అధివాస్తవికుల ప్రదేశం

శ్రీశ్రీ
ఖడ్గసృష్టి
1. ఖడ్గసృష్టి (కవిత)
2. శరచ్చంద్రిక
3. విషాదాంధ్ర
4. విశాలాంద్రలో ప్రజారాజ్యం
5. మున్నుడి
6. సదసత్సంశయం
7. మహాసంకల్పం
8. 'కో ఈ హస్ రహ్ హై' ' కో ఈ రో రహా హై'
9. గాంధీజీ!
10. మంచి ముత్యాల సరాలు
11. ఏవి తల్లీ!
12. సామాన్యుని కామన
13. రుబాయత్
14. భ్రమరగీత
15. బొమ్మలాంతరు
16. ఆఖరిమాట మొదటిమాట
17. విదూషకుని ఆత్మహత్య
18. టాంటాం
19. కొంటె కోణాలు
20. ఎ ఏ ఐ ఒ ఓ ఔ
21. అభిసారికి కడసారి
22. ఒకటీ - పదీ
23. నగరంలో వృషభం
24. అధివాస్తవికుల ప్రదేశం
25. మహాకవి ఆశ్చర్యం

కాసరమా వికారములు కార్చకు పూసరమా మసారపున్‌

రాసులలో కపాలములు రాల్చకు తావళమా విషాదపున్‌

వేసములోకుశాసనము పేర్చకు రాసభమా సమాధిలో

మీసము పెంచిఆ తొడల మీదనటించకు పుణ్యమయ్యెడున్‌

నిచ్చెన పచ్చి నెత్తురులు నింపి నిలింపుల దుంపత్రెంపి కా

ర్చిచ్చులుత్రచ్చుకొన్నదిశచీపతిపీచుమిఠాయివేటలో

పచ్చిక మచ్చికైనదిక్షపాకరభీకర సూకరాకృతుల్‌

పిచ్చిదనాలుపోయిరి కబీరుసు త్రాగిన రోషనారలై

ప్రాతాదిసూదికన్న పొరపాటునతాతెరచాటువేసి ఘో

షా తిలకించబోయి వెదజల్లును గుమ్మడిపూదుమారముల్‌

లేతదిరావికొమ్ముపడలేదు భయానక దందశూకని

ర్ఘాతపతాకదానికొరకై యిరుకైనవి సందులెందుకో

గంధముగా మెడన్‌ పులుముగా తలపోయుదువంధకారపున్‌

బంధకి యూర్చు జాలి చనుబాలను గాలము వేచి లాగుచున్‌

సింధువు పిల్చెనా పరిహసించెడు సైగల ? సుప్తశోణపా

ణింధమ ఖడ్గధార హవణించకుమీ తిలకాష్ట వహ్నిలోన్‌

మ్రింగి తిమింగిలాంగల తమిస్రగుహాంతర మీనమేష పా

రంగతులైనబొంగురములార యెరింగినతెల్పుడా పరి

షంగము పాడుటెందుకు ? విపంచికి కంచికి దూరమెంత? వ

డ్రంగుల రంగులా గులకరాళ్ళగు మా గుడిలోని లింగముల్‌ ?

ఉద్యమ నాయకా చదువుకో: వినిపించని కంచుకాగడా

వాద్యములన్‌నిశానిశితవల్లరి అల్లరి యల్లికన్‌ సము

త్పాద్యసుధావృథావ్యథలుభాషకులొంగని భావశాఖలో

చోద్యము లూహలో మలుపు చూడ్కులునీతలముస్క కాస్కలై

కైకొని కాకికన్ను కలకాలపు చూపులు రెక్కరిక్కపై

పైకొనిమేకుతాకిడికి ప్రాణము హాయి బజారు జారుడై

డాకయికై కడాని పగడాలగుడారములో విడాకులై

రోకలి రోదనాకులంత రోదసినిండిన రోగభోగమై

మౌనము శంఖమై చెరగుమాయగ నేత్రపతంగబింబ ని

ధ్యానము కొంగనెత్తురులుత్రాగెడునల్లతురాయి వూపుగా

వేసలిపై అవే అయిదువేలకుశీర కుఠారదారుణ

ప్రాణశిలీంధ్రముల్‌తిరుగుబాటుతుపాకి తుఫాను కానుపుల్‌

వచ్చెడు ఫల్గుణుడువార్దితరంగ మృదంగ ఘోషలో

విచ్చెడుమచ్చునుందు పలవించెడు కించి దుషస్తుషారముల్‌

పచ్చిక మచ్చికై నదిప్రపంచపు నెత్తురు మంటపాటలన్‌

మెచ్చనివాడనీ మెడలమీదనివే ఉదయాద్రిరౌద్రముల్‌