శ్రీశ్రీ
ఖడ్గసృష్టి
1. ఖడ్గసృష్టి (కవిత)
2. శరచ్చంద్రిక
3. విషాదాంధ్ర
4. విశాలాంద్రలో ప్రజారాజ్యం
5. మున్నుడి
6. సదసత్సంశయం
7. మహాసంకల్పం
8. 'కో ఈ హస్ రహ్ హై' ' కో ఈ రో రహా హై'
9. గాంధీజీ!
10. మంచి ముత్యాల సరాలు
11. ఏవి తల్లీ!
12. సామాన్యుని కామన
13. రుబాయత్
14. భ్రమరగీత
15. బొమ్మలాంతరు
16. ఆఖరిమాట మొదటిమాట
17. విదూషకుని ఆత్మహత్య
18. టాంటాం
19. కొంటె కోణాలు
20. ఎ ఏ ఐ ఒ ఓ ఔ
21. అభిసారికి కడసారి
22. ఒకటీ - పదీ
23. నగరంలో వృషభం
24. అధివాస్తవికుల ప్రదేశం
25. మహాకవి ఆశ్చర్యం

ఎక్కడఎప్పుడు

ఎవరైనా చెప్పుడు ఈ చిక్కువిప్పుడు

ఆరంభం ఎక్కడ

అంతం ఎప్పుడు

ఎందుకీ నొప్పులు ఏమిటీచప్పుడు

లక్షలు లక్షలు

యక్షప్రశ్నలు అన్నీ తప్పులు

ఏచోట జననం

ఏ పూట మరణం

ఈలోపున ఎన్నెన్నిపడరానితిప్పులు

కంట్లోకారం

ఒంట్లో భారం గుండెల్లో దాహం

ఉచ్ఛాసం నిశాసం

ఒకే అనుప్రాసం

సందేహం పన్నుతుందిసరోరుహవ్యూహం

ఆగమనం నిష్క్రమణం

అంతా ఒకచంక్రమణం ఆలోచించుబాగా

ఏదైతేసవాలు

అదేలే జవాబు

ఒమీగా ఆల్ఫా,ఆల్ఫా ఒమీగా

శాస్త్రం నీ అస్త్రం

మౌనం శ్మశానం అదికాదు జ్ఞానం

పరీక్షించు సహేతుకంగా

ప్రసంగించు సాధికారంగా

సమిష్ఠి సూత్రం మాత్రం సరైన విధానం

ఏమిటీ చప్పుడో

ఎందుకీ నొప్పులో అంతం ఎక్కడో

ఆనందం ఎప్పుడో

ఆ చిక్కువిప్పడు

ఎక్కడా ఎప్పుడూ ఎవడూచెప్పడు

ఏదైనా గీతం

చేదైనా మైమరపిం

చేదైనామదికదిలిం

చేదైనా ఎదరగిలిం

చేదైనా ఏదైనా

నేడైనా

రేపైనా

ఏమైనా గానం

జడిజడిగా వర్షంనా

మెడమీదా

తొడమీదా

తడితడిగా రక్తం నా

గదిలోనూ

హృదిలోనూ

దడదడగా కంపం నా

నడినెత్తిని రంపం

నా కోసం ఆకాశం

చేకూర్చే ఆవేశం

రేగించే ఉద్రేకం

ఊగించే ఉదేగం

దావానల హాలహల

కీలోజ్జల కోటీరం

నీలోత్పల కాసారం

నీలోపల కేయూరం

కనిపించక జడిపించే

కికురించే సకిలించే

కిటికీలో రూపం వా

కిటి ముంగిటి ధూపం

గాలంవలె శూలవలె

వేలాడేకాలం

వేటాడేవ్యాఘ్రం అది

వెంటాడును శీఘ్రం

కాలానికి భయపడితే

కలిగేదేశోకం

కదిలేనాలోకం

దొరికేనానాకం

కనుపాపలుతెరచాపలు

ప్రళయంలో పయనం

నిరయంలోశయనం

విలయంలో విజయం

ఐక్యం అదీమనకి ముఖ్యం

అందులోనే ఉందిసౌఖ్యం

లేనిపోనిచీలికలు

రెండు రెండునాలికలు

ఛీ యిదాబతుక్కి

ఫాయిదా

ఐక్యం అదీవ్యవస్థ

అప్పుడుండదుమనకీ అవస్థ

కాదు ఔను అవును

కాదు కాదు అవదు

అనేకం అయితే ఏకం

అదే వివేకం

ఐక్యం అన్నింటికీ మూలం

అటేకదుల్తోందికాలం

పురోగతిప్రపంచనీతి

మనదొకే మానవజాతి

వ్యక్తికి బహువచనం

శక్తి

ఐక్యం అదే మనకి గమ్యం

అప్పుడేసిద్ధిస్తుందిసామ్యం

వ్యర్ధం వద్దంటా

యుద్ధం వద్దంటా

కామ్యం ఐక్యం అయినబతుకే

రమ్యం

ఐక్యం ఎప్పుడో కాదిప్పుడే

ఎక్కడో కాదు అదిక్కడే

మాట చేతగామారి

మనిషిమనిషితో చేరి

సప్నం సత్యం ఐతేనే

సర్గం

ఒకనొక అనగా అనగాల వేళ

(అదికృతయుగం కాదుమృతయుగం)

అదేమన కథలకీ కవితాలకీ డోల

మనుష్యునిబాల్యంలోని అమాయకతం

(ప్రార్ధించే మొక్కలూ

మాట్లాడేనక్కలూ)

కళలో జీవితంలో నిదర్శించే అరణ్య తతం

సామూహికం సాతంత్ర్యం అనేషించు అగత్యం

(ఒంటరి తనం

తుంటరి తనం)

సామాజికంగా పెరుగుతోందిసేచ్ఛ ఇదిసత్యం

అజ్ఞానం చీకటి భయానికీ క్రౌర్యానికీ కాణాచి

(శిశుతం అదే

పశుతం అదే)

చంపటానికి సరదా అమ్మయ్యో బూచి

మార్చాలంటాఇదంతాప్రసరించాలి కాంతి

(శాస్త్రం కళనిచంపబోదుజనాన్ని భయంతో నింపలేదు)

మానవాళికి పరిణామం కానుక పావురంలాంటి

శాంతి

ఓహో విహంగమా

ఎగురు

ఎగురు

నీ రెక్కలవిసరులోమనంతరాలు

తరలు

తరలు ఓహో

తరంగమా

కదలు

కదలు

నీముంచెత్తు వరదలోనిమ్నోన్నతాలు

కరగు

కరగు

ఓహో మృదంగమా

పలుకు

పలుకు

నీవిచ్చు హెచ్చరికలో నిరాశా దురాశా భాండాలు

పగులు

పగులు

ఓహో జనాంగమా

నడువు

నడువు

నీ పరాంకోటి హస్తాలతో నూతన గవాక్షాలు

తెరువు

తెరువు

ఔను వాహనం మారింది;దూరానికి పూరపుటర్ధం

పోయింది

పూరందూరం పోయిందివెనకటి వాహనం

మారింది

ఆ సూర్యుడేనేడూ

ఆ చంద్రుడే నాడూ

అవే నక్షత్రాలూ - ఐనా కాలం మారింది

ఔనా కాలం మారిందిమరి : మానవుడా మేలుకోనేస్తం

ఎద్దుబండితో కొలవకు దూరాన్నిఎగరవోయ్‌

చదలయెదచీలుస్తూ

రేపు బయల్దేరా లనుకున్నావు

నేడే ఇచ్చటికి వచ్చేశావు

విచ్చేసిందినీ తరుణం పుచ్చుకో ఇదినీ భావి

ఇదినీభావిగ్రహించు : ఈభావినీకు నాప్రెజెంటు

భూతకాలపు సరీసృపాలని పాతరాతియుగంలో పారేయ్‌

పాతెయ్‌నీ సందేహాలని

తోలెయ్‌ నీమందాక్షాలని

నిటారుగా నిలబడునేస్తం హుటాహుటిగా

ముందుకిసాగు

హుషారుగా ముందుకిసాగు : ఊరిఖేవెనక్కిచూస్తావే

దుప్పివీ కుక్కవీ కావు తిర్యగ్దృక్కువి నువుకావు

దూరం కరిగిపోతోంది

కాలం మరిగిపోతోంది.

మానవుడిగా మేలుకో నేస్తం ఏలుకో ఈ విశం

సమస్తం.

"https://te.wikisource.org/w/index.php?title=ఎ_ఏ_ఐ_ఒ_ఓ_ఔ&oldid=13142" నుండి వెలికితీశారు