వదరుబోతు/ఆచార్యునికన్న ననుభవము మేలు

ఆచార్యుని కన్న అనుభవము మేలు

15

చెన్నపురినుండి నామిత్రుఁడు వ్రాసిన లేఖయిది:-

“పుష్పక విమానము”

"చెన్నపురి"

“వైశాఖ బ. షష్ఠి”.

"ఆర్యా! పెద్దలమాట వినక దుర్యోధనుఁడును మిత్రుల యుపదేశము నాదరింపక రావణుఁడును జెడిరి పెద్దయు మిత్రుఁడు నగు నీపలుకు పాటిం పక నేనును గొంతకష్టము పాలైతి ననుటలో వింత లేదు.

ఈ దినములలోని లగ్నపత్రికలు వట్టి యాడంబరములే యను సూత్రము సామాన్యజనుల కన్వయించుననియు, ఔదార్యాది గుణములచే బిరుదముల నార్జించిన గొప్పవారియడ నిది యన్వ యింపరాదనియు, తమతో వాదులాడి తత్వమర యుటకై యిటు వచ్చితిని. ఆచార్యునికన్న నను భనమెంతో మేలుకద!


పుష్పకవిమాన మొక గొప్ప సౌధము. 'గన్ సెట్' వాద్యాడంబరము విపరీతముగను వెగ టుగను వినవచ్చుచుండెను. ముఖద్వారము నలు కరించుచున్న యరటికంబములును పచ్చతోరణము లును గన్నులపండువు సేయును. ప్రక్కలను “స్వాగతము”, “Welcome" దయ చేయుడు," అనునక్షరములు నిలువుటెత్తునఁ గాన వచ్చి చూచువారి కాశగొల్పుచుండెను. సముఁ బ్రవేశించి బహిరావరణముఁజొచ్చి కొంత దూర ముత్కంఠతతో నెదురుచూచుచుఁ బోవు చుంటినిగాని, చీమలుపుట్టవలె జనులు వచ్చుచుఁ బోవుచున్న నేమి నా కెవ్వఁడును స్వాగతమియ్య లేదు. మనసు కళుక్కు, మనఁగా నింకను జూతమని యా ప్రాంతమందలి శిలాఫలకముపైఁ గొంతతడవు భీష్మించుకొని విశ్రమించితిని. నేనెవ్వఁడనో యేల యందుంటినో యేరును విచారించువారు లేరైరి.

జము ప్రొద్దెక్కియు౦డె. అల్లంత దూరమునఁ బొదరిండ్లలోని కృతకశిలా వేదికలపై నాసీనులై తరు ణులు కొందఱు కాఫీ ప్రవాహమున దెప్పఁ దేలు చుండిరి. వేఱొకప్రక్కన యువతులు గొందఱు ద్రాక్షపందిళ్ళ నడుమ గూర్చుండి యువకులఁ జూచి ముసిముసినవ్వులు నవ్వుచు నిడ్డెనల మాయముచే యుచుండిరి, నోటఁ జుట్టలనిడుకొని కూనూరు పొగ బండ్లవలె గుప్పు గుప్పున పొగ వెడలవిడుచుచు చేతబెత్తము లాడుచుండ పడుచువారు కొంద ఱిటు నటు పచారు సేయుచుండిరి. మూరెడు మూఁరె డంచు దుకూలములనుగట్టుకొని రవలసొమ్ములతో తళతళలాడుచు వర్షాకాలపు సాయంసమయముల లోని సీతాకోక చిలుకలం బోలె చిఱుత ప్రాయపు మిటారికత్తెలు గొందఱు కాసు పనిపాటలు లేక యిటునటు విహరించుచుండిరి. ప్రయాణవశమున రాత్రి యుపవసించి యాఁకలిచే బాధపడుచు నే క్షణమున నెవ్వరైన విచారింతు రేమోయనివచ్చుఁ బోవువారి ముఖములఁ దిలకించుచుఁ గూర్చుండి యున్న యతిథేయునికినైన గమనింపని యీద్విపాద. మహిషజాతిని సృజించిన విధాతకుఁ బ్రపంచ మున నైవేద్యమర్పించువారు లేకుండు టేమియరు దనుగొంటిని.

వచ్చినపని వాకిటనే కావచ్చినది. అయి సను, ఈ పూత మెఱుంగులు యౌదార్యమును భూర్తిగా రుచిచూచియే యఱుగుదమని నిశ్చ యించి భవనముఁ బ్రవేశించితిని. ఏవాకిటఁ జూచి నను జనుల రాకపోకలకు నిలుకడయేలేదు. చిత్ర విచిత్రముగ నలంకరింపఁబడిన వివాహశాలలో వధూవరుల ప్రక్కన గూర్చుండి యొకరిద్దరు వైది కులుమాత్రము మంత్రములు గొణుగు చుండిరి. పురోహితుఁడు హోమమును వ్రేల్చు చుండెను. వరుడు సిగరెట్టు నొకదానిని నోటఁగఱచుకొని వంగి హోమగుండమున నంటించుకొనుచుండె. అతని వయసు రమారమి యిరువది రెండుండును. ఇంచుమించుగ వధువుగూడ సంతకుఁ దీసిపోదు. యజమానుడు గొప్ప సంఘసంస్కర్తయఁట.

ఆవల శాలలో సంగీతకాలక్షేపము జరుగు చుండెను. పెద్దమనుష్యులును స్త్రీలును పెక్కండ్రు వరుసలుదీరి కుర్చీలపైఁ గూర్చుండియుండిరి. ఒక గోదావరి పాటపాడుచుండగా నొక పినాకిని నాట్య మాడుచుండెను. వేరొక్క చోట చీట్లపేక వ్యవ హారము యధావిధిగా జరుగుచుండెను.మఱి యొకగదిలో “గౌరవనీయులు” గొందఱు పాస కేళిలోఁ దేలుచుండిరి. ఇంకొక్కశాలలో యువ కులు కొందఱుచేరి యథేచ్ఛముగా హార్మోనియ మును వాయించుచుండిరి. వివాహముహూర్త మెప్పుడో, జరుగవలసిన క్రియాకలాపమేమో గమ నించువారే యీసంఘమున నున్నట్లు నాకుఁ దోపలేదు. ఎన్ని చోట్లఁ దిరిగినను, ఎందెందు కూర్చుండినను, నన్ను మాటలాడించిన పాపమునఁ బోయినవారే లేరు.

మధ్యాహ్నము రెండుగంటలు మీఱుచు న్ననుగూడ నాస్థితిలో నేమార్పును గలుగలేదు. దాదాపు మూడు గంటలపుడు వైదికులందఱు భోజనశాలకు నడువుఁడని యొకఁడు ఘంటవాయిం చుచుఁ బిలిచిపోయెను. ఈసమారాధనము సయి తము చవిఁజూచి పరీక్ష జాలింతమనుకొని నేనును భోజనశాల కరిగితిని. నాగరకుల భోజనాదులు పది ఘడియల కే ముగిసినవఁట! ఇప్పుడు జరుగు చున్నది. వైదికుల పండుగు. రమారమి రెండు వందలమంది విస్తళ్లముందు కూర్చుండి యరఘంట సేపు కాచుకొనియుండు నంతలో పొగబండినడుపు వారి వంటి వేషముగల వంటలవారు గొందఱు పఙ్తిపైఁ బ్రత్యక్షమైరి. ఇక నాఁటి పదార్థ ముల సారస్యము మున్నెన్నడును కని విని యెఱుఁ గనిది. ఆదినమున అమాడిన యన్నమునకును ఆయుడుకని పప్పునకును గలయొద్దిక వర్ణనాతీతము. పులుసును చారును మాటిమాటికిని స్నానముచే యనిదే బయట వచ్చుచుండ లేదు. పాయస మన్ననో పాలును చక్కెరయును లేని వింతరకపు వంట. మజ్జిగ యయినవెనుక చేయి గడిగికొను యవసరమే యుండలేదు.

   గీ|| నేయిలేని కూడు నీయాన కసువది
       కూర లేనితిండి కుక్కతిండి:
       ప్రీతిలేనికూడు పిండంపుకూడురా
       విశ్వదాభిరామ వినరవేమ!

అను పద్యము నాకు స్మరణకు వచ్చినది. లహా! వరుఁడు చింతామణి! కన్య అన్నపూర్ణ! యజమాని యింటిపేరే అన్నదానమువారు!! లగ్న పత్రికలచే పిలువనంపి వచ్చిన యతిథుల కీ యందరము!! ఈకొఱ్ఱకూటికా యీఘోషశాంతి? ఈ అన్నదానము వారి యాదార్యమున కింకెన్ని బిరుదములైనను చాలవు.

ఆర్యా! వచ్చినపని యయినది. 'నేఁడిం చుక విశ్వాతి గైకొని రేపు తమ సన్నిధికి వెడలి వచ్చెద.

అని విన్నవించు ప్రియశిష్యుఁడు,

రామానందుడు.”