వికీసోర్స్:ప్రదర్శన గ్రంథాలు/మహేంద్రజాలం

మహేంద్రజాలం(1993)- ఉషా పద్మశ్రీ

Download this featured text as an EPUB file. Download this featured text as a RTF file. Download this featured text as a PDF. Download this featured text as a Mobi. పుస్తకం దింపుకోండి!

పుస్తక ముఖచిత్రం


ఇంద్రజాలం అంటే ఆసక్తికలగని వారుండరు. ఆలాంటి ఇంద్రజాల రహస్యాలను విశదపరచేదే ఈ పుస్తకం. వినోదానికి అత్యంత ప్రాధాన్యత నిచ్చే ఆధునిక ప్రదర్శనలేగాక - మూలికలు, రసాయనాల కలయికచే ఉద్భవించు చిత్ర - విచిత్ర పురాతన పద్ధతులు కూడా దీనిలో వున్నాయి. ఉదాహరణకు కొంత భాగం క్రింద ఇవ్వబడినది.


చేతి వ్రేళ్ళకు తడి అంటకుండా నీటిలో నుండి నాణెం తీయుట

ఒక పళ్ళెంలో గ్లాసుడు నీరు పోసి అంచులకు దగ్గరగా నీటిలో ఒక నాణేన్ని వేసి, ఆ నాణేన్ని నీరు అంటకుండా, నీరు పోకుండా బయటకు తీయాలని మీ మిత్రులను అడగండి. వారికి ఎంత ఆలోచించినా ఎలా తీయాలొ తెలియదు. వారు తీయలేమనీ ఒప్పుకున్న తరువాత మీరు తీసి చూపించడి.

ఒక గ్లాస్ తీసుకొని అందులో ఒక కాగితం ముక్కకు నిప్పంటించి, మండుతున్న కాగితాన్ని గ్లాస్ లో వేసి, ఆ గ్లాస్ ను పళ్ళెం మధ్యలో బోర్లించండి; అప్పుడు విచిత్రంగా పళ్ళెంలో వున్న నీరు గ్లాస్ లోకి వస్తుంది. నాణెం వున్న చోట నీరు లేకుండా పొడిగా వుంటుంది. అప్పుడు మీరు సులభంగా ఆ నాణెమును తీసి అందరికీ చూపండి.

గ్లాస్‌లో మండు తున్న కాగితం వేసినప్పుడు గ్లాస్ లోని గాలి వేడెక్కి బయటకు పోయి, గ్లాస్ లో శూన్యం ప్రదేశం ఏర్పడుతుంది. నీటిలో బోర్లించగానే నీటిపై వున్న గాలి ఒత్తిడికి నీరు గ్లాస్ లోని శూన్య ప్రదేశంలోకి చేరుతుంది. దానితో నాణేం వున్న ప్రదేశంలో నీరు వుండదు.


పూర్తి గ్రంథం చదవండి.