వికీసోర్స్:దింపుకొనదగిన పుస్తకాలు(ముఖచిత్రాలతో)
-
అబద్ధాల వేట - నిజాల బాట :ప్రఖ్యాత హేతు వాది నరిశెట్టి ఇన్నయ్య శాస్త్రీయపద్ధతిపై , మతం మరెన్నో అంశాలపై వ్రాసిన వ్యాసాలు
-
ఆంధ్ర గుహాలయాలు (1988): విజయవాడ, మొగల్రాజపురం, ఉండవల్లి, భైరవకోన వద్ద గల హిందూ గుహాలయాలలోని శిల్పరీతులపై సమగ్రమైన, విమర్శనాత్మక గ్రంథము.
-
ఆంధ్ర రచయితలు: పరవస్తు చిన్నయసూరి నుండి తుమ్మల సీతారామశాస్త్రి చౌదరి వరకు మధునాపంతుల సత్యన్నారాయణశాస్త్రిచే తెలుగు రచయితల జీవనచిత్రణలు
-
ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము :ప్రఖ్యాత చారిత్రక పరిశోధకుడు చిలుకూరి వీరభద్రరావు రచన.తొలినాటి తెలుగు వారి చరిత్ర, అమరావతి విశేషాలతో కూడివుంది.
-
గుత్తా:త్రైత సిద్ధాంత ఆదికర్త ప్రబోధానంద యోగీశ్వరులు ఆత్మకథ
-
తెలుగువారి జానపద కళారూపాలు:ఆధునిక వినోదాలు లేని పాతకాలంలో పల్లె ప్రజలను అలరించి, ఆనందపర్చిన వివిధ జానపద కళారూపాలు.
-
నా కలం - నా గళం:ప్రముఖ పాత్రికేయుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత తుర్లపాటి కుటుంబరావు ఆత్మకథ.
-
ప్రాణాయామము: ప్రాణాయామ మను యోగ సాధనచే యోగులు సూక్ష్మశరీరము వశపరచుకొని దివ్యశక్తులు ఎలా పొందగలరో తెలుసుకొనండి.
-
మారిషస్లో తెలుగు తేజం(2000): బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో మారీషస్ కు తరలి వెళ్ళిన చాలామంది తెలుగువారు తమ స్వభాషా, సంస్కృతీ, సంప్రదాయం పరిరక్షించుకునేందుకు తపిస్తూ చేసిన కృషిని వివరించిన తెలుగు మహాసభల యాత్రాకథనం.
-
వికీపీడియా స్వయంశిక్షణ:వికీపీడియాలో రచనలు చేయడానికి మెళకువలు, తొలిపుస్తకం
-
వికీపీడియాలో రచనలు చేయుట:వికీపీడియాలో రచనలు చేయడానికి మెళకువలు,మెరుగుపరచినపుస్తకం.తెలుగువికీపీడియన్ల పరిచయాలతో సహా చూడవచ్చు.
-
శివతాండవము:పుట్టపర్తి నారాయణాచార్యులు రచించిన శివతాండవం కావ్యంలో సంగీత, నాట్య సాహిత్య సంకేతాలు పెనవేసుకొనివుండి తెలుగు తెలియనివారినికూడా బాగా ఆకర్షించినది.
-
సమాచార హక్కు చట్టం, 2005 (2011): ప్రజాస్వామ్యం సవ్యంగా పనిచేయటానికి అవినీతిని అరికట్టటానికి, ప్రభుత్వాలూ, వాటి అంగాలూ ప్రజలకు జవాబుదారీగా ఉండటానికి, పౌరులకు విషయ పరిజ్ఞానం కలిగించే విప్లవాత్మకమైన సమాచార హక్కు చట్టం వివరాలు.
-
సంపూర్ణ నీతిచంద్రిక:వినోదముతో పాటు విచిత్రమయిన చక్కని నీతి శాస్త్రకథలకు నెలవైన పంచతంత్ర లో ప్రథమ భాగమగు మిత్రలాభము మిత్ర భేదము.
-
సుప్రసిద్ధుల జీవిత విశేషాలు: జానుమద్ది హనుమచ్ఛాస్త్రి రచనలో బ్రౌన్ దొర, పొట్టి శ్రీరాములు, దుర్గాబాయ్ దేశ్ ముఖ్ లాంటి ఎందరివో జీవిత చిత్రణలు అందరిని ఆకర్షిస్తాయి.
-
మహేంద్రజాలం: ఉషా పద్మశ్రీ రచించిన పుస్తకంలో వినోదానికి అత్యంత ప్రాధాన్యత నిచ్చే ఆధునిక ప్రదర్శనలేగాక - మూలికలు, రసాయనాల కలయికచే ఉద్భవించు చిత్ర - విచిత్ర పురాతన పద్ధతులెన్నో వున్నాయి.
-
నా జీవిత యాత్ర: పుట్టు పేద పట్టుదలతో, పెరిగి పెరిగి పెద్దల పెద్దయై దేశదాస్య విమోచన యజ్ఞంలో, తన సర్వస్వం ఆహుతి గావించి ఆంధ్రుల నొక్క తాటిపై నడిపించిన ఆంధ్రకేసరి ప్రకాశం ఆత్మకథ.
-
రాజశేఖర చరిత్రము (ఎమెస్కో): సంఘంలో ప్రచురంగా కొనసాగుతున్న సర్వ దురాచారాలనూ, ఆవేశంతో చెండాడి, ప్రభావంలో మొదటి తెలుగునవలగా కీర్తించబడినది.
-
చిన్ననాటి ముచ్చట్లు: ఆనాటి చెన్న నగరము ఎట్లుండెనో, అప్పటి విద్యార్థులెట్లు కాలము గడిపిరో, రోడ్లు, కాఫీహోటల్లు భవనములు ఏరీతిన ఉండెడివో చర్చించిన కె.ఎన్.కేసరి జీవిత చరిత్ర
-
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు: సామాన్యులు, ప్రముఖులు కృష్ణమూర్తితో చర్చించిన సమస్యల ఉదంతాలను ఆయనే స్వయంగా రాసినది చదవడం వల్ల దర్పణంలా మనల్ని మనమే పరిశీలించుకునే అవకాశం.
-
వేమన పద్యములు (సి.పి.బ్రౌన్): అనంతమైన విలువ గల సలహాలు, సూచనలు, విలువలు, తెలుగు సంగతులు ఇమిడ్చిన యోగి వేమన పద్యాలు, బ్రౌన్ కూర్చిన ఆంగ్లానువాదంతో,
-
కన్యాశుల్కము: తెలుగు జీవనాన్నీ, వాతావరణాన్నీ,మనుషుల శ్వాసనిశ్వాసాల్నీ, ఆంతరిక వ్యధల్నీ, భ్రష్టు పట్టిన మానవస్వభావాల్నీ ఆవిష్కరించిన మొదటి సాంఘిక నాటకం.
-
మాధవ విజయము:మృదు మధురమైన మాటలు, గంభీరమైన శైలితో జానపద జీవనాన్ని కళ్లకుకట్టేల చిత్రించిన నాటకం
-
త్వరలో చేరే పుస్తకాలకు వర్గం:దింపుకొనదగిన పుస్తకాలు మరియు మూస:సమిష్టి_కృషి లో లింకులు చూడండి.