వదరుబోతు/కురులమొఱ
కురుల మొఱ
17
నేడు నాకార్యస్థానమున కరిగినంత బల్లపై నా చిరునామాగల జాబొండు కానవచ్చెను. అది యొక చిత్రమైన లేఖ. అందలి యంశములపై నాయభిప్రాయ మిచ్చుటకన్న దానినే చదువరుల కర్పించుట యెక్కుడు హితమని తలంచుచున్నాఁడు అందిట్లు వ్రాయబడియుండె:-
"ఆర్యా! సాంఘిక గుణదోషములు విమ ర్శించుటయు, అగతికులు కాశ్రయమిచ్చుటయును దేవర నైజగుణములని చాల కాలముగ వినుటచే నేఁడీ విన్నపమును వ్రాసి తమ కొంత తొందర గల్పింప సాహసించితిమి.
మహాత్మా! మాజన్మభూమి యుత్తమాంగ దేశము. కుండలసీమలో నేఁటికిని మా పెట్టినదే పేరు. మార్దవ కోమలత్వాది సుగుణములు మా వంశమున కుగ్గుపాలతోఁగూడ వచ్చినవి. సౌందర్య. మునకు ముల్లోకములలోను మా పెట్టినదే భిక్ష దోషైకదృష్టిగల కవులు గొండఱు మాయెడఁ గౌటిల్యమును గోరంత కొండంత వర్ణించిరి కాని, దానిచే నితరుల కెవరికి నెట్టి యిక్కట్టునుం గల్గమి యటుండ మాకును మముఁ బోషించువారికింగూడ నది సౌందర్యాతిశయమునే గూర్పుటం జేసి యది గుణముగనే సమర్థింపగలము.
కాననే తరతరములనుండియు మీపూర్వులు స్త్రీలనక పురుషులనక, సర్వులును మమ్ము విశేష ముగ గారవించుచుండిరి. మా మాటయన్న తలతో నడచుచుండిరి. సదా స్నేహమున బోషించిరి. పూలతోఁ బూజించిరి. వారినుండి మా పడసిన మన్ననలకై వారిని మేమెంత కొని యాడిననుఁ దీరదు ఎన్ని కష్టములు వారనుభవింప వలసి వచ్చిననేమి, మాకేమాత్రమును చిక్కులు రానీక వారు జాగరూకతతో మెలఁగుచుండిరి. వారు నిరాహారులై నపుడు సయితము మాకు సదా హారముల కేకొఱఁతయు రాదు. సఖీరత పరి వృతయై ప్రాసాదమున యువరాజ్యభోగము లను భవించు దినములలో మల్లెలు సంపెగలతో మమ్మ లంకరించుట పోనిండు, పతిమాత్ర సహాయయై ప్రభుత్వభోగములఁ బాసి ప్రవాసకష్టముల నను భవించుచు దండకారణ్య సీమలలోఁ దిరుగు వేళ గూడ, జానకి కళివిపూవులో, గోరంట కుసుమ ములో, గోదావరిలోని తామరములో తెచ్చియైన మాకర్పించుచుండెనేకాని మాయెడ నిరాదరము చూపినది కాదు. సవతియెడ మత్సరమూని సత్య భౌమ పతిపై నలిగి పన్నాగము లెన్నియో పన్ని కడకు మహేంద్రుని యుపవనమునుండి పారిజాత వృక్షమునే పెకళించి తెచ్చి పెరటితోఁటలో నాటింపఁజేయుట మాకైకదా? అంతయేల? మా ప్రసంగములేకున్నచో భారతకథయునునిస్సారమే! నీచబుద్ధి దుస్ససేనుఁడు ద్రౌపది నవమానించి మమ్ము వట్టి నిష్కరుణుఁడై సభకీడ్చి కాసినెట్టిన కారణమున నాప్రచండమానిని పాంచాలి మాకై దీక్షవహించి యెన్ని యోపాట్లకోర్చి పట్టువట్టి తుద కానీచుఁడు భీమసేనునకుం జిక్కి నిర్ఘాతపాతముం బోలు నతని ఘోరగదాహతిపాలయి నేలఁ గూలి నపుడా పాపి హృదయమందలి రక్త ధారలచే మా కవబృథస్నానము గావించి పగసాధించిన క్షణ మునుదలంచిన మావంశము వారందఱును నేఁడు గూడ మహోత్సవమున నిక్కకమానరు. కాని యివన్నియు దేవరయెఱుంగని యంశములు కావు.
కాల మొక్క తీరుగ నుండ రాదు కాఁబోలు! ప్రాచీనౌన్నత్యమహిమ యెంతయైననేమి! రాను నాను కాలమునకుం జిక్కి మా యోగ్యత తెల్ల వారసాగెను. అకారణముగ మాపై గొందరకు ద్వేషబుద్ధి యొదవెను. మహమ్మదీయులు జైనులు మున్నగువారు మతము పేరు పెట్టి మమ్మునిర్దయతో. ఖండింప మొదలిడిరి. ఎవరు నిరాదరించిన నే- మాయె, మా యార్య సంతతియైన మమ్ము చేవిడు వదుగదాయని కొండను బలె నమ్ముకొని కొంతలో గొంత నెమ్మది పఱచుకొని కాలము గడుపుచుం టిమి. కాని మహాశయా! క్షమింతురుగాక! క్రమక్రమముగ మాదురదృష్ట ఫలమెట్టిదో - వారికి సయితము మేము భారమైతిమి. పాశ్చాత్య నాగ రకతా ప్రవాహవీచికలు ప్రసరించుకొలఁది మీ వారికి మాపయి నసూయ బలపడుచువచ్చినది. పులిని జూచి నక్క వాతలు వేయించుకొనురీతి నొక నిని జూచి యొకఁడు- అందున నిప్పటియువకులు - మాపైఁ గత్తిఁగట్టనేల? శత్రువులపైఁ గత్తి నూఱ నేర్చిన మహనీయుల వంశమం దవతరించియు వీ రిప్పుడు మముఁబోటి యనదలగుఱించి సీమకత్తుల సానదీయఁదివురుట! జన్మావధిగా తమ్మాశ్రయించి వెన్నంటియున్న మమ్ము కరుణాలేశమును లేక కట కటా! రూక దక్షిణతోడ నంగారకగ్రహమునాత ద్రోచి మొదలంట ఖండించి, చుట్టచుట్టుకొని కసవుకుప్పలలోఁబడి పొర్లి పొర్లి మేము దుఃఖంచు చుండఁజూచి యానందించుటకు వీరిహృదయములు హృదయములో? గండశిలలో? పోనిండు. మా బ్రతుకేగాలిఁ బోయినఁ బోవుఁగాక! మమ్ముగాద న్నమానె , బోలెఁడు గొఱియత్రుప్పుడు కుళ్ళాయి. పేరున నెత్తి నెత్తుకొనుట యలంకారమా, వికా రమా! ఆర్యా! మీనవనాగరకుల చదువున కిది మాత్రమా పరిణామము? నెత్తి నెత్తువారున్న చో సపంచమంతయేని మోయంగలమని విఱ్ఱవీగు చున్న యీయన్నలకు మేమాభారము? గోష్పా దమాత్ర పదేశమునకు మేము తగమా?
ఇక నాగరిక తరుణీమణులును మమ్ము పెక్కు చిక్కులం బెట్టుచున్నవారు. మునుపటి సొగసులన్నియును మూలఁబడినవి.వారిఁ కొప్పు లిపుడు మెప్పులు కావు. తొల్లిఁటికాలమున నెందు లకు గొఱమాలిన జడలని వీరి యాశయము. కొన్ని నాళ్ళు మమ్ములఁ గట్టిగా బిగియఁబెట్టి లాగిలాగి పురిపెట్టిరి. కొంతకాలము చిత్రవిచిత్ర ముగ విరచికట్టి బాధించిరి. మొగ్గలతో నలంక రించెదమను నెపమున నిలువెల్ల సూదులతో గుట్టి సూత్రములతో బిగియఁగట్టిరి. అలంకార వ్యాజ మున మోయలేని భారమును మోయించిరి.తా- ము మున్దినదే గంగ కాకున్న నిట్టి వా యలంకార ములు? మా సహజ సౌందర్యపు తత్త్వమెఱిఁగి ప్రపంచమున నదిమాసిపోకుండ చిత్రపటములలో నైన నిలిపినందుకై రాజా రవివర్మ మాకెంతయు వందనీయుడు.
ఇవన్నియు నెటులో యోర్చుకొని యిన్ని నాళ్ళు గడిపితిమి.కాని ముఁదున్నది ముసళ్ళ పండుగ. నవనాగరకత స్త్రీలలో వ్యాపించుకొలఁది మాకుఁ గష్టములు రెట్టింపగుచు వచ్చినవి. సువా సన పేరున సారాయములలో మమ్ము ముంచుచున్న వారు. ఇంతియకాదు. స్వేచ్ఛగఁ బెరుగక ముమ్మపుడప్పుడు కత్తరించునాచారము ప్రారంభ మయ్యె. ఆర్యా! మాకేమో భయమగుచున్నది. ఇఁకఁ గొన్ని నాళ్ళలో, యీ నాగరకత నబ్బు రథ ముపై నెక్కి సీమకత్తులు నూఱుచు మాపై నిర ర్ళళగముగ దండయాత్ర వెడలఁగలదనియు అప్పుడు స్త్రీ పురుషులలో నెవరుగాని మా కభయమిచ్చి మమ్ము పోషించువారే యుండరనియు మాకు సూచనలు స్పష్టముగ గానవచ్చుచున్నవి. మును పటి కవులు స్త్రీలనుమాత్రము వర్ణనలకై పూ బోడులనిరిగాని యిఁకమీఁద పూలు లేకున్న పీడ వదలినది స్త్రీలను పురుషులనుగూడ నా పేరునఁ బిలుచుకాలము రానున్నది కాబోలు?
మహాశయా! మాగతి యెవరు విచారించు వారు? మీరయిన మాపైఁ గరుణించి సంఘ మునకు హితము చెప్పరాదా? .
ఇట్లు విన్నవించు,
కురులు.”