వికీసోర్స్:రచ్చబండ/పాత చర్చ 7

పాత చర్చ 6 | పాత చర్చ 7 | పాత చర్చ 8

అర్జున శాశ్వత నిర్వాహక హోదాకై ప్రతిపాదన (Permanent adminship for Arjunaraoc) మార్చు

వికీమిత్రులకు తెలుగు వికీసోర్స్ లో అభివృద్ధి రీత్యా నిర్వాహక చర్యలు అవసరమవుతున్నాయి. ఇంతకు ముందు రెండుసార్లు తాత్కాలిక నిర్వాహక హోదా పొందినవిషయం దానిద్వారా తెలుగు వికీలో అవసరమైన సాంకేతిక అభివృద్ధి చేయడం మీకు గుర్తుండేవుంటుంది. ఇకముందు కూడా ఇటువంటి విషయాలలో సహాయపడటానికి శాశ్వత నిర్వాహక హోదాకు ప్రతిపాదన చేస్తున్నాను. మీ స్పందన ఏప్రిల్ 6లోగా తెలియచేయవలసినది. ---అర్జున (చర్చ) 04:05, 23 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

అంగీకారం
  1. అర్జునరావు గారుకి ఎప్పుడో నిర్వాహక హోదా లభించాలి. అన్ని రకాల ఈ హోదాకు వీరు అర్హులు. సాంకేతికంగా ముందుండే వీరికి కాపీహక్కుల గురించి మంచి అవగాహన కలదు. నేను వీరి ప్రతిపాదనను సమర్ధిస్తున్నాను.--Rajasekhar1961 (చర్చ) 06:13, 23 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  2. అర్జున గారు నిర్వాహకత్వ బాధ్యతలు స్వీకరించడం ద్వారా తెవికీసోర్సుకు చాలా ప్రయోజనకరం అని భావిస్తున్నాను. ఈ ప్రతిపాదనను సమర్థిస్తున్నాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 11:35, 23 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  3. అర్జునరావుగారి ప్రతిపాదనను సమర్ధిస్తున్నాను. --శ్రీరామమూర్తి (చర్చ) 13:20, 23 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  4. అర్జునరావుగారు ! నిర్వాహక బాధ్యతలు వహించడానికి ఆసక్తి చూపించడం తిరిగి చురుకుగా వికీ సౌర్స్‌లో పనిచేయడం ముదావహం. అర్జునరావుగారిలాంటి నిర్వహకులు వికీసౌర్స్‌కు చాలా అవసరం. వికీసౌర్స్ అభివృద్ధికి వారి నిర్వాహకత్వం గొప్పగా సహకరిస్తుందని భావిస్తున్నాను. T.sujatha (చర్చ) 05:32, 25 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  5. అర్జునరావుగారి ప్రతిపాదనను సమర్ధిస్తున్నాను. Gokulellanki (చర్చ) 08:16, 27 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  6. అర్జునరావుగారి ప్రతిపాదనను నేను మనస్పూర్తిగా సమర్ధిస్తున్నాను Bhaskaranaidu (చర్చ) 08:14, 27 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  7. అర్జునరావుగారి ప్రతిపాదనను నేను మనస్పూర్తిగా సమర్ధిస్తున్నాను --Nrgullapalli (చర్చ) 09:44, 27 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  8. <పై వరుసలో # చేర్చి వికీసంతకం చేయండి>
వ్యతిరేకత
  1. <పై వరుసలో # చేర్చి వికీసంతకం చేయండి>
తటస్తం
  1. <పై వరుసలో # చేర్చి వికీసంతకం చేయండి>

ఫలితం మార్చు

స్పందించిన సభ్యులందరికి ధన్యవాదాలు. ప్రతిపాదన ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. (Thanks to all the responders. The proposal for permanent admin role for Arjuna Rao has been approved unanimously by 7 members). --అర్జున (చర్చ) 02:48, 7 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
Thanks Ajraddatz for your prompt action in granting adminship. --అర్జున (చర్చ) 08:30, 7 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్తగా లబిస్తున్న పుస్తకాల ప్రాధాన్యత అంశం మార్చు

ఇటీవలి కాలంలో సీసీ-బై-ఎస్ఎలో తమ పుస్తకాన్ని విడుదల చేసేందుకు అంగీకరించిన రచయిత, పుస్తకం, అంశాల వివరం కింద అందిస్తున్నాం. తెవికీ సభ్యులు పుస్తక ప్రాధాన్యతను పరిశీలించాల్సిందిగా కోరుతున్నాం.

పుస్తకం రచయిత అంశం విజ్ఞాన సర్వస్వ పరమైన కోణం
ఫ్రెంచి పాలనలో యానాం బొల్లోజు బాబా ఫ్రెంచి ప్రభుత్వం యానాం ప్రాంతాన్ని పరిపాలించిన కాలం యొక్క చరిత్రను ఈ గ్రంథం ప్రతిబింబిస్తుంది, సెకండరీ రిఫరెన్సు సోర్సు యానాం ప్రాంతపు చారిత్రిక వ్యక్తులు, సంస్థలు, ఘటనలు వంటివి ఎన్నిటి గురించో వ్రాయబోతే రిఫరెన్సుగా పనికివస్తుంది.

--పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 06:40, 23 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

  • భారతదేశంలో [1]యానాం చాలా చారిత్రక ప్రాముఖ్యమున్న ప్రదేశం. ఇందుకోసం సంబంధించిన పుస్తకం తెలుగు వికీసోర్స్ లో చేరబోవడం చాలా బాగుంటుంది. దీనన్ని మన ద్వారా తెలుగు ప్రజానీకానికి అందజేస్తున్న బుల్లోజు బాబా గారికి సమూహం తరపున నా ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 07:48, 23 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) గారికి, పుస్తకం కినిగె ద్వారా ఉచితంగా అందుబాటులో వుంది. ఈ పుస్తకం ప్రాధాన్యతను వివరించే వ్యాసాలు (పత్రిక సమీక్షలు లాంటివి) ఏమైనా వుంటే తెలపండి. ఇప్పటికే రూపుదిద్దుకుంటున్న పుస్తకాలు చాలా వున్నందున మరియు సముదాయం తగినంత వృద్ధికానందున, ఇటువంటివి ప్రాధాన్యత అనిపిస్తే మొత్తము బాధ్యత సిఐఎస్ తీసుకుని వికీసోర్స్ లోకి చేర్చడం మంచిది. నేను ఇటీవల చేసిన గణాంకాల విశ్లేషణని పరిశీలిస్తే, ఇప్పటికే వున్న పుస్తకాల నాణ్యతను పెంచేందుకు సాంకేతికసహాయంతో సిఐఎస్ తోడ్పడడం ప్రాధాన్యతగా చేసుకొంటే తెలుగు వికీసోర్స్ కి సహాయంగా వుంటుంది. ఉదాహరణకు వికీసోర్స్:సూచికపేజీలు పరిశీలించితే 8930 స్కాన్ ఆధారంకాని పేజీలున్నాయి. వాటిలో చాలావరకు ఇటీవల చేర్చిన పుస్తకాల స్కాన్ ఆధారంగా చేయవచ్చు. (ఉదా: వేమన పద్యములు, అన్నమయ్య పాటలు, పోతన భాగవతము లాంటివి). ఇంకా ఉపయోగపడేవి అధ్యాయపు పేజీల సృష్టికి మరియు పేజి విరుపులు సునాయాసంగా చేర్చటానికి తగిన సాఫ్ట్వేర్ ఉపకరణాలు చేయటం. --అర్జున (చర్చ) 08:35, 23 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ పుస్తకం కినిగెలో ఉండడం; మన తెవికీసోర్స్ లో ఉండడానికి అడ్డంకి కాదు. ఇక్కడ మనం చూడవలసినది : ఇందులోని కంటెంట్ నోటబుల్ అవునా కాదా అని మాత్రమే. రచయిత మనకు సి.సి.బై వై క్రింద లైసెన్స్ ఇస్తున్నప్పుడు మనం ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని నా అభిప్రాయం. ఇక మిగిలిన విషయాలు ఈ పుస్తకానికి సంబంధించినవి కావు.--Rajasekhar1961 (చర్చ) 11:18, 23 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
* అర్జున గారూ మీరు కోరిన విధంగా రెండు పుస్తక సమీక్షలు ఇక్కడ పొందుపరుస్తున్నాను. సాక్షి ఫన్ డేలో చేసిన పుస్తక సమీక్ష, జనమిత్ర పత్రికలో సమీక్ష లభిస్తున్నాయి. ఇక దీని గురించి సమీక్షలు కాక లభిస్తున్న మరికొన్ని వ్యాసాల్లో (ఇవి ఉపకరించవచ్చు, ఉపకరించకపోవచ్చు) పుస్తకం.నెట్లో రచయిత ముందుమాట, రచయిత బ్లాగులో పుస్తకావిష్కరణ సభ వివరాలు, పుస్తక రచనకు తానెన్నుకున్న విధానాల గురించిన వ్యాసం కూడా ఉన్నాయి. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 11:25, 23 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  • Rajasekhar1961 గారికి, విషయ ప్రాధాన్యత వుండాలన్నదానితో నేను ఏకీభవిస్తున్నాను. వికీ ప్రాజెక్టులకి అది అత్యంత ప్రధానమే. అయితే గత రెండుసంవత్సరాలలో పుస్తకాల CC-BY-SA విడుదల అంటూ చేసిన కృషి అంత ఉపయోగంగా వున్నదని విశ్లేషణ తర్వాత నా కన్పించడం లేదు పైపెచ్చు దోషపూరిత పేజీల నెలవుగా అనుకొనే స్థాయికి వచ్చింది. అందుకని విషయ ప్రాధాన్యత ని దృష్టిలో పెట్టుకొని వికీసోర్స్ సముదాయం కృషిచేస్తేనే వికీసోర్స్ నాణ్యత పెరిగి విలువ పెరుగుతుంది. పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) ఇచ్చిన లింకులను పరిశీలించిన తర్వాత, (స్థానిక పత్రికలో సీరియల్, మూల ఫ్రెంచ్ గ్రంథాలను గూగుల్ ట్రాన్లేేట్ వాడి అనువదించి వాడుకోవటం, ఆ తరువాత నాణ్యతని సమీక్షించే సమర్ధవంతమైన ప్రక్రియ వాడకపోవడం లాంటివి) ఈ పుస్తకం అంత ప్రాధాన్యత గలది గా నాకనిపించుటలేదు. విషయం ప్రాధాన్యమే గాని పుస్తకం అంత ప్రాధాన్యతగా అనిపించుటలేదు. వికీసభ్యులు చేసే స్వల్ప కృషి ప్రాధాన్యతలపై వుంటే వికీసోర్స్ నాణ్యత పెరుగుతుంది. వికీసోర్స్ మూల ఉద్దేశం విషయాన్ని అందరి అందుబాటులోకి తీసుకురావడం కాబట్టి, అవి ఇప్పటికే అందుబాటులో వుంటే అటువంటి వాటిని చేపట్టటము అంత విలువైనది కాదు. --అర్జున (చర్చ) 11:51, 23 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

దింపుకొనే పుస్తకాల, పేజీలు అచ్చుదిద్దడాల ప్రాధాన్యత నిర్ణయంలో పాల్గొనండి. మార్చు

అర్జునరావు గాని గణాంకాల విశ్లేషణ తర్వాత ఇప్పటికే చేర్చబడిన సుమారు 250 పుస్తకాలలో ప్రాముఖ్యమున్న వాటిని ఐదింటిని తీసుకొని ప్రతినెల పూర్చిచేస్తే బాగుంటుంది. అందుకు చురుకుగా పనిచేస్తున్న అర్జునరావు గారు, నేను, రామమూర్తి, భాస్కరనాయుడు మరియు గుళ్లపల్లి గార్లు చెరి ఒక పుస్తకాన్ని ఏప్రిల్ నెలకోసం ప్రతిపాదించండి. ఆ నెలలో ఆయా పుస్తకాలను పూర్తిచేసి అందంగా తీర్చిదిద్దుదాము. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 06:48, 27 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

  1. భారత అర్థశాస్త్రము. --శ్రీరామమూర్తి (చర్చ) 07:08, 27 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  2. అభినయ దర్పణము --Rajasekhar1961 (చర్చ) 18:11, 27 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  • Rajasekhar1961 గారి ప్రతిపాదన మంచిదే కాని ప్రస్తుత నాణ్యత దృష్టిలో పెట్టుకుంటే ఆచరణయోగ్యము కాదు. ఎవరు వ్యక్తిగత ఆసక్తి తో ఏ పుస్తకంపే పనిచేసినా వికీసోర్స్ మొత్తానికి ఒక ప్రాధాన్యత జాబితా కావాలి. అది అందరి అభిప్రాయంతో సేకరించాలి. నాణ్యతకు అందరు కలిసి జట్టుగా పనిచేయాలి. ఇంతకు ముంది పని పరిశీలించినయితే అచ్చుదిద్దడం జట్టుగా పని చేశామనుకుంటే అది నాణ్యతతో జరగలేదు. (ఉదా:అబద్దాలవేట పుస్తకం, సమాచారహక్కు పుస్తకం). ఇప్పటికే 40దాదాపు పుస్తకాలు అచ్చుదిద్దడం పూర్తయినట్లుగా వున్నవి వాటికి అధ్యాయాల కూర్పు, అధ్యాయాల పేజీ విరుపులు సరిచేయడంలో (పెద్ద కష్టమైనది కాదు, నేను లేక రాజశేఖర్ ఐదు నిముషాలలో స్కైప్ ద్వారా నేర్పగలము) అచ్చు తిరిగి తనిఖీ చేయడంలో అందరూ పాల్గొంటే దింపుకొనదగిన పుస్తకాలు ఎక్కువవుతాయి. గూగుల్ OCR అందుబాటులో వున్నప్పుడు, అది వాడకుండా నేరుగా టైపు చేస్తే మామూలు సభ్యుల టైపింగులో ఎక్కువ దోషాలుండడమే కాకుండా వాటిని సరిచేయటానికి ఎక్కువ సమయం పడుతుంది. వికీసోర్స్ ప్రాజెక్టు ప్రాధాన్యతని నిర్ణయించడానికి, వికీసోర్స్:పుస్తక_కూర్పు_ప్రాధాన్యత/201603 పేజీలో వివరం చేర్చడం మరియు మీ ప్రాధాన్యతలు ఏప్రిల్ 2, 2016 లోగా చేర్చండి . --అర్జున (చర్చ) 23:24, 27 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  • పేజీలు రూపుదిద్దడంలో ఆసక్తి కలవారు, తమ ప్రాధాన్యతలను వికీసోర్స్:పేజీ కూర్పు ప్రాధాన్యత/201603 లో ఏప్రిల్ 2, 2016 లోగా చేర్చండి. --అర్జున (చర్చ) 00:35, 28 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ఇప్పటికే స్పందించిన Rajasekhar1961 ,శ్రీరామమూర్తి గార్లకు ధన్యవాదాలు.ఇంకా పిభ్రవరి గణాంకాల ప్రకారం పైస్థాయి 10 సభ్యులైన User:Bhaskaranaidu, User:Nrgullapalli, User:Gokulellanki, User:రహ్మానుద్దీన్, User:Roy.d, User:Sagarraju.b,User:Pusalapati తమ ప్రాధాన్యతలు తెలియచేస్తే బాగుంటుంది. అవసరమనుకుంటే ఇంకొన్ని నిలువువరుసలు చేర్చి మీ ప్రాధాన్యతలు తెలియచేయండి. పుస్తక కూర్పు , పేజీకూర్పు సంబంధం కలవికావున, ఇప్పటికే ఒకదానిలో మీ ప్రాధాన్యతలు తెలియచేసి వుంటే రెండవదానిలో కూడా మీ ప్రాధాన్యతలు తెలియచేయండి. సందేహాలుంటే రాజశేఖర్ గారిని కాని నన్ను కాని సంప్రదించండి.--అర్జున (చర్చ) 06:15, 30 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  • సముదాయ ప్రాధాన్యత నిర్ణయంలో పాల్గొన్న Rajasekhar1961 ,శ్రీరామమూర్తి లకు ధన్యవాదాలు. ప్రాధాన్యత వివరాలతో ఆయా పేజీలు తాజా చేయబడివవి. సహసభ్యులు సముదాయ ప్రాధాన్యత విషయాలపై సహకరించాలని, ఇకముందు ప్రాధాన్యత నిర్ణయంలో కూడా చురుకుగా పాల్గొని వికీసోర్స్ కృషి ని మరింత సమర్ధవంతం చేయడానికి తోడ్పడవలసిందిగా కోరుకుంటున్నాను. --అర్జున (చర్చ) 06:28, 6 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

వికీసోర్స్ సమర్ధవంతంగా పని చేయుటకు మరియు, నిర్వహణకు కొత్త సదుపాయాలు మార్చు

గత కొద్దిసంవత్సరాలుగా వికీ సోర్స్ అభివృద్ధికి కృషి చేసిన సహసభ్యులందరికీ అభివందనాలు. మన కృషిని మరింత సమర్ధనీయంగా చేయటానికి ఇంకొన్ని సౌలభ్యాలు చేశాను.

 
దింపుకొనగలిగే ఎలెక్ట్రానిక్ రూప పుస్తకాలు ప్రదర్శన ( పై బొమ్మపై నొక్కి పూర్తి జాబితా చూడండి)

248 పుస్తకాలున్న వికీసోర్స్ లో పని ప్రాధాన్యతలు నిర్ణయించడానికి (ఇంతకు ముందలి చర్చాంశము) మరియు నిర్వహణ సౌలభ్యానికి కొన్ని పేజీలు , స్క్రిప్ట్ లు చేయడం జరిగింది. వీటిలో భాగంగా మొదటిపేజీలో దింపుకొనగలిగే పుస్తకాల బొమ్మ కూడా చేర్చడం జరిగింది. ప్రాధాన్యత పట్టికలు తాజాపరిస్థితి చూసేందుకు సభ్యులెవరైనా వాడగలిగే డాటాబేస్ క్వెరీలు దింపుకొనగలిగే పుస్తకాల జాబితా, అచ్చుదిద్దడం ఆమోదించబడి, పుస్తకకూర్పు తయారవవల్సిన పుస్తకాల జాబితా, పేజీలో అచ్చు టైపు లేక ప్రాగ్రామ్ ద్వారా చేర్చడం మరియు దిద్దడం చేయవలసిన పుస్తకాల జాబితా తయారయ్యాయి. విషయసూచిక, అధ్యాయాల పేజీలు స్క్రిప్ట్ ద్వారా లేక పోగ్రామ్ ద్వారా చేయుటకు విషయసూచిక వికీసోర్స్: విషయసూచిక మూల దత్తాంశం తీరు, పదే పదే మార్పులు చేయవలసిన వారు బాట్ సహాయం అర్ధించడానికి ఉపయోగపడే {{బాటు సహాయం కావాలి}} మూస వాడి సమన్వయం చేసుకొని వికీ మరింత వేగంగా అభివృద్ధిచేయడానికి తోడ్పడండి. మీ సందేహాలు, సలహాలు ఇక్కడ తెలియచేయండి. ప్రాజెక్టు లేక చర్చాపేజీలలో సందేహం, సహాయం కోరుతుంటే {{సహాయం కావాలి}} చేర్చడం మరవకండి.--అర్జున (చర్చ) 10:22, 28 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

స్కాన్లలో దోష పేజీలు వివరము తెలియచేయడానికి కొత్త మూస {{స్కానుదోషం సహాయం కావాలి}} సూచిక చర్చాపేజీలలో వాడండి. --అర్జున (చర్చ) 07:02, 30 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

స్కాన్ నాణ్యత పరిశీలన మార్చు

ఇప్పటివరకు టైపు అయిన కొన్ని పుస్తకాలలో సమస్యలు మొత్తం టైపు పూర్తయిన తరువాత తెలుస్తున్నాయి. కొత్త పుస్తకం నేరు టైపు లేక ప్రాగ్రాము ద్వారా పాఠ్యము చేర్చబోయేముందు, స్కాన్ నాణ్యతని పరిశీలించాలి. మూల పుస్తకంలోని అన్ని పేజీలు స్కాన్ లో వున్నాయా? బొమ్మలు నాణ్యతగా వున్నాయా? బొమ్మలు చేర్చేటప్పుడు సాగినట్లుగా ఏమైనా వస్తున్నాయా? లేక పోతే మీ విలువైన కృషికి పూర్తి ఫలం దక్కదు. దోషాలు వున్న పుస్తకాలను తరువాత సరిచేయటం చాలా కష్టం. ఒకవేళ మీరు ప్రస్తుతము టైపు కొంత జరిగివుంటే ఇప్పడైనా స్కాన్ మొత్తం పరిశీలించి నాణ్యత బాగా వుందని తెలిసిన తరువాతే టైపు కొనసాగించడం పై దృష్టి పెట్టండి. --అర్జున (చర్చ) 01:39, 29 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీసోర్స్ అభివృద్ధిపై నా బ్లాగ్ పోస్ట్ మార్చు

తెలుగు వికీసోర్స్ లో ఉచితంగా పొందగలిగే పుస్తకాల అభివృద్ధి(2012-2015) అనే బ్లాగ్ పోస్ట్ ని చదివి మీ అభిప్రాయాలు ఇక్కడగాని, బ్లాగ్ లో గాని తెలపండి. --అర్జున (చర్చ) 11:48, 29 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీసోర్స్ లో జరుగుతున్న అభివృద్దిని మీ బ్లాగులో ప్రదర్శించి; కొంత ప్రచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 12:36, 29 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Open Call for Individual Engagement Grants మార్చు

 

Please help translate to your language:

Greetings! The Individual Engagement Grants (IEG) program is accepting proposals until April 12th to fund new tools, research, outreach efforts, and other experiments that enhance the work of Wikimedia volunteers. Whether you need a small or large amount of funds (up to $30,000 USD), IEGs can support you and your team’s project development time in addition to project expenses such as materials, travel, and rental space.

With thanks, I JethroBT (WMF) 15:47, 31 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

అధిక వీక్షణల పుస్తకాలు మార్చు

గత మూడు నెలలలో మొదటి పది స్థానాలలో నిలిచిన పుస్తకాలను వికీసోర్స్:అధిక వీక్షణల పుస్తకాలు లో చూసి స్పందించండి. --అర్జున (చర్చ) 10:34, 6 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఎవరికి వారే మొదటిసారి పేజీనాణ్యతను పసుపురంగు స్థితికి చేర్చడం ఆపుటకు ప్రతిపాదన మార్చు

ఇటీవల అచ్చుదిద్దడం పూర్తయినవనుకున్న పుస్తకాలలో కూడా పేజీకి 5 పై బడి అచ్చు తప్పులు కనబడుతున్నాయి. మహేంద్రజాలం పేజీల వివరం చూడండి ఇటువంటి పేజీలన్నింటిని మరల ఇంకొకసారి అచ్చుదిద్దితేనే వీటిని వాడుకోగలుగుతాము. ప్రస్తుతానికి నేను మహేంద్రజాలం పుస్తకానికి బాటు ద్వారా పేజీస్థితిని పసుపు రంగుకి మార్చాను. ఇటువంటి పరిస్థితి ఇకముందు లేకుండా చేయుటకు ఎవరైనా పాఠ్యము టైపు చేసినపుడు పేజీస్థితిని ఆరంజి రంగులోనే వుంచేయండి. ఆ తరువాత వేరేవారు జాగ్రత్తగా తనిఖీ చేసి తప్పులు సరిదిద్దిన తరువాత మాత్రమే పసుపు రంగుకి మార్చి భద్ర పరచండి. అచ్చు తప్పులు పట్టుకోవటం కూడా ఒక నైపుణ్యం కాబట్టి, ఏ సభ్యులైన వారు సరిగా పట్టుకోలేరని భావించినపుడు ఆ అచ్చుతప్పు తనిఖీ చేయకుండా వుండడమే మేలు. ఈ ప్రతిపాదనపై వారం రోజులలోగా అనగా 15 ఏప్రిల్ లోగా స్పందించండి. --అర్జున (చర్చ) 06:21, 8 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

దింపుకొనే పుస్తకాలను పరీక్షించడానికి కొత్త మూస మార్చు

{{featured download trial}} ను పుస్తకం దింపుకొనదగిన ప్రయత్నానికి వాడండి. పని పూర్తయిన తర్వాత {{featured download}} తో మార్చండి. --అర్జున (చర్చ) 02:20, 10 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

వికీసోర్స్ లో పుస్తకాలను మూలంగా వాడడానికి వికీపీడియాలో కొత్త మూస మార్చు

Cite wikisource అనబడే కొత్త మూసని వికీసోర్స్ పుస్తకాల మూలాలకు వికీపీడియాలో వాడండి. ఇది తెలుగు అక్షరాలు మాత్రమే కనబడి సౌలభ్యంగా వుంటుంది. ఉదాహరణ వాడుక --అర్జున (చర్చ) 02:30, 10 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది బావుంది. ఐతే దీన్ని మూలాలు చేర్చండి అన్న బటన్లో చేరిస్తే బావుంటుందా? అందుకు అనుగుణంగా తెవికీపీడియా రచ్చబండలో చర్చ ప్రారంభించుకుందామా? --పవన్ సంతోష్ (చర్చ) 06:58, 10 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్, మంచి సలహా. దీనివలన వాడుకరులకి ఇబ్బందేమి లేదు కనుక మార్పు చేసి రచ్చబండలో సూచన చేర్చండి. విజువల్ ఎడిటర్ వాడుకరులకైతే ఏ మార్పు అవసరం లేదనుకుంటాను. --అర్జున (చర్చ) 16:40, 10 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Epub కొరకు విషయసూచికలో జాగ్రత్తలు. మార్చు

విషయసూచికలో దారిమార్పు పేజీలుంటే Epub లో విషయం చేరకుండా కేవలం వికీసోర్స్ లింకు మాత్రమే చేరుతుంది, కాబట్టి విషయసూచికలో కేవలం నేరు పేజీలకు మాత్రమే లింకు వుండాలని గమనించండి. --అర్జున (చర్చ) 17:10, 10 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

సహకారం స్థితి మూస మెరుగు, పక్కపట్టీలో సహాయంకోరిన పేజీల ఇటీవలి మార్పులు లింకు మార్చు

సహాయం కోరుతున్న పేజీల స్థితి, కోరిన తేదీతో, క్రమము వాటిలో ఇటీవలి మార్పుజరిగిన తేది ప్రకారం, తాజా చేయడానికి మరి, వాటికి సంబంధించిన మార్పులనే చూసేందుకు, పక్కపట్టీలో ఇటీవలి మార్పులు(సహాయంకోరిన) చేర్చబడింది.గమనించండి. ఇ‌వి ఉపయోగపడాలంటే మీ మార్పుల సారాంశ వ్యాఖ్య రాయడం మరవవద్దు. ఏవైనా సలహాలను తెలియచేయండి. --అర్జున (చర్చ) 05:05, 11 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

పాక్షికంగా స్కాన్ సహాయం మార్చు

ఇటీవల తెవికీసోర్సు సముదాయం పుస్తకాలు పూర్తిచేసి, దింపుకోగలిగిన స్థితికి తీసుకురావడాన్ని ప్రాధాన్యతగా స్వీకరించి పనిచేస్తుండడం, అందులో భాగంగా స్కాన్ దోషాలు కలిగిన పుస్తకాల్లో పేజీలు స్కాన్ చేసే సహకారాన్ని సీఐఎస్-ఎ2కె వనరులు, సంస్థాగత భాగస్వామ్యాలను ఉపయోగించి చేస్తే బావుంటుందన్న సూచన వంటి పరిణామాలు జరిగాయి. ఈ నేపథ్యంలో అన్నమయ్య గ్రంథాలయంతో సీఐఎస్-ఎ2కెకి ఉన్న సంస్థాగత భాగస్వామ్యాన్ని పురస్కరించుకుని, తెలుగు వికీమీడియా సముదాయం కొరకు సీఐఎస్-ఎ2కె ఏర్పాటుచేసిన స్కానర్ వినియోగించి కొన్ని పుస్తకాలు పూర్తిచేసేందుకు అవసరమైన లోపించిన పేజీలు స్కాన్ చేశాం. స్కానింగ్, ఎడిటింగ్ (జేగురు రంగు తీసివేయడం, పుస్తకం పేజీల్లోని లోపాలు తగుమాత్రం సవరించడం, వగైరా) వంటివి పూర్తికాగా సిద్ధంగా ఉన్న పుటల సంఖ్య ఇక్కడ ప్రకటిస్తున్నాం. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 05:43, 12 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

పేజీల సంఖ్య విషయంలో, ఇతర ఫార్మాటింగ్ అంశాల్లో సందేహం లేకుండా వికీసోర్సులోని మూలంలో ఉన్న ముద్రణ (ఒకే ప్రచురణ కర్త, ఒకే ముద్రణ సంఖ్య) ఏదైతే అదే పుస్తకాన్ని వెతికి స్కాన్ చేయడం జరిగింది. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 05:56, 12 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) గారికి ధన్యవాదాలు. ఇంకా కొన్ని పుస్తకాలకు కూడా సహాయం కావాలి, చూడండి. 300dpi లేక ఆ పై స్థాయిలో స్కాన్ చేసిన బొమ్మలను <సూచిక పేరులో ప్రధానభాగము >-P<pagenum>.png లాంటి పేరుతో స్థానికంగా ఎక్కించి ఆ వివరాలు ఆయా సూచిక సహాయం కావాలి పెట్టిన దగ్గర చర్చాపేజీలో తెలపండి. వాటిని "పుస్తకపుప్రధానపేజీ/P<pagenum>" గా టైపు చేయటం మంచిది. ఆతరువాత వాటిని సరియైన స్థానంలో చేర్చవచ్చు.--అర్జున (చర్చ) 10:42, 13 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు అర్జున గారూ. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 05:22, 13 ఆగష్టు 2016 (UTC)

క్స్లో -> క్స్‌లో ఎలా? (ZWNJ కోడ్ పాయింట్ U+200C చేర్చడం ఎలా?) మార్చు

హలాంతం తర్వాత ఖాళీ లేకుండా విభక్తులు చేర్చడానికి ఉదాహరణ లు చూసి, మీ కంప్యూటర్ నిర్వహణ వ్యవస్థకి(విండోస్?) తగినవి వాడాలి. అలా ప్రయత్నించినా చేయలేకపోతే {{ ZWNJ}} మూస వాడితే సరిపోతుంది. దీనిని సులభంగా ప్రవేశ పెట్టుటకు వికీ ఎడిట్ పెట్టె క్రింద కనబడే చిహ్నాలలో కూడా చేర్చాను.ప్రయత్నించండి. --అర్జున (చర్చ) 10:49, 12 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఇక సూచికలకు, పుస్తకాలకు మార్పుల గణాంకాలు చేర్చే పద్ధతి నిలుపుదల ప్రతిపాదన మార్చు

చాలా వాడుకరులు అచ్చుదిద్దడంలో జాగ్రత్త వహించడం లేదు కాబట్టి ఇక పుస్తకాలకు, పేజీలకు మార్పు చేసిన సభ్యుల గణాంకాల పట్టీ చేయడం అంత ఉపయోగం అనిపించడం లేదు. కనుక ఇవి ఆపి వేద్దామని ప్రతిపాదన చేస్తున్నాను. వీటిని ఆధారంగా అభివందనలు తెలిపే పద్ధతి కూడా నిలిపివేయబడుతుంది. సవరణ చేసే వారి నాణ్యతని పసిగట్టగలిగే విధంగా కొత్త గణాంకాలను చేయగలిగితే అప్పుడు మరల చేరుద్దాము. దీనిపై వారం రోజులలోగా స్పందించండి--అర్జున (చర్చ) 00:07, 14 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

స్కానుదోషపేజీలు చేర్చిన తరువాత పాఠ్యీకరణ చేర్చుట ఉదాహరణ మార్చు

సూచిక పేజీ సూచిక :Abraham Lincoln (Telugu).pdf కి ప్రధానపేజీ ఆబ్రహాము లింకను చరిత్ర కావున, స్కాన్ దోషంగల పేజీల కొత్త స్కాన్ (బొమ్మ రూపంలోని) పాఠ్యీకరించే విధానం చూడండి.

దస్త్రం:Abraham Lincoln (Telugu)-P160.jpg ని ఆబ్రహాము లింకను చరిత్ర/P160 లో

దస్త్రం:Abraham Lincoln (Telugu)-P175.jpg ని ఆబ్రహాము లింకను చరిత్ర/P175 లో పాఠ్యీకరించండి. దీనిలో పేజీ పీఠికలు, భూమికలు ( వుంటే )పాఠ్యీకరించడంలో వదలివేయండి. బొమ్మని వేరుగా పేజీని వేరుగా తెరచి ప్రక్కప్రక్కనే పెట్టుకొని లేక బొమ్మని ముందుగా ముద్రించుకొని పాఠ్యీకరణ పూర్తిచేయండి.--అర్జున (చర్చ) 01:21, 16 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

పెద్దాపుర సంస్థానము మార్చు

పుట:Peddapurasamstanacheritram (1915).pdf/7 నేను ఒక పేజీ మార్పు చేసాను. అది 99 శాతం బావుందనిపించింది. ఒకవేళ అలాయితే మిగతా పేజీలను డౌన్ లోడ్ చేసి గూగుల్ డాక్స్ ద్వారా మొత్తం సులభంగా చేయవచ్చు..--విశ్వనాధ్.బి.కె. (చర్చ) 11:53, 17 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Server switch 2016 మార్చు

The Wikimedia Foundation will be testing its newest data center in Dallas. This will make sure Wikipedia and the other Wikimedia wikis can stay online even after a disaster. To make sure everything is working, the Wikimedia Technology department needs to conduct a planned test. This test will show whether they can reliably switch from one data center to the other. It requires many teams to prepare for the test and to be available to fix any unexpected problems.

They will switch all traffic to the new data center on Tuesday, 19 April.
On Thursday, 21 April, they will switch back to the primary data center.

Unfortunately, because of some limitations in MediaWiki, all editing must stop during those two switches. We apologize for this disruption, and we are working to minimize it in the future.

You will be able to read, but not edit, all wikis for a short period of time.

  • You will not be able to edit for approximately 15 to 30 minutes on Tuesday, 19 April and Thursday, 21 April, starting at 14:00 UTC (15:00 BST, 16:00 CEST, 10:00 EDT, 07:00 PDT).

If you try to edit or save during these times, you will see an error message. We hope that no edits will be lost during these minutes, but we can't guarantee it. If you see the error message, then please wait until everything is back to normal. Then you should be able to save your edit. But, we recommend that you make a copy of your changes first, just in case.

Other effects:

  • Background jobs will be slower and some may be dropped.

Red links might not be updated as quickly as normal. If you create an article that is already linked somewhere else, the link will stay red longer than usual. Some long-running scripts will have to be stopped.

  • There will be a code freeze for the week of 18 April.

No non-essential code deployments will take place.

This test was originally planned to take place on March 22. April 19th and 21st are the new dates. You can read the schedule at wikitech.wikimedia.org. They will post any changes on that schedule. There will be more notifications about this. Please share this information with your community. /User:Whatamidoing (WMF) (talk) 21:08, 17 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

స్కాన్ దోష గుర్తింపు మార్చు

సముదాయ సభ్యులకు నమస్కారం,
తెలుగు వికీసోర్సులో ప్రస్తుతం దింపుకోగలిగే పుస్తకాలు తయారుచేసుకోవడాన్ని ప్రాధాన్యతగా స్వీకరించడం, అందులో భాగంగా స్కాన్ దోషాలు గుర్తించడం, సాధ్యమైనంతవరకూ సీఐఎస్-ఎ2కె సంస్థాగత కృషితో సహకరించడం తెలిసిందే. ఈ సందర్భంలో అన్నమయ్య గ్రంథాలయం, మనసు ఫౌండేషన్ సంస్థలతో సీఐఎస్-ఎ2కెకు ఉన్న భాగస్వామ్యాన్ని ఉపయోగించుకుంటున్నాం. ఇప్పటికి నాలుగు పుస్తకాల విషయంలో స్కాన్ దోషాలు నివృత్తిచేసే సహకారం అందించడం గమనించివుంటారు. ఐతే వికీసోర్సులోని మిగిలిన పుస్తకాల్లోనూ స్కాన్ దోషాలను గుర్తించడాన్ని ప్రధానంగా తీసుకుని గుర్తింపు ప్రక్రియ పూర్తిచేస్తే భాగస్వామ్య సంస్థలకు జాబితా పంపి ఇప్పటికే మరింత నాణ్యమైన స్థితిలో స్కాన్ అయివుంటే వాటిని స్వీకరించడమో, లేక మన వద్ద ఉన్న అదే ముద్రణ లభిస్తే మనమే స్కాన్ చేయడమో, రెండూ లభించని చోట తప్పనిసరి స్థితిలో (స్కాన్ ఆధారితం కాని) పుస్తకం నుంచి నేరుగా పాఠ్యం టైప్ చేయడమో చేయవచ్చు. మొత్తం దోషాల స్థితి తెలిస్తే దీనికి వీలుగా ఉంటుందని సభ్యులు గుర్తించగలరు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 07:00, 19 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) గారికి. మీరు ఇప్పటికే చేసిన సహాయానికి ధన్యవాదాలు. పనులు సభ్యుల ఆసక్తులని బట్టి జరుగుతుంటాయి. ఇప్పటికే వున్న 264 పుస్తకాలకి స్కాను దోషాలు కనుక్కోవాలంటే ప్రధాన బాధ్యతగా వున్న ఉద్యోగులే చేయగలరు. ఇప్పటికే ప్రాధాన్యతలో అచ్చుదిద్దడం చాలావరకు పూర్తయిన వాటి స్కాను దోషాలు సవరించడానికి సహాయం చేయండి. ఇది ఒక నిరంతరం జరిగే ప్రక్రియగా విజయవంతం అవుతుంది అనుకుంటాను. --అర్జున (చర్చ) 00:06, 20 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) గారికి, చాలా ధన్యవాదాలు. మీరు టైపింగు కూడా పూర్తిచేసినట్లుంది. అర్జున గారు, ఈ పేజీలను ఆయా పుస్తకాలకు సంబంధించిన సూచిక పేజీలలో చేర్చాలా లేదా అధ్యాయాల పేజీలలోనికి నేరుగా చేర్చవచ్చునో తెలియజేయండి. ఇవన్నీ టైపింగు పూర్తయిన పుస్తకాలు కాబట్టి ఇంకా చేయవలసిన పనులను ఆయా పుస్తక చర్చపేజీలలో తెలియజేయండి. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 05:14, 20 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
Rajasekhar1961 గారికి, ఇంకొకరు ఆ పాఠ్యాన్ని తనిఖీ చేసి అ‌వసరమైతే సవరించాలి. ఆతరువాత వాటిని అధ్యాయాల్లోకి చేర్చాలి. ఇప్పటికే నేను ఉదాహరణగా చేసినది చూడండి. --అర్జున (చర్చ) 11:29, 20 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

పాఠ్య చేర్చేటప్పుడు ఉపవిభాగాలకి ';' వాడవద్దు. మార్చు

';' ను నిర్వచనాలకి మాత్రమే వాడాలి. ';'కి బదులుగా {{p|al|fwb}}...</p> వాడండి.--అర్జున (చర్చ) 04:28, 22 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

మారిషస్‌లో తెలుగు తేజం-మే నెల ప్రదర్శన గ్రంథం ప్రతిపాదన మార్చు

మారిషస్‌లో తెలుగు తేజం-మే నెల ప్రదర్శన గ్రంథంగా ప్రతిపాదన చేయడమైనది . ఈ గ్రంథం రూపు దిద్దుటకు కృషి చేసిన సభ్యులందరికి ధన్యవాదాలు. వికీసోర్స్:ప్రదర్శన గ్రంథాలు/మారిషస్‌లో తెలుగు తేజం లో పరిచయం చూసి మెరుగు చేయండి, లేక స్పందించండి.--అర్జున (చర్చ) 03:52, 26 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రదర్శన గ్రంథంగా చేయడమైనది. --అర్జున (చర్చ) 00:16, 1 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

భోగినీ దండకము మార్చు

సాంబశివరావు గారు భోగినీ దండకము మొత్తం పాఠ్యాన్ని చేర్చారు.

రహ్మానుద్దీన్ గారు పుస్తకాన్ని అప్లోడ్ చేసి; మొత్తం పాఠ్యాన్ని (తాత్పర్యంతో సహా) చేర్చినా, చాలా తప్పులున్నాయి. ఈ రెండింటినీ కలిపితే బాగుంటుంది.--Rajasekhar1961 (చర్చ) 07:19, 28 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

సూచిక చర్చ:Bhogini-Dandakamu.pdf చూడండి.--అర్జున (చర్చ) 00:48, 1 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

సాక్షి మార్చు

సూచిక:SaakshiPartIII.djvu, సాక్షి ప్రస్తుతం కంవెర్షన్ నడుస్తున్నది. అప్పటి వరకూ మార్పులు వద్దు, అనవసర శ్రమ అవుతుంది. పేజీలు అన్నీ పూర్తి అయ్యాక చేద్దాం...--విశ్వనాధ్.బి.కె. (చర్చ) 15:27, 1 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

నాగేశ్వరరావు, రాజశేఖర్, భాస్కరనాయుడు, శ్రీరామమూర్తి గార్లకు సాక్షి పత్రికలను ఒక్కో పేజీ చేస్తున్నాను, అయితే అందులో సరిదిద్దవలసినవి చాలా ఉన్నాయి, మిగతా సభ్యులు కూడా ఒక చేయి వేస్తే అవి సులభంగా పూర్తి అయిపోతాయి..(ప్రస్తుతం మీరు చేస్తున్నవి కూడా ఆపమని అడుగుతున్నాను. ఎందుకంటే అంత శ్రమపడి టైపింగ్ చేయడం వృదా కనుక , మీమీ పేజీలను నేను నెమ్మదిమీద కన్‌వర్ట్ చేసి ఇస్తాను) --విశ్వనాధ్.బి.కె. (చర్చ) 10:41, 2 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

శ్రీమదాంధ్ర మహాభారతం ప్రాజెక్టు మార్చు

శ్రీమదాంధ్ర మహాభారతము: ఈ ప్రాజెక్టు పరిస్థితి ఏమిటి. ఎంతవరకు పని జరిగింది. మనం అందరం కలిసి పూర్తిచేయగలమా. దయచేసి సభ్యులు తెలియజేయండి.--Rajasekhar1961 (చర్చ) 05:17, 4 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఆ ప్రాజెక్టుకు ప్రముఖ బ్లాగర్ రానారె నాయకత్వం వహించినట్టు కనిపిస్తోంది. (పి.ఎస్. చురుకుగా పాల్గొన్నట్టు తెలిపారు--పవన్ సంతోష్ (చర్చ)) ఆయనతో వ్యక్తిగత పరిచయం లేకున్నా బ్లాగ్ పరంగా ఉన్న కొద్ది పరిచయాన్ని పురస్కరించుకుని ఫేస్ బుక్ ద్వారా ఈ అంశాన్ని ప్రస్తావించాను. ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 03:59, 6 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్, మీరు తీసుకొన్న చొరవకు ధన్యవాదాలు. వారి స్పందనలు తెలియజేయండి.--Rajasekhar1961 (చర్చ) 05:38, 6 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

నడుస్తున్న చరిత్ర/అమ్మనుడి ఓ.టీ.ఆర్.ఎస్. పరిష్కారాల కోసం మార్చు

నమస్తే,
గతంలో విలువైన విజ్ఞాన సర్వస్వ మూలం కాదగిన పత్రిక నడుస్తున్న చరిత్ర/అమ్మనుడిని పత్రిక యాజమాన్యం వారు సీఐఎస్-ఎ2కె భాగస్వామ్యంతో సీసీ-బై-ఎస్.ఎ. లైసెన్సులోకి పునర్విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూలం పత్రిక కావడంతో కాపీహక్కులు పత్రిక యాజమాన్యం వద్ద ఉన్నాయా? లేక విడివిడి రచయితల వద్ద ఉన్నాయా అన్న మీమాంసలో ఓటీఆరెస్ పనుల్లో జాప్యం నెలకొంటోంది. ఈ నేపథ్యంలో ఇతర భాషల్లో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టేవారి అనుభవాన్ని ఆధారం చేసుకుని ఓ ప్రతిపాదన వచ్చింది. దీని ప్రకారం కాపీహక్కుల సమస్యలు అధిగమించేందుకు గాను అన్ని ప్రధాన వార్తాపత్రికల్లో మనం చేపట్టనున్న ప్రక్రియను వివరిస్తూ, పత్రికకు రాసిన రచయితలు ఎవరికైనా ఈ ప్రక్రియపై అభ్యంతరం ఉంటే సంప్రదించాలంటూ ఆహ్వానించే నోటీసును ప్రచురించాలి. ఈ అంశంపై సముదాయాన్ని చర్చించాల్సిందిగా, ఇన్ పుట్స్ అందిచాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 04:09, 6 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

నాకు తెలిసినంతవరకు ఇదొక సరైన పద్ధతి; దీనిని పార్లమెంటులో జరిగే కొన్ని చర్చలు, మరియు బిల్లుల విషయంలో భారతదేశ ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి న్యాయవాదుల ద్వారా దేశంలోని అన్ని ప్రముఖ భాషల పత్రికలలో ప్రచురించి; దానికి నిర్ణీత సమయాన్ని ఇస్తారు. అందులోపల వ్యక్తపరచిన అభిప్రాయాలను, అభ్యంతరాలను పరిగణలోనికి తీసుకొని తుది నిర్ణయానికి వస్తారు. అయితే నడుస్తున్న చరిత్ర విషయంలో ఒకటి-రెండు జాతీయ పత్రికలలోను, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని ప్రాంతీయ (తెలుగు) పత్రికలలోను మన న్యాయవాది ద్వారా ప్రకటనలు ఇస్తే సరిపోతుంది.--Rajasekhar1961 (చర్చ) 05:42, 6 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
అభిప్రాయం వ్యక్తం చేసిన రాజశేఖర్ గారికి ధన్యవాదాలు. ఆయన సానకూల అభిప్రాయం వెల్లడించివుండడమూ, సముదాయం నుంచి మరే స్పందన రాకపోవడం బట్టి ఈ అంశంపై అభిప్రాయం సానుకూలం అని భావించాల్సివస్తోంది. అందుకు భిన్నమైన అభిప్రాయం ఉంటే వ్యక్తంచేయగలరు. ప్రస్తుతానికి దీని విషయమై ముందుకువెళ్తాము. --పవన్ సంతోష్ (చర్చ) 03:17, 21 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారికి, కేవలము ఒకరు స్పందించితే ముందుకు వెళడం సంస్థాపరంగా మంచిది కాదు. నాకు ప్రతిపాదిత పద్ధతి సరియైనదనిపించడంలేదు. ప్రకటనలకు చాలా ధనం ఖర్చయ్యే అవకాశంకూడావుంది. సిఐఎస్ లో చట్టం పై విశేష అనుభవం వారు ఉన్నారు కాబట్టి వారిని సంప్రదించి ప్రతిపాదించారా? మేగజైన్ పై కృషి యాంత్రికంగా చేయదలచితే ఆ వివరాలు, మచ్చుకి పత్రికలో కొంత భాగం చేస్తే మంచిది. ఇప్పటికే సమిష్టికృషి ప్రతిపాదనలలో సముదాయ భాగస్వామ్యం అంతంత మాత్రమే కాబట్టి ఈ పత్రిక గురించి సముదాయ ప్రాధాన్యత అభిప్రాయాన్ని సేకరించివుంటే అది తెలియచేయగలరు. --అర్జున (చర్చ) 01:10, 23 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జునగారు, ఈ విషయం గురించి నెలవారీ సమావేశంలో చర్చించాము. రెండు వారాల సమయంలో సమూహం యొక్క అభిప్రాయం రాని పక్షంలో చర్చ లేవదీనవారి అభిమతానికి అనుగుణంగా ఆ అంశాన్ని ముందుకు తీసుకొనిపోవలసిందని సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ నడుస్తున్న చరిత్ర పత్రికలో చాలా తెలుగు భాషకు సంబంధించిన సమాచారం ఉన్నది. వాటిలో నేను పనిచేస్తాను. అందులోని సమాచారం అంతా డిజిటల్ రూపంలో ఉన్నందున ఓ.సి.ఆర్.తో గాని ఇతర పద్ధతులలో సులభంగా పూర్తిచేయవచ్చును. తెవికీలో వ్యాసాలకు కూడా ఇవి మంచి మూలాలుగా ఉపయోగపడతాయి. ఈ విధంగా ప్రజల అభిప్రాయాలను తీసుకోవడం న్యాయపరంగా ఆమోదయోగ్యమైనది.--Rajasekhar1961 (చర్చ) 05:17, 23 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

మహేంద్రజాలం - జూన్ నెల ప్రదర్శన గ్రంథం ప్రతిపాదన మార్చు

మహేంద్రజాలం - జూన్ నెల ప్రదర్శన గ్రంథంగా ప్రతిపాదన చేయడమైనది . ఈ గ్రంథం రూపు దిద్దుట చివరిదశకు చేరుకుంటున్నది. కృషి చేసిన సభ్యులందరికి ధన్యవాదాలు. వికీసోర్స్:ప్రదర్శన గ్రంథాలు/మహేంద్రజాలం లో పరిచయం చూసి మెరుగు చేయండి, లేక స్పందించండి.----అర్జున (చర్చ) 05:34, 29 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

మహేంద్రజాలం పుస్తకాన్ని కొద్ది సమయంలో పూర్తిచేసినందులకు అర్జున గారికి ధన్యవాదాలు. ఈనెల ప్రదర్శన గ్రంథంగా బాగుంటుంది.--Rajasekhar1961 (చర్చ) 14:05, 29 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

జూన్ నెలలో సమిష్టి కృషి మార్చు

అర్జున గారు, జూన్ నెలలో సమిష్టి కృషి నిర్ణయించి ; కొన్ని మంచి పుస్తకాలను గుర్తించి; పూర్తిచేద్దాము. మే నెల సహకారానికి సభ్యులందరికీ ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 14:55, 2 జూన్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

వికీసోర్స్:పుస్తక కూర్పు ప్రాధాన్యత/201606 చూడండి. సహ సభ్యులందరు స్పందించమని మనవి. --అర్జున (చర్చ) 00:50, 10 జూన్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ గారి సహాయంలో స్కానింగ్ లో లోపించిన పేజీలను పుర్తి చేసిన నాలుగు పుస్తకాలను ఈ నెలలో పూర్తిచేయాలనుకొంటున్నాను. అవి : ఆంధ్రుల సాంఘిక చరిత్ర, ఆంధ్ర వీరులు - రెండవ భాగము, అళియ రామరాయలు మరియు ఆబ్రహాము లింకను చరిత్ర. సభ్యులు సహకరించమని మనవి.--Rajasekhar1961 (చర్చ) 12:23, 10 జూన్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు సినిమా పాటల పుస్తకాల ప్రచురణ మార్చు

తెలుగు సినిమా పాటల పుస్తకాలు (1935-54 మధ్య విడుదలైనవి) డిజిటల్ రూపంలో సీఐఎస్-ఎ2కె ఆర్కైవ్స్ లో దొరుకుతున్నాయి. ఆనాటి తెలుగు పాటల పుస్తకాల్లో కేవలం పాటలు మాత్రమే కాక సినిమా పాత్రలు-పాత్రధారులు, సాంకేతిక వర్గం, సంక్షిప్త కథ వంటి వివరాలు కూడా ఉన్నాయి. ఈ మొత్తం వివరాలన్నీ తెలుగు వికీపీడియాలో వేలాదిగా ఉన్న తెలుగు సినిమా వ్యాసాల మొలకల అభివృద్ధికి ఉపకరిస్తాయి. పాటలకు ఉండే సాహిత్యపరమైన విలువ కాకుండా ఇలా విజ్ఞాన సర్వస్వ పరమైన విలువ కూడా ఉండడంతో సీఐఎస్-ఎ2కె వారు వీటిని ప్రచురించి, డిజిటైజ్ చేయాలన్న ప్రయత్నం చేస్తున్నాం. విజ్ఞాన సర్వస్వ పరంగా వీటి ప్రయోజనం ఎలావుంటుందన్న విషయాన్ని పరిశీలించి సముదాయం భవిష్యత్తులో ఈ పనిలో సహకరించేందుకు తమ ప్రాధాన్యత తెలియజేయగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 09:43, 11 జూన్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు సినిమా పాటల పుస్తకాల సంకలనం మొత్తం మూడు భాగాలు నా దగ్గర ఉన్నాయి. ఈ పుస్తకాలలో చిత్రకథ, సాంకేతిక వర్గం మరియు పాటలు (పూర్తిగా) లభిస్తున్నాయి. ఇవి తెలుగు వికీపీడియాలో నున్న బాగా పాత సినిమాల వ్యాసాల అభివృద్ధికి ఉపయోగిస్తాయి. ఓ.సి.ఆర్. సరిగా రాకపోవచ్చును. ఇవి వికీసోర్స్ లో అప్లోడ్ చేసి ఉపయోగించుకోవచ్చును. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 11:16, 11 జూన్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
సంకలనానికి కాలపరిమితి దాటితే పాటలు స్వేచ్ఛానకలహక్కుల పరిధిలోనికి వచ్చినట్లు కాదు. వాటి రచయితల జీవిత కాలాన్ని బట్టి ఆ నిర్ణయం చేయాలి. కొత్త ఆలోచనలు సముదాయం బలపడినతర్వాత ఉపయోగం. సముదాయ బలపడే దిశగా చర్యలు చేపట్టితే మంచిది. గతం లో స్పందనలకు పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) నుండి ప్రతిస్పందనలుండటం లేదు. అలాగైతే సముదాయంతో సిఐఎస్ సహకారం అభివృద్ధి కష్టం. --అర్జున (చర్చ) 11:24, 11 జూన్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  • అర్జున గారూ 60 సంవత్సరాల క్రితం విడుదలైన ప్రతి సినిమా కాపీహక్కుల పరిధి నుంచి అన్ని విధాలా బయటకు రాదన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకునేవున్నాం. సినిమా గురించిన ఇతర వివరాలన్నీ పాటల పుస్తకంలో రాసినవారెవరో అజ్ఞాతంగా ఉండిపోయినందువల్ల ఆయా భాగాలు 60 సంవత్సరాల పరిధి దాటాకా కాపీహక్కుల పరిధిలో లేకున్నా, పాటలు రాసిన రచయితల వివరాలు సుస్పష్టం కనుక వారు మరణించిన తేదీ నుంచి 60 ఏళ్ళ వరకూ కాపీహక్కుల పరిధిలోనే ఉంటాయి అన్నది నా అవగాహన. అలా కాపీహక్కుల పరిధిని అన్ని విధాలా దాటగలిగిన పాటల పుస్తకాలనే చేర్చవచ్చు. స్పందనల విషయమై సముదాయ సూచనలను పరిగణనలోకి తీసుకుంటున్నాం, పనిచేస్తున్నాం. సముదాయం చేస్తున్న కృషిలో సాధ్యమైనంత భాగం అవుతున్నాం. అన్నమయ్య గ్రంథాలయ స్కాన్ల విషయంలో మీరు గుర్తించి వుంటారు. ఐతే మిగిలిన అభ్యర్థనలు (వాటిపై ప్రగతి ఉన్నా కూడా)పూర్తి అయ్యాకే లేక గణనీయమైన ప్రయత్నం సాధ్యపడ్డాకే అయిందన్న విషయం చెప్తూ స్పందించడం అన్న సరికాని పద్ధతి అవలంబించడం వల్ల సమస్య తలెత్తింది. ఇందుకు క్షంతవ్యులం. ఇక నుంచి సముదాయ అభ్యర్థనలు, అవసరాల విషయంలో ఏం చేపడుతున్నామన్నదీ, ప్రగతి ఏంటన్నది ఎప్పటికప్పుడు తెలియజేస్తాము. ఆ పద్ధతి ప్రారంభించడం కూడా గమనించవచ్చు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 06:40, 13 ఆగష్టు 2016 (UTC)
పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) గారి స్పందనకు ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 11:34, 13 ఆగష్టు 2016 (UTC)

రామానుజన్ నుండి అటూ ఇటూ పుస్తకం సీసీ-బై-ఎస్ఎ లైసెన్సులో విడుదల, డిజిటైజేషన్ మార్చు

అందరికీ నమస్కారం,
వేమూరి వెంకటేశ్వరరావు గారు తాను రచించిన రామానుజన్ నుండి అటూ ఇటూ పుస్తకాన్ని సీసీ-బై-ఎస్ఎ లైసెన్సులోకి విడుదల చేయమని కోరగా ఆయన అంగీకరించారు. వికీమీడియా కామన్స్ లోకి పుస్తకాన్ని విడుదల చేశారు.
సుప్రసిద్ధుడైన గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ అతిపిన్న వయస్సులో మరణించి గణిత శాస్త్రంలో అద్భుతమైన ఆవిష్కరణలు చేశారు. అయితే ఆయన జీవితచరిత్రలా కాకుండా ఆయన చేసిన గణిత ఆవిష్కరణల గురించి తేలికైన, తేటైన తెలుగులో రాసిన పుస్తకం - రామానుజన్ నుండి అటూ ఇటూ.
పుస్తకాన్ని తెలుగు వికీసోర్సులోకి తెచ్చి డిజిటైజ్ చేసే కృషిని సంస్థాగతంగా చేయనున్నాం. ఈ కృషి చేసేందుకు తెలుగు వికీసోర్సర్లకు వైయుక్తికంగా ఆసక్తి వుంటే సంప్రదించగలరు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 06:04, 20 జూన్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

నేను చాలాకాలం శ్రమించి నేర్చుకొన్న పనిని అనతికాలంలోనే ఒడిసిపట్టి అతి నేర్పుతో నిర్వహిస్తున్న పవన్ సంతోష్ గారికి అభినందనలు. మీ కృషిని మరింతగా ముందుకు తీసుకొని పోయి తెలుగు వికీసోర్సును భారతీయ భాషలలో అన్నింటా ముందు వరుసలో నిలబెట్టాలని నా అభిలాష. నానుండి ఏమైనా సహాయం కావాలంటే దయచేసి అడగండి. తప్పకుండా చేస్తాను. ప్రస్తుతం నాకు ఇప్పటికే టైపింగు పూర్తైన పుస్తకాలను దింపుకొనే పుస్తకాలుగా తయారుచేసి తెలుగు భాషాభిమానులకు అందించడమే ప్రాముఖ్యతగా అనిపిస్తుంది. ఇందులో మీలాంటి భాష, సాహిత్యాభిమానుల సహాయం అవసరంం ఉన్నది.--Rajasekhar1961 (చర్చ) 04:59, 23 జూన్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు సర్. మీ సహకారంతోనే వేగంగా నేర్చుకోగలిగాను. --పవన్ సంతోష్ (చర్చ) 06:03, 23 జూన్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

యశస్వి సతీష్ కుమార్ రచనలు సీసీ-బై-ఎస్ఎ లైసెన్సులో విడుదల, డిజిటైజేషన్ మార్చు

అందరికీ నమస్కారం,
యశస్వి సతీష్ కుమార్ తాను సమకాలీన కవుల చిత్రణగా రాసిన ఒక్కమాట పుస్తకాన్ని, ఆయన కవితల సంకలనం తెల్లకాగితంతో పాటు సీసీ-బై-ఎస్ఎ లైసెన్సులోకి విడుదల చేయమని కోరగా అంగీకరించి, విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పుస్తకాలను వికీసోర్సులో డిజిటైజ్ చేసే కృషి సంస్థాగతంగా చేపట్టనున్నాం.
యశస్వి సతీష్ రాసిన ఒక్కమాట పుస్తకంలో పలువురు సమకాలీన కవుల చిత్రణతో పాటు, ఛాయాచిత్రాలు వంటివీ ఉన్నాయి. ఇవన్నీ కూడా పుస్తకంతో పాటుగా సీసీ-బై-ఎస్ఎలోకి విడుదల అవుతున్నాయి.
ఈ డిజిటైజేషన్ కృషిలో తెలుగు వికీసోర్సర్లు ఎవరైనా పాల్గొనేందుకు వైయుక్తికంగా ఆసక్తి ఉంటే సంప్రదించగలరు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 19:34, 22 జూన్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

పుస్తకాలలోని సమాచారం విజ్ఞాన కోశానికి ఉపయోగకరమైనదిగా ఉండాలి. అదొక్కటే చూసుకొండి. డిజిటల్ కాపీ లభిస్తే మనం ఎక్కువ శ్రమ పడకుండా పూర్తిచేయవచ్చును. మీ కృషికి మరోసారి ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 07:08, 23 జూన్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

జూలై ప్రదర్శన గ్రంథం మార్చు

గణపతిముని చరిత్ర సంగ్రహం పుస్తకాన్ని జూలైనెల ప్రదర్శన గ్రంథంగా ప్రతిపాదన చేయడమైనది. కృషి చేసిన సభ్యులందరికి ధన్యవాదాలు. వికీసోర్స్:ప్రదర్శన గ్రంథాలు/గణపతిముని చరిత్ర సంగ్రహం లో పరిచయం చేయండి, లేక స్పందించండి.--Rajasekhar1961 (చర్చ) 07:34, 28 జూన్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Open call for Project Grants మార్చు

 

Please help translate to your language:

Greetings! The Project Grants program is accepting proposals from July 1st to August 2nd to fund new tools, research, offline outreach (including editathon series, workshops, etc), online organizing (including contests), and other experiments that enhance the work of Wikimedia volunteers.
Whether you need a small or large amount of funds, Project Grants can support you and your team’s project development time in addition to project expenses such as materials, travel, and rental space.
Also accepting candidates to join the Project Grants Committee through July 15.
With thanks, I JethroBT (WMF) 15:25, 5 జూలై 2016 (UTC)[ప్రత్యుత్తరం]

గణపేశ్వరాలయం పుస్తకం సీసీ-బై-ఎస్ఎ లైసెన్సులో విడుదల, డిజిటైజేషన్ మార్చు

అందరికీ నమస్కారం,
కట్టా శ్రీనివాసరావు గారు తాను రచించిన గణపేశ్వరాలయం పుస్తకాన్ని సీసీ-బై-ఎస్ఎ లైసెన్సులోకి విడుదల చేయమని కోరగా ఆయన అంగీకరించారు. ఆయన సీసీ లైసెన్సులోకి విడుదల చేయగా, మేము కామన్స్ లోకి పుస్తకాన్ని చేర్చాం.
గణపేశ్వరాలయం పుస్తకం ఖమ్మం జిల్లాలోని కూసుమంచి గ్రామంలోని ప్రాచీనమైన శివాలయాన్ని గురించిన చరిత్ర రచన. మౌలిక, ప్రామాణిక స్థాయి పరిశోధనలతో తెలంగాణా చరిత్రను పునర్నిర్మించాలని స్వంత ఆసక్తితో విస్తృతమైన పరిశోధనలు చేస్తున్న ఈ తరం తెలంగాణా చరిత్రకారుల్లో కట్టా శ్రీనివాసరావు గారు ముందు శ్రేణిలోని వారు. తెలంగాణా ప్రాంతంలోకెల్లా అతిపెద్ద, దేశంలోకెల్లా చెప్పుకోదగ్గ పరిమాణంలోని శివలింగం గణపేశ్వరాలయం విశిష్టతల్లో ఒకటి. గొలుసుకట్టు చెరువులు, శిల్పకళా విశిష్టతలు, ఆంధ్రమహాభారతేతిహాస రచన, పేరిణి శివతాండవం వంటి అపురూప సృష్టి జరిగిన కాకతీయ సామ్రాజ్యపు వైభవాన్ని నేపథ్యంగా కనిపించేలా ఈ శివాలయపు చరిత్ర, విశిష్టతలను రచించారు.
పుస్తకాన్ని తెలుగు వికీసోర్సులోకి తెచ్చి డిజిటైజ్ చేసే కృషిని సంస్థాగతంగా చేయనున్నాం. ఈ కృషి చేసేందుకు తెలుగు వికీసోర్సర్లకు వైయుక్తికంగా ఆసక్తి వుంటే సంప్రదించగలరు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 04:17, 19 జూలై 2016 (UTC)[ప్రత్యుత్తరం]

కానూరి బదరీనాథ్ సమగ్ర సాహిత్యం సీసీ-బై-ఎస్ఎ లైసెన్సులోకి విడుదల మార్చు

చరిత్రకారుడు, రచయిత, జర్నలిస్టు కానూరి బదరీనాథ్ తాను ఇప్పటివరకూ రాసిన సమగ్ర సాహిత్యం అంతా సీసీ-బై-ఎస్ఎ లైసెన్సులోకి పునర్విడుదల చేసేందుకు అంగీరించారు. గత రెండు దశాబ్దాలుగా ఆయన రాసిన పలు పుస్తకాల వివరాలు ఇలా ఉన్నాయి:

  1. తణుకు తళుకులు - సుదీర్ఘమైన చరిత్ర కలిగిన తణుకు పట్టణం, సమీప ప్రాంతాల్లో జన్మించి/నివసించి రాజకీయ, సాహిత్య, కళా రంగాల్లో కృషిచేసిన 250 మందికి పైగా ప్రముఖుల గురించి రాసిన పుస్తకం.
  2. పానార విషయము - పశ్చిమ గోదావరి జిల్లాకు పానార విషయమని పూర్వ నామం. సుదీర్ఘమూ, ఆసక్తికరమూ అయిన జిల్లా చరిత్రను మౌలిక, విశ్లేషణాత్మక చారిత్రిక అంశాలతో చేసిన చరిత్ర రచన. దీనిలో జిల్లాలో చరిత్రలో విశిష్టత కలిగిన గ్రామాల గురించిన చరిత్ర వివరంగా రాశారు.
  3. మా దూతికాపురము - పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్తిలి మండలంలో జుత్తిగ గ్రామం ఈ ప్రాంతంలో చారిత్రక ప్రశస్తి కలిగింది. ఈ గ్రామపు సుదీర్ఘమైన చరిత్ర గురించి సవివరంగా ఇందులో రాశారు.
  4. యర్రా నారాయణస్వామి జీవిత చరిత్ర - రాజకీయవేత్త యర్రా నారాయణస్వామి అధికారిక జీవిత చరిత్ర. పశ్చిమ గోదావరికి చెందిన యర్రా నారాయణస్వామి రాజకీయ జీవితంలో రాష్ట్రమంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా, శాసన సభ్యునిగా, జిల్లా బోర్డు అధ్యక్షునిగా, ఇతర పదవుల్లో పనిచేసిన వ్యక్తి. ఆయన హయాంలో పలు విద్యాసంస్థలు నెలకొల్పడమే కాక స్థానికంగా నిజాయితీ పరునిగా పేరు పొందారు. ఆయన జీవితం గురించే కాక ఆయన చురుకుగా రాజకీయ రంగంలో పనిచేసిన నాటి రాష్ట్ర రాజకీయాల గురించి ప్రామాణిక రిఫరెన్సు పుస్తకంగానూ ఉపకరిస్తుంది.
  5. కాశ్యప వ్యాసాలు - ప్రైమరీ, సెకండరీ రీసెర్చ్ సమాచారంగా ఉపకరించే చరిత్ర వ్యాసాల సంకలనం ఇది. ఈ వ్యాసాలు పలు పత్రికల్లో, జర్నల్స్ లో ప్రచురితం అయివున్నవి.
  6. అంతర్వాణి - జర్నలిస్టుగా పలు వార్తా పత్రికల్లో రాసిన రాజకీయ, సామాజిక, సాంస్కృతిక విశ్లేషణాత్మక వ్యాసాల సంకలనం.
  7. బదరీనాథీయం - సంస్కృతి, సినిమా, కవిత్వం, రాజకీయాల గురించి పలు పత్రికల్లో ప్రచురితమైన వ్యాసాల సంకలనం.
  8. లోచూపు - కళ, భాష, సాహిత్యం, పాత్రికేయం, చరిత్ర వంటి అంశాలపై వివిధ పత్రికల్లో ప్రచురించిన వ్యాసాల సంకలనం.
  9. అన్నవీ అనుకున్నవీ - సమకాలీన సంఘటనలు (గత దశాబ్దిలో) గురించి గ్రంథకర్త రాసిన కాలమ్ లోని వ్యాసాల సంకలనం.
  10. వ్యాసబదరికం - సమకాలీన సంఘటనల గురించి బదరీనాథ్ రాసిన కాలమ్ లోని వ్యాసాల సంకలనం.
  11. కవి గారు - ఏడు దశాబ్దాలకు పైగా సాగే కాలంలో ఓ కాల్పనిక కవి జీవితాన్ని కాలాన్ని చిత్రీకరించిన నవలిక. స్వాతంత్ర్యానంతర భారతదేశంలో సాహిత్య పోషణ దిగజారిపోతున్న స్థితికి నవలిక అద్దం పడుతుంది.
  12. కౌటిల్యుని నిష్క్రమణం - సుప్రసిద్ధ రాజనీతివేత్త, అర్థశాస్త్ర రచయిత, భారత చరిత్రలో అతిగొప్ప సామ్రాజ్యాల్లో ఒకదాని నిర్మాణదక్షుడైన కౌటిల్యుని ఉన్నత వ్యక్తిత్వాన్ని సూక్ష్మంగా చిత్రీకరిస్తూ సాగిన చారిత్రక నాటకం.

రచయిత యొక్క ఈ సాహిత్య సర్వస్వాన్ని తెలుగు వికీసోర్సులోకి తెచ్చి డిజిటైజ్ చేసే కృషిని సంస్థాగతంగా చేయనున్నాం. ఈ కృషి చేసేందుకు తెలుగు వికీసోర్సర్లకు వైయుక్తికంగా ఆసక్తి వుంటే సంప్రదించగలరు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 04:45, 19 జూలై 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఒక ప్రసిద్ధ రచయిత యొక్క సమగ్ర సాహిత్యాన్ని తెలుగు వికీసోర్స్ ద్వారా విడుదల చేయడం ఇదే ప్రథమం. ఇందులో చొరవతీసుకొన్న పవన్ సంతోష్ కు మరియు బద్రీనాథ్హ్ గారికి మా హార్థిక శుభాకాంక్షలు. అయితే వీనిలో సగం పుస్తకాలు విజ్ఞాన సర్వస్వానికి ప్రయోజనకరంగా ఉండగా మిగిలినవి సాహిత్యపరంగా ప్రముఖమైనవిగా కనిపిస్తున్నాయి. అయినా ఒక రచయిత తన రచనలన్నింటికి మనకు అందిస్తున్నప్పుడు ఇలాంటి వెసులుబాటు కలిగించాలి కదా. రచయితకు వికీసోర్స్ తరఫున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.--Rajasekhar1961 (చర్చ) 06:41, 21 జూలై 2016 (UTC)[ప్రత్యుత్తరం]

RahmanuddinBot వాడుకరికి బాటు హోదా మార్చు

వికీసోర్స్ సభ్యులకు,

RahmanuddinBot బాటు అకౌంటు వాడి ఇప్పటికే టైపు చేసిన పాఠ్యాన్ని ఒక చోట చేర్చటం లాంటి పనులు చేస్తున్నాను. అయితే ఈ సభ్యత్వానికి బాటు హోదా లేదనుకుంటాను. అన్ని మార్పులు ఇటీవలి మార్పుల్లో కనిపిస్తున్నాయి. దయచేసి ఈ అకౌంటుకు బాటు హోదా కల్పించగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 10:01, 28 జూలై 2016 (UTC)[ప్రత్యుత్తరం]

రహ్మానుద్దీన్ గారికి. తెలుగు వికీసోర్స్ లో క్రియాశీలంగా వున్న అధికారులు లేరు కనుక, మీ అభ్యర్ధన పై సభ్యుల స్పందనలు కోరి ఆతదుపరి వికీమీడియా మెటాలో బాట్ హోదా కొరకు అభ్యర్ధించండి. --అర్జున (చర్చ) 11:38, 13 ఆగష్టు 2016 (UTC)

Whatamidoing (WMF) (talk) 18:03, 9 ఆగష్టు 2016 (UTC)

మనసు ఫౌండేషన్ నుంచి స్వేచ్ఛా నకల హక్కుల్లోకి కొన్ని పుస్తకాలు మార్చు

అందరికీ నమస్కారం,
మనసు ఫౌండేషన్ వారు ఇంతవరకూ తెలుగు వికీసోర్సులోకి చేర్చేందుకు అవసరమైన పుస్తకాలను స్కాన్ చేయడం ద్వారానూ, తమ వద్ద ఇప్పటికే ఉన్న స్కాన్ పుస్తకాలు అందజేయడం ద్వారానూ సీఐఎస్-ఎ2కెతో సంస్థాగతంగా సమన్వయం చేస్తూ సాయం చేస్తున్న విషయం సముదాయానికి తెలిసిందే. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసే విస్తృత లక్ష్యాన్ని సాధించేందుకు తెలుగు సాహిత్యంలో అద్భుతమైన కృషిచేసిన గురజాడ అప్పారావు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, కె.ఎన్.వై.పతంజలి వంటి పలువురి సమగ్ర సాహిత్యాన్ని ప్రచురించడం, 20వ శతాబ్దికి పూర్వపు తెలుగు, ఆంధ్ర దేశాల సాంఘిక, రాజకీయ జీవనాలు ప్రతిబింబించే రచనలు అనువదించి ప్రచురించడం వంటి పనులు చేపట్టి సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు ఇదివరకు ప్రచురించిన మూడు పుస్తకాలను స్వేచ్ఛా నకలు హక్కుల్లో అందజేస్తున్నారు.

  1. గురుజాడలు: గురజాడ వెంకట అప్పారావు రచించిన సర్వ సాహిత్యాన్ని సాకల్యంగా సంకలనం చేసి అందజేసిన పుస్తకం ఇది. గురజాడ అప్పారావు కాపీహక్కుల పరిధిలో లేకున్నా, ముందుమాటలు, నోట్సు, కొన్ని రచనల అనువాదాలు, అనుబంధాలు వంటివాటికి ఫౌండేషన్ కు కాపీహక్కు ఉంటూంది. ఈ నేపథ్యంలో ఆ భాగాలు సహితం సీసీ-బై-ఎస్ఎలో విడుదల చేస్తూ పుస్తకాన్ని చేర్చేందుకు ఉన్న కాపీహక్కుల పరమైన ఇబ్బందులు తొలగించారు.
  2. చెప్పులు కుడుతూ కుడుతూ: 19వ శతాబ్దిలో కోస్తాంధ్ర ప్రాంతంలోని మాదిగ కులస్తుల జీవితాన్ని, ఎదుర్కొన్న ఆటుపోట్లను, వారి మూలాలను ఇతరేతర సాంఘికార్థిక నేపథ్యాల సాయంతో ఎమ్మా రొషాంబు క్లౌ 19వ శతాబ్ది చివరి భాగంలో రాసిన ఆంగ్ల గ్రంథం While sewing sandalsకు ఇది తెలుగు అనువాదం. ప్రముఖ రచయిత, విమర్శకుడు, సాహిత్యవేత్త వివినమూర్తి ఈ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించగా, మనసు ఫౌండేషన్ ప్రచురించింది. మూలగ్రంథం ప్రచురితమై 110 ఏళ్ళు కావస్తూండడం, రచయిత్రి మరణించి వందేళ్ళు కావడంతో ఈ పుస్తకపు ఆంగ్ల మూలం పబ్లిక్ డొమైన్లోనే ఉంది, ఇప్పుడు దాని తెలుగు అనువాదంపై తనకు గల హక్కులను సీసీ-బై-ఎస్ఎ లైసెన్సులోకి వివినమూర్తి విడుదల చేశారు.
  3. సర్ ఆర్థర్ కాటన్ జీవితం, కృషి: గోదావరి డెల్టా ప్రజలకు ఆరాధ్యుడైన ఇంజనీరు సర్ ఆర్థర్ కాటన్ జీవితానికి, కృషికి తెలుగు వారి చరిత్రలో కీలకమైన స్థానం ఉంది. ఆధునిక చరిత్రకారులు ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీ నిర్మించి, గోదావరి డెల్టాకు పునాదులు వేయడాన్ని ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో మలుపుతిప్పి ఆధునిక ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రాంతాల చరిత్రలో అత్యంత కీలకమైన సంఘటనగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాటన్ కుమార్తె లేడీ హోప్ రాసిన ఆయన జీవిత చరిత్రను కవన శర్మ తెలుగులోకి అనువదించగా, మనసు ఫౌండేషన్ వారు ప్రచురించారు. ఈ పుస్తకానికి ఆంగ్ల మూలమూ 1899లో దాదాపు 117 ఏళ్ళ క్రితం తొలి ప్రచురణ పొందింది. రచయిత్రి కూడా 90 ఏళ్ళ క్రితమే మరణించారు. ఇప్పుడు తెలుగు అనువాద ప్రతిని కవన శర్మ సీసీ-బై-ఎస్ఎ లైసెన్సులోకి విడుదల చేయనున్నారు.

ఈ పుస్తకాలను తెలుగు వికీసోర్సులోకి తెచ్చి డిజిటైజ్ చేసే కృషిని సంస్థాగతంగా చేయనున్నాం. ఈ కృషి చేసేందుకు తెలుగు వికీసోర్సర్లకు వైయుక్తికంగా ఆసక్తి వుంటే సంప్రదించగలరు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 14:48, 7 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమించండి. గురజాడ అప్పారావుగారి సమస్త సాహిత్యాన్ని తెలుగులో ప్రజలందరికీ అందిస్తున్నందుకు సంతోషంగా ఉన్నది. ఇందులో నేను భాగస్వామి కావడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక సర్ ఆర్థర్ కాటక్ బ్రౌన్ దొరగారి వలె తెలుగు నేలను ఎనలేని మేలు చేశారు. వారి జీవితచరిత్ర మనందరికీ స్మరణీయం. వీటిని తప్పకుండా చేరుద్దాము. మంచి కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 06:13, 1 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారం పుస్తకం స్వేచ్ఛానకలు హక్కుల్లో విడుదల, డిజిటైజేషన్ మార్చు

అందరికీ నమస్కారం, పశ్చిమ గోదావరి జిల్లా చరిత్ర, జాతీయోద్యమంలో జిల్లావాసుల పాత్రపై కూలంకషంగా అధ్యయనం చేసి పలు వ్యాసాలు, పుస్తకాలు వెలువరించిన చరిత్రకారుడు డాక్టర్ గాదం గోపాలస్వామి. ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో క్విట్ ఇండియా ఉద్యమంపై చేసిన పరిశోధనకు ఎం.ఫిల్ పట్టా, భారత జాతీయోద్యమం(1919-1947)లో పశ్చిమ గోదావరి పాత్రపై వెలువరించిన పరిశోధనపై పి.హెచ్.డి. పొందారు. భారత జాతీయోద్యమంలో పశ్చిమ గోదావరి జిల్లా యోధులు, పశ్చిమ గోదావరి జిల్లా సంస్కృతీ సౌరభాలు వంటి పుస్తకాలు వెలువరించగా పలువురు చరిత్రకారుల ప్రశంసలు పొందాయి. పలు పత్రికల్లో ఆయన రాసిన చరిత్రకు సంబంధించిన వందలాది వ్యాసాలు ప్రచురితమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ కార్యనిర్వాహక సభ్యునిగా మూడేళ్ళు పనిచేశారు, రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారాన్ని పొందారు. ఆయన రాసిన పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారం పుస్తకాన్ని సీసీ-బై-ఎస్ఎ లైసెన్సులో విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని తెలుగు వికీసోర్సులోకి తెచ్చి డిజిటైజ్ చేసే కృషిని సంస్థాగతంగా చేయనున్నాం. ఈ కృషి చేసేందుకు తెలుగు వికీసోర్సర్లకు వైయుక్తికంగా ఆసక్తి వుంటే సంప్రదించగలరు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 17:50, 9 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ పుస్తకం గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల చరిత్రకు సంబంధించినవిగా తెవికీ వ్యాసాల విస్తరణకు బాగా తోడ్పడతాయి. ఇదొక మంచి కృషిగా అనిపిస్తున్నది.--Rajasekhar1961 (చర్చ) 06:20, 1 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

RevisionSlider మార్చు

Birgit Müller (WMDE) 15:08, 12 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

గురజాడ అప్పారావు లభ్య సంపూర్ణ సాహిత్యం మార్చు

అందరికీ నమస్కారం, తెలుగు జాతిని ఎన్నో విధాలుగా ప్రభావితం చేసిన మహాకవి గురజాడ అప్పారావు సాహిత్యాన్ని వేర్వేరు పుస్తకాలుగా తెలుగు వికీసోర్సులో డిజిటైజ్ చేయడం జరుగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం కన్యాశుల్కం, మహాకవి డైరీలు, లేఖలు మాత్రమే స్కాన్ ఆధారితంగా ఉండగా, మన వద్ద ఉన్న మెటిల్డా అన్న కథ, దేశమును ప్రేమించుమన్నా, ముత్యాల సరములు, కన్యక, లవణరాజు కల, పూర్ణమ్మ, మిణుగురులు వంటి కొన్ని కవితలు మాత్రం స్కాన్ ఆధారితం కాకుండా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురజాడ అప్పారావు లభ్యరచనలు అన్నిటినీ సమగ్రంగా మనసు ఫౌండేషన్ "గురుజాడలు" పుస్తక రూపంలో ప్రచురించారు. వీటిలో పైన ప్రచురించిన రచనలతో పాటుగా, ఆయన కథలు, కవితలు, వ్యాసాలు, నాటకాలు అనేకం ఉన్నాయి. అరుదైన కన్యాశుల్కం మొదటి కూర్పు కూడా దానిలో ఒకటి. వీటితో పాటుగా ముందుమాటలుగా ప్రముఖ విమర్శకుడు వివిన మూర్తి కూడా విశ్లేషిస్తూ రాశారు. గురజాడ రచనలన్నీ పబ్లిక్ డొమైన్లో ఉండగా, ముందుమాటలు, ఇతర సృజనాత్మక కృషి అంతటినీ మనసు ఫౌండేషన్ వారు సీసీ-బై-ఎస్ఎ లైసెన్సులో విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఈ ప్రచురణను నేరుగా తెలుగు వికీసోర్సులోకి డిజిటైజ్ చేయాలో, ఏం చేయవచ్చన్న అంశంపై సూచనలు ఇవ్వగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 15:23, 27 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఇంతకు ముందుగా తెలియజేసినట్లు గురజాడ అప్పారావు గారి సాహిత్యాన్ని వికీసోర్సులో చేర్చడానికి నేను పనిచేస్తాను. నాకు అవకాశాన్ని ఇవ్వండి. ఇప్పటికే ఉన్న కన్యాశుల్కం పుస్తకాన్ని తొలగించాల్సిన అవసరం లేదు. రెండూ వేర్వేరు ముద్రణలు కాబట్టి రెండూ కొనసాగిద్దాము. దీనిలో పనిచేయడానికి లయోలా కళాశాల్ విద్యార్థులు తోడ్పడడం మన పనిని సులభం చేస్తుంది. ఈ కృషి మూలకారణభూతులైన మనసు ఫౌండేషన్ వారికి మా ధన్యవాదాలు. మొత్తం అంతటినీ స్కాన్ ఆధారంగా చేర్చిన పిదప, వాటిని విభాగాలుగా, పుస్తకాలుగా వేరు వేయవచ్చును.--Rajasekhar1961 (చర్చ) 06:17, 1 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Grants to improve your project మార్చు

Please help translate to your language:

Greetings! The Project Grants program is currently accepting proposals for funding. There is just over a week left to submit before the October 11 deadline. If you have ideas for software, offline outreach, research, online community organizing, or other projects that enhance the work of Wikimedia volunteers, start your proposal today! Please encourage others who have great ideas to apply as well. Support is available if you want help turning your idea into a grant request.

I JethroBT (WMF) (talk) 20:11, 30 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

భారతీయ బాషలలో ముందున్న తెలుగు వికీ సోర్స్ మార్చు

తెలుగు వికీ సోర్స్ ప్రస్తుతం భారతీయ భాషా వికీసోర్స్ లలో ముందున్నది. ముందుగా ఈ ఘనత సాధించదంలో ముఖ్యపాత్ర పోషించిన సభ్యులందరికీ శుభాభినందనలు. ఇక్కడ వివరాలు ఈ విధంగా పొందుపరచబడ్డాయి..

As per Number of article

  1. Sanskrit Wikisource ( 14840 pages) - supported by 0.05% scan pages.
  2. Telugu Wikisource ( 11708 pages) - supported by 24.3% scan pages.
  3. Kannada Wikisource ( 7666 pages) - supported by 1.05% scan pages.


As per Number of page Validation

  1. Telugu Wikisource ( 17943 pages)
  2. Tamil Wikisource ( 5116 pages)
  3. Gujarati Wikisource ( 3519 pages)


As per Number of page Proofread

  1. Telugu Wikisource ( 19872 pages)
  2. Malayalam Wikisource ( 8022 pages)
  3. Tamil Wikisource ( 7157 pages)

As per percentage supported by scan pages.

  1. Telugu Wikisource ( 24.30%)
  2. Bengali Wikisource (22.21%)
  3. Gujarati Wikisource (16.70%)

For Sanskrit, Telugu & Kannada Wikisource, they need to exploring their work of text towards scan page support.

మరిన్ని వివరాలకు ఇక్కడ చూడండి.- https://wikisource.org/wiki/Wikisource:Indic_Wikisource_Stats - --విశ్వనాధ్.బి.కె. (చర్చ) 13:54, 3 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీసోర్సును మంగోలియన్ గుర్రాల్లా పరుగులు తీయిస్తున్న సహ సభ్యులకు అందరికీ హృదయపూర్వకమైన అభినందనలు. ఈ సందర్భంగా నాణ్యతపై మరింత దృష్టి పెట్టడంపై వ్యక్తిగతంగా సూచిస్తూన్నాను. అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 03:21, 6 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Creative Commons 4.0 మార్చు

Hello! I'm writing from the Wikimedia Foundation to invite you to give your feedback on a proposed move from CC BY-SA 3.0 to a CC BY-SA 4.0 license across all Wikimedia projects. The consultation will run from October 5 to November 8, and we hope to receive a wide range of viewpoints and opinions. Please, if you are interested, take part in the discussion on Meta-Wiki.

Apologies that this message is only in English. This message can be read and translated in more languages here. Joe Sutherland (talk) 01:34, 6 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Password reset మార్చు

I apologise that this message is in English. ⧼Centralnotice-shared-help-translate⧽

We are having a problem with attackers taking over wiki accounts with privileged user rights (for example, admins, bureaucrats, oversighters, checkusers). It appears that this may be because of weak or reused passwords.

Community members are working along with members of multiple teams at the Wikimedia Foundation to address this issue.

In the meantime, we ask that everyone takes a look at the passwords they have chosen for their wiki accounts. If you know that you've chosen a weak password, or if you've chosen a password that you are using somewhere else, please change those passwords.

Select strong passwords – eight or more characters long, and containing letters, numbers, and punctuation. Joe Sutherland (చర్చ) / MediaWiki message delivery (చర్చ) 23:59, 13 నవంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Adding to the above section (Password reset) మార్చు

Please accept my apologies - that first line should read "Help with translations!". Joe Sutherland (WMF) (talk) / MediaWiki message delivery (చర్చ) 00:11, 14 నవంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీసోర్సుపై విద్యార్థులకు శిక్షణ మార్చు

అందరికీ నమస్కారం,
తెలుగు వికీపీడియా, వికీసోర్సులపై విద్యార్థులకు శిక్షణను ఇవ్వడానికి విజయవాడ ఆంధ్ర లొయోలా కళాశాలలో నవంబరు 18-20 తేదీల్లో జరుగుతున్న కార్యక్రమం గురించి వికీపీడియా రచ్చబండ ద్వారా తెలిసినదే. ఈ కార్యక్రమానికి అనుభవజ్ఞులైన వికీపీడియన్ గుళ్ళపల్లి నాగేశ్వరరావు వస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు తెలుగు వికీసోర్సులోని డిజిటైజేషన్ ప్రక్రియలో పలు అంశాలపై శిక్షణను ఇవ్వనున్నందున కార్యక్రమంలో నేర్పదగ్గ అంశాల విషయమై సూచనలు తెలియజేయగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 06:10, 16 నవంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Help test offline Wikipedia మార్చు

Hello! The Reading team at the Foundation is looking to support readers who want to take articles offline to read and share later on their phones - a use case we learned about from deep research earlier this year. We’ve built a few prototypes and are looking for people who would be interested in testing them. If you’d like to learn more and give us feedback, check out the page on Meta! Joe Sutherland (WMF) (talk) 20:08, 29 నవంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

New way to edit wikitext మార్చు

James Forrester (Product Manager, Editing department, Wikimedia Foundation) --19:32, 14 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]