వదరుబోతు/నాటకతత్త్వము

నాటకతత్వము

13

కావ్యములలో నెల్ల నాటకములు శ్రేష్ఠములని పెద్దలుపలుకుదురు. లోకమునందలి జనుల వ్యవహార వ్యాపారాదులను వానియందలి గుణదోషములను, తత్తత్ఫలములను, అన్నియు నున్నవి యున్నటుల ప్లేక్షకుల కనుల ముందఱ నుంచి కనులారఁ జూచి యనుభవమునకుఁ దెచ్చికొండని బోధించునవి నాటకములే యగును. కావ్యశాస్త్రాదులు పండిత హృదయములకు మాత్రము గోచరములగుటం జేసి నాటకములు పామరులకుఁ గూడ బుద్ధి గఱపుచు నాహ్లాదకరము లగుటఁబట్టియే వాని కీ శ్రేష్ఠత్వమనుట నిర్వివాదాంశము. రామా యణము జరుగునంత కాలమును రాముని వెంట నుండి పరీక్షించుచు సతని జీవితమునుండి నీతిని గ్రహింపవలెనన్న నెందఱకు సాధ్యము? ఎన్నఁడో ఏ దేశముననో, ఎన్ని యేండ్ల కాలముననో నడి చిన చరిత్రములలోని యనుపయుక్తాంశములు నెల్ల వదల్చి స్వల్పకాలమున వానిసారమును మాత్రము మనకన్నుల యెదుటఁ బెట్టుశక్తి యీనాటకములకు మాత్రమే గలదు.

కాని, నాటకమని పేరు బెట్టుకొన్నంతనే నెత్తిఁ బెట్టుకొని పూజింపవలెననుట కాదు. సర్వ జనోపయుక్తమగు నీతిబోధించు సత్కథా సంవి ధానముగల్గి, హృదయంగమరచనా వైదగ్ధ్యముతో నొప్పి, ప్రపంచానుభవ శాలురగు సత్కవులు రచిం చిన నాటకములే నాటకములు కాని యితరములు బూటకములు. సత్కథా ప్రణాళికచే నలరు నాటకములు నీతిబోధచే లోకమున కెంత యుపక రించునో దుష్కథా సరణిం గూర్పఁబడ్డ నాటక ములు దుర్నీతి కాదర్శ ప్రాయములై ప్రపంచ మునకంత యహితముఁ గూర్చును. వానిలోని నీతి వ్యంగ్యరూపముగ నేమి, ఛాయామాత్రముగ నేమి, చూపఁబడునట్టిది కాక స్పష్టముగను ప్రసిద్ధ ముగ గోచరించు చుండవలయు. మూ ర్తీభవించి చాల కాలము ప్రేక్షకుల నేత్రములకుఁ గట్టినట్లుండ వలయు, జీవితముల కాదర్శము గావలయు. మన చిత్తములలో నాటు కొనఁగలవి ప్రధానపాత్రల గుణచర్యాదులే యగుటచే నవి నీతిదాయకము లగుట చాల యవశ్యకము. ఏవిదూషకుని చర్య యందో ఏపరిచారిక నడతయందో నీతిగలదన్నచోఁ జాలదు. సావిత్రీ చిత్రాశ్వమును, అహల్యాసం క్రందనమును ప్రదర్శింపఁబడి నపుడు వానియందలి ముఖ్య పాత్రల గుణ చేష్టస్వభావాదులు చూపఱ హృదయసీమల జనింపఁజేయు భావములకుఁ గల తారతమ్యము నెఱుగవర్ణింప నక్కరయుండదు. తారాశశాంకుల జంఝాటముల నెల్ల పూసగ్రుచ్చిన తెఱంగునఁ దర్శించి, "తగని దాంపత్యమునఁ గల్గు ఫలమిట్టి”దని కొనకొక నీతిముక్కను బడ వేసినచోఁ జాలునన నెవఁడు సాహసించును? కాన, నాటకముల యుపయోగము, వాని కథల ననుస గించి యుండుననుట.

ఆధునిక నాటకకర్తలు పలువు రీ యంశ ముపై దృష్టి వదలి స్వేచ్ఛగా కథలఁగైకొని నాట కముల జాతికే కళంకమును దెచ్చిరని చెప్పక . తీరదు. తారాచంద్ర విజయము, బిల్హణీయము మున్నగు కథల రూపకములు రూపమున పేర్లు మార్చి మార్చి వ్రాసిరి. ఇతర కథలెన్ని యో యున్న నేల? యని వారి రసికతకుఁ బనికిరావు. రసములలో రాజగుటం బట్టి శృంగారము పచ్చిదై నను విడువరానిదయ్యెఁగదా! పోనిండు. పాటలో పసలేనందుకు నాట్యములో నసయైన నుండవలెనని కాఁబోలు లేనిపోని సంవిధానములఁ గల్పించి, రసాభాసముగ నాయికా నాయకులతో శృంగార సల్లాపములఁ జేయించుచు గంటలకలఁది రంగమున వారిని నాట్యమాడించిరి. చాలనందుకు ప్రశ్నోత్తర రూపములగు పాటలఁ గూర్చి జేనెడుకు జేనెడు, మూరెడుకు మూరెడు, బారెడుకు బారెఁడుగ నర్థములేని ప్రశ్న కవసరములేని యుత్తరము లిప్పించుచు రసముతోడ నీతినిగూడ కొంపఁగూ- ల్చుటఁ జూడ నేరసజ్ఞనకయిన మనసు కళుక్కు మసకమానదు.

ఇంతటితోఁ బోయెనను కొనరాదు. ప్రత్య- క్షముగ రంగమునఁ బ్రదర్శింపఁ బడదగని విషయ ముల ప్రసంగము సందర్భ వశమున గల్గిన చోట బాచీన రూపకకర్తలు సంవిధానమును ముద్దుగ . మార్చి తేలిపోవుచుండిరి. ఆధునికుల రసికత కీమఱుగు మాటులు సరిరావు. నాయకుఁడు వేశ్య యింటికరుగు సంవిధానమును గల్పించి యొక కవి యారంగమున వీధి బొజుంగులు సానివాడకుఁ బోవునప్పటి యాచారములును వేశ్యతోడి సంభా షణచాతుర్యాదులును తూచా తప్పకుండ ననుభవ హీనుల కుపకరించులాగు వ్రాసి వారి కృతజ్ఞతకుఁ బాత్రుఁడయ్యె. మఱియొక కవిశిఖామణి తారా శశాంక విజయమునఁ బడకటింటిలోఁ దూగుమం- చముపైఁ గూర్చున్న చంద్రునకు గుఱులు దువ్వుచు నర్మోక్తుల దేలుచున్న తారాదేవికిఁ బరవశత్వమునఁ బోక ముడి వీడినట్లు పైశాచ శృంగార వర్ణనగల రంగము నొక దానిని గల్పించె ననుటకే సిగ్గగుచున్నది. ఇట్టి నాటకము లింకనుఁ గొన్ని బయలుదేఱ గలవా వేఱు దుర్నయ మేల? మన ఆంధ్రనాటక పితామహుని నాటకరత్నము లలోనెల్ల నతని విషాద సారంగధరమే సానదీఱినది. అతని రచనా ప్రాగల్భ్యమును నాటక కళా కౌశల్య మును సంవిధాన సంపాదన ప్రతిభయు రసపోషణ చాతుర్యమును నందుఁ బూర్ణముగఁ బ్రతిఫలించిన వనుట యతిశయోక్తికాదు. కాని యెంత పక్వ మయిన నేల యాకథ పుచ్చినపండు! తొడిమకడనో మఱి యేమూలనో తీసి యింత కలదన్నను గూడ నది పుచ్చుపండెకాని మెచ్చుపండు కాదు. అందలి ప్రధాన స్త్రీపాత్ర చిత్రాంగి. దాని దుర్నీతి చేస్టా కలాపమంతయు ఆతళుకుఁ బెళుకులును, ఆ మాయదారి చేతలును, ఆ ఱాగతనంపు పరుసము లును, ఆ తఱితీపు పల్కుల జాణతనమును, ఆ ప్రోడతనపు జిత్తులును, ఆచిన్నెలును, ఆవన్నెలును -నాటకారంభమునుండి ప్రేక్షకుల కనుల కంటఁ గట్టి, తరువాత నెపుడో చిత్రాంగికి దుర్మరణశిక్ష విధింపఁబడినవి తెరమఱుఁగున వినిపించిన మా- త్రాన నాటక దర్శనాంతమున జనుల భావదర్పణ ములలో బ్రతిబింబితములయి నిలిచియుండు భా- వము లెట్టివో, ప్రపంచ తత్త్వవేత్తలకు విన్నవిం చుట యధిక ప్రసంగమే యగును. కథ వేఱయి యున్నచో నన్ని విధముల నగ్రతాంబూలము నకుఁ దగినదై యీనాటకము మాకవి కింకను నూరుమడుంగుల కీర్తిఁ దెచ్చియుండునని ఘంటా ఘోషము చాటఁగలను.

దుర్గుణముల వర్ణింపనిదే సుగుణములకు వన్నియరాదను వాదమును గొంతవఱకు మేము నొప్పుకొందుముగాని మందునకైనను విషము తగి సంతయె వాడవలెనని విన్నవింపవలసియున్నది. ఇక నాటకదర్శనము చేతనే చెడుదారిఁ బట్టు మనుసులుగలవా రున్నచో, నట్టి మెత్తని చిత్త వృత్తిగలవారు యతులవలె గుహలలో దాగి యుండఁదగినవారే కాని వెలికిరా ననర్హులని కొం- గఱ మతము. ఇట్టివానిచే చలింపని చిత్తవృత్తి గలి, సుఖ దుఃఖాదులతో సమభావము వహించి.


   "పర్ణాంబు భక్షులై నవసి,
    యినుప కచ్చడాల్ గట్టుకొను”

వారి యుపయోగమునకై మాత్రమే నా- టకము లాడఁబడునేని యెవరి యాక్షేపము నుండ దని మావిన్నపము.

"Every play is a problem which tries
to answer one of those moral questions.
that concern nearly all of us."
               ---PHILIP LITTON
           
 

_____________