నగరంలో వృషభం
శ్రీశ్రీ | ||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
నగరం నడివీధిలో
వృషభం తీరుబాటుగా
గత జన్మసంస్మృతులు కాబోలు
కనులరమోడ్చి మెదలకుండా
నగరం హృదయంలోవృషభం
దారికి హక్కుదారు తానే అయినట్టు
పరిత్యజించి కాలానికి బాధ్యత
పరిహసించి నాగరికతపరుగు
నిలబడిందినేనే రాజునని
ఎవరు పొమ్మనగలరీ ఎద్దుని
ఎలాచూస్తుందో చూడు
ఏయ్ ఏయ్‌మోటారుకారూ
ఏవిటేవిటి నీతొందర
భాయ్‌భాయ్ సైక్లిస్ట్
భద్రంసుమీ ఎద్దునిన్ను తప్పుకోదు
యంత్రవిరోధిఅహింసావాదిశాకాహారి
మద్య నిషేధప్రజ్ఞాశాలి
నగరం నడివీధిలో
నాగరికతగమనాన్ని నిరోధిస్తూ
ఇలా యెంతసేపయినా సరే
ఈయెద్దునిలబడగలదు
ఎద్దుకి లేకపోతేబుద్ధి
మనిషికేనా ఉండొద్దా?