వదరుబోతు/సదయునికథ
స ద యు ని క థ
19
నర్మదానది యొడ్డున విలాసధామ మను నగరమునందు సదయుఁడను బేరుగల యైశ్వర్య వంతుఁ డొకఁడుండెను. పేరుంబట్టి యాతఁడట్టి వాఁడయ్యెనో, కాక యాతని గుణముల దివ్యదృష్టి నూహించి 'పెద్ద లాపే రతని కిడిరో చెప్పలేనుకాని స్వభావముచేతనే సదయుఁడు మిగుల దయాళువు. బంధు మిత్రులనేగాక జన సామాన్యమును గూడ నతఁడు జాల ప్రేమించుచుండెను. అతనిచే మంచి వాఁడని యనిపించుకొనని వాఁడును, అతనిని చెడ్డ యనినవాఁడును లోకముననే యఱిది.
అతని యౌదార్యము వర్ణనకు మించినది. ద్రవ్యము నంతయు నతఁడు పేదసాదల నుద్ధరిం- చుట యందును స్నేహితులు సంతోషింపఁజేయుట యందునే వినియోగించెను. పాత్రతా పాత్రతల విచారము లేక యెడ తెగని ప్రవాహమువలె నతని యీవి ప్రవహించుచుండెను. అతిథి షడ్ర సోపేతమగు భోజనములేక వెళ్ళుటలేదు; ఆర్థి రిక్తహస్తముల వెనుక కెన్నఁడును దిరిగి పోలేదు. కవులును భాగవతులును బహుమతిఁగొనక వెడల లేదు. లేదన్నఁనటఁ లేనే లేదు. విందులు జరుగని దినమే లేదు. బంధువుల రాక పోకలకు విరామము లేదు. అతని యిల్లొక గొప్ప సత్రమై యుండెను. ఉన్న యెడల రాజ్యములఁ గూడ నతడు దానమిచ్చు వాఁడే. వీఁడు వాఁడనక యా బాల చండాలము సదయుని యాదరమున బా త్రులైన వారే. అతనినందఱును ప్రేమించిరి ; పొగడిరి; అతని కార్యముల నాసక్తితోఁ జేసిరి.
గొప్పయింటి తరుణ వయస్కులు గొందఱు ధనమంతయు విచ్చల విడిగా పాడుచేసి యప్పుల పాలై తీర్చు నుపాయముఁ గానక యందుండఁగా సదయుఁడు వారియ్యవలసిన మొ- త్తము నిచ్చి వారి చెఱవిడిపించెను. వారెప్పుడు నీతని విడచి యుండలేదు. పొరుగింటి యాతఁ డొకఁడు గొప్పయింటి కూతునొక దానిని వరించి, యామె తండ్రి యైదు వేలుంకవ, దెమ్మని నందుని నిరాశఁ జెంది యుండంగా, సదయుఁడాతని కా సొమ్మొసఁగి వివాహముగావించెను. స్తోత్ర ప్రియులగు నీచు లాతని చుట్టుఁజేరి యాతని ధన మెల్ల నపహరించిరి. కాని,
"కలి మేమి యెల్ల కాలము
కుల గిరులా కదలకుండ?"
సదయుడచిర కాలముననే దరిద్రుఁడ య్యెను. అప్పులవారి నిక్కచ్చి చెప్పరానిదయ్యె ధనము స్నేహితులకే యిచ్చినిని కాని, దుష్టుల కిచ్చి పాడు చేయలేదనియు, తన వలన నంత మే లొందిన మిత్రులు గష్టకాలమునఁ దనకు సాయ పడరా యనియు, నంత మాత్రము కృతజ్ఞత తన చెలికాండ్రకు లేదాయనియు నాతఁడు చాల నమ్మి యుండెను. కాని యెవరు తన్నొక్క నిముసమేని పాసి యుండఁజాల మని దుఃఖము నభినయించు చుండిరో యట్టి సఖు లాతడుున్న వీధిపైనఁ బోవు టకు మానుకొనిరి. ఆ యీవి ఎవ్వరు స్తోత్రము సేయుచుండిరో వారే , "ఇతఁడెంత తెలివిమాలిన వాఁడు, అంత దుర్వ్యయము మంచిదేనా?” యని తెగడసాగిరి.
మనుష్య తత్త్వ మాతని కప్పుడు బాగుగ బోధపడినది. తానిదివఱకు స్వప్నమునఁ గూడఁ దలఁచి యెఱుఁగని వేనవేలు లోపములు మను ష్యునియం దున్ననని యతఁడు కనుగొనియెను: మనుష్య సంఘము విూదనే యతనికి రోఁత పుట్టెను. మనుష్యుని వంటి కృతఘ్న జంతు వీ ప్రపంచముననే యుండదని యాతని తలంపు, అతని దృష్టి యెచ్చట ప్రసరించినను కృతఘ్నత ద్రోహము, మాయదారితనము, అసత్యము, స్వార్థపరత్వము దప్ప వేఱు గానవచ్చుటే లేదు.
నీచాతి నీచమగు మనుష్య మృగమునకు నివాస యోగ్యములగు పట్టణము లందుండ రాదని యెంచి సదయుడు, విలాసధామమును విడచి యొక్కడు నొక్క ఘోర కాంతారముఁ జేరెను. అచటి పక్షులు మృగములు నతనికి స్వాగత మిచ్చినట్లుండె. అందలి పచ్చికయు, రమ్యములగు ఫలపుష్పములచే నిండిన తరు లతాదులును, జల జలమని నిర్మలోదకముల ప్రవహించు సెలయే- ళ్ళును జూచి యతని మనసు చల్లబడియెను. మానవ హృదయముల కన్న నచటి గండశిలలు కోమలములని తోచెను. స్తుతి పాఠకుల ప్రసంగ ములకన్న సింహ శార్దూలాదుల గర్జారవములు మధురములయ్యె. మిత్రుల ప్రశంసా వాక్యములలో నున్నంత విషము పాములు కోరలలోఁ గూడ నతనికి గానవచ్చినదికాదు. క్రమముగ మనుజుని వేషము గూడ నాతనికిఁ గిట్టలేదు. నీచుడఁగు మనుష్యునిఁ దలఁపునకుఁ దెచ్చునని, మనుష్య ద్వేష మాతనిని వస్త్రములను విప్పివైచి దిగంబరుఁడు గాఁ దిరుగు. నటు చేసినది.
చలి కాలము వచ్చెను. సదయుఁడు శాంత.. ముతో చలి బాధను సహించె. మనుజులవలె ససత్యములు చెప్పక యీ చలిగాలి యధార్థస్థితిని తనకుఁ జెప్పుచున్నదని యతఁడు సంతోషించెను. కృతఘ్నత కోఱకున్నంత పదను చలి వంటికి లేదని యాతనితలంపు. పక్వములును మధుర ములునగు నానావిధ ఫలములఁ దినుచు నిర్మలము- లును శీతలములు నగు ఝురవారి నీరునట్టార్చు కొనుచు, విశాలములును ప్రశాంతములునగు కందరముల విశ్రమించుచు పత్ర పుష్పఫల భరిత ములగు దట్టంపు మ్రాకుల నీడలు నీమానవ శరీర మును బాపుమని సర్వేశ్వరుఁ బ్రార్థించుచు నా- తఁడీ యరణ్యమున గొన్నిదినములు నిశ్చల చి- త్తుఁడై యుండెను. సకల దుర్గుణములకును మూల కందమగు మనుష్య కీటము భూమినుండి తొలగింపు వలెననుట డప్ప యాతనికి వేరు కోరికయే లేదు. అతఁడీశ్వరుని బ్రార్థించిన దిదియే.
సదయుఁ డొకనాఁడు కాంతార మధ్యమున నున్న తటాక తీరమున నిలుచుండి చుట్టునుం జూచెను. కౄర మనుష్య మృగము లేనందున నాయడవి సహజ సౌందర్య సంపద చేఁ గడు రంజిల్ల: చుండె. మావి చిగుళ్ళ గుంపున నుండి కోయిల “కూహూ” గానమున ప్రపంచమును సంమోహి-. తము జేయుచుండెను. చేరువ నినుక తిన్నెపై నొక నెమలి రంగులపురి విప్పి రమ్యముగ నర్తన మొనరించుచుండె. సెలయేటి తరంగములు మృదు మధుర స్వరములతో మృదంగము వాయించెను. తటాకమున జలపక్షులు ఱెక్కలల్లార్చుచు కర తాళ ధ్వనులు చేసినవి. పచ్చికపై పారణనేయు జింకలును పొదలలో నరనిద్రలోనున్న పులులును హాయిగ నీగానము ననుభవించుచుండెను. తరు లతాదులు ప్రేక్షకులకు ఫలపుష్పముల నుపాయన మర్పించుచుండె! అకటా! స్వార్థపరమగు మానవ ప్రపంచమున నీయానంద మెందుండి వచ్చును! సదయుఁడు చూచి చూచి యుప్పొంగెను, కో- యిలగనో, జింకగనో, తన కపుడు జన్మమబ్బిన చో నెంత సంతసించి యుండునో.
భగవంతునిచే సృష్టింపఁబడిన జీవరాసు లన్నిటిలో మానవుఁడే యెందునకుఁ గొఱమాలిన . నిరర్దక జంతువు. అడవిలోని కౄర జంతువులు గూడ తమ కాహారమయిన మృగములఁ దప్ప నితర మృగముల జోలికిఁబోవు. క్షుద్ర జంతువు- లును తమ భోక్తను దప్ప యితర మృగములను ద్వేషింపవు. మనజుఁడన్ననో స్వభావము చేతనే సర్వజంతువులను ద్వేషించును. ఆనంద మయమగు నీప్రపంచమున నానందము లేనివాఁడు మానవుఁ డొక్కఁడే! ఈదుర్గుణములు కలవాటుపడని మాన వులలోకమే లేదా? భగవంతుని సృష్టి కిది యసా - ధ్యమా? నిజముగ నట్లే కాఁబోల?
ఇట్లు తలపోసి తలపోసి “ఛీ! ఈ నీచ దే- హమును భరింపఁజాల! సర్వేశ్వరా! మంచి లోక మున నన్ను సృజింపఁ జాలనిచో నాకు మానవ దేహమేవలదు. కీట జన్మమైన నిమ్ము!" అని యుచ్ఛైస్స్వరమున నాడి, దభాలున నాతటాక మున దూకి మునిఁగిపోయెను.
నిజమరసినచో మనలో సదయులనేకులులేక పోలేదు. వీరే తనకు సర్వస్వమని నమ్ముకొనియున్న దారపుత్రాదుల కృతఘ్నత వలననో, మిత్రుల మోసము గారణముగనో; సుఖనాశము సంభవించి. నప్పుడు - అశా భంగ మావహిల్లి నపుడు ఉత్సా హ శక్తి యడుగంటి నపుడు - ఆనంద కళ యంత రించి నపుడు- మనుజునికి చుట్టునున్న ప్రపంచము పై ద్వేష మొదవు టేమియరుదు? “అనాశ్వా- సీత దుఃఖితే సర్వ మసహ్యమనా నెఱుంగవే?” యను నానుడిఁ బరికింపుడు.
కాని సదయుని స్థితి యేమయినదియు కను గొందము. చదువరులు కొంత కాలము వేచి యుందురు గాత!