కాశీమజిలీకథలు/ఎనిమిదవ భాగము
విషయసూచిక.
2 |
13 |
27 |
48 |
69 |
78 |
86 |
94 |
115 |
133 |
142 |
158 |
172 |
180 |
190 |
197 |
208 |
222 |
233 |
257 |
263 |
275 |
295 |
308 |
313 |
324 |
332 |
351 |
382 |
పీఠిక.
చ. ఇరువురు రాజులైరి మఱియిద్దరురాజుల కల్లురైరి యొ
క్కరుఁడల రాజమిత్రుఁడనగాఁదగె నొక్కఁడు యక్షకన్యకం
బరిణయమయ్యె శ్రోత్రియుకుమారిత నొక్కఁడు బెండ్లియాడె నీ
ధరఁదగుసప్తమిత్ర చరితంబు విచిత్రకథాస్పదంబుగన్ .
ఆర్యులారా ! ఈభాగమునకుఁ 'గథానాయకులైన దత్తక చారాయణ గోనదీన్‌య కుచుమార ఘోటకముఖ సువర్ణనాభ గోణికాపుత్రు లేడ్వరును లోక ప్రసిద్ధులగు కామశాస్త్రప్రవక్తలు పాంచాలుఁడు రచించిన కామశాస్త్రమును క్లుప్తపఱచి యేడ్వురునుబంచుకొని తలయొక యధికరణమును వ్రాసిరి. వీరు మహాపండితులైనట్లు వీరురచించినగ్రంథములే చాటుచున్నవి. వాత్స్యాయన సూత్రవ్యాఖ్యానకర్త దత్తకునిగుఱించి యిట్లువ్రాసెను.
గద్య మాధురో బాహ్మణః పాటలీపుత్రే వసతిం చకార. తస్యోత్తరె వయసి పుత్రోజాతః తస్యజాతమాత్రస్యమాతా మృతా. పితాపి, తత్రాన్యస్యై బ్రాహ్మణ్యై తం పుత్రత్వెన దత్వా కాలేన లోకాంతరంగతః బ్రాహ్మణ్యపి మమాయం దత్తకఃపుత్ర ఇత్యనుగతార్థ మేవ నామచక్రె స తయాసం వర్థితః కాశీంగత్వా అచిరేణైవ కాలేన సర్వావిద్యా: కలాశ్చ అధీతవాన్. వ్యాఖ్యానశీలత్వాద్దత్తకాచార్య ఇతి ప్రతీతిముపాగతః ఎకదాచ తస్యచేత స్యేవ మభవత్. లోకయాత్రా పరాజ్ఞేయాస్తి సాప్రాయశో వేశ్యాసుస్థితేతి. తతో వేశ్యాజనం పరిచయపూర్వకం ప్రత్యహముసాగమ్య తథాతామభివివేద. తతోసౌవీరసేనాప్రముఖ గణికాజనే నాభిహితః అస్మాకంపురుషరంజసముపదిశ్యతామితి. తన్నియోగా ద్వైసికంపృధక్చకారేతి అపిచయక్షేణశప్తొ దత్తకః స్త్రీబభూన పునశ్చకాలేన లబ్ధవరః పురుపోభూత్ తేనో భయరసజ్ఞేన దత్తెన పృధక్కృతమితి.
దత్తకునిజన్మభూమి పాటలీపుత్రనగరము తండ్రిమాధురుఁడు చిన్నతనమునందె తల్లిమృతినొందగాఁ దండ్రివానిని మఱియొక కాంతకు బెంచుకొననిచ్చెను. దానంజేసి యతనికి దత్తకుఁడను పేరువచ్చినది. దత్తకుఁడు కాశిలో ననేకశాస్త్రములు చదివి దత్తకాచార్యుఁడనిపేరు పొందెను. మఱియు లోకయాత్ర సేయదలంచి వేశ్యాజనమువలన దద్విశేషములుదెలియగలవని తలంచుచుఁదఱుచువారియిండ్లకుఁ బోవు చుండును. ఒకచో యక్షునిచే స్త్రీగా శపింపఁబడి తిరుగాఁగొంతకాలమునకు బురుషుఁడయ్యెనఁట దానఁజేసి దత్తకుఁ డుభయరసజ్ఞుఁడని ప్రసిద్ధిజెందెను. పురుషులరంజింపఁజేయు విథానము బోధింపుమని తన్ను వేశ్యాజనము ప్రార్థింప వైశికప్రకరణమురచించెనని వాత్స్యాయన సూత్రవ్యాఖ్యాన కర్త వ్రాసియున్నాడు. ఇతనిగుఱించి మఱియొక గ్రంథమున మఱియొకరీతిగా వర్ణిం పఁబడియున్నది.
ఏది యెట్లైనను నీయేడ్వురుమిత్రులు ఒక్క గ్రంథమునే పంచుకొని యట్లు తలయొక యధికరణమును వ్రాయుటచే నేకకాలికులని చెప్పకతప్పదు. తక్కినవిషయముల నిజానిజంబులఁ దెలిసికొనుటకు సృష్టించిన బ్రహ్మదేవునడుగవలసియున్నది. ఇందలి కథాచమత్కా.రమునే పరిశీలింపవలయునని చదువరులఁ గోరుచున్నాను.
వీరేడ్వురు కాశిలో విద్యలబూర్తిజేసి పండితులతోఁ బ్రసంగించి విజయమందనుత్సుకత్వము చెందుచు భోజునియాస్థానమునఁ బెద్ద పండితులున్నారనివిని మధ్యదేశవిశేషంబులం జూచుచు సంవత్సరము నాఁటికావీటికి జేరుటకునిశ్చయముజేసికొని తలయొకదారిఁ బయలుదేరిరి. అందుదత్తకుండు ఒకమార్గంబునంబడిపోవుచు దారితప్పి యొక యర్థరాత్రంబున యక్షశైలంబునకుఁబోయి తత్క్రీడా విశేషంబులఁ జూచిచూచి యతనిచే స్త్రీగాఁ శపింపబడియెరు. ధారానగరముజేరు వఱకు నాఁడుతనము రాకుండునట్టును సంవత్సరముగాఁగానే శాపాంత మగునట్లును నతనిచేవరంబు వడసి యప్పురంబునకుఁ బోవుచుండ రాజపుత్రికయెక్కుగుఱ్ఱము కళ్ళెముత్రెంచుకొని పారిపోయి యాదత్తు నెక్కించుకొని యుద్యానవనములోఁ బ్రవేశించినది. అంతలోనతం డాఁడుదియయ్యెను. మొదటఁజూచినవారలతని బురుషుఁడనియుఁ దరువాత జూచినవారు స్త్రీయనియు వాదించిరి. దత్తుండు స్త్రీపురుష రూపములతో నావీట గావించినచర్యలు కడునాశ్చర్యకరములుగా నుండును. భోజురాజకాళిదాస వియోగసంయోగకథలును గోణికాపు త్రుఁడు పాటలీపుత్రనగరవాస్తవ్యురాలగు రతినూపురయనువేశ్యపుత్రికలు చిత్రసేనారతిమంజరులవెంటఁబెట్టికొని ధారానగరముజేరినకథయు శ్రోతవ్యముగానుండును. కుచుమారుఁడు సరస్వతియను రాజపుత్రిక నరువదినాలుగువిద్యలలో నోడించి రాజ్యముతోఁగూడ నాచేడియంబరిగ్రహించినకధయు భూతోచ్చాటన గావించి మదయంతిని బెండ్లియాడిన గోనర్దీయునికధయు ముందుగాఁ జదివితీరవలయును. చారాయణుఁ డుత్తరదేశారణ్యసంచారముగావించి లోకోత్తరరూపగాన కళాలలితయగు యక్షవనితం బరిణయం బాడి ధారానగరము జేరి మిత్రులంగలిసికొనిన చమత్కారము విస్మయముగలుగఁజేయక మానదు.
ఘోటకముఖుఁడు భోజునివెంటఁ దిరిగితిరిగి రాధయను వృద్ధ నాశ్రయించి వరాహద్వీపమునకేగి యామె మనుమరాలిఁ బెండ్లియాడి మిత్రులం గలిసిసవిషయము సొంపుగావర్ణింపఁబడి యున్నది. ఇందుచింతామణి లీలాశుకుఁడు మదాలసకౌశికుఁడు లోనగువారియుప కధలు చాలగలవు. పెక్కులువ్రాయనేల ఏకధలెట్లున్నవని నిరూపించుటకుఁ జదువరులలే ప్రమాణము—పదార్థములు వడ్డించి రుచులడుగనేల?
ఇందు విశేషించి చతుష్షష్టికళలు అరువదినాలుగు విద్యల యొక్కపేరులు(వైశికప్రకరణము) వ్రాయబడినవి. వానింజదువుటకు విసువుగలవారు విడిచిచదువవచ్చును. కథాసందర్భమునకు లోపముండదు.
2-3-4 కూర్పులపీఠిక.
ఈముద్రణమందు మార్పులేమియును జేయలేదు. కాకితములు మంచివని చదువరులే గ్రహింతురు. ఈకాశీమజిలీకథలు ఇప్పటికిఁ పది భాగములు ముద్రించితిని. దీనితోఁ బూర్తియైనదికాదు. పండ్రెండవ భాగముతో గ్రంథము బూర్తిజేయఁదలంచికొంటిని (11-12భాగము లొకతూరియే ముద్రించి ప్రకటింతుము.) సాధ్యమైనంతత్వరలో వెలువడగలవు. వీనిగుఱించి యిచ్చినపండితాభిప్రాయములు చాలగలవు. దైవానుగ్రహమున 12 భాగములు పూర్తికాబడినది.
శతావధాని చెళ్లపిళ్ల వెంకటశాస్త్రిగారు
బ॥ శ్రీ॥ గురువరులగు మధిర సుబ్బన్నదీక్షితులవారి సముఖమునకు. - కడియము. 15 - 9 - 26
శిష్యుఁడు చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి శతావధాని యనేక నమస్కార పూర్వకముగా వ్రాసికొను విజ్ఞాపనము.
గురువరా ! తాము కొలఁదిదినములనాఁడు దయాపూర్వకముగ నొసఁగిన కాశీమజిలీలు అనుపేరుగల భవద్విరచితగ్రంధమునందలి కొన్ని భాగములను నాకొసఁగుచు వీనినిజదివి యభిప్రాయమును దెలుప వలసినదియని సెలవిచ్చి యున్నారు తదేక దృష్టితోఁ దమగ్రంథమునందలి కొన్ని కధలనుజదివితిని. ఇవి కేవలకథలవంటివేకాక వ్యాకరణాదిశాస్త్ర సంప్రదాయమునందేమి యలంకారాదులయందేమి మనప్రాచీనకావ్యములకించుకయుఁ దీసిపోక పాఠకులకు మంచిసాహిత్యజ్ఞానమలవఱచుటకుఁ గడుంగడుఁ దగియున్నట్లు గ్రహింపఁగల్గితిని. సూత్రప్రాయముగా వ్రాసిన యీయభిప్రాయమునందలి సారమును బాఠకలోకము గ్రహింపకపోదని విస్తరింపక యింతతో ముగించుచున్నాఁడను. ఇవియే నానమస్కారములు.
చిత్తగింపుఁడు.
ఇట్లు
భవద్విధేయుఁడు
శతావధాని చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి
సంస్కృత ప్రాకృతాది బహుభాషా విశేషజ్ఞులగు శ్రీమాన్
యమ్. ఎ. మానపల్లి రామకృష్ణ కవిగారిచ్చిన యభిప్రాయము.
విద్యాగంథములేని స్త్రీబాలపామరజన సామాన్యమును నిరంతరరాజ్యభార ఖిన్నులగు ప్రభువులను వ్యవహారక్లేశసాగరతరంగితాంతరంగులగు శ్రీమంతులను ఉపదేశపఠన చింతనాది శ్రమములేకయే కేవలము హృదయైక వేద్యమై రసభావబంధురముగా క్షణకాలమహ్లాద సముద్రమున దేలించి ధర్మానుష్ఠానమున నెలకొల్పి యాత్మ విద్యాపారంగతుల గాఁ జేయఁజాలినది కథావినోదమేయని మహర్షులు దాని జతుష్షష్ఠి విద్యలలోఁబరిగణించి యనుశాసించి యభివృద్ధిపఱచిరి. ఇట్టికధావినోదము వినోదమాత్రఫలజనకముగాక ధర్మాదిసాధనోపాయ మహత్తమంబగుట సర్వజన వేద్యమే. కేవలము రాజనీతిబ్రతిబోధించు పంచతంత్రాదికథలును విప్రలంభసంభోగ శృంగారనామ ద్విధాభూతరసరాజు రహస్యపరమార్ధ విచారమనోభిరామంబగు బృహత్కధా నిబంధనంబును ధర్మలోకలవసాధిత బృహద్ధర్మ సంస్తానాది ధర్మసూక్ష్మపరిబోధన చమత్కారంబగు దశకుమార కథావిస్తరంబును ఏకకథారసపరిపూర్ణంబై సాహిత్య విద్యాధి దేవతావిలసితంబగు కాదంబరియు గేవలము ధర్మప్రధానంబగు పురాణజాతమును ఏకదేశరమ్య ప్రస్తావములె యగుచున్నవి. మఱియుఁ గాల కౌటిల్యమున భిన్న దేశభిన్నాచార సంక్రమణంబునంజేసి చిరకాలావధిం బహుపురుషాంత రంబులంగాని తెలిసికొనరాని సదాచారధర్మానుష్ఠాన తారతమ్యంబు నెఱుఁగలేక యవిశ్వాస మూఢమగు చిత్తంబు కుక్షింబరక్రియా సాధనోపాయమగ్నంబగుచు బురాణగాధావిచారణావథానంబు లేక తత్తరించుచుండ తీర్ణోపాయంబులలో సులభమై పతిష్ఠమై బహుధర్మప్రతి పాదకంబయి నానారసభావ సమగ్రభాజనంబయి సమస్తపురాణగాథాకథాసారవిరాజితంబై బహుకళామర్మ విచారదక్షంబై కథా సంవిథానచాతురీనిరంతరోత్తమకథా స్వాదనోత్సేక సంభావికంబయివిలసిల్లు కాశీమజిలీలకధా నిబంధనము సర్వజనచిత్తా కర్షకంబనుటకును సందియములేదు. దీనిలో రసాభావపుష్టియు గధాసంథాన కౌశలమటుండ జతుర్విధపురుషార్థకంబులగు మహాకవి వాఙ్మయములోని నవరసములు సాథారణకధాకధనధోరణిలో వెదజల్లబడియుండుటచే నివి పండితులకును గావ్యకర్తలకును గూడ బ్రతిభోన్మేషణక్షయంబులని నిస్సంశయముగాఁ జెప్పవచ్చును. ఇందు బారమార్ధకులకుఁదప్ప సామన్యులకురుచింపని శంకరాద్యాచార్యచరిత్రము లతిరసవంతముగా బరమార్ధబోధకంబుగ కధాధోరణిగా గూర్పబడినవి.
విశ్రాంతి చింతావినోదులకు జన్మజీవనతరణోపాయంబగు తీయనియౌషధంబువలెనుండు నీగ్రంథరాజమెంత పెద్దదియై పెరుగనున్నను విసుగులేక యుత్తరోత్తర సంపుటప్రకటనమున నెల్లరును వేచియుందురని నిశ్శంకముగా చెప్పవచ్చును. ఇందు గాదంబరీకథాసంపుటము ప్రౌఢసాహిత్యరచనా బంధురంబై రసభావవస్తృతంబై యించుక కఠినమయ్యును సాహిత్యజ్ఞానసోపానాధిరోహణమునకై నిర్మింపబడిన యీకథా సంపుటములలో నిప్పటికిది యున్నతస్థాన మలంకరించుచున్నది. చతుర్ధాష్టమ సంపుట కథావిన్యాసము లీగ్రంధకర్తకుఁ గథానిర్మాణ చతుర్ముఖత్వమును దప్పక యొసంగు చున్నది. బ్రహ్మశ్రీ మధిర సుబ్బన్నదీక్షితులవారి గ్రంథరచనాములంబున గుణాఢ్యాదిమహాకధ కీర్తిప్రతినిధియగు శాశ్వతఖ్యాతి సంపాదించిరని మాయభిప్రాయము వీనియభ్యుదయపరంపర సర్వేశ్వరుం డొనగూర్చుగాక యని మాప్రార్ధనము.
ఇట్లు
మానవల్లి రామకృష్ణకవి.
రాజమహేంద్రవరమున డిస్ట్రిక్టుమునిసిఫ్ పదవిలో నుండు బ్రహ్మశ్రీ శ్రీమాన్ మ. కృష్ణమాచార్యులవారు ఎం, ఏ, ఎం, ఎల్, పి, హెచ్', డి. బిరుదాంకితులు ఈక్రింది యభిప్రాయము నాంగ్లేయభాషలో దయచేసి యొసంగిరి,
శ్రీమత్పండిత మధిర సుబ్బన్నదీక్షితులవారిచే రచింపఁబడిన "కాశీమజిలీకథ" లను పేర నొప్పు కధా సమూహ మింత కాంధ్రదేశమంతయుఁ జక్కఁగా నెఱింగినదే కావున నేను బ్రశంసింపవలసిన యావశ్యకతలేదు. ఆగ్రంధముల కిడిన కేవలనామముసహితము మసకుఁ బవిత్రమైన భావమును హృదయమున నుత్పాదింపఁజేయుటయేకాక పూర్వకాలమున రాకపోకలకు మనకువలె సౌలభ్యములు లేకుండియుఁ గ్లేశనదియైన మన పెద్దలు గాలినడకతో పుణ్యపట్టణమైన. కాశీని దర్శించిరాఁగలంత భక్తిశ్రద్ధలు వహించియుండిరను నాశ్చర్యమును గలిగించుచున్నవి. జనసమూహముల నాహ్లాదింపఁ జేయుటకుఁ గథాకధనము మనహిందూదేశములో నతిప్రాచీనవిద్యయే. దానికి రెండు విధముల ప్రయోజనముగలదు ఈకథలు ధర్మపరాక్రమముల తత్వప్రభావముల నుపదేశించుటయేకాక అప్పటి దీర్ఘకాలమార్గా యానమును యాత్రికసంక్లేశమును దొలఁగించుచుండను మతవిషయమునను ఆధ్యాత్మిక విషయమునను విశ్వాసములేక శంకా కళింకితమగు నేఁటికాలమున స్వభావంలో శులభశైలి వ్రాయఁబడిన యీకథలు హిందూదేశమున నాదియగు వేదశాస్త్రపురాణాది విద్యాప్రపంచమున నేది యేది శ్రేష్టమో శాశ్వతస్మరణీయమో దానినెల్లఁదప్పక బునరుజ్జీవనముచేయుచున్నవి. ఇవి యవనయామీనీ వినోదకధలలోని చమత్కృతిప్రభావము చూపుచున్నను, శబ్దరచనయందును భావములయందును అశ్లీలథర్మసాంకర్యాది దోషములులేక భాసిల్లుచున్నవి. కథలకిచ్చిన పేరును సంవిధానధోరణియు సమస్తవిషయసంగ్రాహకమగుటచే యట్లే కొనసాగుచుండినయెడల నిదితప్పక హిందూపురాణ గాథాకోశమై సర్వవాఙ్మయమున కాదర్శ మైయొప్పుననుట యసాధ్యము గాదు.
యమ్. కృష్ణమాచారి.