యాసకర్తల కంతకంటె స్టీలుయొక్క 'టాట్లరు' అను పద 'మె ఎక్కువ రుచించి వారు దానిని 'వదరుఁబోతు' అని తెలిఁగించుకొనిరి.
కాని నిజముగాఁ బరీక్షించితిమేని 'సాక్షికి' వదరుబో' తనియు, 'వదరుఁబోతునకు 'సాక్షి'య నియు పేళ్ళుండిన స్వరూపౌచిత్య మెక్కునగా నుండి యుండునేమో యని యొక యూహ తోఁచెడిని, ‘వదరుఁబోతు' అనుపదమునందలి నీచార్థమునువదలి 'వాగ్మి' అనునర్థమును మాత్రము గ్రహించితిమేని- అట్లే గ్రహింప వలయును గదా - 'సాక్షి' లో నున్నంత మాటల పాటవము, అడ్డు ఆకలేని నాగుఁబామునడక, సందేహములేని సిద్ధాంతము లు, గరుసుపాఱని గొంతుకతో రచ్చలోనున్న వారికెల్ల వినవచ్చునట్లుగా చేయు రాద్ధాంతములు,- ఇవి ‘వదరుఁబోతు'లోఁ గానరావు. 'సాక్షి' సంఘ మందలి ప్రముఖపాత్రమగు జంఘాలశాస్త్రికి నోరు తప్ప మఱియేమైన నవయవము లుండెనా యను సందేహము చదువరులకుఁ గలిగినను అది సహజ ముగానే తోఁచును. 'వదరుబోతు' మార్గము కొంతవఱకు మృదువైనది. ధ్వని ప్రధానము. ఇరువురును ట్లలో మేటులైనను, 'సాక్షి' తిట్లలోని తెగువ 'వదరుఁబోతు' తిట్లకులేదు. 'వదరుబోతు" తిట్లలోని తీపు 'సాక్షి' తిట్లకులేదు. ఉదాహరణ ముగా వీరిరువురును చేసిన సారంగధర నాటక విమర్శను చూచినచో నీవిషయము స్పష్టమగును. ఇంతకన్న నెక్కు_వచర్చది చోటుగాదు.
ఇదిగాక ఇంచు మించుగా నీ వదరుబోతు జన్మించిన కాలమందే గుంటూరునుండి కాఁబోలు నొక్కరు ఇట్లే కొన్ని వ్యాసములు ప్రకటించు చుండిరి. వాని పేరు ప్రకృతము మఱచితిమి. ఎట్లో వారు మకుటముగా నుంచుకొని యుండిన ఈక్రింది పద్యమొకటి జ్ఞప్తిలో నిలిచినది.
"తే. ఉద్ధరించెద దేశమేనొక్కరుఁడ నె
నిక్కమియ్యది చేయంగ నేర రొరులు
అనుచు విలియము పిట్టను నతఁడు పలికె;
అట్లయందఱుఁ దలఁచిన నగును శుభము."
గుంటూరు మిత్రు లొక్కరివద్ద నీ వ్యాసపత్ర ములు రెండుండఁగాఁ జూచియుంటిమి గాని యితరు. లీప్రాంతములలో నెవరును వాని నిదివఱకు కని యెఱుఁగరు. వినియెఱుఁగరన్నను తప్పులేదు.
ఈవల కీ॥శే॥ వంగూరు సుబ్బారావుగారు 'వసంత లేఖలు' అను పేర కొన్ని వ్యాసముల నాంధ్ర పత్రికలో ప్రకటించుట సర్వవిదితమే.ఇంకను గొందఱట్టివేమైన వ్రాసిరేమో మాదృష్టికి రాలేదు.
ఈవ్యాసకర్తలు ఇరువురు; ముగ్గురన్నను తప్పులేదు. వారి పేళ్ళు ప్రచురించుటకు మాకిప్పు డధికారములేదు. మొదలువారు ప్రకటించుకో లేదు. కారణము మాకుఁజూడఁగా నిది: అధికార వృద్ధులు, వయోవృద్ధులు, విద్యావృద్ధులుగూడ నాచరించుచుండిన కొన్ని పద్ధతులను ఆచారము లను తప్పులని తోఁచినప్పుడు విమర్శించి ఖండిం చుటకై జన్మించిన వీవ్యాసములు. ఈ వ్యాసకర్తలు అధికార విద్యావయోధనాదులందు సామాన్యులే కాని విశిష్టులు గారు. అట్టివారు ఇతరులను ఖం డింపఁ బూనినప్పుడు వారిపేరు ప్రచురమయ్యెనా వారిననామధేయులకన్న నల్పముగాఁదలఁచి తిర స్కరించుజనులే యెక్కువ. తమ్ము ఖండించువార నామధేయులుగా మఱుఁగున నుండి వారెవరో సుగృహీత నామధేయులని జనులు భావించి మన్నించుటయు సహజము. కావున సంఘమందలి లోపములను వెలికిఁబెట్టుటయే ప్రధానోద్దేశముగాఁ గల 'వదరుఁబోతు' వ్రాయసగాండ్రకు తమ పేరు మఱిగించుకొనుటయే కార్యసాధన మార్గముగా తోఁచియుండును. మఱియు సంఘసేవాకార్యము నకు తోడు స్వసేవయగు నీనామధేయ ప్రకటన మేలయను నౌదాసీన్యముగూడ రెండవ కారణ ముగా నుండవచ్చును. ఈ వ్యాసకర్తల నెఱిగిన మిత్రులు కొందఱు వారియందీ స్వార్థ రాహిత్యము ఎంత నేఁటికిని కలడనుట యెఱుఁగుదురు. యుద్దేశములట్లే యుండుటచే ఇప్పుడును వారి నామ ములు మఱుఁగుననే యుంచఁబడినవి.
ఈ‘వదరుబోతు' జన్మించినది, పనిచేసినది సన్యసించినదిగూడ అనంతపురమందే. అపుడా యూరిలో నుండినది ఆచార్యుల గుఱ్ఱపు తట్ట... పదిప్రక్కలందును పదిమంది చేతులు వేసి నడప వలసిన ప్రాఁత 'ప్రెస్సు' ఒకటే. అది సా ... విలాస ప్రెస్సు'. అన్ని పనులకు అదే ఆధారము చేతడబ్బు ఎక్కువలేక, అధికారము లేమియు యున్న వారు ఆకాలములో పక్షమున కొక క్లుప్తముగా నాలుగైదు పుటల వ్యాసము ముద్రింపించు భగీరథ ప్రయత్నమాపని చేసిన తప్ప నితరు లెఱుఁగలేరు. ఎట్లో కష్టపడి ముద్రిం పించి వ్యాసములను కాలణా కొకటిగా వీరు అమ్మి, పోస్టుకర్చులు పెట్టుకొని బైటి కెందరికో ఉచితముగా పంపి, ఎన్నో ప్రతులు తిరిపెము సుమారు రెండేండ్లకుమించి దీనినినడిపి త - సుప్రసిద్ధ కారణములచేత 'వదరుబోతు' మూసికొనెను. మొత్తము ప్రకటించిన వ్యాస ములు సుమారు 5ం.
కాని ఇప్పుడు వాని నెల్ల నొక సంపుటము గా ప్రకటింపఁ బూనుకొనఁగా దొరికినవి 22 మాత్రమే. కర్తలు స్థలాంతరములకుఁబోయి కార్యాంతరములకుఁజిక్కి పోవుటచేతను, ఒకతూరి వ్రాసి పంచిపెట్టుటచేత తాము తలపెట్టిన పని యైనది గావున నీవ్యాసములను భద్రపఱచియుంచ వలసినంత యక్కడ వారికంతగా లేకపోవుటచేతను పై వ్యాసములలో ననేకములు దుర్లభములైనవి. కాని చదువరులలో హిందూపురము శ్రీ పక్కా గురురాయాచార్యులవంటి యభిమానశాలు లుండ బట్టియే ఈ వ్యాసములిన్ని యైనను నేఁటికి దొరకి నవి. ప్రకాశకులు వారికి కృతజ్ఞులు. తక్కినవి యెంత ప్రయాసపడినను దొరకవయ్యెను. ఎవరి వద్దనైనను ఇప్పుడు లభింపని వ్యాసములున్నచో దయచేసి యిచ్చినచో ప్రకాశకులు కృతజ్ఞలతో నందుకొని యవకాశము లభించినప్పుడు చేర్చి ప్రకటింతురు.
వ్యాసకర్త లుదాసీనముగా నున్నను, కాల మెంత మాఱినను, ఇంకను ఈ వ్యాసములు చేయ వలసిన ప్రబోధకార్యమున కవకాశముగలదని తోఁ చుటచే వీనిని పుష్ఠకరూపమున ప్రచురింపవలసెను. తక్కినది “భాగ్యాయత్త మతఃపరం నఖలు తద్వా చ్యం” అన్నాఁడు వేఱొక సందర్భమున కాళిదాసు.
విషయసూచిక
వ్యాసము
పుట
1 |
7 |
14 |
21 |
26 |
32 |
39 |
46 |
51 |
58 |
65 |
70 |
76 |
83 |
88 |
94 |
99 |
106 |
112 |
119 |
127 |
136 |
This work was published before January 1, 1930, and is in the public domain worldwide because the author died at least 100 years ago.