సామాన్యుని కామన

శ్రీశ్రీ
ఖడ్గసృష్టి
1. ఖడ్గసృష్టి (కవిత)
2. శరచ్చంద్రిక
3. విషాదాంధ్ర
4. విశాలాంద్రలో ప్రజారాజ్యం
5. మున్నుడి
6. సదసత్సంశయం
7. మహాసంకల్పం
8. 'కో ఈ హస్ రహ్ హై' ' కో ఈ రో రహా హై'
9. గాంధీజీ!
10. మంచి ముత్యాల సరాలు
11. ఏవి తల్లీ!
12. సామాన్యుని కామన
13. రుబాయత్
14. భ్రమరగీత
15. బొమ్మలాంతరు
16. ఆఖరిమాట మొదటిమాట
17. విదూషకుని ఆత్మహత్య
18. టాంటాం
19. కొంటె కోణాలు
20. ఎ ఏ ఐ ఒ ఓ ఔ
21. అభిసారికి కడసారి
22. ఒకటీ - పదీ
23. నగరంలో వృషభం
24. అధివాస్తవికుల ప్రదేశం
25. మహాకవి ఆశ్చర్యం

సామాన్యునివాస్తవికత

ఈ రోజున సామాన్యుడు

ఏమీలేనట్టివాడు

కూడూ గూడూ గుడ్డా

ఏమీలేనట్టివాడు

చదువూ సాము శాస్త్రం

ఏవీయెరుగనివాడు

ఈ రోజున సామాన్యుడు

సగందేవతాంశ, సగం

రాక్షసాంశ, సగటున ఈ

సామాన్యుడుమానవుడు

అంటేనీవూ నేనూ

ఆమె ఈమె వీడువాడు

అంతా సామాన్యులమే

సగంవెలుగు సగం నీడ

సగంఋతం సగం మనృతం

సగం ఆడసగం ఈడ

సగం పశువు సగం నిసువు

ఈవెల్తురు ఈచీకటి

ఈ యిరులూ ఈవెలుగూ

వేరు వేరు గదులు కావు

ఒకటి రెండూకూడా

ఇపుడు నిప్పు ఇపుడెపువు

ఇప్పుడుదూసిన

ఇంతట్లో కౌగిలించ

ఒకనేత్రం కల్హారం

మరో కన్నుకర్పూరం

మూడో కంటివాడంటూ

లేడంటేనమ్ముతావ్‌

చూడవోయ్‌నీలోకి నీవు

ఒకటి రెండువెరసిమూడు

నరకం సర్గం అన్నవి

ఒక స్థితికే రెండు పేర్లు

ఫోకస్‌ భేదం అంతే

లోకస్‌ రెండిటి కొకటే

శ్రీ అనగా లక్ష్మి,సరే

శ్రీ అంటే విషం కూడా

శ్రీ శ్రీ సిరిచేదు లేక

సిరీ సిరీ,చేదుచేదు

మీ యిష్టం శ్రీకారం

గుణకారం చేసుకొండి

మీకే అర్ధం తోస్తే

ఆ key నే వాడుకొండి

ఒకటే శ్రీ అదేరెండు

అదే చేదు సిరీ అదే

అమరతం అసురతం

శ్రీ శ్రీ ఒకమానవుడు

నే పథ్యంలో :

నీ మూసిన పిడికిటిలో

ఏమున్నదికవీ కవీ

ఆదాచిన పళ్ళెంలో

ఏంతెచ్చావ్‌ సుకవీ

ఆమూలని కవీకవీ

నీ మూసిన గుండెల్లో

ఏందాచావ్‌ సుకవీ

నీ పాడని పాటలలో

రాపాడే దేదికవీ

ఆ కొసలోనీడలలో

ఏ సత్యం సుకవీ

ఏ సత్యం ఏ సప్నం

ఏ సర్గం సుకవీ

మా కోసంనీ కోసిన

వే కాన్కలపూలు కవీ

సామాన్యుని కామన

సైన్సువల్ల ఈ రోజున

సామాన్యునిబ్రతుకు కూడ

సౌందర్యమయం కాగల

సదుపాయం లభించింది

జన్మం చర్మం వెనకటి

సంప్రదాయమూ ఇప్పటి

సంఘస్థితులూ నెరపే

అసమానతపనికిరాదు

ఐశర్యం అందరిదీ

అందుచేతఅందులోన

సామాన్యుడుతన వాటా

తనకిమ్మని కోరుతాడు

బతకడమే సమస్యగా

పరిణమింప జేసినట్టి

అన్యాయాలన్నిటినీ

హతమార్చాలంటాడు.

ఇదేం పెద్దగగనమా ? మ

రిదేం గొప్ప కోరికా ? ఇ

కేం ? ఇదొక్కవిప్లవమా ?

ప్రశ్నిస్తేపాపమా ?

యుగసంధిది,సామాన్యుని

శకందీన్నికాదనరా

దిదిరేపొచ్చేవ్యవస్థ

కివాళనించీ ,పునాది

ఇప్పటినించీ నాంది.

అంతే ,ఇంతేసప్నం :

అన్నీ ఒక్కడికి బదులు

అంత మందికీ అన్నీ :

అదే సర్గమంటాను.

ఆ సర్గం వేరే కడు

దూరంలోలేదులేదు

ఈడే నేడే , వున్నది.

నీలోనాలో వున్నది.

మీ యిష్టం ఈ ధాత్రిని

చేయవచ్చు సర్గంగా

చీల్చవచ్చు నరకంగా

ఏంచేస్తారో సరిమరి యిక మీ యిష్టం.