శ్రీశ్రీ
ఖడ్గసృష్టి
1. ఖడ్గసృష్టి (కవిత)
2. శరచ్చంద్రిక
3. విషాదాంధ్ర
4. విశాలాంద్రలో ప్రజారాజ్యం
5. మున్నుడి
6. సదసత్సంశయం
7. మహాసంకల్పం
8. 'కో ఈ హస్ రహ్ హై' ' కో ఈ రో రహా హై'
9. గాంధీజీ!
10. మంచి ముత్యాల సరాలు
11. ఏవి తల్లీ!
12. సామాన్యుని కామన
13. రుబాయత్
14. భ్రమరగీత
15. బొమ్మలాంతరు
16. ఆఖరిమాట మొదటిమాట
17. విదూషకుని ఆత్మహత్య
18. టాంటాం
19. కొంటె కోణాలు
20. ఎ ఏ ఐ ఒ ఓ ఔ
21. అభిసారికి కడసారి
22. ఒకటీ - పదీ
23. నగరంలో వృషభం
24. అధివాస్తవికుల ప్రదేశం
25. మహాకవి ఆశ్చర్యం

బాకాలులాభం లేదుబాజాలు లాభంలేదు

ఎంతఈదినా ఏం ఫాయిదా ఎక్కడాతీరం కనపడదు

తలమాత్రం మీదికుంచి నిలువీతఈదుతున్నాం

గమనం పిసరూ లేదు గమ్యం అసలేలేదు

పట్టాభిరావ సామ్మీదప్రమాణంచేసిచెబుతున్నా

అంతా గజీతగాళ్ళేమళ్ళీఅరగంటపురోగమనం లేదు

ఆదర్శప్రాయంగా అభినయిస్తున్నాం అయినా ఎవరూ మనల్ని

చూడ్రు

అరుస్తున్నాం గొంతుచించుకుని అయినా ఎవరూ విన్రు

మనలోకొంతమందికవులు మధురంగా విశసిస్తారు

యతిప్రాసలు సరిపోతాయి పదాలు మజాగా పడతాయి

పౌరుషానికి లోటులేదుప్రశస్తికి కూడాడిటో

పద్యాలకు పళ్ళురాలవు చింతకాయలుచెట్టు మీదేవున్నాయి

ఈ గొంగళీ వయస్సు ఇరవై అయిదేళ్ళు

ఇంకా ఎక్కువే అనుకో ఎవడుచూశాడులెక్కలు

తీర్మానాలూ ఉపవాసాలూ చేశాం ఖద్దరూ కేకలూ వేశాం

మొసుకొచ్చాం సరాజ్యమ్మూట మూట విప్పితే ఏమీలేదు

అరవిందఘోస్టు ఆశీరదించాడు కదా

ముమ్మిడివరం బాలయోగి ఏమంటాడో

ఆంజనేయదండకంవల్లిస్తేనో

అన్నట్టు సాయిబాబాకి మొక్కుకోకూడదూ

మహారణ్యంలోమధ్యాహ్నంలాగ ఒక స్తబ్దతనిశ్శబ్దత

రాత్రిపూట వేట ముగించుకొని కౄరమృగాలునిద్రిస్తున్నాయి

చిల్లరజంతువులుభయంతో ఎక్కడివక్కడఇరుక్కుపోయాయి

ఎప్పుడైనా ఒక పక్షి ఎగిరితేఎక్కడో ఒక ఆకురాలిచప్పుడు

శిశువుకి దక్కని స్తన్యంలాగ ప్రవహిస్తున్నాయి గోదావరి నీళ్ళు

బద్దలైన గుండెల్లాగా బీటలువేశాయి పొలాలు

మన పరిశ్రమలు ప్రణాళికల్లోనే మన ప్రతిభచాకిరీకి తాకట్టు

మనకో ఇల్లంటూ లేదు రచ్చకెక్కిరాద్దాంతాలు

కొంగల్లారా జపం చెయ్యండిపిల్లీ పఠించుమంత్రాలు

ఎలకల్లారా సభ జరపండిఎవరు గంటకట్టాలని

ఇంకోమారు ఎగరవేనక్కాఈ సారి అందవచ్చు ద్రాక్షపళ్ళు

కోతీతీసుకురా త్రాసు పంపకం తెగడం లేదు.