వదరుబోతు/సృష్టికర్తయుద్దేశము
సృష్టికర్త ఉద్దేశ్యము
2
నిద్రించునపుడు తప్ప మనుష్యుఁడెల్ల వేళల యందు నేదేనొక విషయమును గూర్చి యోజించు చుండును. అతని భావనా సముద్రమునఁ బ్రతి క్షణమును వేరువేరు యోచనాతరంగము లుప్ప తల్లి యాయుత్తరక్షణముననే యణఁగిపోయి క్రొత్త వానికిఁ జోటిచ్చును. ఎట్టి భావములఁ జొఱని య్యక మనస్సును బ్రశాంతముగా నుంచుకొనుట యోగాభ్యాసపరులగు మహాత్ముల కేగాని కేవల మానవునకు సాధ్యముగాదు.
విశ్రాంతి వేళల వాహ్యాళి వెడలునపుడు
నాబుద్ధి యోచనా లహరిలోఁడి మునిగి తేలు
చుండునుగాని, యగాధ జలములోఁ బ్రమాద
మునఁ బడి కాలుసేతు లిట్లట్లుగదల్చి యాప్రశాంత
సలిలముల సంక్షోభింపఁజేయుటచే నీతరానివాఁ
డెట్లు దరిఁజేరలేఁడో యట్లే, నాబుద్ధియు దరిగాం-
చుటలేదు. మానవుఁడాచరింపవలసిన ధర్మంబులఁ
గూర్చియు మనుష్యజన్మ సార్థకతఁ గుఱించియు
చింతించుచుండుట నాకెక్కువ యలవాటు. ఏదే
నొక కారణమునఁ దనపల్లియవీడి చేరువనున్న ప-
ట్టణమునకుఁబోయి, యందుఁ దటాలునఁ దన
ప్రక్కఁ బారిపోయిన మోటారు బండిని జూచి దాని
చలనమునకుఁ గారణమరయఁ బ్రయత్నించిన
మూడుఁడగు పల్లెటూరివాని యోజనలెంతవఱకుఁ
కృతార్థతఁ జెందునో మనష్యధర్మంబును గూర్చి
చేయు నాతలపోతలుగూడ నంతవఱకే ఫలించినవి.
నాపిచ్చియూహలను నేను మానుచుండుట
లేదు.
ఒక సా యంతనమున నిట్లాలోచించుచుంటిని. లోకములో నెన్ని యో వేల మతములున్నవి.
ఒక్కొక్క మతము వార లొక్కక్క దేవుని సమ్ము
చున్నారు. అందఱును వారి వారి యూహల
కందినట్లు స్వస్థ నరకములఁ గల్పించుకొని మను
ష్యుఁడు దానుజేసిన పుణ్యపాపములఁ బట్టి స్వర్గ
మునకో నరకమునకో పోవునని గట్టిగా నమ్ము
చున్నారు. ప్రతివాఁడును దనమతమే యుత్కృష్ట
మైనదనియు నితర దేవతలఁ గొల్చువారు పుణ్య-
ములంబడయఁజలరనియు వాదించుచున్నారు. ఈ
వాదము లెన్ని యో వేల యేండ్ల నుండియు జఱుగు
చున్నవి; యింక ముందెన్ని వేల యేండ్లకును నిలిచి
పోవునవి గావు. ఇది తెలిసి యుండియు నీతత్త్వముఁ
మార్చి, శాస్త్రజ్ఞులును, తార్కికులును, కవులును,
విద్యావంతులును దమ జీవిత కాలమంతయు
విచారించుట వృథా కాలహరణముసేయుట గాదా?
ఎందులకిన్ని శాస్త్రములు భూమిననతరించుట?
ఇందఱు మతాచార్యులు, ఇన్ని దేవాలయములును
వట్టి యాడంబరములేనా?
కాని యొక వేళ లోకములోని జనులందఱును సమ్మతించి యొక మతమునే , యొక దేవతనే శ్రేష్ఠ ముగా నొపుకొందురుబో, దానివలన మనుష్యునికిఁ గలుగు లాభమేమి ? అప్పుడు మాత్రము జనులంద ఱును సత్యవంతులును ధర్మపరులు నగుదురా? - అప్పుడు మోక్షమార్గము సుకరమగునా? లేనిచో నిట్టి నిరర్థక ప్రయాసను మానవుఁ డెందుకొఱకు పడుచున్నాడు? ఫలమున్నను లేకున్నను మనము శ్రమంబడి యీ తత్త్వము దెలిసికొనుట యవసరమా! తెలిసి కొననిదే మనజీవయాత్రఁ గడపుట దుష్క రమా! మనమిట్టి యోజనలఁజేసి వాస్తవ స్థితి నెఱుఁగ వలయునని సృష్టికర్త యుద్దేశమై యుండునా?
ఇక మతములన్నియు నేదేనొక విధమున దేవుని బ్రార్థింపవలయు, నాతనియెడ భక్తిఁగలిగి యుండవలయుననిగదా చెప్పుచున్నవి. మన మెల్లప్పుడు నాతనియెడఁగృతజ్ఞతఁ గలిగి సదా యాతని బ్రార్ధనఁజేయవలయునని యాతనియభీ స్టమా! అయినచో నాతనికిఁ గలుగు లాభమేమిః బ్రహ్మాండమునెల్ల సృజించిన యాతనికి మన మే యుపకారము సేయఁ గలుగుదుము. ఓ దేవుఁడా! నీవు దయామయుఁడవు. ప్రేమస్వరూపుఁడవు. నే ననుభవించున వెల్లయునీవొసంగినవియ. నేనెల్ల - ప్పుడును నీయందుఁ గృతజ్ఞుఁడవై యుండెదను. అనిసతిదినము నతనిగుఱించి స్తోత్రము సేయుట వల్ల నాతనికిఁ గలుగు మోక్ష మేమి? ఓ యీశ్వరుఁడా మాకదియు నిదియు నొసఁగి మాకోర్కెల సమకూర్పుమని గూడ, కొం- డఱు ప్రార్థనములఁ జేయుచున్నారు. మన కేది శ్రేయస్కరమో యేది కాదో, యెఱిఁగి యుండిన గదా మనమాతనిని 'ఫలాని' దిమ్మని కోర గలము. ఈశ్వరుఁడు సర్వజ్ఞుఁడే! అతనికి మన లోపములు దెలియవా? మన కావశ్యకము లగు నవి యాత్రఁడే యొసఁగ లేఁడా! ఇట్టి పిల్లి మ్రొక్కులు మ్రొక్కినవారియందు మాత్ర మతఁ డనుగ్రహించి తక్కినవారియెడ నిరాదరము గలిగియుండునా? దైవప్రార్ధనము భక్తితోఁ జేయువారు చేయని వారి కంటె నేవిధమున నిహమున నెక్కువ యభివృద్ధిఁ జెందుచున్నారు. అట్లేని తిర్యగ్జంతువులు భగవత్ సృష్టిలోనివి దైవప్రార్థన సేయుచున్నవా ? వానికి గూడ నొక మతమును స్వర్ణవంకముల జ్ఞానమును గలదా? భగవంతుఁడు వాని సౌఖ్యమునకుఁ గావ - లసిన దొసంగుట లేదా? పక్షులకుఁ దమ కులాయ ముల గట్టుకొను నేర్పును, చిన్న సింహమునకుఁ పెద్ద ఏనుఁగు సంహరింపఁగల శక్తియు, పొట్టేళ్ళకుఁ జలి దగులకుండునట్లు వెచ్చనియున్నియు,నిది యదియన నేల వాని సౌఖ్యమున కేమి గావలయునో యదియంతయు నాతఁడిచ్చుట లేదా? వానికంటె మనుష్యుఁడేమి యెక్కుడు సౌఖ్య మనుభవించు చున్నాడు?
వానివలెనే మనమును సృష్టిలోని జంతు వులము. మనము జీవించియుండుట భగవదుద్దే- శము గనుక జీవించుచున్నాము.ఆతని యాజ్ఞ యైనపుడు ప్రపంచమును విడచుచున్నాము. ఈ మధ్యన మన చేఁతలచేఁ గలిగించుకొన్న కష్టము- లనో, సుఖములనో, యనుభవించుచున్నాము. ఈ చేతఁజేసిన దాచేత ననుభవింప వలయునని గదా పెద్దలు సెప్పుదురు.
'అవశ్యమనుభోక్తవ్యం కృతంకర్మశుభాశుభం'
కాని యీమతములు ధర్మాధర్మములు, వర్ణాశ్రమములు, కట్టు బాట్లు, వీనియాడంబర మేమి? జీవితానంతరమున మాత్రము మననెత్తిన శిఖర మెత్తుటకా యివి? మానవుని జీవితకాలమును సుఖ మాపాదించుటకుఁ గానిచోఁ తర్వాత నివి- యేల? ఈ యేడంతయు నుపవాసమున మలమల మాడి వచ్చు సంవత్సరము నిరంతరము పండుగుల ననుభవించుట కెట్టిమూర్ఖుఁ డిచ్చగించును? కా- వున వీని నిర్మించిన మహనీయుల యభిప్రాయ మేమైయుండును? సంఘమును బాగుపఱచుటకా? లేక ముక్తినొసఁగుటకా? వారు స్వర్గసంపాదనములని జెప్పు ధర్మశాస్త్రములన్నియును సంఘ- మునకు మేలుగలిగించు నుద్దేశము గలవికావా?
సంఘమునకుఁ జెఱుపుఁగలిగించు కార్యము లనేగదా వారు నరకహేతువులగు పాపకార్యము లనుట. మనకుఁ జేతనైనంత మట్టున కితరులకు మేలుచేయుచు, సంఘమున కేవిధమగు కీడుఁగలి గింపక నలుగురిలో సజ్జనుఁడనిపించుకొన్నచో శ్రుతి స్మృతుల యుద్దేశము నెఱవేరును గదా? అట్ల యినచో దేవుఁడుండనిండు, లేకుండనిండు. శంకర మతమైనఁ గానిండు, చార్వాకమన్న నననిండు. స్వర్గములుండనిండు; లేక వలసఁబోనిండు; వాని గూర్చి వృధా కాలక్షేపము లెందుకు?ఈ మన యుద్దేశము నెఱవేరినచో యిహసౌఖ్య మేమో తప్పక కలుగును. పరమున్నచో నిస్సంశయముగా నందును సౌఖ్యమే చేకూరును. లేకున్న నక్కఱ యేలేదు. వృధా కష్టమేల?
ఇట్లని నా మెడకు నాస్తికత్వ మంటఁగట్ట రాదు. స్వర్గసుఖమన్న నాకు మాత్రము నోరూరక పోవునా? ఆలోక మేదిశలోనున్నదో నేనిదివర కెఱుఁగనైతిని గాని లేనిచో నీ వేళకు నలకూబ రునితో ద్వంద్వయుద్ధము నారంభించియే యుందు 'నేమో! పోనిండు; తెలియని మతములకై యర్థముకాని గ్రంథములఁజదివి రానిపోని స్వర్గసుఖ- మున కర్రులు సాచుటకన్న మనయింట మన యూర, మన దేశమున, మన సంఘమున, మన జీవితముల నుపయుక్తములుగఁ జేయుట మిగుల ముఖ్యమని నాయాశయము.
చదువులందులేదు శాస్త్రమందును లేదు,
లేదు వాడదైవ భేదములను
బయటనున్నముక్తి బాటించలేరయా
విశ్వదాభిరామ వినరవేమ!