శ్రీశ్రీ
ఖడ్గసృష్టి
1. ఖడ్గసృష్టి (కవిత)
2. శరచ్చంద్రిక
3. విషాదాంధ్ర
4. విశాలాంద్రలో ప్రజారాజ్యం
5. మున్నుడి
6. సదసత్సంశయం
7. మహాసంకల్పం
8. 'కో ఈ హస్ రహ్ హై' ' కో ఈ రో రహా హై'
9. గాంధీజీ!
10. మంచి ముత్యాల సరాలు
11. ఏవి తల్లీ!
12. సామాన్యుని కామన
13. రుబాయత్
14. భ్రమరగీత
15. బొమ్మలాంతరు
16. ఆఖరిమాట మొదటిమాట
17. విదూషకుని ఆత్మహత్య
18. టాంటాం
19. కొంటె కోణాలు
20. ఎ ఏ ఐ ఒ ఓ ఔ
21. అభిసారికి కడసారి
22. ఒకటీ - పదీ
23. నగరంలో వృషభం
24. అధివాస్తవికుల ప్రదేశం
25. మహాకవి ఆశ్చర్యం

చెవులువిప్పి మనసు విప్పి కనులువిచ్చివినవయ్యా కేథలిక్కుకెన్నెడీ బోల్షివిక్కు మున్నుడి అరుపులిచ్చి కరువు తెచ్చి ఋణంపెట్టి రణం తెచ్చి జనంధనం ఇంధనమై చరణకరాబంధనమై జనన జరా మరణదురా శ్రమణల సంగ్రంథనమై ఒకనాడోహో అని పిం చుకతిరిగినధనిక వాద మికపైవెగటై జిగటై మరణంలోమశౌతుంది వినవయ్యాకెన్నడీ విశాలంధ్రమున్నుడి కేథలిక్కుకెన్నెడీ జీవితమేనిన్నది భావములేమొన్నవి క్యూబా ఏమన్నది లావోస్‌ ఏమన్నది కాంగో నిలుచున్నది ఐసన్‌హోవర్‌ చేసిన మోసంతాలూకు అసలు వేసంఈనాడు ఎగిరివచ్చి నిజంపైకి లెక్కి వచ్చిజనం తిరుగు బాటుకేసి ఆకలేసి పిడికెడు కబళంకావా లనియడిగినతరుణంలో లుముంబానుతిన్నావు కుటుంబాలుకొన్నావు అమెరికాల కాలు విరిగె ఆఫ్రికాకు నోరు తిరిగె ఆసియాకు ఆశరగిలె ఆస్ట్రో ఆఫ్రోఏష్యన్‌ కాస్ట్రోలకు కనులువిరిసె ఏమంటావ్‌కెన్నడీ ఈ శ్రీశ్రీ సన్నిధి చంపేస్తాననినీకో సందేహంఉండవచ్చు సర్దేస్తాననినీకో సమాధానముండవచ్చు నీటాంకులు నీబాంబులు విమానాలు విధానాలు శ్మశానాలుచూస్తాయి ప్రశాంతినే హరిస్తాయి నీసలహాదారులతో నీకలహాచారులతో పెంటగనుల తుంటరులను వెంటబెట్టుకునివస్తే రాకెట్లనువిప్పుతాం నీకట్లను విప్పుతాం జాకెట్లను సవరించి పాకెట్లను సరిదిద్ది నీమతాన్నే నీ హితాన్ని నీగతాన్నికెలుకుతాం చీకట్లనుతరుముతాం నీ హిట్లరు పాతదనం చావాలని కసరుతాం విన్నావాకెన్నడీ శ్రీ శ్రీశ్రీ మున్నుడి

"https://te.wikisource.org/w/index.php?title=మున్నుడి&oldid=20316" నుండి వెలికితీశారు