వదరుబోతు/గౌరవపదార్థము

గౌరవపదార్థము

3

మునుపటి కాలమునకును మన కాలము నకునుఁగల భేదమును విమర్శించు నొక యర్థ శాస్త్రవేత్త “మునుపటికన్న నిపు డన్నిపదార్థము లకును వెలలు చాల హెచ్చిన" వనియె. నిజమే కాని నాకుఁదోచినంతలో నీమాత్రమున కొక యపవాద మున్నయది. ఎంతటి సుభిక్షు సంవ- త్సరము లందైనను, ఏ సామ్రాజ్యకాలమం దైనను ునుపటి దినములలో "గౌరవమున కొంత వెల తగ్గియుండదు. రామరాజ్యము నాఁడును ధర్మరాజు పరిపాలనమందునుగూడ నీ పదార్థమింత యగ్గువ యయినదికాదు. అంత దనుకయేల? ప్రకృతపు ప్రపంచ సంగ్రామము కారణముగ బజారున అన్నిం టికిని వెల లసాధారణముగ హెచ్చుచున్నఁగూడ “గౌరవ"ము మాత్రము. నానాఁటికి చవుకగఁ బరిణమించు చున్నయది.

ఇంతమాత్రం మొక వింతకాదు. ఉపయో గించువారి సంఖ్య మధికమగు కొలఁదిని పదార్థ సంచయపువెల హెచ్చుట మన కనుభవగోచరము. గౌరవపు విషయమున నీవిధి వర్తింపదు. పూర్వ కాలమున గౌరవము నపేక్షించువారు చాల తక్కువ. ఎవ్వడో నూఁటనొక్కఁడు మాత్రము దాని నభిలషించుచుండెను. ఇప్పుడన్ననో, ఆబాల గోపాలముగ నందరును గౌరవమునకై యఱ్ఱులు సాచుచున్నారు. కాని గిరాకి హెచ్చినను వెల హెచ్చలేదను టొకవింతయే!

తొల్లింటివారు పరులు తమ్ము గౌరవించి నను లేకున్నను తమ తమ ధర్మములు నిర్వర్తించి తృప్తిఁజెందుచుండిరి. నిష్టాగరిష్ఠులని పదుగురిలో ఖ్యాతిఁగాంచ నెంచి సంధ్యావందనాదిక మాచ- రించుచుండలేదు. భక్తితోఁ బలువురు సమర్పించు నానావిధ ఫలాదుల మఱుఁగున యథేష్టముగ భుజింపగోరి కపటయోగమును సలుపు చుండలేదు. దేశోద్ధారకుఁడను కీర్తి గడింపఁ బనిఁ బూనిఁ యుప న్యాసము లిచ్చుచుండ లేదు. వారి పద్దతి వేఱు. ధన్వంతరి యైనను దనమందు లమూల్యములని, అసాధారణములని, సిద్ధక్రియలని, పత్రికలలోఁ ప్రచురించినట్లు కానము. వశిష్ఠాది మహామునులు శిష్యకోటితో సనుసరింపఁ బడుచుండిరిగాని “పర- మహంస పరివ్రాజకాచార్య, ప్రతివాది భయంకర ప్రముఖ బిరుదములతో వారు తమ్ము బొగడు చుండగాఁ దృప్తితో నాలకించుచుండినట్లు వినము. పరోపకారార్థమై తమ దేహమునేని యాసింపని శిబిచక్రవర్తియు జీమూత వాహనుఁడును దమ స్వార్థత్యాగమును మునుముందుగఁ జాటించిన వారు కారు. మహాకవు లనేకులు నూర్లకొలఁదిగ నుద్గ్రంథములు రచించిరికాని “గ్రంథమాలల” స్థాపించినవారులేరు. “జగద్ధితంబుగా” సుప్రసిద్ధ మగు భాగవత పురాణమును రచించిన బమ్మెర పోతన "హాలికుఁడు"గ కాలము గడపెఁగాని "భాగవత గ్రంథకర్తా”యని తాటికాయ లంతేసి ప్రకటనాక్షరములఁ దనయింటి వాకిటిపైఁ జెక్కించి యుండడు. విలువిద్యలో నర్జునుని సయితము వెఱఁగు పడజేసిన యేకలవ్యుఁడు తనయడవులలోఁ దాను తిరుగుచుండెఁగాని యూరూరు దిరిగి తన శక్తిని జనులకు వెల్లడించుచు “సభినవద్రోణా- చార్యు”డని పొగడొండ యత్నించిన వాడు కాఁడు. ఇంక నేఁటి పత్రికలలోఁ జూడుఁడు; యోగు- లకును, దేశోద్ధారకులకును, వైద్యులకును, దాత- లకును, కవులకును, గ్రంథములకును మితీయే కాన రాదు. వారి వర్ణన అపారములు. నేను ముందు నేను ముందని గౌరవమునకై ప్రతిమనుజుఁడును ప్రయత్నించు చుండుట యీ కాలపు లక్షణము.

ఘటం భింద్యాత్ పటం ఛింద్యాత్
      కుర్వాద్వా గార్ధభస్వనం!
ఏన కేనా ప్యుపాయేన
      ప్రసిద్ధః పురుషో భవేత్ ||

ఇది నేఁటి ధర్మము. కాని మరియొక విశేషము గలదు. ఇప్పుడు లభించినంత సులభముగఁ బూర్వకాలమున గౌర- వము లభించునదికాదు. ఇప్పుడు కందమువ్రాసిన వారెల్లఁగవులే! మందునూరిన వారెల్ల వైద్యులే! గడ్డము పెంచినంత మహర్షిగావచ్చును. ఉపన్యా- సవేదిక నెక్కినంత నాయక పదవి నధిష్ఠింపవచ్చును. కాని పూర్వకాలమున నిట్లుకాదు. రాజర్షి సత్తముఁడై యపరచతుర్ముఖుఁ డనందగిన మహా తపోనిధి విశ్వామిత్రుఁడు బ్రహ్మర్షిత్వము వడయు టకై యెంతకాల మెన్ని పడబాట్లు పడియెనో మనము విననిదికాదు.రాక్షసరాజుచే నపహ రింపఁ బడుచున్న లోకమాత సీతకై తనప్రాణ- ముల గోలుపోయిన జటాయువును నిర్దేశించి స్మరణచిహ్నము నొకదానినైన నెవ్వఁడును నెల కొల్పలేదు. భగీరథుఁడు గంగను దెచ్చిన చోట ప్రశంసా సూచకముగ నొక్క శాసనాక్షరమైనఁ గలదా తన కహితమైనఁ గానిమ్మని సహజ కవచ కుండలముల నడిగినంత దానమిచ్చిన యా వ దాన్య శిరోరత్నమగు కర్ణునికి కడకొక "రాయ బహదూరీ” నిచ్చిన పుణ్యాత్ములనైనఁ జూపుఁడు. కాళిదాసునివంటి మహాకవికే రాజసభలో ప్రవే శము చాలకాలమునకుఁగాని కల్గినది కాదఁట.

ఇందలి తారతమ్యమిది. తొల్లి గౌరవము నాశించువా రెంత యుదారులుగ నుండిరో, గౌర- వించువారుఁగూడ సంత లోభులుగనుండిరి. ఇప్పుడీ భేశము తారుమారైనది. గౌరవమునకై లోభ- పడువారు హెచ్చినకొలఁది గౌరవము నిచ్చువారు ప్రబలిరి. అడుగకమున్న, ప్రయత్నింపకమున్న, యోగ్యతఁ జూపకమున్న, తమంత నితరులకు గౌరవమును గొల్లలుగ దానము సేయు మహాదాత లీపుడు గలరు.ఈదానమునఁ దమగౌరవమునకు హాని వాటిల్లునదిగూడ వీరు సరకు చేయని యుదా మునుపటివలె గాక యిప్పుడు బజారున "గౌరవము” వెలకుఁగూడ లభించును. ధనవంతు లెల్లరును స్వేచ్ఛగఁ దానిఁ గొని యనుభవింతురు. ఇంతియకాదు. దాతల నాశ్రయింపఁ జాలని వారును, పణమిచ్చి కొన శక్తిలేనివారును గూడ దీని నార్జించుట కుపాయము లేకపోలేదు. నలు- గురు పోవుత్రోవను బోక నూతనమార్గ మొకటి దీని యందరుగుచు నదియే సత్పథమని యుచ్చై- స్వరమునఁ జూటుచుం బోవుచున్నచోఁ జాలును. ఆమార్గమున రాసులుగ నుండు గౌరవమును జేత నయినంతపట్టి మూటగట్టుకొని యరుగవచ్చును.

కాని యొకటి మాత్రము చింతాకరము. నేఁటి. “బాలసరస్వతి”ని రేపు ప్రశంసించు వా రకుదు. నిన్నఁటి 'రాయబహదూరు”ను నేఁడు తలంచువారు లేరు. మొన్నటి గ్రంథమును, కవిని, ఎల్లుండి స్మరించువా రుండరు. “ఆంధ్రకవితా పితామహ” బిరుదముచే నల్లసాని పెద్దనార్యుఁ డెన్ని యేండ్లకయిన గుర్తింపఁబడఁడా?. శిబి కర్ణ జీమూతవాహనుల పవిత్రనామాక్షరము లెన్ని యుగములకైన మాయునా? ముద్రా యంత్రములు పనిబూనిన తరువాతనే వాల్మీకి రామాయణమును రచించెనా? యోగ్యత ననుస- రించి గౌరవము తనంత రావలయుఁగాని, కొలఁదికి మీరి యపేక్షించి నంత రాదనుట ధ్రువము.

Fair Nymph, if fame or honour were to be
atinined with ease
Then would I come and rest with thee and
leave such toils as these.
                             -DANIEL.